padma-puraskaramఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలలో ఆరుగురు తెలంగాణీయులకు పద్మశ్రీ గౌరవం దక్కింది. వివిధ రంగాల్లో విశేష కృషిచేసిన తెలంగాణ ముద్దుబిడ్డలు ప్రొఫెసర్‌ ఎక్కా యాదగిరిరావు, చింతకింది మల్లేశం, దరిపల్లి రామయ్య, బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, డాక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ వహీద్‌, చంద్రకాంత్‌ పితావలను పద్మశ్రీ వరించింది.

దేశవ్యాప్తంగా మొత్తం 89 మందికి పద్మ పురస్కారాలు దక్కాయి. వీరిలో ఏడుగురికి పద్మ విభూషణ్‌, మరో ఏడుగురికి పద్మభూషణ్‌ దక్కింది. పద్మశ్రీ పురస్కారాలు మొత్తం 75 మందికి దక్కగా అందులో ఆరుగురు తెలంగాణ వారున్నారు. ఎంపికైనవారిలో 19 మంది మహిళలు, ఐదుగురు విదేశీయులు, ప్రవాస భారతీయులు ఉన్నారు. ఆరుగురికి మరణానంతరం అవార్డులను ప్రకటించారు.

చెట్ల పెంపకాన్ని ఉద్యమంగా చేపట్టి, దానికి జీవితాన్ని అంకితం చేసిన తెలంగాణకు చెందిన వనజీవి దరిపల్లి రామయ్య, పోచంపల్లి పట్టుచీరలను నేయటానికి అవసరమైన సమయాన్ని, శారీరకశ్రమను తగ్గించే లక్ష్మీ ఆసు యంత్రాన్ని రూపొందించిన తెలంగాణ చేనేత కళాకారుడు చింతకింది మల్లేశం, తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని రూపొందించిన శిల్పి ప్రొఫెసర్‌ ఎక్కా యాదగిరిరావు, నాస్కామ్‌ మాజీ ఛైర్మన్‌ బివిఆర్‌ మోహన్‌రెడ్డి, యునానీ వైద్య చికిత్సలో విశేష అనుభవం గడించిన డాక్టర్‌ మహ్మద్‌ వహీద్‌, సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌లో అవిరళ కృషి చేసిన చంద్రకాంత్‌ పితావహలకు పద్మశ్రీ పురస్కారాలు లభించాయి.

Other Updates