తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు వ్యవసాయానికి ఆయువు పట్టుగా వున్న చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం నడుం బిగించింది. కాకతీయుల కాలం నుంచి తెలంగాణ రైతాంగానికి కల్పతరువుగా వున్న గొలుసుకట్టు చెరువులకు పూర్వవైభవం తెచ్చేందుకు ప్రభుత్వం రూపొందించిన ‘మిషన్‌ కాకతీయ’ పనులు చకచకా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు స్వయంగా పలుగు పట్టి, మట్టితట్ట మోసి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రజలు కూడా కర్తవ్యదీక్షతో పెద్దఎత్తున భాగస్వాములవుతున్నారు.

పాడిపంటలతో దేశం సుభిక్షంగా వున్ననాడే అన్నవస్త్రాలకు కొదువ లేకుండా ప్రజలు సుఖ శాంతులతో వుంటారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ పటిష్టంగా వుంటుంది. ఈ వాస్తవాన్ని

Other Updates