ఊరెప్పుడు నవ్వుతది? చెర్లు నిండినప్పుడు, చేన్లు పచ్చగున్నప్పుడు, కాలువలు సాగుతున్నప్పుడు, పంటలు పండుతున్నప్పుడు. తెలంగాణ నేల కరువుతో కొన్నేండ్లుగా కొట్లాడింది. కకావికలు చెందింది. నీళ్లు రాలేదు. కండ్లల్లకెల్లి నిప్పులు రాలినయి. ఇప్పుడు చెర్లు నీళ్లతో నిండుతున్నయి. కాలువలు పారుతున్నయి. నదులు నడుస్తున్నయి. నీళ్ళు నిలువ ఉంటన్నయి. బిందెల నిండుతున్నయి. పచ్చని పొలాలు పైరగాలికి ఊగుతున్నయి. ఎవల సంపారం వాల్లు చేసికుంటే ఇట్లనే ఉంటది. ఎవల రాజ్యం వాల్లు ఏలుకుంటే గిట్లనే ఉంట