kavitha

తెలంగాణ రాష్ట్ర ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలలో కూడా ఘనంగా జరిగాయి. వివిధ దేశాలలో స్థిరపడ్డ తెలంగాణ ప్రజలు జూన్‌ 2వ తేదీన, ఆ తరువాత కూడా పండుగలాగ ఆవిర్భావ వేడుకలను నిర్వహించుకున్నారు. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, దుబయ్‌, ఖతర్‌, సౌదీ అరేబియా దేశాలలో ఉన్న తెలంగాణ ప్రజలు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు నిర్వహించుకుని తెలంగాణ రాష్ట్రంపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

మెల్‌బోర్న్‌లో..

జై తెలంగాణ నినాదాలు ఖండాంతరాల్లో ప్రతిధ్వనించాయి. మెల్బోర్న్‌ లో తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా శాఖ అధ్వర్యంలో తెలంగాణ ఆవిరాÄ్భవ వేడుకలు ఘనంగా జరిగాయి. నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరవగా ఆస్ట్రేలియా కేంద్ర, విక్టోరియా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, భారత కాన్సులేట్‌ జనరల్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జూన్‌ 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మెల్బోర్న్‌ లోని క్యారమ్‌ డౌన్స్‌ ప్రాంతంలో గల శివ విష్ణు ఆలయ ప్రాంగణంలోని సాంస్కతిక కేంద్రంలో కార్యక్రమాలు జరిగాయి. ప్రవాస తెలంగాణ బిడ్డలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మద్యాహ్నం 2 గం.లకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ముందుగా కవితకు చిన్నారులు స్వాగతం పలికారు. అనంతరం అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి మౌనం పాటించారు. పలు తెలంగాణ ఉద్యమ గీతాలకు చిన్నారులు చేసిన నత్యాలు అలరించాయి.

ఆస్ట్రేలియాలోని రాజకీయ, అధికార, వ్యాపార ప్రముఖులు పాలొెన్న ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా బహుళ సంస్క ృతుల మరియు ఆసియా సంబంధాల పార్లమెంటరీ సెక్రెటరీ హాంగ్‌ లిమ్‌, ఆస్ట్రేలియా బహుళ సంస్క తుల షాడో మినిస్టర్‌ ఇంగా పులిచ్‌, పార్లమెంటు సభ్యులు ముర్రే థామ్సన్‌, సోనియా కిల్కెనీ, మెల్బోర్న్‌ లోని భారత కాన్సులేట్‌ జనరల్‌ రాకేష్‌ మల్హోత్రా, మాజీ విద్యామంత్రి ప్రస్తుత ప్రభుత్వ అంతర్జాతీయ విద్యా సలహాదారులు ఫిల్‌ హనీవుడ్‌, లిబరల్‌ పార్టీ నాయకులు గ్యారీ స్పెన్సర్‌లు అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొెన్న ఎం.పి కవిత మాట్లాడుతూ, ఆస్ట్రేలియాలో ఉన్న ప్రవాస తెలంగాణీయులందరు తమ తమ గ్రామాలకు సేవ చెయ్యాలని పిలుపునిచ్చారు. ప్రవాస భారతీయ ప్రముఖులు ప్రఖ్యాత విక్టోరియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సీయీవో అర్జున్‌ సూరపనేని, జాగృతి సిడ్నీ నాయకులు రాజేష్‌ అర్శనపల్లి, కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ యాదూ సింగ్‌, పంజాబీ అసోసియేషన్‌ అధ్యక్షులు పరమ్‌ జైస్వాల్‌, మెల్బోర్న్‌ తెలంగాణ ఫోరం అధ్యక్షులు రాజేష్‌ తౌటిరెడ్డి, ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్‌ అధ్యక్షులు గోపాల్‌ తంగెర్ల, ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్‌ ప్రతినిధి ప్రవీణ్‌ దేసం, స్టార్మ్‌ హైదరాబాద్‌ డైరెక్టర్‌ భరత్‌ రెడ్డి పట్లొళ్ళ కార్యక్రమంలో పాల్గొెన్నారు.

అమెరికాలో..

అమెరికాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు కనుల పండుగగా జరిగాయి. అమెరికాలో నివసిస్తున్న తెలంగాణ వాసుల ఆహ్వానం మేరకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు టి.ఆర్‌.ఎస్‌. ఎం.పి. బి.వినోద్‌కుమార్‌, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి, సాంస్కృతికవేత్త దేశపతి శ్రీనివాస్‌ల నేతృత్వంలోని ప్రతినిధివర్గం విస్తృతంగా పర్యటించి, వేడుకల్లో పాల్గొన్నారు. తొలుత బోస్టన్‌లో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న అనంతరం డల్లాస్‌లో తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన గ్లోబల్‌ కన్వెన్షన్‌కు వీరు హాజరయ్యారు. ఈ కన్వెన్షన్‌లో ఎంపి వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, కరెంటు సరఫరాలో గుణాత్మక ప్రగతి సాధించామని చెప్పారు. దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్రావిర్భావం అనంతరం తెలంగాణ కళారూపాలకు పున: ప్రాభవం కల్గించేందుకు విశేషకృషి సాగుతోందని వివరించారు.

అనంతరం నార్త్‌ కరోలినాలోని రాలి, వాషింగ్టన్‌, కనెక్టికట్‌, న్యూజెర్సీ నగరాల్లో తెలంగాణ వాసులతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌ నుంచి నేరుగా న్యూయార్క్‌, డల్లాస్‌ నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభించాలని వారు చేసిన అభ్యర్థనకు ఎం.పి. సానుకూలంగా స్పందించారు. అక్కడికక్కడే కేంద్ర ప్రభుత్వంతో ఆయన సంప్రదించి వీలైనంత త్వరలో ప్రారంభింపచేస్తామని ప్రకటించారు. అదేవిధంగా రైతు రుణాల రీషెడ్యూలింగ్‌ విషయంలో వారు లేవనెత్తిన అంశాలను ఎం.పి. వినోద్‌కుమార్‌ ఫోన్‌ ద్వారా రాష్ట్ర సీనియర్‌ అధికారి రేమండ్‌ పీటర్‌ దృష్టికి నివేదించారు. ప్రవాస తెలంగాణ ప్రతినిధులు నారాయణ స్వామి, వెంకట్‌మారాజు, అమర్‌ కరిమెళ్ళ, మంగ్లీ, విజయ మొదలైన వారు పాల్గొన్నారు.

లండన్‌లో..

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు లండన్‌ నగరంలో పండగ వాతావరణంలో జరిగాయి. తెలంగాణ జాగృతి యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, అసెంబ్లీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనా చారి, లంబేత్మే మేయర్‌ సలేర్‌ జాఫర్‌, భారత హై కమిషనర్‌ ఫస్ట్‌ సెక్రటరీ వీజాయ్‌ వసంత, బ్రిటన్‌ ఎం.పి. స్టీఫెన్‌ టీమ్స్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రశంసించారు. స్పీకర్‌ మధుసూదనాచారి మాట్లాడుతూ అమరుల త్యాగాలను స్మరించుకోవాలన్నారు.

కువైట్‌లో..

కువైట్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను తెలంగాణకు చెందిన ప్రజలు ఘనంగా నిర్వహించారు. కువైట్‌ తెలంగాణ జాగృతి అధ్యక్షులు వినయ్‌కుమార్‌ నేతృత్వంలో కార్యక్రమాలు నిర్వహించారు. కేక్‌ కట్‌చేసి ఉత్సవాలు జరుపుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

వివిధ నగరాలలో..

తెలంగాణ ప్రవాస భారతీయుల ఆధ్వర్యంలో ప్రపంచంలోని నలు మూలలా ఉన్న పలు నగరాలలో ఆవిర్భావ వేడుకలు జరిగాయి. మస్కట్‌, బహ్రేన్‌, మలేసియా, ఖతర్‌లలో ప్రవాస తెలంగాణ ప్రజలు ఎంతో సంతోషాతిరేకాలతో ఆవిర్భావ పండగను జరుపుకున్నారు.

ఢిల్లీలో..

దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు కనుల పండుగగా నిర్వహించారు. తెలంగాణ భవన్‌ను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఢిల్లీలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కూడా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలలో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలా చారిలు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. తెలంగాణ తల్లి, అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేశారు. తెలంగాణ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో చేపట్టిన పథకాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి ప్రారంభించారు. వివిధ ఆసుపత్రులలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ మీడియాతో మాట్లాడుతూ, రెండు సంవత్సరాలలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. విద్యుత్‌లో స్వయం సమృద్ధి సాధించామన్నారు. తెలంగాణ ఏర్పడితే ఎన్నో కష్టాలు ఎదురవుతాయని కొందరు సృష్టించిన అపోహలు పటాపంచలయ్యాయన్నారు. ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్‌లు మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల సంక్షేమంపై దృష్టి సారించిందన్నారు. దేశంలో కెల్లా అగ్రగామి రాష్ట్రంగా తెలంగా ణను తీర్చిదిద్దడానికి కేసీఆర్‌ ఎంతో శ్రమిస్తున్నాడన్నారు. ఎన్నో ఐటీ దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీ రాపోలు ఆనందభాస్కర్‌, కేంద్ర సమాచార శాఖ కమీషనర్‌ మాడభూషి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏపీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రావుల పాలెంలో మే 2వ తేదీన వేడుకలు జరిగాయి. జాతీయ రహదారి చౌరస్తా వద్ద జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సీమాంధ్రుల ఐక్యవేదిక కన్వీనర్‌ సింగినీడి సీతారాం పాల్గొన్నారు.

 

Other Updates