Journalist_1”మీ గురించి నాకు తెలుసు. ‘ఊపర్‌ షేర్వాణీ.. అందర్‌ పరేషానీ’, బయట జర్నలిస్టులు కనపడినట్టుగా, పలుకుబడి ఉన్నట్టుగా, ఇంటి వద్ద ఏమీ ఉండదని నాకు తెలుసు. మీ ఆర్థిక, సామాజిక స్థితిగతులు దిగువ మధ్య తరగతి కూడా కాదు. పేదలే. అందు ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఒక మోడల్‌గా జర్నలిస్టుల సంక్షేమం ఉండాలె. అడ్రిెటేషన్లు, హెల్త్‌కార్డులు, ఇళ్ల స్థలాలతో పాటు, జర్నలిస్టు సంక్షేమనిధి వందకోట్లు పెడదాం. అట్లాగే ఏ పనైనా బాజాప్తా చేసేందుకు బడ్జెట్‌లో వందకోట్లు పెడదాం” అన్నారు ముఖ్యమంత్రి సీేఆర్‌. జర్నలిస్టులు తెలంగాణ పోరాటంలో ఉన్నారు. తెలంగాణ వచ్చినంక సుఖంగా, సంతోషంగా ఉండాలె. ఇదీ సీేఆర్‌ వాగ్దానం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక నమూనాగా జర్నలిస్టుల సంక్షేమం ఆచరణలోకి వస్తున్నది. అమలవుతున్నది. డబుల్‌బెడ్‌రూవ్‌ులతో సహా అన్నీ ఒకటివెంట ఒకటి అమలు కాబోతున్నవి. జర్నలిస్టుల సంక్షేమంలో మనమే ఒక నమూనా…

‘తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు’ అని నినాదం ఇచ్చి ఒక్క తెలంగాణ తప్ప మామీే వద్దని రాజీలేని ఆత్మగౌరవ పోరాటం చేసిన వాళ్లు తెలంగాణ జర్నలిస్టులు. విశాల ప్రాతిపదికన తెలంగాణ కోసం పనిచేసేందుకు తెలంగాణ జర్నలిస్టు ఫోరమ్ (టీజేఎఫ్‌) స్థాపించుకొని గల్లీ నుంచి ఢిల్లీదాకా పోరాడిన వారు జర్నలిస్టులు. అస్తిత్వ, ఆత్మగౌరవ, ప్రాంతీయ పోరాటంలో దేశ చరిత్రలోనే పెద్ద ఎత్తున కదిలిన వాళ్లు ఇక్కడి జర్నలిస్టులు. 2001 సంవత్సరంలో ఏర్పడిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరవ్‌ు తెలంగాణ ఏర్పడే దాకా సంక్షేమం, వృత్తి, జీతవేతన, భద్రత సమస్యలలాంటి స్వీయ సమస్యలను కనీసం పట్టించుకోకుండా తెలంగాణ కోసమే ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇతర పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఐ, అట్లాగే ఉద్యమ సంస్థల అన్నింటితోనూ అనుసంధానంతో పనిచేసింది జర్నలిస్టులు. తెలంగాణ కల సాకారమయిన తర్వాత అన్ని సెక్షన్ల ప్రజలలాగే జర్నలిస్టులు కూడా ఇప్పుడిక తమ సంక్షేమం, స్వీయ సమస్యలపైన దృష్టిపెట్టారు. అందులో భాగంగానే తెలంగాణ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందిన తర్వాత ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో తెలంగాణ జర్నలిస్టులు హాజరయిన ఈ ఉద్వేగ, ఉత్తేజకరమయిన సన్నివేశంలో అప్పటికింకా ముఖ్యమంత్రి కాని, మన ముఖ్యమంత్రి కేసీఅర్ ఆ సభను ఉద్దేశించి ప్రసంగించారు. అప్పుడే జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక్కటొక్కటిగా అమలు చేస్తున్నారు.

తెలంగాణ జర్నలిస్టుఫోరం ఆధ్వర్యంలో జరిగిన జర్నలిస్టు జాతరలో ప్రకటించిన వరాలను మరచిపోకుండా కేసీఆర్‌ ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల ప్రణాళికలో చేర్చారు. అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు ప్రత్యేకంగా నిధి ఏర్పాటు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెల్త్‌ కార్డులు, ఇళ్ల స్థలాలు లాంటి అంశాలను చేర్చి ప్రణాళికలో వాగ్దానాలను పొందుపరిచారు.

ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ జర్నలిస్టుల సంక్షేమం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ ప్రెస్‌ అకాడమీని స్వతంత్రంగా ఏర్పాటుచేసి మీడియాకు సంబంధించిన సంక్షేమం, శిక్షణ కార్యక్రమాలన్నింటినీ ఒకే గొడుగుకిందికి తేవాలని, అట్లాగే జర్నలిస్టుల కోసం ఒక భవన నిర్మాణం చేయాలని కూడా ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ప్రెస్‌ అకాడమీ ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా స్వయంగా కేసీఆర్‌ అకాడమీకి వచ్చారు. రాష్ట్రంలో లబ్దప్రతిష్టులయిన, తెలంగాణ వాదంవైపు నిలబడిన ముఖ్యజర్నలిస్టులు, ప్రెస్‌ అకాడమీ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యులు, సంపాదకులతో కూడిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. దరిదాపు నాలుగు గంటలు ముఖ్యమంత్రి జర్నలిస్టుల సమస్యలు విన్నారు. అడ్రిెటేషన్లు, హెల్త్‌కార్డులు, ఇళ్ల స్థలాలు లాంటి సమస్యలపైన సమగ్ర చర్చ జరిగింది. కొత్త రాష్ట్రంలో అడ్రిెటేషన్లు ఎట్లా? అట్లాగే చాలా కాలంగా పెండింగ్‌ లో ఉన్న, జర్నలిస్టు జాతర సందర్భంలో హామీ ఇచ్చినట్టు డెస్క్‌ జర్నలిస్టులకు అడ్రిెటేషన్లు ఇవ్వడం ఎలా? అన్న అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. అట్లాగే హెల్త్‌ కార్డులు కూడా ఉచితంగా, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా క్యాష్‌లెస్‌ కార్డులు, కుటుంబంలో తల్లీదండ్రులను కూడా చేర్చి విస్తృత పరిచి ఇవ్వాలని నిర్ణయించారు. ఆంధ్రలో వేలం అడ్రిెటేషన్లు ఉన్న జర్నలిస్టులకు మాత్రమే హెల్చ్‌కార్డులు అని ప్రకటించినందున, తెలంగాణలో మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే మండల విలేకరులు, పార్ట్‌టైమర్లకు కూడా హెల్త్‌కార్డులు అందాలని, లేనప్పుడు ఆ కార్డు ప్రయోజనమే నెరవేరదని జర్నలిస్టులు చేసిన వాదనను సావధానంగా విన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందుకు అంగీకరించారు. ఇళ్ల స్థలాల సమస్యను కూడా ఆనాడు ప్రస్తావించారు.

ఇవన్నీ ఒకెత్తు అయితే, ముఖ్యమంత్రి నాలుగు గంటల చర్చల తర్వాత ఒక అద్భుతమైన సూచన చేశారు. అది జర్నలిస్టుల సంక్షేమ నిధిని వందకోట్లతో ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరవ్‌ు జాతరలో వేలం పదికోట్ల రూపాయలు అడిగితే పెద్ద మనసుతో సీేఆర్‌ వందకోట్లను ప్రకటించారు. ప్రధానంగా అడ్రిెటేషన్లు, హెల్త్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, సంక్షేమ నిధి అనే అంశాల్లో ఇప్పటి కార్యాచరణ, ఆచరణ ప్రారంభమయింది. నిజంగానే ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ కొత్త రాష్ట్రం జర్నలిస్టులకు ప్రకటించి అమలు చేస్తున్నంత సంక్షేమం దేశంలో మరెక్కడా లేదు. అది ఎవరైనా ఏ మార్గాల్లోనైనా పరిశీలించుకోవచ్చు.

ప్రెస్‌ అకాడమీలో సమావేశం తర్వాత అసెంబ్లీలో పదికోట్ల రూపాయల నిధిని మొదటి బడ్జెట్‌లో ప్రకటించారు. రెండవ బడ్జెట్‌లో మరో పది కోట్లు కూడా చేరాయి. ఈ రకంగా అయిదేండ్ల పాటు 50 కోట్లు జర్నలిస్టు సంక్షేమ నిధికి చేరతాయి. ఆ తర్వాత అయిదేళ్ల కాలంలో ఈ నిధి వందకోట్లకు చేరుకుంటుంది. తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ నిధికి ఛైర్మన్‌గా ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ ఆధ్వర్యంలో ఐఅండ్‌ పీఆర్‌ కమీషనర్‌, అధికారులు, అకాడమీ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యులతో కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ ఏర్పరచిన విధివిధానాలపై ఇప్పుడు ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన తరువాత ఈ సంవత్సరం నుంచి ఈ పథకం అమలు కాబోతున్నది. ప్రధానంగా జర్నలిస్టు సంక్షేమనిధి ద్వారా వచ్చే వడ్డీతో ఈ పథకం నిర్వహణ జరుగుతుంది.

ప్రమాదానికిలోనయిన, అకాల మరణం పొందిన జర్నలిస్టు కుటుంబాలకు అండగా ఉండేందుకు అయిదేళ్ళ పాటు నెలకు రూ.5000 చొప్పున ఇచ్చే పథకం త్వరలో అమలవుతుంది. తెలంగాణ అధికారికంగా ఏర్పడిన 2014 జూన్‌ 2 తరువాత నుంచి జర్నలిస్టు కుటుంబాలను పరిగణనలోకి తీసుకుంటారు. నిజంగానే ఉమ్మడి రాష్ట్రంలో ఇట్లాంటి ఒక నిధి కోసం రెండు కోట్ల రూపాయలు కూడా సాధించలేకపోయిన జర్నలిస్టులు ఇవ్వాళ్ల 20 కోట్ల నిధి (ఆ తరువాత వంద కోట్లు)తో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు.

అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఉమ్మడి రాజధాని, ప్రధాన పత్రికల కార్యాలయాలన్నీ హైదరాబాద్‌లోనే వుండడం, డెస్క్‌లు కూడా ఇక్కడే వుండటం లాంటి ప్రత్యేక కారణాలతో తెలంగాణ అడ్రిెటేషన్ల్లకు ప్రత్యేక విధివిధానాలు అవసరం అయ్యాయి. అందుకోసం సుప్రసిద్ధ సంపాదకులు కె. రామచంద్ర మూర్తి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి అడ్రిెటేషన్ల విధివిధానాలు రూపొందించారు. ఆ తర్వాత మొట్టమొదటిసారి ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌నే, అడ్రిెటేషన్ల కమిటీ ఛైైర్మన్‌గా చేసిన తర్వాత దరిదాపు 30 సమావేశాలు జరిపి 2500పైబడి అడ్రిెటేషన్లు మంజూరు చేశారు. మొట్టమొదటిసారి పారదర్శకత కోసం ఈ అడ్రిెటేషన్లు జారీ చేసిన అందరిపేర్లనూ వెబ్‌సైట్‌లో పెట్టారు. డెస్క్‌ జర్నలిస్టుల అడ్రిెటేషన్ల సమస్య పరిష్కారానికి ఇటీవలే ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌తో అడ్రిెటేషన్ల కమిటీ, ఛైైర్మన్‌ సమావేశం జరిపి రిపోర్టర్లకు ఇచ్చిన స్థాయిలోనే అదే సంఖ్యలో డెస్క్‌ జర్నలిస్టులకు కూడా అడ్మినిస్ట్రేషన్లు ఇవ్వాలని నిర్ణయం జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడటమే ఆలస్యం అవి అమలవుతాయి. సుదీర్ఘ సమావేశాలు, చర్చలు, ఒక్కొక్క దరఖాస్తు కూలంకషంగా పరిశీలించి అడ్మినిస్ట్రేషన్లు మంజూరు చేశారు. వచ్చే సంవత్సరం మరింత పారదర్శకత కోసం మొత్తం ఆన్‌లైన్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

హెల్త్‌కార్డుల విషయంలో జాప్యం జరిగింది. కానీ ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రభుత్వ ఉద్యోగులతో సరిసమానంగా హెల్త్‌కార్డులకు, రూపకల్పన చేసింది. మరీ ఆలస్యమైన సందర్భంలో స్వయంగా మంత్రి టీేఆర్‌ జోక్యంతో ఒక కొలిక్కి వచ్చిన తర్వాత సెక్రటేరియట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలోనే టీేఆర్‌ చేతులమీదుగా హెల్త్‌కార్డుల ప్రక్రియ అమలులోకి వచ్చింది. ఇప్పటివరకు 23000 దరఖాస్తులు వచ్చినవి. వాటిలో సౌలభ్యం కోసం అడ్రిెటేషన్లు ఉన్న జర్నలిస్టుల స్క్రూటినీ, గుర్తింపు సమస్యలు ఉండవు కనుక మొదటి విడతలో అందాయి. ఇప్పుడిక నాన్‌ అడ్రిెడేటెడ్‌్‌ జర్నలిస్టుల, హెల్త్‌ కార్డుల ప్రక్రియ జరుగుతున్నది. నివ్స్‌ు, కిమ్స్‌, ఇతర కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఇప్పటి ఈ కార్డులతో వైద్యం ప్రారంభమయింది. ఇంకొక గొప్ప విజయం గురించి చెప్పుకోవాలి. సాధారణంగా సీఎంఆర్‌ఎఫ్‌ కొంత మేరకు లభిస్తుంది. కానీ జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు అందుబాటులో లేనందున ప్రత్యేకంగా సీఎంవో అధికారులకు ఈ విషయం తెలిసినందువల్ల ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ సిఫారసు మేరకు 160 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి అందింది.

ఇక ఇళ్ల స్థలాల విషయంలో ఇటీవలె ముఖ్యమంత్రి సీేఆర్‌ స్వయంగా చొరవతీసుకొని సమావేశాలు ఏర్పాటు చేశారు. వరంగల్‌ పర్యటన సందర్భంగా జర్నలిస్టులకు డబుల్‌ బెడ్‌రూవ్‌ు ఇండ్ల వాగ్ధానం చేసిన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌, వివిధ యూనియన్ల నాయకులు, హౌసింగ్‌ సొసైటీల బాధ్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. జర్నలిస్టులకు డబుల్‌ బెడ్‌ రూవ్‌ు లేదా త్రిబుల్‌ బెడ్‌ రూవ్‌ు కోసం భూములు చూడాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ నేతృత్వంలో జర్నలిస్టు నేతలు అమీన్‌పూర్‌, బండ్లగూడ, రాజేంద్రనగర్‌, బుద్వేల్‌ ప్రాంతా లను సందర్శించి చివరకు బుద్వేల్‌ (వాలంతరీ ప్రక్కన) అవసరమైన వంద ఎకరాల పైబడి భూమి ఉన్నదని ముఖ్యమంత్రికి ఒక నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి సీేఆర్‌, సంబంధిత అధికారులు, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌, జర్నలిస్టు బృందాలతో మరొక సమావేశం ఏర్పాటు చేసి, బుద్వేలునే నిర్ణయిద్దామని ప్రతిపాదించారు. త్వరలోనే ఈ పథకం అమలయ్యే అవకాశం వున్నది.

తెలంగాణ పోరాటంలో ప్రత్యక్ష, పరోక్ష భాగస్వామ్యంలో పాల్గొన్న జర్నలిస్టుల పోరాటానికి ప్రతిఫలం దక్కబోతున్నది. మనసున్న ముఖ్యమంత్రి, జర్నలిస్టుల ఆర్థిక, సామాజిక, అంతస్థుల స్థితిగతులు పూర్తిగా తెలిసిన ముఖ్యమంత్రి జర్నలిస్టుల సంక్షేమం దేశంలోనే ఆదర్శంగా ఉండాలని భావించి అమలు పరుస్తున్నారు. చివరికి ఈ బడ్జెట్‌లో వందకోట్ల నిధి ూడా విడిగా ప్రకటించారు. మరే ఆటంకం లేకుండా బాజాప్తాగా బడ్జెట్‌ నిధులతో అన్ని పనులు చేసుకుందామని ప్రకటించిన ముఖ్యమంత్రి నిజంగానే జర్నలిస్టులకు వరం. జర్నలిస్టుల సంక్షేమం పూర్తయిన్నాడు తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌ జర్నలిస్టు సంక్షేమ రాష్ట్రం అవుతుంది. నిజంగానే ముఖ్యమంత్రి సీేఆర్‌కు జర్నలిస్టుల పట్ల ఉన్న ప్రేమ, అవగాహన ఎన్నదగినవి. అందు భవిష్యత్తు మనదే. సంక్షేమం మనదే. తెలంగాణ మనదే. పునర్నిర్మాణంలో భాగమవుదాం. బంగారు తెలంగాణ నిర్మించుకుందాం. జర్నలిస్టు భవన్‌ను ూడా నిర్మించుకొని ఏ రాషా్టనికైనా జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ మోడల్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం.

Other Updates