tempuleనాగబాల సురేష్‌ కుమార్‌

దేవరకొండ కోట నల్గొండ జిల్లా చరిత్రాత్మక వైభవాన్ని గూర్చి సగర్వంగా సకల

జనులకు తెలియజెప్పే గొప్ప కోట. ఎందరో రాజులు, చక్రవర్తుల ఏలుబడిలో

వెలుగొందిన ఈ కోట హైదరాబాద్‌కు సుమారు 110 కి.మీ దూరంలో , నాగార్జున

సాగర్‌కు ?5 కి.మీ. దూరంలో వుంది. దాదాపు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన

ఈ కోట ఉప్పువాగు, స్వర్ణముఖి వాగుల నడుమ దర్పంతో అలరారుతూ మనకు

కనువిందు చేస్తుంది. దాదాపు 500 మీటర్ల పై ఎత్తులో నిర్మించబడ్డ ఈ కోట ఏడు

కొండల ప్రాంతాల నడుమ సుమారు 52? ఎకరాల విస్తీర్ణంలో విస్తరించబడి వుంది.

దేవరకొండ కోట చాలాకాలంపాటు కాకతీయుల ఏలుబడిలో వుండి వారి పాలనలో

అదు ్బతÛ వబై వó ాన్ని చవి చూ సిం ది. ర చర ్ల పద ్మ నాయ కు ల ఏలుబడలి ో ఈ కోట మరింత

బలిష్టం గా, పట షి ం్ట గా తయ ూ రర ుుంది. తలె ంగాణ ప్రాంతం గత వరే ుు సం వత్స రాలుగా

వివిధ రాజులు, చక్రవర్తుల ఏలుబడిలో వుండటం వల్ల అనేక చారిత్రక కట్టడాలకు

కోటల నిర్మాణాలకు నెలవయింది. తెలంగాణలో ఆయా రాజుల కాలంలో ఆయా

ప్రాంతంలో ఎన్నో దుర్గాలు, ఖిల్లాలు కట్టబడ్డాయి. ఈ ప్రాంతంలో ఎన్నో వనదుర్గాలు,

గిరి దుర్గాలు, అద్భుత సశీవల దుర్గాలు, జల దుర్గాలు నిర్మితమయ్యాయి. ఈ ప్రాంతం

ఎక్కువగా కొండలు, గుట్టలకు నెలవు కావటంతో తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా

గిరి దుర్గాలు మనకు దర్శనమిస్తాయి. ఇలాంటి గిరి దుర్గాలలో ప్రముఖమైంది మాత్రం

నల్గొండ జిల్లాలోని దేవరకొండ దుర్గం. ఎంతో చారిత్రక

ప్రాధాన్యం కలిగినా ఈ ప్రాంతం అభివృద్ధిలో కొంత

వెనుకబడింది. గోల్కొండ, భువనగిరి దుర్గాలకు సమాంతరంగా

అదే సాశీవయిలో ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఈ కోటను

ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పరిస్తే ఆ కోటలకు ఉన్నంత

ప్రాధాన్యత ఈ కోటకు కూడా వస్తుందనడంలో ఎలాంటి

సం దహే ా ం లదే ు . ర చర ్ల పద ్మ నాయ కు లు దవే రక ొండ కోట నుండి

తమ పరిపాలన చాలా సంవత్సరాల పాటు సాగించడమేగాక

కోట వైభవానికి ఎనలేని కృషి చేశారు. కాకతీయ రాజుల

ఏలుబడిలో దేవరకొండ కోట చాలాకాలం పాటు ఉంది.

కాకతీయులు తమ రాజ్యాన్ని విస్తరించే క్రమంలో రాచకొండ

కోటతో పాటు దేవర కొండ కోటను కూడా వారు తమ వశం

చేసుకున్నారు. సుమారు 1230 సంవత్సర ప్రాంతంలో

దేవరకొండను ఆధారంగా చేసుకొని కాకతీయులు తమ రాజ్య

పాలనను గావించారం ట ే ఈ కోట ప్రాదాó న్యత ఎంతట ది ో మనం

అరశీవం చేసుకోవచ్చు. దాదాపు 290 సంవత్సరాల పాటు

దేవరకొండ కోట కాకతీయుల ఏలుబడిలోనే వుండి అనేక

విధాలుగా తీర్చిదిద్దబడింది. ఈ కోటలో మొత్తం 9 ద్వారాలుమనకు దర్శనమిస్తాయి. పూర్తి గ్రానైట్‌ రాయితో చెక్కబడిన ఈ ద్వారాలపై అనేక

కాకతీయుల రాజ చిహ్నాలు మనకు నేటికీ దర్శనమిస్తాయి. 9 ప్రధాన ప్రాకారాలు

మాత్రమే కాకుండా కోట లోపలి వైపు వెళుతున్నకొద్దీ దాదాపు 30 చిన్న ప్రాకారాలు

సహితం మనకు దర్శనమిస్తాయి. కోటలోకి ప్రవేశించే శత్రువులను తప్పుదారి పట్టించి

వారిని బంధించడానికి వారి ఎత్తులను చిత్తు చేయడానికి, ఎక్కడికక్కడ శతృవుల

రాకను నిరోధించడానికి ఆ ద్వారాలు నిర్మించారు. ఇది వారి దూరదృష్టికి తార్కాణం.

అలాగే 20 వరకు మంచినీటి బావులు, మరో 53 వరకు మెట్ల మార్గం కలిగిన నీటి

బావులు కోటలో మనకు కనిపిస్తాయి. అంతే కాకుండా కోటలోని ప్రజల జల

అవసరాల కోసం ఆరు డ్యాం వంటి నిర్మాణాలు, అయిదు వరకు చెరువుల నిర్మాణాలు

మనకు ఈ కోటలో కనిపిస్తాయి. శత్రువులు నెలల తరబడి కోటను చుట్టుముట్టినా

నీటికి కొరతలేకుండా ఇన్ని నీటి నిర్మాణాలు ఈ కోటలో అలనాటి రాజులు చేపట్టటం

గొప్ప విశేషం. 900 సంవత్సరాల క్రితమే ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో లేని

సమయంలో నాటి శిల్పులు, ఇంజినీర్లు శత్రువుల రాకను పసిగట్టడానికి అలాగే

ఎదుర్కోవడానికి అద్భుతంగా నిర్మించిన వాల్‌ టు వాల్‌ నిర్మాణాలు, అలాగే

ఆయుధాలను భద్రపరచుకునే ఆయుధ బాంఢాగారాలను చూసి అబ్బురపడవలసిందే.

ప్రతి ప్రధాన ద్వారం వద్ద మర ఫిరంగులను అమర్చి శత్రువులను సమరశీవవంతంగా

ఎదుర్కొనే విధంగా వివిధ నిర్మాణాలను వారు ఏర్పాటు చేసుకున్నారు. కోట ప్రధాన

ద్వారం కోటకు దకిూజుణ దిశలో వుంది. ఈ కోటకి రెండు ప్రధాన ప్రాకార ద్వారాలు

వున్నాయి. మొదటి ప్రాకార ద్వారానికి ఆనుకుని రెండో ప్రాకార ద్వారం వుంటుంది.

అయిత ే ప్రాకారానిక ి ప్రాకారానిక ి మద్యó సహ ా జసది ్ధ వ్యత్యాసం వుంటుంది. ఎందు కం టే

మొదటి ప్రాకారం దాటుకుని వచ్చిన శత్రువులను రెండో ప్రాకారం దగ్గర ఎదుర్కొనే

విధంగా గొప్ప నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే కోట ప్రాంతాన్ని ూజుకుణ్ణంగా

పరి శీలించినపు ్పడు మనకు కోటలో దవే ాలయా లు కూ డా కని పసి ార్త ుు. వాటలి ో ఎలవ్ల ు్మ

దవే ాలయ ం, కోట వుె సౖ వ ు్మ దవే ాలయ ం, హ నుమాన ్‌ దవే ాలయ ం, గణ పతి దవే ాలయా

లతో పాటు వివిధ దేవతల రాతి నిర్మాణాలు అనేకచోట్ల చెక్కబడి మనల్ని

మంత్రముగ్ధుల్ని చేయడమేగాక భక్తి భావాన్ని కలుగజేస్తాయి.

ఈ కోటలో నాటి ప్రజల తాగునీటి అవసరాల కోసం కోట్ల బావిని నిర్మించారు

ఆనాటి రాజులు. ఈ బావి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఇక్కడివారి దాహార్తిని తీరు

స్తోం ది. పద ్మ నాయ క రాజులు తలె ంగాణ ప్రాంతాన్ని సు మారు 195 సం వత్స రాలపాటు

పాలించారు. నల్గొండ రాజ్యాన్ని 156 సంవత్సరాల పాటు, దేవరకొండ రాజ్యాన్ని

150 సంవత్సరాల పాటు వారు పాలించారు. దేవరకొండ కోటని కేంద్రంగా చేసుకొనిపాలించినవారిలో పద్మనాయక రాజులు ముఖ్యులు.

పద్మనాయక రాజులలో 6వ తరంవారైన ఎర్రదాచమనేని

మాదనాయుడు ముందుగా కోట నిర్మాణాన్ని ప్రారంభించినట్టు

చారిత్రక కథనం. ఈ తరం తరువాతి వారైన సింగమ

నాయకుడు, అనపోత నాయకుడు, వేదగిరి నాయకుడులతో

పాటు 3వ మాద నాయకుడు కూడా కోట నిర్మాణంలో పాలు

పంచుకున్నారు. వారు తమ రాజ్య విస్తరణ ఒకవైపు

చసే ు కు ంటూన ే తాము కూ డా స్వ య ంగా కోట నిర్మాణాలో ్ల పాలు

పంచుకునేవారు. వీరి ప్రాభవం ఎంతగా వెలిగిపోయిందంటే

ఒక దశలో ఓరుగల్లు రాజ్యం కూడా వీరి రాజ్యంలో కొంత

కాలంపాటు అంతర్భాగంగా వున్నట్టు తెలుస్తోంది. రాజ్య

విసర్త ణ లో బాó గం గా వీరు శ్రీశలై ం వర కు కూ డా తవ ు రాజ్యాన్ని

వ్యాప్తి చేశారని చారిత్రక కథనాల ద్వారా తెలుస్తోంది.

శ్రీనాదక¸ వి సార్వ బౌó ములవారు కూ డా ఈ ప్రాంతాన్ని దరి ్శంచిన

ఆధారాలున్నాయని చరిత్రకారుల కథనం. ఈ కోటలోని మరో

ప్రధాన ద్వారం దాటుకుని ముందుకు వెళితే అక్కడ ఆయుధ

బాంఢాగార నిర్మాణాలు త్రాగునీటి నిర్మాణాలతో పాటు

చూడముచ్చటైన విశాల ప్రాంతాలు మనకు దర్శనమిస్తాయి.

ఒక్కొక్క ద్వారం మరొక ద్వారం వైపుకు తీసుకెళ్ళే వివిధ

నిర్మాణాలు చూపరుల్ని ఆకట్టుకుంటాయి. ఈ కోట ఎంతో

ప్రణాళికతో కట్టబడిందని మనకు తెలుస్తోంది. మంచి నీటి

బావులు అనకే ం ఇందు లో కని పసి ు ం్త టాయి. కోట ఉతర్త దిశల ో

రాజులు బయటికి వెళ్ళడానికి రహస్య గుహ రాజమార్గాలు

న్నాయి. శతృవులు దండయాత్రలు చేసిన సమయంలోనూ,

ప్రమాద సూచికలు, హెచ్చరికలు జారీ చేసిన సమయాల్లోనూ,

రాజులు ప్రజల బాగోగులు చూడటానికి రాజ్యంలో మా

రువేషాల్లో తిరిగే సమయాల్లోనూ ఈ సొరంగ మార్గాలని

వాడేవారని చెబుతారు. కోటలోపలికి వెళుతున్నకొద్దీ సందర్శ

కులు గమ్మత్తయిన అనుభూతికి లోనవుతారు. 5వ ప్రాకార

సింహద్వారం మనకు స్వాగతం చెబుతున్నట్టుగా ఠీవీగా వుంది.

ఈ ద్వారం దాటి ముందుకు వెళితే మనకు శ్రీరామాలయంకనిపిస్తుంది. ఈ ఆలయ వెనుక భాగంలోనే మనకు నాటి సైనికులు, రాజుల

నివాస గృహాలతోపాటు స్నాన ఘట్టాలు, దర్బార్‌ వంటి మరికొన్ని నిర్మాణాలు

మనకు కనిపిస్తాయి. ప్రతి నిర్మాణం అద్భుతమయిందే. ప్రతి కట్టడం శిల్పుల

అద్భుత నిర్మాణ ప్రతిభకు తార్కాణంగా నిలిచేదే.

ఈ ప్రాంతానికి సమీపంలోనే గొలుసుల బావి వుంది. అలాగే నృత్య

కళాకారుల కొరకు వారు ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వడానికి నిర్మించిన నృత్య

మండపం లాంటి వేదికను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఆసాశీవన

పం డతి ు ల కోసం , కళ ాకారు ల కోసం నిర్మించిన నివాస గృ హా లను కూ డా మనం

చూడవచ్చు. ఈ వేదికలను చూస్తే నాటి రాజులు కళలకు ఎంతటి ప్రాధాన్యత

ఇచ్చేవారో మనకు అరశీవమవుతుంది. ఆ కళా ప్రాంగణం పక్కనే మనకు

శివాలయం దర్శనమిస్తుంది. అలాగే ఈ ప్రాంగణంలోనే నేలమట్టమైన

ధ్వజస్తంభంతోపాటు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఠీవీగా వున్న ఎన్నో కట్టడాలు

మనకు కని పసి ార్త ుు. ప్రతి యే టా తొలి ఏకాదశి నాడు అలాగ మహా శివరాత్రినాడు

భక్తులతో ఈ శివాలయ ప్రాంతమంతా కిటకిటలాడుతుంది. ఆ

సమయంలో దేవరకొండ కోట సందర్శకులతో కిటకిటలా

డుతుంది. ఈ ప్రాంతానికి సమీపంలో రాణుల స్నానాల కొరకు

ప్రత్యేక బావులు, వారు బట్టలు మార్చుకొనుటకు నిర్మించిన

ప్రత్యేక గదుల వంటి నిర్మాణాలు మనకు కనిపిస్తాయి. ఇప్పటికీ

ఈ బావులు జలకళతో నిండి వుండటం మనం చూడవచ్చు.

ఈ ప్రాంతంలోగల బావులలో గల నీరు ఎంతో తియ్యగా

ఉంటుందని, ఆ నీళ్లు ఎంతో ఆరోగ్యకరమైనవని సాశీవనికులు

నమ్ముతారు. ప్రధాన ద్వారాలపై పూర్ణకుంభాలవంటి నిర్మితాలు

మనకు కనిపిస్తాయి. గోడలపై రాతి నిర్మాణాలలో సింహం,

అశోక చ కం , చపే , నాగస ర ా్పల్లాం ట ి పల ు గు రు ల్త ు, నిర్మాణాలు

మనకు కనిపిస్తాయి. వీటిలోని పూర్ణ కుంభం, సింహపు

నిర్మాణాలు రేచర్ల పద్మనాయకుల ధర్మనియమబద్ధమైన

రాజ్యపాలనకు వారి రాజ చిహా ్నలుగా మనకు కని పసి ార్త ుు. చపే

మరియు తాబేలు వారి ధర్మనిరతిని తెలియజేస్తాయి. ఈ కొండ

చుట్టూ ఎంతో ప్రాశస్త్యమైన పలు దేవాలయాలు కూడా

వున్నాయి. వీటిలో ఆంజనేయ మందిరం ఒకటి. అలాగే కోట

చుట్టూ అష్టదిగ్బంధనం పేరుతో నిర్మించిన పలు దేవాలయాల

నిర్మాణాలు మనకు కనిపిస్తాయి. దేవరకొండ కోట అలనాటి

చారిత్రక వబై వó ానిక ి ప్రత ్య కూంజు గా నటే కి ీ నిలిచిన గొప్ప ఆనవాలు.

ఈ కోట పూ ర్వ వబై వó ం కోసం ప్రబ ుó త్వ ం కొంచెం శ్రద ్ధ వహి ంచి

నాటి నిర్మాణాలను కాపాడటమే కాకుండా పర్యాటకులకు కొన్ని

వసతులు కల్పిస్తే గొప్ప టూరిస్టు క్రేంద్రంగా దేవరకొండ కోట

నిలుస్తుంది. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని

ఆశిద్దాం.

Other Updates