magaతెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థినులు అరుదైన ఘనత సాధించారు. నిత్యం మంచుతోనిండి, ప్రమాదకరమైన ఎల్‌బ్రస్‌ పర్వతాన్ని అధిరోహించారు. ఎవరెస్టును అధిరోహించిన అత్యంత పిన్న వయస్సురాలిగా రికార్డు సాధించిన ఇబ్రహీంపట్నం గురుకుల విద్యార్థిని మాలావత్‌ పూర్ణ, ఆలేరులోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థిని బొల్లెద్దు శ్రీవిద్య ఈ సాహసం చేశారు. తెలంగాణలో 53 గురుకుల డిగ్రీ కళాశాలలు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలగా ఎల్‌బ్రస్‌ పర్వత శిఖరంపై ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. చిత్రపటాన్ని, తెలంగాణ రాజముద్రను ప్రదర్శించారు.

Other Updates