cmసిద్ధిపేట ప్రజల ఆశీర్వాదంతోనే తాను ఇంతవాడినయ్యాయని, నేను మీ చేతుల్లో పెరిగిన బిడ్డనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. అక్టోబరు 11న దసరా పండగరోజు రాష్ట్రంలోని 21 కొత్తజిల్లాలను పలువురు మంత్రులు, స్పీకర్‌, మండలి ఛైర్మన్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. సిద్ధిపేట కొత్త జిల్లాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన చేతులమీదుగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. గతంలో 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ కరీంనగర్‌ వెళుతుండగా సిద్ధిపేట అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఆపి అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసిన తరువాత సిద్ధిపేటను జిల్లా చేయాలని కోరుతూ జిల్లా ఏర్పాటుకు సంబంధించిన మ్యాప్‌ను కూడా అందించానని తెలిపారు. అయినా అప్పుడు ఆ కల సాకారం కాలేదని, ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఈ జిల్లాను ప్రారంభించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. తనకు ఆనందభాష్పాలు వస్తున్నాయని పేర్కొన్నారు. చిన్న జిల్లాలను చేయడం రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద పాలనా సంస్కరణగా ఆయన పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు 2 నుంచి 4 లక్షల జనాభా ఉండే విధంగా జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. చిన్న జిల్లాల వల్ల పాలన ప్రజల ముంగిటికి వెళుతుందని, దీనితో పాలన సౌలభ్యం ఎంతో మెరుగుపడి ప్రజల పనులు త్వరగా పూర్తవుతాయన్నారు. ఆర్థిక ఫలాలు అందరికీ అందుతాయని, పల్లెల్లో ఉన్న మారుమూల కుటుంబాలకు కూడా లబ్ధి చేకూరుతుందన్నారు. మన పాలన చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు ఆ రాష్ట్రానికి పోయి బతకాలనే విధంగా మన పాలన ఉండాలని సీఎం ఆకాంక్షించారు. మనం ఎంతో పోరాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం, దానిని బంగారు తెలంగాణగా మార్చడానికి ఎన్నో సంస్కరణలు చేపట్టాల్సి ఉందన్నారు. పాత ఫ్యూడల్‌ పాలన, పెత్తందారీతనమంతా ఒకేచోట ఉండే పరిస్థితులు పోవాలన్నారు. ప్రజల గడప దగ్గరకు పాలన రావడమే తన ఉద్దేశం అని పేర్కొన్నారు. తాను బతికున్నంతవరకు ప్రజారంజకమైన పాలన అందించడమే తన జీవితధ్యేయం అని కేసీఆర్‌ తెలిపారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుందని, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అప్పులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయని కేసీఆర్‌ తెలిపారు. ఇప్పటికే 14 బ్యాంకులు అప్పులు ఇస్తామని చెప్పాయి. దీనికి కారణం మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలేనని అన్నారు. 2024 వరకు రాష్ట్ర బడ్జెట్‌ 5లక్షల కోట్లకు చేరుకుంటుందన్నారు. ఇంత బడ్జెట్‌ను ఎలా వినియోగిస్తారని ఒకసారి గవర్నర్‌ నన్ను అడిగారని పేర్కొన్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థిక లబ్ధి చేకూరే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పానని కేసీఆర్‌ వివరించారు. ఇందులో భాగంగా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయి ప్రతి ఎకరాకు సాగునీరు అందితే ప్రజల, రైతుల ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందని కేసీఆర్‌ వివరించారు. కొండపోచమ్మసాగర్‌ నీటి సామర్థ్యాన్ని 10 నుంచి 20 టిఎంసీల సామర్థ్యం ఉండేలా చూస్తున్నట్లు కేసీఆర్‌ వివరించారు.

హరీష్‌ గొప్ప నాయకుడు

హరీష్‌ గొప్ప నాయకుడని సీఎం కేసీఆర్‌ ప్రశంసించారు. తాను సిద్ధిపేట శాసనసభ్యత్వానికి రాజీమానా చేసి వెళ్ళేటప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళానని, కానీ హరీష్‌ కూడా ఎంతో సమర్ధవంతంగా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నాడని, అభివృద్ధిలో ఉరకలు వేయిస్తున్నాడని పొగడ్తలతో ముంచెత్తారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ. 100 కోట్ల ప్రత్యేక నిధిని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సిద్ధిపేట జిల్లాలో మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీ.ఎం. : హరీష్‌

అంతకు ముందు మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ కేసీఆర్‌ అంటే కే అంటే నాలెడ్జ్‌(విజ్ఞానం), సి అంటే కమిట్‌మెంట్‌ (నిబద్ధత), ఆర్‌ అంటే రీ కన్‌స్ట్రక్షన్‌ (పునర్‌నిర్మాణం) అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సిద్ధిపేటకు మూడు వరాలు ఇచ్చాడని, అవి మూడు కూడా పూర్తయ్యాయన్నారు. మొదటిది జిల్లా చేయడం, రెండు సిద్ధిపేటకు రైలు మార్గం తేవడం, మూడు సిద్ధిపేట రైతులకు ప్రాజెక్టుల నుంచి సాగునీటిని తేవడం

ఉన్నాయన్నారు. ఈరోజు సిద్ధిపేట జిల్లా కల సాకారమైందని, రైలుమార్గ నిర్మాణానికి ప్రధానమంత్రి మోడీ శంకుస్థాపన చేశారని, సాగునీటి కోసం ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నదని మంత్రి హరీష్‌ పేర్కొన్నారు. సిద్ధిపేట అనగానే ప్రతి విషయంలోనూ కాదనకుండా మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి రుణం తీర్చుకోలేనిదంటూ స్టేజీపైనే కేసీఆర్‌ కాళ్ళకు నమస్కరించారు.

పతాకావిష్కరణతో ప్రారంభం

ముఖ్యమంత్రి సిద్ధిపేట చేరుకోగానే అంబేద్కర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కలెక్టరేట్‌ను ప్రారంభించారు. పూజా కార్యక్రమాల అనంతరం జిల్లా కలెక్టర్‌ వెంకట్‌రాంరెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ హనుమంతరావు బాధ్యతలను స్వీకరించారు. అక్కడ నుంచి పాత బస్టాండ్‌ వరకు ముఖ్యమంత్రి ర్యాలీగా వచ్చారు. ఈ కార్య క్రమంలో జడ్పీ అధ్యక్షురాలు రాజమణి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్‌, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, సతీష్‌, రసమయి బాల్‌కిషన్‌ తదితర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సిద్దిపేట

జిల్లాకేంద్రం: సిద్దిపేట

విస్తీర్ణం: 3,432 చ.కి.మీ.

జనాభా: 10,02,671

మండలాలు: 22

గ్రామాలు: 217

రెవెన్యూ డివిజన్లు: 3

మున్సిపాలిటీలు: 2

మండలాలు:

సిద్దిపేట అర్బన్‌, సిద్దిపేట రూరల్‌, చిన్నకోడూరు, నంగునూరు, దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, గజ్వేల్‌, కొండపాక, జగదేవ్‌పూర్‌, వర్గల్‌, ములుగు, దౌల్తాబాద్‌,మర్కూక్‌, రాయ్‌పోలు, బెజ్జెంకి, హుస్నాబాద్‌, హుస్నాబాద్‌ రూరల్‌, కోహెడ, మద్దూర్‌, చేర్యాల, కొమురవెల్ల్లి

రెవెన్యూ డివిజన్లు: సిద్దిపేట, గజ్వేల్‌, హుస్నాబాద్‌

మున్సిపాలిటీలు: సిద్దిపేట, గజ్వేల్‌

దర్శనీయ స్థలాలు :

వర్గల్‌లోని సరస్వతీదేవి ఆలయం, కొమురవెల్లి మల్లన్న ఆలయం, కొండపోచమ్మ దేవాలయం, నాచారం లక్ష్మీనరసింహస్వామి ఆలయం, సరస్వతి క్షేత్రం (అనంతసాగర్‌), కోటిలింగాల దేవాలయం (సిద్దిపేట)

ప్రగతి పరుగులు సిద్దిపేట.. ముఖ్యమంత్రి స్వగ్రామమైన చింతమడక సిద్దిపేట మండలంలోనే ఉంది. సిద్దిపేట వాణిజ్య కేంద్రంగా పేరొందింది. కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలోని ఎక్కువ మండలాలు సిద్దిపేట జిల్లాలోనే ఉన్నాయి.ములుగులో ఉద్యాన విశ్వవిద్యాలయం, అటవీ కళాశాల, వర్గల్‌ నవోదయ విద్యాలయం, గజ్వేల్‌ ఎస్సీ పాల్‌టేక్నిక్‌ కళాశాల, కర్కపట్లలో బయోమెడికల్‌ సెజ్‌లు ఉన్నాయి.,

ఆదిలాబాద్‌

జనాభా: 7,21,433

విస్తీర్ణం: 4,153 చ.కి.మీ.

రెవిన్యూ డివిజన్లు:

ఆదిలాబాద్‌, ఉట్నూర్‌

మండలాలు 18:

గ్రామపంచాయతీలు: 275

మండలాలు :

ఆదిలాబాద్‌ అర్బన్‌, ఆదిలాబాద్‌ రూరల్‌ (కొత్త), బేల, జైనథ్‌, నేరేడిగొండ, ఇచ్చోడ, బోథ్‌, బజర్‌హత్నూర్‌, గుడిహత్నూర్‌, తాంసి, తలమడుగు, భీంపూర్‌, సిరికొండ, ఉట్నూర్‌, ఇంద్రవెల్లి, నార్నూర్‌, గాదిగూడ, మావల

మున్సిపాలిటీ: ఆదిలాబాద్‌

పరిశ్రమలు: జిన్నింగ్‌ అండ్‌ ప్రెస్సింగ్‌, స్పిన్నింగ్‌ మిల్స్‌, సోయా సంబంధిత ఫ్యాక్టరీలు

సాగునీటి పారుదల: మత్తడివాగు, సాత్నాల, కొరాట-చనాఖా బ్యారేజీ

ఎమ్మెల్యేలు: జోగు రామన్న (ఆదిలాబాద్‌), రాథోడ్‌ బాపూరావు (బోథ్‌), అజ్మీరా రేఖానాయక్‌ (ఖానాపూర్‌), కోవా లక్ష్మి (ఆసిఫాబాద్‌)

ఎంపీ: జీ నగేశ్‌

పర్యాటక ప్రాంతాలు: కుంటాల, పొచ్చెర, కనకాయి, గాయత్రీ జలపాతాలు, కేస్లాపూర్‌ నాగోబా ఆలయం, జైనథ్‌లో లక్ష్మీనారాయణ ఆలయం

జాతీయ రహదారి: ఆదిలాబాద్‌ ఎన్‌హెచ్‌ 44

పత్తికి, ప్రకృతికి పట్టుగొమ్మ.. గిరిజన సంస్కృతికి ఆలవాలం.. ప్రకృతి అందాల నిలయం ఆదిలాబాద్‌. ఆదిల్షా అనే రాజు పరిపాలించడంతో ఈ ప్రాంతానికి ఆదిలాబాద్‌ అనే పేరు వచ్చింది. ఆదిలాబాద్‌నే ఎదులాపురం అని కూడా అంటారు. ఈ జిల్లాలో పత్తి విస్తారంగా పండిస్తారు. సాత్నాలా ప్రాజెక్టు, మత్తడి వాగు ప్రాజెక్టులు నీటి వనరులు. కాటన్‌ స్పిన్నింగ్‌ మిల్లు ఉంది. విస్తారమైన అటవీ ప్రాంతం. గోదావరి గలగలలు ఈ ప్రాంతం సొంతం.

రైల్వేలేను: ఆదిలాబాద్‌-ముత్‌ఖేడ్‌, ఆదిలాబాద్‌-నాగ్‌పూర్‌

అటవీ విస్తీర్ణం: 1,09,007 హెక్టార్లు

మంచిర్యాల

జనాభా: 7,07,050

విస్తీర్ణం: 3,943 చ.కి.మీ.

రెవిన్యూ డివిజన్లు: 2

మండలాలు 18:

మున్సిపాలిటీలు: 3

గ్రామపంచాయతీలు: 200

మండలాలు:

జన్నారం, దండేపల్లి, లక్సెెట్టిపేట, హాజీపూర్‌, మంచిర్యాల, నస్పూర్‌, భీమారం, జైపూర్‌, చెన్నూర్‌, కోటపల్లి, వేమనపల్లి, నెన్నెల, మందమర్రి, కాసిపేట, బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, తాండూరు

ఎమ్మెల్యేలు: ఎన్‌. దివాకర్‌రావు (మంచిర్యాల), నల్లాల ఓదెలు (చెన్నూరు), దుర్గం చిన్నయ్య (బెల్లంపల్లి), రేఖాశ్యాంనాయక్‌ (ఖానాపూర్‌ నియోజకవర్గం)

మున్సిపాలిటీలు: మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి

రైల్వేలేన్లు: హైదరాబాద్‌-న్యూఢిల్లీ

గనులు: సింగరేణి (శ్రీరాంపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి మూడు డివిజన్లు)

పరిశ్రమలు: జైపూర్‌లో 1200 మెగావాట్ల సింగరేణి విద్యుత్‌ కేంద్రం. మంచిర్యాలలో ఎంసీసీ సిమెంట్‌ ఫ్యాక్టరీ, దేవాపూర్‌లో సిమెంట్‌, సిరామిక్‌ పరిశ్రమలు, జిన్నింగ్‌ మిల్లులు

పర్యాటక ప్రాంతాలు: మందమర్రి మండలంలో గాంధారి ఖిలా, గాంధారి వనం, జైపూర్‌ మండలంలో మొసళ్ల అభయారణ్యం, కోటపల్లి మండలంలో కృష్ణ జింకల అభయారణ్యం, జన్నారం మండలంలో పులుల అభయారణ్యం

ప్రాణహితతో పునీతం.. గోదావరి, ప్రాణహిత జలాలతో పునీతమవుతున్న జిల్లా మంచిర్యాల. అపారమైన బొగ్గు నిక్షేపాలతో సింగరేణికి ఊపిరులూదుతోంది. సిమెంటు పరిశ్రమలు ఈ జిల్లా ప్రత్యేకం. జైపూర్‌ మండలంలో 1200 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రం తెలంగాణకు వెలుగురేఖ. గోదావరి నదిపై ఎల్లంపల్లి (శ్రీపాదసాగర్‌) జలాశయం వేల గ్రామాలకు తాగు,సాగునీరు అందిస్తోంది. హైదరాబాద్‌ దాహార్తి తీరుస్తోంది.

నిర్మల్‌

జనాభా: 7,30,286

విస్తీర్ణం: 3,845 చ.కి.మీ.

రెవిన్యూ డివిజన్లు: 2

మండలాలు 19:

మున్సిపాలిటీలు: 2

గ్రామపంచాయతీలు: 240

మండలాలు:

నిర్మల్‌, సారంగాపూర్‌, దిలావర్‌పూర్‌, మామడ, కడెం, ఖానాపూర్‌, లక్ష్మణచాంద, సోన్‌, నిర్మల్‌ అర్బన్‌, నర్సాపూర్‌ (జి), దస్తూరాబాద్‌, పెంబి, భైంసా, కుంటాల, కుభీర్‌, తానూర్‌, ముథోల్‌, లోకేశ్వరం, బాసర

రెవిన్యూ డివిజన్లు: నిర్మల్‌, భైంసా

మున్సిపాలిటీలు: నిర్మల్‌, భైంసా

ఎమ్మెల్యేలు: అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి (నిర్మల్‌), గడ్డం విఠల్‌రెడ్డి (ముథోల్‌), రేఖాశ్యాంనాయక్‌ (ఖానాపూర్‌)

జాతీయ రహదారులు: నంబర్‌ 44 (నాగ్‌పూర్‌ – హైదరాబాద్‌), నంబర్‌ 61 (నిజామాబాద్‌-జగదల్‌పూర్‌)

పరిశ్రమలు: పత్తి జిన్నింగ్‌ మిల్స్‌, రైస్‌ మిల్లులు, బీడీ పరిశ్రమ

అటవీ విస్తీర్ణం: 1,17,022 హెక్టార్లు

జ్ఞాన సరస్వతి కొలువు.. బాసర జ్ఞాన సరస్వతీదేవి కొలువైన జిల్లా నిర్మల్‌. తూర్పున అడవులు, పడమర బాసర క్షేత్రం, ఉత్తరాన సహ్యాద్రి పర్వతాలు, దక్షిణాన గోదావరి నది నడుమ ఈ జిల్లా రూపుదిద్దుకుంది. పెయింటింగ్‌లు, కొయ్యబొమ్మలకు ప్రపంచఖ్యాతి పొందిన నిర్మల్‌ ఒకప్పుడు నిజాం ఆయుధాల తయారీ కేంద్రం. వ్యవసాయమే ఇక్కడ ప్రజల ప్రధాన వ్యాపకం.

400 ఏళ్ల క్రితం నిమ్మనాయుడు పాలించడంతో ఆయన పేరుపై వెలిసిందే నిర్మల్‌. ఈ చారిత్రక పట్టణం కవులు, కళాకారులకు పుట్టినిల్లు.

బాసర, పాపేశ్వర ఆలయం, ఆడెల్లి మహా పోచమ్మ ఆలయాలు ఉన్నాయి.

స్వర్ణ, గడ్డెన్నవాగు, కడెం జలాశయాలతో పాటు సదర్మాట్‌ బ్యారేజీ తాగు, నీటి అవసరాలు తీరుస్తున్నాయి.

కుంరం భీం ఆసిఫాబాద్‌

జనాభా: 5,92,831

విస్తీర్ణం: 4,878 చ.కి.మీ.

రెవిన్యూ డివిజన్లు: 2

మండలాలు 15:

మున్సిపాలిటీలు: 1

గ్రామపంచాయతీలు: 177

మండలాలు:

ఆసిఫాబాద్‌, రెబ్బెన, వాంకిడి, కెరమెరి, తిర్యాణి, జైనూర్‌, సిర్పూర్‌ (యు), లింగాపూర్‌, కాగజ్‌నగర్‌, సిర్పూర్‌ (టి), బెజ్జూర్‌, చింతనమానెపల్లి, దహెగాం, కౌటాల, పెంచికల్‌పేట

రెవిన్యూ డివిజన్లు: ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌

మున్సిపాలిటీ: కాగజ్‌నగర్‌

ప్రధాన పరిశ్రమలు: దశాబ్దాలుగా కాగితాన్ని అందించిన కాగజ్‌నగర్‌లోని పేపర్‌మిల్లు ఇక్కడే ఉంది. ఆసిఫాబాద్‌ జిన్నింగ్‌ మిల్లులకు నిలయం.

నీటి పారుదల: కుంరం భీం ప్రాజెక్టు, వట్టివాగు, జగన్నాథ్‌పూర్‌, ఎర్రవాగు, తమ్మిడిహట్టి ప్రాజెక్టులు, ప్రాణహిత నది

ఎమ్మెల్యేలు: కోవ లక్ష్మి (ఆసిఫాబాద్‌), కోనేరు కోనప్ప (కాగజ్‌నగర్‌)

ఎంపీ: గోడం నగేశ్‌

సాగునీటి పారుదల: కుంరం భీం ప్రాజెక్టు వట్టివాగు, ఎన్టీఆర్‌సాగర్‌, జగన్నాథ్‌పూర్‌, పాల్వాయిసాగర్‌ జలాశయాలు ఈ జిల్లాలో ముఖ్యమైనవి.

పోరాటయోధుడు కుంరంభీం పోరుసల్పిన జోడేఘాట్‌, ప్రకృతి రమణీయత అలరారే ప్రాంతాలు, గిరిజనుల ఆరాధ్య దైవాలు కొలువుదీరిన ప్రాంతాలు నేటి ఆసిఫాబాద్‌ జిల్లా సొంతం. నేటి జిల్లా కేంద్రం ఆసిఫాబాద్‌ ఒకప్పటి గోండుల రాజధాని. ఏడు దశాబ్దాల క్రితమే జిల్లా కేంద్రం. జోడేఘాట్‌తో పాటు జైనూర్‌లోని మార్లవాయి హేర్మన్‌డార్ఫ్‌ దంపతుల స్మారక స్థలం, సప్తగుండాల జలపాతం, సముతుల గుండం జలపాతాలు ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు

కెరిమెరి మండలంలోని జంగుబాయి దేవత శంకర్‌లొద్ది, తిర్యాణి మండలంలోని అర్జున్‌లొద్ది గుహలు గిరిజనుల ఆధ్యాత్మిక క్షేత్రాలు. వాంకిడిలోని కాకతీయులనాటి శివాలయం ఉన్నాయి.

ఖమ్మం

జనాభా: 13,89,566

విస్తీర్ణం: 4,360 చ.కి.మీ.

రెవిన్యూ డివిజన్లు: 2

మండలాలు: 21

మున్సిపాలిటీలు: 3

గ్రామపంచాయతీలు: 389

మండలాలు: ఖమ్మం అర్బన్‌, ఖమ్మం రూరల్‌, తిరుమలాయపాలెం, కూసుమంచి, బోనకల్లు, చింతకాని, ముదిగొండ, కొనిజెర్ల, సింగరేణి, కామేపల్లి, రాఘునాథపాలెం, మధిర, ఎర్రుపాలెం, నేలకొండపల్లి, వైరా, సత్తుపల్లి, వేమూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, ఎన్కూర్‌

రెవిన్యూ డివిజన్లు: ఖమ్మం, కల్లూరు

కార్పొరేషన్‌: ఖమ్మం, సత్తుపల్లి, మధిర నగర పంచాయతీలు

ఎమ్మెల్యేలు: తుమ్మల నాగేశ్వరరావు (పాలేరు), పువ్వాడ అజయ్‌కుమార్‌ (ఖమ్మం), బానోతు మదన్‌లాల్‌ (వైరా), సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి), మల్లు భట్టి విక్రమార్క (మధిర), కోరం కనకయ్య (ఇల్లెందు)

ఎంపీ: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

రైల్వే లేను: సికింద్రాబాద్‌-విజయవాడ

సాగులో మేటి.. అభివృద్ధిలో పోటీ.. అభివృద్ధికి మచ్చుతునక ఖమ్మం జిల్లా. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ జిల్లా వ్యవసాయంలో అగ్రగామిగా ఉంది. జిల్లాలో దొరికే గ్రానైట్‌ విదేశాలకు ఎగుమతి అవుతుంది. నేలకొండపల్లి, కల్లూరులో రెండు చక్కెర కర్మారాగాలు, రైస్‌మిల్లులు ఉన్నాయి. సాగర్‌ ఎడమ కాలువ జిల్లా పరిధిలో ఉంటుంది. వైరా, లంకసాగర్‌ ప్రాజెక్టులున్నాయి. సత్తుపల్లిలో ఉపరితల బొగ్గుగని ఉంది.

పర్యాటక ప్రాంతాలు: నేలకొండపల్లిలో బౌద్ధ స్థూపం, భక్తరామదాసు

నివాసం, ఖమ్మంలోని ఖిల్లా, ఖమ్మం పట్టణంలోని స్తంభాద్రి లక్ష్మీనరసింహాస్వామి దేవాలయం స్వయంభూగా విరాజిల్లుతుంది.

భద్రాద్రి కొత్తగూడెం

జనాభా: 11,02,094

విస్తీర్ణం: 8,062 చ.కి.మీ.

రెవిన్యూ డివిజన్లు: 2

మండలాలు: 23

మున్సిపాలిటీలు: 4

గ్రామపంచాయతీలు: 205

అటవీ విస్తీర్ణం: 4.76 లక్షల హెక్టార్లు

మండలాలు: కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్‌, చండ్రుగొండ, అన్నపురెడ్డి పల్లి, టేకులపల్లి, జూలూరుపాడు, పాల్వంచ, ములకలపల్లి, అశ్వాపురం, మణుగూరు, పినపాక, కరకగూడెం, గుండాల, ఆళ్లపల్లి, ఇల్లెందు, అశ్వారావుపేట, దమ్మపేట, భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు

రెవిన్యూ డివిజన్లు: కొత్తగూడెం, భద్రాచలం

మున్సిపాలిటీలు : కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు

సాగనీటి ప్రాజెక్టులు: కిన్నెరసాని, సీతారాంసాగర్‌, తాలిపేరు, పెదవాగు, సింగభూపాలెం, మూకమామిడి

ఎమ్మెల్యేలు: జలగం వెంకటరావు (కొత్తగూడెం), కోరం కనకయ్య (ఇల్లందు), పాయం వెంకటేశ్వర్లు (పినపాక), తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట),సున్నం రాజయ్య (భద్రాచలం)

ఎంపీలు: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (ఖమ్మం), సీతారాంనాయక్‌ (మహబూబాబాద్‌)

జాతీయ రహదారి : (విజయవాడ-జగదళ్‌పూర్‌ (ఛత్తీస్‌గఢ్‌) పనులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌-ఖమ్మం-కొత్తగూడెంలను కలుపుతూ ఛత్తీస్‌గఢ్‌కు మరో హైవే ప్రతిపాదనలు..

భద్రాద్రి రామయ్య కొలువున్నది భద్రాద్రి జిల్లాలోనే. తెలంగాణ గుండెకాయ సింగరేణి సంస్థ ప్రధాన కార్యాలయమూ ఇక్కడే ఉంది. కేటీపీఎస్‌, జెన్‌కో విద్యుదుత్పత్తి ప్లాంట్లు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు కొత్తగూడెంలో ఉన్నాయి. ఉద్యోగులు అధికంగా నివసించే పట్టణమిదే.

జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ) ముడి ఇనుము శుద్ధి కేంద్రం, మణుగూరులో భార జల కేంద్రం, సారపాకలో ఐటీసీ కాగితం పరిశ్రమలు ఉన్నాయి.

మణుగూరు, ఇల్లెందు, టేకులపల్లి, కోయగూడెంలో సింగరేణి బొగ్గుగనులు ఉన్నాయి.

కొత్తగూడెంలో విమానాశ్రయం, మణుగూరులో భద్రాద్రి విద్యుదుత్పత్తి కర్మాగారం రానున్నాయి.

మహబూబ్‌నగర్‌

జనాభా: 12,90,467

విస్తీర్ణం: 4,037 చ.కి.మీ.

రెవిన్యూ డివిజన్లు: 2

మున్సిపాలిటీలు: 3

మండలాలు 26

గ్రామ పంచాయతీలు: 543

మండలాలు: మూసాపేట, భూత్పూర్‌, హన్వాడ, కోయిలకొండ, మహబూబ్‌నగర్‌ అర్బన్‌, మహబూబ్‌నగర్‌ రూరల్‌, నవాబుపేట, జడ్చర్ల, బాలానగర్‌, రాజాపూర్‌, గండీడ్‌, దేవరకద్ర, మిడ్జిల్‌, అడ్డాకుల, నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్‌, కోస్గి, మద్దూర్‌, ఉట్కూర్‌, నర్వ, మాగనూర్‌, కృష్ణ, మక్తల్‌, చిన్నచింతకుంట.

రెవిన్యూ డివిజన్లు: మహబూబ్‌నగర్‌, నారాయణపేట

మున్సిపాలిటీలు: మహబూబ్‌నగర్‌, నారాయణపేట, బాదేపల్లి

నీటిపారుదల: కోయిల్‌సాగర్‌, రాజీవ్‌భీమా ఎత్తిపోతల పథకాలు

ఎమ్మెల్యేలు: వి. శ్రీనివాస్‌గౌడ్‌ (మహబూబ్‌నగర్‌), లక్ష్మారెడ్డి (జడ్చర్ల), ఆల వెంకటేశ్వరరెడ్డి (దేవరకద్ర), చిట్టెం రామ్మోహన్‌రెడ్డి (మక్తల్‌), ఎస్‌. రాజేందర్‌రెడ్డి (నారాయణపేట)

ఎంపీలు: ఏపీ జితేందర్‌రెడ్డి (మహబూబ్‌నగర్‌)

పాలఉత్పత్తికి పేరుగాంచి పాలమూరుగా వినుతికెక్కిన జిల్లా. నిజాం పాలన తర్వాత దీనికి మహబూబ్‌నగర్‌గా నామకరణం చేశారు. నిజాం కాలంలోనే పాలమూరుకు రైలుమార్గం అందుబాటులోకి వచ్చింది. దేవరకద్ర మండలంలోనికోయిల్‌సాగర్‌ జలాశయం ప్రధాన నీటి వనరు.

పర్యాటకం: పిల్లల మర్రి ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం.

700 ఏండ్ల చరిత్ర ఉన్న మర్రిచెట్టు మూడుఎకరాల్లో విస్తరించి ఉంది. పర్యాటక ప్రదర్శన శాల, వస్తు ప్రదర్శన శాల ఉన్నాయి. పేదల తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన మన్యంకొండ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. గంగాపురంలోని చెన్నకేశవస్వామి, చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తిస్వామి దేవాలయం దర్శనీయం.

వనపర్తి

జనాభా: 7,70,334

విస్తీర్ణం: 3,055 చ.కి.మీ.

మున్సిపాలిటీలు 1

రెవిన్యూ డివిజన్లు: 1

మండలాలు 14

గ్రామ పంచాయతీలు: 215

మండలాలు: వనపర్తి, గోపాల్‌పేట, ఖిల్లాఘనపురం, పాన్‌గల్‌, వీవనగండ్ల, రేవల్లి (కొత్తది), చిన్నంబావి (కొత్తది), కొత్తకోట, అమరచింత (కొత్తది), మదనాపురం (కొత్తది), పెబ్బేరు, శ్రీరంగాపూర్‌, పెద్దమందడి, ఆత్మకూరు

రెవిన్యూ డివిజన్లు: వనపర్తి

మున్సిపాలిటీ: వనపర్తి, మేజర్‌ గ్రామపంచాయతీలు: పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు

సాగునీటి ప్రాజెక్టులు: జూరాల ప్రాజెక్టు ఎడమ భాగం, సరళాసాగర్‌, రామన్‌పాడు, బీమా, అమరచింత ఎత్తిపోతల, రంగ సముద్రం, శంకరసముద్రం రిజర్వాయర్లు

ఎమ్మెల్యేలు: జి. చిన్నారెడ్డి (వనపర్తి), ఆల వెంకటేశ్వరరెడ్డి (దేవరకద్ర), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్‌), చిట్టెం రామ్మోహన్‌రెడ్డి(మక్తల్‌)

ఎంపీలు: నంది ఎల్లయ్య, జితేందర్‌రెడ్డి

జాతీయ రహదారులు: హైవే నం. 44

పరిశ్రమలు: కొత్తకోటలో కృష్ణవేణి ప్రైవేటు చెక్కర పరిశ్రమ, పెబ్బేరు సస్తామొలాసిస్‌

విద్యాక్షేత్రం వనపర్తి… సంస్థానాల చరిత్రలో ప్రత్యేకమైన స్థానం పొందిన జిల్లా వనపర్తి. 1870 కాలంలో పరిపాలన సాగించిన సంస్థాధీశుల వనపర్తి కోట ప్రాముఖ్యం గాంచింది. చదువుల ఖిల్లాగా పేరున్న ప్రాంతం. ప్రస్తుతం జిల్లాగా ఆవిర్భవించింది.

హైదరాబాద్‌ – బెంగళూరు జాతీయ రహదారికి సమీపంలో పెబ్బేరు మండలంలో శ్రీరంగాపురం శ్రీ రంగనాయక స్వామి ఆలయం ప్రసిద్ధి.

నాగర్‌కర్నూల్‌

జనాభా: 8,60,613

విస్తీర్ణం: 2,966 చ.కి.మీ.

రెవిన్యూ డివిజన్లు: 3

మున్సిపాలిటీలు 4

మండలాలు 20

గ్రామ పంచాయతీలు: 329

మండలాలు:

నాగర్‌కర్నూలు, తాడూరు, బిజినేపల్లి, తిమ్మాజిపేట, తెలకపల్లి, పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్‌, పెంట్లవెల్లి, కోడేరు, అచ్చంపేట, ఆమ్రాబాద్‌, పదర, ఉప్పునుంతల, బల్మూర్‌, లింగాల, కల్వకుర్తి, ఊర్కొండపేట, వెల్దండ, వంగూరు, చారగొండ

రెవిన్యూ డివిజన్లు: నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, అచ్చంపేట

మున్సిపాలిటీలు: నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, అచ్చంపేట, కల్వకుర్తి

ఎమ్మెల్యేలు: జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్‌), గువ్వల బాలరాజు (అచ్చంపేట), వంశీచంద్‌రెడ్డి (కల్వకుర్తి), మర్రి జనార్ధన్‌రెడ్డి (నాగర్‌కర్నూల్‌)

ఎంపీ: నందిఎల్లయ్య

పర్యాటక ప్రాంతాలు: నల్లమల అటవీ ప్రాంతం, సోమశిల పూరాతన శివాలయాలు, మాధవస్వామి దేవాలయం, అచ్చంపేట ఉమా మహేశ్వర క్షేత్రం, రంగాపూర్‌ ఉర్సు సలేశ్వర క్షేత్రం, మల్లెల తీర్థం, సిరిసినగండ్ల సీతారామాస్వామి ఆలయం, ఉర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయం, వట్టెం వెంకటేశ్వరస్వామి ఆలయం, నంది వడ్డెమాన్‌ పురాతన ఆలయాలు, శనైశ్చర ఆలయం, పాలెం వెంకటేశ్వరస్వామి ఆలయం, జటప్రోల్‌ సప్తనది సంగమక్షేత్రం

నల్లమల అటవీప్రాంతం, నాగార్జునసాగర్‌ పులుల అభయారణ్యం, కృష్ణానది పరవళ్లు నాగర్‌కర్నూలు జిల్లా ప్రత్యేకతలు. తెలంగాణ సాగునీటి రంగంలో కీలకమైన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, శ్రీశైలం వెనుక జలాల ఎత్తిపోత ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం ఈ జిల్లాలోనే ఉంది. ముఖ్యంగా వందేళ్లక్రితమే జిల్లాగా ఉన్న నాగర్‌కర్నూలు ఇప్పుడు మళ్లీ జిల్లాగా మారింది. 1794-1904 కాలంలో నాగార్‌కర్నూలు జిల్లాగా బాసిల్లింది.

నీటిపారుదల: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, పాలమూరు ప్రాజెక్టులో భాగంగా

నార్లాపూర్‌వద్ద 8.61 టీఎంసీలు, వట్టెంవద్ద 16.58 టీఎంసీల సామర్థ్యంగల రిజర్వాయర్లు

జోగుళాంబ గద్వాల

జనాభా: 6,64,971

విస్తీర్ణం: 2,928 చ.కి.మీ.

రెవిన్యూ డివిజన్లు: 1

మున్సిపాలిటీలు 1

మండలాలు 12

గ్రామ పంచాయతీలు: 190

మండలాలు: గద్వాల, కేటీదొడ్డి (కొత్త), ధరూరు, గట్టు, మల్దకల్‌, ఆలంపూర్‌, మానవపాడు, ఇటిక్యాల, వడ్డేపల్లి, అయిజ, రాజోళి (కొత్త), ఉండవెల్లి (కొత్త)

రెవిన్యూ డివిజన్‌: గద్వాల

మున్సిపాలిటీలు: గద్వాల, అయిజ (నగర పంచాయతీ)

సాగునీటి ప్రాజెక్టులు: జూరాల, ఆర్డీఎస్‌, నెట్టెంపాడు ఎత్తిపోతల, తుమ్మిళ్ల, గట్టు ప్రతిపాదిత ఎత్తిపోతల పథకాలు

ఎమ్మెల్యేలు: డీకే అరుణ (గద్వాల), సంపత్‌కుమార్‌ (ఆలంపూర్‌)

ఎంపీ: నందిఎల్లయ్య

పర్యాటకం: ఆలంపూర్‌, జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలు, బీచుపల్లి ఆంజనేయస్వామి, చింతరేవుల ఆంజనేయస్వామి, మల్దకల్‌ శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవాలయం, గద్వాల జమ్మిచేడు జములమ్మ, జూరాల ప్రాజెక్టు, గద్వాల, కోట, నిజాంకొండ

జాతీయ రహదారి: 44 (బీచుపల్లి-పుల్లూరు)

రైల్వేలైను: గుంతకల్‌ డివిజన్‌లో గద్వాల రైల్వేస్టేషన్‌ జంక్షన్‌గా ఉంది.

గద్వాల – రాయచూర్‌మధ్య 55 కి.మీ. రైల్వే లైన్‌

కృష్ణా, తుంగభద్రల నడిగడ్డ.. తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక సంప్రదాయాలు, సంస్కృతులు కలగలిసిన జిల్లా గద్వాల. కృష్ణా, తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో విస్తరించి నడిగడ్డగా పేరొందింది.అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవదైన జోగులాంబక్షేత్రం కొలువైన ఆలంపురం ఈ జిల్లాలోనే ఉంది. గద్వాల సంస్థానానికి ఎంతో ప్రాభవం ఉండేది. గద్వాల చేనేత చీరల ఖ్యాతి జగద్విదితం. కృష్ణా నదిపై తెలంగాణ మొట్టమొదటి ప్రాజెక్టు అయిన జూరాల ధరూర్‌ మండలంలో ఉంది. నెట్ఠెంపాడు జూరాల సాగునీరు అందిస్తున్నాయి. జూరాల జలవిద్యుత్‌ కేంద్రం ఏటా 200 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నది.

కరీంనగర్‌

జనాభా: 9,86,204

విస్తీర్ణం: 2,379 చ.కి.మీ.

రెవిన్యూ డివిజన్లు: 2

మున్సిపాలిటీలు 3

మండలాలు 16

గ్రామ పంచాయతీలు: 215

మండలాలు: కరీంనగర్‌, కొత్తపల్లి (కొత్తది), కరీంనగర్‌ రూరల్‌ (కొత్తది), మానకొండూర్‌, తిమ్మాపూర్‌, గన్నేరువరం (కొత్తది), గంగాధర, రామడుగు, చొప్పదండి, చిగురుమామిడి, వీణవంక, సైదాపూర్‌, శంకరపట్నం, హుజూరాబాద్‌, జమ్మికుంట, ఇల్లంతకుంట (కొత్తది)

రెవిన్యూ డివిజన్లు: కరీంనగర్‌, హుజూరాబాద్‌

మున్సిపాలిటీలు/కార్పొరేషన్‌: కరీంనగర్‌ కార్పొరేషన్‌, హుజూరాబాద్‌ నగర పంచాయతీ, జమ్మికుంట నగరపంచాయతీ

సాగునీటి ప్రాజెక్టులు: లోయర్‌ మానేరు డ్యాం

ఎమ్మెల్యేలు: ఈటల రాజేందర్‌ (హుజూరాబాద్‌), గంగుల కమలాకర్‌ (కరీంనగర్‌),రసమయి బాలకిషన్(మానకొండూర్‌), బొడిగె శోభ (చొప్పదండి)వొడితల సతీశ్‌బాబు (హుస్నాబాద్‌)

ఎంపీ: బీ వినోద్‌కుమార్‌

పర్యాటక ప్రాంతాలు: ఎలగందుల ఖిల్లా, ఉజ్వల పార్కు, జింకలపార్కు (కరీంనగర్‌), ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం, కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి ఆలయం, గట్టుదుద్దెనపల్లి శ్రీఆంజనేయస్వామి ఆలయం

కరీంనగర్‌ పాతపేరు ఎలగందుల. హైదరాబాద్‌ సంస్థానంలో జిల్లా కేంద్రంగా ఉండేది. ఆ తర్వాత ఖిలేదార్‌ కరీముద్దీన్‌ పేరుతో 1905లో కరీంనగర్‌ జిల్లా ఏర్పాటైంది. ఎలగందులకోట కరీంనగర్‌ కేంద్రంనుంచి 14 కి.మీ. దూరంలో ఉంది. నగరానికి దగ్గరలో దిగువ మానేరు జలాశయం వుంది. కరీంనగర్‌లో వెండితో వస్తువులు తయారుచేసే ఫిలిగ్రీ కళ ప్రపంచ గుర్తింపు పొందింది. కరీంనగర్‌ జిల్లా పరిధిలో దాదాపు 200 గ్రానైట్‌ పరిశ్రమలు, క్వారీలు నడుస్తున్నాయి. కరీంనగర్‌ డెయిరీ, మానకొండూరు, తిమ్మాపూర్‌ మండలాల్లోని విత్తన పరిశ్రమలు అదనపు బలం.

రైల్వేలేన్‌: పెద్దపల్లి-జగిత్యాల లైన్‌ నిర్మాణంలో ఉంది.

జాతీయ రహదారులు: ప్రతిపాదిత వరంగల్‌-నిజామాబాద్‌

జగిత్యాల

జనాభా: 9,83,414

విస్తీర్ణం: 3,043 చ.కి.మీ.

రెవిన్యూ డివిజన్లు: 2

మున్సిపాలిటీలు 3

మండలాలు 18

గ్రామ పంచాయతీలు: 328

మండలాలు: జగిత్యాల, జగిత్యాల రూరల్‌, రాయికల్‌, సారంగాపూర్‌, బీర్‌పూర్‌, ధర్మపురి, బుగ్గారం, పెగడపల్లి, గొల్లపల్లి, మల్యాల, కొడిమ్యాల, వెల్గటూర్‌, కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, కథలాపూర్‌

రెవిన్యూ డివిజన్లు: జగిత్యాల, మెట్‌పల్లి (కొత్తది)

మున్సిపాలిటీలు: జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి

సాగునీటిపారుదల: ఎస్సారెస్పీ, కాకతీయ కాలువ

ఎమ్మెల్యేలు: జీవన్‌రెడ్డి (జగిత్యాల), కొప్పుల ఈశ్వర్‌ (ధర్మపురి), విద్యాసాగర్‌రావు (కోరుట్ల), చెన్నమనేని రమేశ్‌ (వేములవాడ), బొడిగె శోభ (చొప్పదండి)

ఎంపీలు: కల్వకుంట్ల కవిత (నిజామాబాద్‌), బాల్క సుమన్‌ (పెద్దపల్లి), వినోద్‌ (కరీంనగర్‌)

పర్యాటకం: ప్రముఖ ఆలయాలైన కొండగట్టు, ధర్మపురి, కోరుట్ల సాయిబాబా ఆలయం, బండలింగాపూర్‌లోని హనుమాన్‌ ఆలయం, వెల్గటూర్‌ మండలంలోని కోటిలింగాల, కోరుట్ల మండలం నాగులపేటలో కాకతీయ కాల్వపై సైఫన్‌

జాతీయ రహదారులు: నిజామాబాద్‌-జగ్దల్‌పూర్‌

రైల్వేలైన్‌: కాగజ్‌నగర్‌-జగిత్యాల

జగ్గదేవుడి పేరిట జగిత్యాల పేరువచ్చింది. గోదావరినది, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌, రాయ్‌కల్‌, సారంగాపూర్‌, ధర్మపురి, వెల్గటూరు మండలాల మీదుగా ప్రవహిస్తుంది. ఇక్కడి పొలాసలోని వ్యవసాయ పరిశోధనాకేంద్రం ఉత్తర తెలంగాణ జిల్లాలకు సేవలందిస్తున్నది. తెలంగాణలోని గోదావరి నది పరివాహక ప్రాంతంలో క్రీ.పు. నాగరికత వర్ధిల్లిందనడానికి కోటిలింగాల పట్టణం కీలకమైన ఆధారం.

ముత్యంపేట చెక్కర కర్మాగారం ప్రధాన పరిశ్రమ

రాజన్న సిరిసిల్ల

జనాభా: 5,43,694

విస్తీర్ణం: 2,019 చ.కి.మీ.

రెవిన్యూ డివిజన్లు: 1

మున్సిపాలిటీలు: 2

మండలాలు: 13

గ్రామ పంచాయతీలు: 177

మండలాలు: సిరిసిల్ల, తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి,గంభీరావుపేట, ముస్తాబాద్‌, ఇల్లంతకుంట, వేములవాడ, వేములవాడ (రూరల్‌),చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి, బోయినపల్లి

రెవిన్యూ డివిజన్లు: సిరిసిల్ల

మున్సిపాలిటీలు: సిరిసిల్ల, వేములవాడ

పరిశ్రమలు: వస్త్ర పరిశ్రమ

నీటిపారుదల: మధ్య మానేరు (మన్వాడ), ఎగువ మానేరు (నర్మాల), కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (9వ ప్యాకేజీ)

ఎమ్మెల్యేలు: కె. తారకరామారావు (సిరిసిల్ల), సీహెచ్‌ రమేశ్‌బాబు (వేములవాడ),రసమయి బాలకిషన్‌ (మానకొండూర్‌), బొడిగె శోభ (చొప్పదండి)

ఎంపీ: వినోద్‌కుమార్‌

పారిశ్రామికం: వస్త్రపరిశ్రమ

ఖనిజాలు: గ్రానైట్‌, ఇసుక

నేతన్నల ‘రాజన్న’.. అగ్గిపెట్టెలో ఆరు గజాల చీరను నేసిన ఘనత సిరిసిల్లదే. మరనేత, చేనేత పరిశ్రమకు ఎంతో ప్రసిద్ధి చెందింది. దక్షిణ కాశీ క్షేత్రంగా, కోడె మొక్కుల దేవుడిగా పేరొందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర దేవస్థానం ఇక్కడే కొలువుదీరింది.

పెద్దపల్లి

జనాభా: 7,95,332

విస్తీర్ణం: 2,236 చ.కి.మీ.

రెవిన్యూ డివిజన్లు: 2

మున్సిపాలిటీలు: 2

మండలాలు: 14

గ్రామ పంచాయతీలు: 209

మండలాలు: పెద్దపల్లి, ఓదెల, సుల్తానాబాద్‌, జూలపల్లి, ఎలిగేడు, ధర్మారం, రామగుండం, అంతర్గాం, పాలకుర్తి, కాల్వశ్రీరాంపూర్‌, కమాన్‌పూర్‌, రత్నాపూర్‌, మంథని, ముత్తారం

రెవిన్యూ డివిజన్లు: పెద్దపల్లి, మంథని

మున్సిపాలిటీలు: పెద్దపల్లి

మునిసిపల్‌ కార్పొరేషన్‌: రామగుండం

ఎమ్మెల్యేలు: దాసరి మనోహర్‌రెడ్డి (పెద్దపల్లి), సోమారపు సత్యనారాయణ (రామగుండం), పుట్ట మధు (మంథని)

ఎంపీలు: బాల్క సుమన్‌ (పెద్దపల్లి)

పర్యాటక ప్రాంతాలు: బౌద్ధ స్థూపం (ధూళికట్ట), రాముని గుండాలు (రామగుండం), రామగిరి ఖిల్లా (కమాన్‌పూర్‌), గౌరి గుండాలు జలపాతం (పెద్దపల్లి), బుగ్గరామస్వామి దేవాలయం (పాలకుర్తి), మొసళ్ల కేంద్రం (ఎల్‌-మగుడు), లక్ష్మీనరసింహాస్వామి దేవాలయం (కమాన్‌పూర్‌), జనగామ త్రిలింగేశ్వర ఆలయం, మల్లికార్జునస్వామి దేవాలయం (ఓదెల), వెంకటేశ్వర దేవాలయం (ముప్పిరితోట)

ఎన్టీపీసీ, సింగరేణి అండగా.. నిజాం కాలంలో ప్రత్యేక సంస్థానంగా వెలుగొందిన పెద్దపల్లి.. ప్రస్తుతం పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలకు ప్రధాన కేంద్రం. భారీ పరిశ్రమలు, బియ్యం మిల్లులు, విద్యుత్తు కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలోని ప్రతీ మండలానికి ఎస్సారెస్పీనుంచి గోదావరి జలాలు అందుతాయి. హైదరాబాద్‌-ఢిల్లీ రైలు మార్గంలో ప్రధాన రైల్వే స్టేషన్‌గా వెలుగొందుతోంది.

సాగునీటిపారుదల: ఎల్లంపల్లి, ఎస్సారెస్సీ కాలువలు

రైల్వేలేన్లు: కాజీపేట-రామగుండం ప్రధాన రైల్వే స్టేషన్లు, పెద్దపల్లి, రామగుండం

పారిశ్రామికం: ఎన్టీపీసీ విద్యుత్‌ కేంద్రం, జెన్‌కో ప్లాంటు, కేషోరామ్‌ సిమెంటు పరిశ్రమ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఎరువుల కర్మాగారం, శాలివాహన విద్యుత్‌ కేంద్రం,రైస్‌ మిల్లులు, జిన్నింగ్‌ మిల్లులు

ఖనిజాలు: సింగరేణి బొగ్గు గనులు

మెదక్‌

జనాభా: 7,67,428

విస్తీర్ణం: 2,723 చ.కి.మీ.

రెవిన్యూ డివిజన్లు: 3

మున్సిపాలిటీలు: 1

మండలాలు: 20

గ్రామ పంచాయతీలు: 381

మండలాలు: మెదక్‌, హవేలీ ఘనపూర్‌, పాపన్నపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట, నిజాంపేట, పెద్దశంకరంపేట, టేక్మాల్‌, అల్లాదుర్గం, రేగోడ్‌, వెల్దుర్తి, శివ్వంపేట, చేగుంట, నార్సింగి, తూప్రాన్‌, మనోహరాబాద్‌, నర్సాపూర్‌, కౌడిపల్లి, కొల్చారం, చిలిపిచేడ్‌

రెవిన్యూ డివిజన్లు: మెదక్‌, తూఫ్రాన్‌, నర్సాపూర్‌

మునిసిపాలిటీ: మెదక్‌

ఎమ్మెల్యేలు: పద్మా దేవేందర్‌రెడ్డి (మెదక్‌), మదన్‌రెడ్డి (నర్సాపూర్‌),

సోలిపేట రామలింగారెడ్డి (దుబ్బాక), కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (గజ్వేల్‌)

ఎంపీలు: కొత్త ప్రభాకర్‌రెడ్డి (మెదక్‌), బీబీ పాటిల్‌ (జహీరాబాద్‌)

జాతీయ రహదారులు: నంబర్‌ 44 (రామాయంపేట నుంచి కాళ్లకల్‌ వరకు)

పర్యాటక ప్రాంతం: మెదక్‌ చర్చి, మెదక్‌ ఖిల్లా, ఏడుపాయల వనదుర్గామాత, కొల్చారం మండలంలోని జైనమందిరం, నర్సాపూర్‌ అడవులు,పోచారం అభయారణ్యం, పోచారం ప్రాజెక్టు

సాగునీటిపారుదల: ఘనపురం, హల్దీవాగు, బొల్లారం మత్తడి, రాయినిపల్లి ప్రాజెక్టుఏడుపాయలు.. మంజీరా గలగలలు

మెదక్‌ జిల్లా కేంద్రం కావాలన్న కొన్నేళ్ల కల నెరవేరింది. హైదరాబాద్‌కు దగ్గర్లో… అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లా మెదక్‌. నిజాం కాలంలో నిర్మించిన ఘనపూర్‌ ఆనకట్ట జిల్లాలో సాగునీటికి ఏకైక ఆధారం.తుప్రాన్‌, చిన్నశంకరంపేట, చేగుంట మండలాల పరిధిలో దానా, విత్తన తయారీ పరిశ్రమలు ఉన్నాయి. ఏడు పాయల వనదుర్గాజాతర జిల్లాలో ప్రముఖమైనది. ఇక్కడ మంజీరానదీ ఏడుపాయలుగా చీలి ప్రవహిస్తుంది.

పరిశ్రమలు: టాటా కాఫీ ఫ్యాక్టరీ (బ్రాహ్మణపల్లి), శాంతా బయోటిక్స్‌ (ముప్పిరెడ్డి పల్లి), మైకో సీడ్స్‌ (కాళ్లకల్‌), కావేరీ ఐరన్‌ స్టీల్స్‌ (చేగుంట), దివ్యశక్తి గ్రానైట్స్‌ (నర్సాపూర్‌)

సంగారెడ్డి

జనాభా: 15,23,758

విస్తీర్ణం: 4,441 చ.కి.మీ.

రెవిన్యూ డివిజన్లు: 3

మున్సిపాలిటీలు: 4

మండలాలు: 26

గ్రామ పంచాయతీలు: 475

మండలాలు: సంగారెడ్డి, కంది (కొత్త), కొండాపూర్‌, సదాశివపేట, పటాన్‌చెరు, అమీన్‌పూర్‌ (కొత్త), రామచంద్రాపురం, జిన్నారం, గుమ్మడిదల (కొత్త), పుల్కల్‌, ఆందోలు, వట్‌పల్లి (కొత్త), మునిపల్లి, హత్నూర, జహీరాబాద్‌, మొగుడంపల్లి (కొత్త), న్యాల్‌కల్‌, ఝరాసంగం, కోహిర్‌, రాయికోడ్‌, నారాయణఖేడ్‌, కంగ్టి, కల్హేర్‌, సిర్గాపూర్‌ (కొత్త), మనూరు, నాగల్‌గిద్ద (కొత్త)

రెవిన్యూ డివిజన్లు: సంగారెడ్డి, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌

మునిసిపాలిటీలు: సంగారెడ్డి, జహీరాబాద్‌, సదాశివపేట

నగర పంచాయతీ: జోగిపేట

ప్రధాన పరిశ్రమలు: బీహెచ్‌ఈఎల్‌, బీడీఎల్‌, ఓడిఎఫ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎంఆర్‌ఎఫ్‌, చార్మినార్‌ బ్రావరేజెస్‌

ఎమ్మెల్యేలు: చింత ప్రభాకర్‌ (సంగారెడ్డి), జి. మహిపాల్‌రెడ్డి (పటాన్‌చెరు), జె. గీతారెడ్డి (జహీరాబాద్‌), బాబూమోహన్‌ (ఆందోలు), భూపాల్‌రెడ్డ (నారాయణఖేడ్‌), మదన్‌రెడ్డి (నర్సాపూర్‌)

హైదరాబాద్‌ నగరానికి సమీపంలోని ప్రధాన పట్టణం సంగారెడ్డి. గోదావరి ఉపనది మంజీరా బ్యారేజీ జిల్లా కేంద్రానికి సమీపంలోనే ఉంది. మొసళ్ల ఉత్పత్తి కేంద్రానికి చిరునామా. మంజీరా అభయారణ్యంలో దాదాపు 600 మొసళ్ళు ఉంటాయని అంచనా. జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్‌), ఆసియా ఖండంలోనే పరిశ్రమలకు పెట్టింది పేరైన పటాన్‌చెరు పారిశ్రామిక వాడ అదనపు బలం.

ఎంపీలు: కొత్త ప్రభాకర్‌రెడ్డి (మెదక్‌), బీబీ పాటిల్‌ (జహీరాబాద్‌)

జాతీయ రహదారులు: హైదరాబాద్‌-ముంబై (ఎన్‌హెచ్‌ 65), నాందేడ్‌-అకోల (ఎన్‌హెచ్‌ 161)

దేవాలయాలు: కేతకీ సంగమేశ్వర దేవాలయం (ఝరాసంగం), సిద్ధి వినాయక గుడి (రేచింతల్‌), త్రికూటేశ్వరాలయం (కల్పగూర్‌), రామలింగేశ్వర ఆలయం (నందింది), వీరభద్రస్వామి ఆలయం (బొంతపల్లి)

వికారాబాద్‌

జనాభా: 8,81,250

విస్తీర్ణం: 3,386 చ.కి.మీ.

రెవిన్యూ డివిజన్లు: 2

మున్సిపాలిటీలు: 2

మండలాలు: 18

గ్రామ పంచాయతీలు: 354

మండలాలు: వికారాబాద్‌, థరూరు, మోమిన్‌పేట్‌, మర్పల్లి, బట్వారం, కోట్‌పల్లి, నవాబుపేట్‌, తాండూరు, బషీరాబాద్‌, యాలాల, పెద్దేముల, పరిగి, పూడూరు, కుల్కచర్ల, దోమ, కొడంగల్‌, బొంరాస్‌పేట్‌, దౌల్తాబాద్‌

రెవిన్యూ డివిజన్లు: వికారాబాద్‌, తాండూరు

మునిసిపాలిటీలు: వికారాబాద్‌, తాండూరు

ఎమ్మెల్యేలు: బి. సంజీవరావు (వికారాబాద్‌), పి. రామ్మోహన్‌రెడ్డి (పరిగి),పట్నం మహేందర్‌రెడ్డి (తాండూరు)

ఎంపీ : కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

పర్యాటక ప్రాంతాలు: అనంతగిరి కొండలు, అనంతపద్మనాభస్వామి దేవాలయం, తాండూరు భూకైలాస్‌ క్షేత్రం

రైల్వే లేన్లు: వికారాబాద్‌ కేంద్రంగా జంక్షన్‌

ప్రధాన పట్టణమైన తాండూరులో మూడు సిమెంటు కర్మాగారాలు దాదాపు 10వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.

ఆనంతగిరి ఆలంబనగా.. హైదరాబాద్‌ నగరానికి తాగునీటి అవసరాలు తీర్చిన మూసీ పుట్టిన అనంతగిరి కొండలు ఈ జిల్లాలోనే ఉన్నాయి. 41వేల హెక్టార్ల అటవీ ప్రాంతం చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకుల్ని కట్టిపడేస్తుంది. ఈ కొండల్లోనే పద్మనాభుడు కొలువుదీరాడు. బుగ్గరామేశ్వరం, భూకైలాస్‌, ఏకాంబరేశ్వర, జుంటుపల్లి రాముడు, కొడంగల్‌ వెంకటేశ్వరస్వామి దేవాలయాలు ఉన్నాయి. జిల్లాలోని కోటిపల్లి, లక్నాపూర్‌, సర్పన్‌పల్లి, జుంటుపల్లి ప్రాజెక్టులు సాగునీటి అవసరాలు తీర్చుతున్నాయి.

కంది పంటకూ తాండూరు ప్రసిద్ధి. నాపరాళ్లు, సుద్ద, ల్యాటరైట్‌ గనులున్నాయి. వీటిలో 8వేలమందికి పైగా ఉపాధి పొందుతున్నారు.

రంగారెడ్డి

జనాభా: 25,51,731

విస్తీర్ణం: 5,006 చ.కి.మీ.

రెవిన్యూ డివిజన్లు: 5

మున్సిపాలిటీలు: 5

మండలాలు: 27

గ్రామ పంచాయతీలు: 436

మండలాలు: చేవెళ్ల, శంకర్‌పల్లి, మొయినాబాద్‌, షాబాద్‌, కందుకూరు, మహేశ్వరం, బాలాపూర్‌, సరూర్‌నగర్‌, ఆమనగల్‌, కడ్తాల్‌, తలకొండపల్లి, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌, హయత్‌నగర్‌, మాడ్గుల, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌, శేరిలింగంపల్లి, గండిపేట్‌, ఫరూక్‌నగర్‌, కొత్తూరు, కేశంపేట్‌, కొందుర్గు, చౌదరిగూడెం, నందిగామ

రెవిన్యూ డివిజన్లు: చేవెళ్ల, రాజేంద్రనగర్‌, కందుకూరు, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్‌

మున్సిపాలిటీలు: షాద్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, బడంగ్‌పేట్‌, పెద్ద అంబర్‌పేట్‌, జిల్లెలగూడ

ప్రధాన పరిశ్రమలు: ఐటీ, పౌల్ట్రీ, హార్టికల్చర్‌, మహేశ్వరంలో హార్డ్‌వేర్‌ పార్క్‌, ఫార్మాసిటీ, కాటేదాన్‌, కొత్తూరు ప్రాంతాల్లో భారీ పారిశ్రామికవాడలు ఉన్నాయి.

నీటిపారుదల: ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌

ఎమ్మెల్యేలు: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం), టి. ప్రకాశ్‌గౌడ్‌ (రాజేంద్రనగర్‌), అంజయ్య యాదవ్‌ (షాద్‌నగర్‌), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), తీగల కృష్ణారెడ్డి (మహేశ్వరం), కాలె యాదయ్య (చేవెళ్ల), ఆర్‌. కృష్ణయ్య (ఎల్బీనగర్‌), వంశీచంద్‌రెడ్డి (కల్వకుర్తి)

ఎంపీలు : మల్లారెడ్డి (మల్కాజ్‌గిరి), కొండా విశ్వేశ్వశ్వర్‌రెడ్డి (చేవెళ్ల), నంది ఎల్లయ్య (నాగర్‌కర్నూల్‌), బూర నర్సయ్య గౌడ్‌ (భువనగిరి), దేవేందర్‌గౌడ్‌ (రాజ్యసభ)

రాష్ట్రానికి తలమానికమైన ఐటీ పరిశ్రమ కేంద్రీకృతమైన జిల్లా రంగారెడ్డి. ప్రపంచస్థాయి ఐటీ సంస్థల దన్నుతో లక్షలమందికి నాణ్యమైన ఉపాధి కల్పిస్తోందీ పరిశ్రమ. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వైమానికరంగంలో ఉపాధి అవకాశాలను సృష్టించింది. రక్షణ, ఏరోస్పేస్‌ పరిశ్రమలకు ఈ జిల్లా కేంద్రంగా మారనుంది. హైదరాబాద్‌ చుట్టూ స్తిరాస్థి రంగానికి రంగారెడ్డి జిల్లానే చిరునామా.నిజాం కాలంలో మూసీ, ఈసీ నదులపై నిర్మితమైన తాగునీటి తటాకాలు హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట) ప్రధాన ఆకర్షణ.వ్యవసాయ పరిశోధన సంస్థలు, ఇంజనీరింగ్‌ కళాశాలలు, వైద్య విద్యాసంస్థలకు నెలవు. రెండో తిరుపతిగా పేరొందిన చిల్కూరు బాలాజీ, నర్కూడలోని అమ్మపల్లి దేవాలయాలు ప్రధాన ఆలయాలు. సినిమా చిత్రీకరణలకు అమ్మపల్లి ఆలయం పేరుగాంచింది. శంషాబాద్‌లోని ముచ్చింతల్‌లో చిన జీయర్‌స్వామి ఆశ్రయం ఉంది.

మేడ్చెల్‌

జనాభా: 25,42,203

విస్తీర్ణం: 1,039 చ.కి.మీ.

రెవిన్యూ డివిజన్లు: 2

మున్సిపాలిటీలు: 4

మండలాలు: 15

గ్రామ పంచాయతీలు: 84

మండలాలు: మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్‌ (కొత్త), బాలానగర్‌, కూకట్‌పల్లి, దుండిగల్‌, గండిమైసమ్మ (కొత్త), బాచుపల్లి (కొత్త), ఆల్వాల్‌ (కొత్త), కీసర, మేడ్చల్‌, మేడిపల్లి (కొత్త), శామీర్‌పేట్‌, ఘట్‌కేసర్‌, కాప్రా (కొత్త), ఉప్పల్‌

రెవిన్యూ డివిజన్లు: మల్కాజ్‌గిరి, కీసర

నగర పంచాయతీలు: బోడుప్పల్‌, ఫిర్జాదిగూడ

ప్రధాన పరిశ్రమలు: ఐటీ, పౌల్ట్రీ, హార్టికల్చర్‌

ఎమ్మెల్యేలు: సుధీర్‌రెడ్డి (మేడ్చల్‌), ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ (ఉప్పల్‌), చింతల కనకారెడ్డి (మల్కాజిగిరి), వివేకానంద (కుత్బుల్లాపూర్‌), అరికపూడి గాంధీ (కూకట్‌పల్లి)

ఎంపీ: చామకూర మల్లారెడ్డి (మల్కాజ్‌గిరి)

పర్యాటక ప్రాంతాలు: సఫిల్‌గూడ చెరువు, దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ, ఫాక్స్‌ సాగర్‌

దేవాలయాలు: మల్లికార్జునస్వామి దేవాలయం, కీసరగుట్ట

జాతీయ రహదారులు: ఎన్‌హెచ్‌ 9

పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తున్న ప్రాంతాలతో మేడ్చల్‌ జిల్లా ఆవిర్భవించింది. ఉత్తర తెలంగాణను హైదరాబాద్‌ నగరానికి అనుసంధానం చేసే ప్రధాన పట్టణం మేడ్చల్‌. మేడ్చల్‌ అంటే ప్రకాశవంతమైన నగరం అని అర్థం. అందుకే నిజాం ఈ పట్టణాన్ని విడిది కేంద్రంగా ఎంచుకున్నారు. ద్రాక్షతోటలు, అందమైన విల్లాలకు ఈ ప్రాంతం ప్రధాన కేంద్రం.బాలానగర్‌, జీడిమెట్ల, ఉప్పల్‌ పారిశ్రామిక వాడల్లో వేల సంఖ్యలో పరిశ్రమలు ఉన్నాయి. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది. జైన, బౌద్ధ మతాలకు సంబంధించిన చారిత్రక ఆనవాళ్లు ఎన్నో వెలుగు చూశాయి.

హైదరాబాద్‌

జనాభా: 39,43,323

విస్తీర్ణం: 217 చ.కి.మీ.

రెవిన్యూ డివిజన్లు: 2

జీహెచ్‌ఎంసీ సర్కిళ్లు: 9

మండలాలు: 16

గ్రామ పంచాయతీలు: 84

మండలాలు: బహదూర్‌పురా, ఆసిఫ్‌నగర్‌, ముషీరాబాద్‌, సైదాబాద్‌, బండ్లగూడ, ఖైరతాబాద్‌, షేక్‌పేట్‌, చార్మినార్‌, తిరుమలగిరి, గోల్కొండ, నాంపల్లి, మారేడుపల్లి, అంబర్‌పేట్‌, సికింద్రాబాద్‌, హిమాయత్‌నగర్‌, అమీర్‌పేట్‌

రెవిన్యూ డివిజన్లు: హైదరాబాద్‌, సికింద్రాబాద్‌. జీహెచ్‌ఎంసీ సర్కిళ్లు: కాప్రా, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, రామచంద్రాపురం, కుత్బుల్లాపూర్‌, మల్కాజిగిరి. పర్యాటక ప్రాంతాలు: చార్మినార్‌, గోల్కొండ, నెక్లెస్‌రోడ్‌, నెహ్రూ జులాజికల్‌ పార్కు, హుస్సేన్‌సాగర్‌, బుద్ధవిగ్రహం, శిల్పారామం, బిర్లామందిర్‌, సాలార్‌జంగ్‌ మ్యూజియం తదితర ప్రాంతాలు. పారిశ్రామిక ప్రాంతాలు: కాటేదాన్‌, ఆజామాబాద్‌

ఎమ్మెల్యేలు: సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రీ (చార్మినార్‌), ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ (యాకుత్‌పురా), అక్బరుద్దీన్‌ ఓవైసీ (చాంద్రాయణగుట్ట), మొజంఖాన్‌ (బహదూర్‌పుర), పద్మారావు గౌడ్‌ (సికింద్రాబాద్‌), కె. లక్ష్మణ్‌ (ముషీరాబాద్‌), తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ (సనత్‌నగర్‌), మాగంటి గోపీనాథ్‌ (జూబ్లీహిల్స్‌), చింతల రామచంద్రారెడ్డి (ఖైరతాబాద్‌), కిషన్‌రెడ్డి (అంబర్‌పేట), రాజాసింగ్‌ (గోషామహల్‌)

ఎంపీలు: బండారు దత్తాత్రేయ, అసదుద్దీన్‌ ఓవైసీ

చారిత్రక, సాంస్కృతిక, సంప్రదాయ జీవన ప్రతీక. ప్రపంచ ఐటీరంగ యవనిక హైదరాబాద్‌. ఎంతటి అంతర్జాతీయ సంస్థ అయినా కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే హైదరాబాద్‌వైపు చూస్తుందంటే అతిశయోక్తి కాదు. పుష్కలమైన మానవవనరులు, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణం. గోల్కొండ నవాబు మహ్మద్‌కులీ కుతుబ్‌షా 1590లో హైదరాబాద్‌కు పునాది వేశారు. 425 ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర కలిగిన భాగ్యనగరం ఖ్యాతి ఏటా పెరుగుతూనే వుంది. ఏడో నిజాం.. ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా గుర్తింపు తెచ్చుకోవడంతో హైదరాబాద్‌ విలువ ప్రపంచ దేశాలకు తెలిసింది. 1978 వరకు హైదరాబాద్‌ అతిపెద్ద జిల్లాగా ఉండేది. ఆ తరువాత హైదరాబాద్‌నుంచి కొన్ని ప్రాంతాలను విడగొట్టి రంగారెడ్డి జిల్లాగా ఏర్పాటు చేశారు. అప్పటినుంచి నేటి వరకు హైదరాబాద్‌ జిల్లా పరిధిలో ఎలాంటి మార్పుల్లేవు.

వరంగల్‌ అర్బన్‌

జనాభా: 11,35,707

విస్తీర్ణం: 1,305 చ.కి.మీ.

రెవిన్యూ డివిజన్లు: 1

మున్సిపాలిటీలు: 1

మండలాలు: 11

గ్రామ పంచాయతీలు: 45

మండలాలు: వరంగల్‌, ఖిలావరంగల్‌, హన్మకొండ, కాజీపేట, హసన్‌పర్తి, ఐనవోలు, ధర్మసాగర్‌, వేలేరు, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్‌

రెవిన్యూ డివిజన్లు: వరంగల్‌ అర్బన్‌

కార్పొరేషన్‌: గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌

ప్రాజెక్టులు: ఎస్సారెస్పీ కాలువ, దేవాదుల పైప్‌లైను

ఎమ్మెల్యేలు: దాస్యం వినయ్‌భాస్కర్‌ (వరంగల్‌ పశ్చిమ), కొండా సురేఖ (వరంగల్‌ తూర్పు), ఆరూరి రమేశ్‌ (వర్ధన్నపేట), వి. సతీశ్‌కుమార్‌ (హుస్నాబాద్‌), టి. రాజయ్య (స్టేషన్‌ఘన్‌పూర్‌), ఈటల రాజేందర్‌ (హుజూరాబాద్‌)

ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు భద్రకాళి దేవాలయం, చరిత్రాత్మక వేయి స్థంభాలగుడి ప్రధాన ఆకర్షణలు. ఖిల్లా వరంగల్‌ మట్టికోట, రాతికోట కాకతీయుల కళా నైపుణ్యానికి ప్రతీక. కుష్‌మహల్‌ వీక్షకులకు ఆనందాన్ని అందిస్తుంది. తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత విద్యాలయాలకు చిరునామా వరంగల్‌. ఒకప్పటి ప్రాంతీయ ఇంజనీరింగ్‌ కళాశాల ఇప్పుడు నిట్‌గా మారి ఇంజినీరింగ్‌ విద్యకు పట్టుగొమ్మగా భాసిల్లుతోంది. కాకతీయ విశ్వవిద్యాలయం, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయాలు విద్యారంగంలో వరంగల్‌ ప్రతిష్ఠను పెంచుతున్నాయి.

కాకతీయ వైభవదీప్తి.. కాకతీయ సామ్రాజ్య రాజధానిగా చరిత్రపుటల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న నగరం వరంగల్‌. పునర్విభజనతో ఇప్పుడు నగరం చుట్టుపక్కల మండలాలన్నీ కలిపి వరంగల్‌ అర్బన్‌ జిల్లాగా రూపాంతరం చెందింది. వరంగల్‌.. హైదరాబాద్‌ తరువాత రాష్ట్రంలో అతిపెద్ద నగరం. తెలంగాణనుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలను అనుసంధానం చేసే ప్రధాన రైల్వే జంక్షన్‌ ఖాజీపేట ఇక్కడే ఉంది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ ఆసియాలోనే అతిపెద్దది.

నైజాం కాలంనాటి మామునూరు విమానాశ్రయం ఈ జిల్లాలో ఉంది.

ప్రధాని అయిన ఏకైక తెలుగుబిడ్డ పీవీ నర్సింహారావు స్వగ్రామం వంగర ఈ జిల్లాలోనిదే.

వరంగల్‌ రూరల్‌

జనాభా: 7,16,457

విస్తీర్ణం: 2,175 చ.కి.మీ.

రెవిన్యూ డివిజన్లు: 2

మున్సిపాలిటీలు: 2

మండలాలు: 15

గ్రామ పంచాయతీలు: 280

మండలాలు:

రాయపర్తి, వర్థన్నపేట, పరకాల, ఆత్మకూరు, దామెర, శాయంపేట, గీసుకొండ, సంగెం, పర్వతగిరి, నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపూర్‌, నెక్కొండ

రెవిన్యూ డివిజన్లు:

వరంగల్‌ రూరల్‌, నర్సంపేట

మున్సిపాలిటీలు:

నగర పంచాయతీలు నర్సంపేట, పరకాల

ఎమ్మెల్యేలు:

చల్లా దర్మారెడ్డి, దొంతి మాధవరెడ్డి, ఆరూరి రమేశ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎస్‌. మధుసూధనాచారి

ఎంపీలు:

పసునూరి దయాకర్‌ (వరంగల్‌), ఏ సీతారాంనాయక్‌ (మహబూబాబాద్‌)

నీటిపారుదల: కాకతీయ కాలువ, పాకాల చెరువు, చలివాగు ప్రాజెక్టు

కాకతీయ సామ్రాజ్యం విస్తరించిన జిల్లా వ్యవసాయానికి ఖిల్లా. నర్సంపేట రైసుమిల్లులకు, గీసుకొండ పత్తి పరిశ్రమలకు చిరునామా. కాకతీయుల పాలనకు గుర్తుగా చారిత్రక పాకాల సరస్సు, పాకాల గుండం శివాలయం, అయినవోలు దేవస్థానం కనిపిస్తాయి.

భీమునిపాదం జలపాతం, కొమ్మాల జాతర ప్రసిద్ధి. గంగదేవిపల్లి దేశానికే ఆదర్శ గ్రామపంచాయతి.

జయశంకర్‌ భూపాలపల్లి

జనాభా: 7,05,054

విస్తీర్ణం: 6,175 చ.కి.మీ.

రెవిన్యూ డివిజన్లు : 2

మున్సిపాలిటీలు : 1

మండలాలు : 20

గ్రామ పంచాయతీలు : 262

మండలాలు : భూపాలపల్లి, గణపురం, రేగొండ, మొగుళ్ళపల్లి, చిట్యాల, టేకుమట్ల, మల్హర్‌రావు, కాటారం, మహదేవ్‌పూర్‌, వలిమెల, మహాముత్తారం, ములుగు, వెంకటాపూర్‌, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయగూడెం, మంగపేట, వెంకటాపురం, వాజేడు.

రెవిన్యూ డివిజన్లు : భూపాలపల్లి, ములుగు

మునిసిపాలిటీలు : భూపాలపల్లి నగర పంచాయతీ

భారీ పరిశ్రమలు : సింగరేణి, కేటీపీసీ, బిల్ట్‌ కాగితపు పరిశ్రమ

నీటిపారుదల : మేడిగడ్డ, దేవాదుల, చెరువులు (గణపసముద్రం, రామప్ప, లక్నవరం)

ఎమ్మెల్యేలు: సిరికొండ మధుసూదనాచారి, పుట్ట మధు, అజ్మీరా చందూలాల్‌

పర్యాటక ప్రాంతాలు: రామప్ప, లక్నవరం, మల్లూరు, మేడారం, సమ్మక్క-సారలమ్మ,

కోటగుళ్ళు, పాండవులగుట్ట, కాళేశ్వరం, ముక్తీశ్వరస్వామి, బోగత జలపాతం

తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో కీలక భూమిక వహించిన ఆచార్య జయశంకర్‌ సార్‌ పేరుమీదుగా ఏర్పాటైన జిల్లా ఇది. సిరులు కురిపించే నల్లబంగారానికి నెలవు. విలువైన అటవీ సంపద, వేలమంది సింగరేణి కార్మికుల శ్రామికశక్తికి చిరునామా. గలగలా గోదావరి ప్రవహిస్తున్న ఈ జిల్లాలో తెలంగాణ వ్యవసాయానికి జీవనరేఖగా భావించే కాళేశ్వరం (మేడిగడ్డ) ప్రాజెక్టు నిర్మించబోతున్నారు. కేటీపీపీ విద్యుత్‌ కేంద్రం జిల్లాకే తలమానికం. రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లా ఇదే. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర.

మహబూబాబాద్‌

జనాభా: 7,70,170

విస్తీర్ణం: 2,877 చ.కి.మీ.

రెవిన్యూ డివిజన్లు : 2

మున్సిపాలిటీలు : 1

మండలాలు 16

గ్రామ పంచాయతీలు: 287

మండలాలు:

మహబూబాబాద్‌, కురవి, కేసముద్రం, డోర్నకల్‌, గూడూరు, కొత్తగూడ, గంగారం,

బయ్యారం, గార్ల, చిన్నగూడూరు, దంతాలపల్లి, తొర్రూరు, పెద్దవంగర, నెల్లికుదురు, మరిపెడ, నర్సింహులపేట

రెవిన్యూ డివిజన్లు: మహబూబాబాద్‌, తొర్రూర్‌

మునిసిపాలిటీ: మహబూబాబాద్‌

సాగునీటి ప్రాజెక్టులు: బి.ఎన్‌. గుప్తా ప్రాజెక్ట్‌, బయ్యారం పెద్ద చెరువు, కంబాల్‌ చెరువు

ఎమ్మెల్యేలు: బానోత్‌ శంకర్‌నాయక్‌ (మహబూబాబాద్‌), డి.ఎస్‌. రెడ్యానాయక్‌ (డోర్నకల్‌), కోరం కనకయ్య (ఇల్లందు), అజ్మీరా చందూలాల్‌ (ములుగు), ఎర్రబెల్లి దయాకర్‌రావు (పాలకుర్తి)

ఎంపీ: అజ్మీరా సీతారాం నాయక్‌

జాతీయ రహదారి: ఎన్‌హెచ్‌ 365 (మహబూబాబాద్‌, కురవి, మరిపెడ)

రైల్వే లేను: కేసముద్రం, మహబూబాబాద్‌, గుండ్రాతిమడుగు, డోర్నకల్‌, గార్ల

గిరిజనులు ఎక్కువగా ఉండే జిల్లా ఇది. మహబూబాబాద్‌(నాటి మానుకోట)కు చారిత్రక ప్రాధాన్యం ఉంది. అటవీ సంపదకు నిలయం. రైలు, రోడ్డు, మార్గాల్లో ప్రధానమైన ప్రాంతం. కురవి శ్రీవీరభద్రస్వామి దేవాలయం ప్రసిద్ది చెందింది. బయ్యారంలో అపారమైన ఇనుప ఖనిజం ఉంది. అనంతారంలోని శ్రీవెంకటేశ్వరస్వామి, నర్సింహులపేటలో శ్రీ వెంకటేశ్వరస్వామి, డోర్నకల్‌లో చర్చి, గూడూరు,లోని భీముడి పాదం సందర్శనీయ స్థలాలు.దశాబ్దాలుగా గార్లలో ఏటా దసరా రోజున జాతీయజెండా ఎగురవేయడం ఇక్కడి ప్రత్యేకత.

అటవీ విస్తీర్ణం 1,31,530 హెక్టార్లు

జనగామ

జిల్లా కేంద్రం: జనగామ

విస్తీరం: 2,817 చ.కి.మీ

జనాభా: 5,82,457

మండలాలు: 13

గ్రామాలు: 217

రెవెన్యూ డివిజన్లు: 2

మున్సిపాలిటీలు: 1

మండలాలు:

జనగామ, లింగాలఘనపురం, బచ్చన్నపేట, దేవరుప్పల, నర్నెట, తరిగొప్పుల, రఘునాధపల్లి, గుండాల, స్టేషన్‌ఘన్‌పూర్‌, చిల్పూర్‌,జఫర్‌గఢ్‌, పాలకుర్తి, కొడకండ్ల

రెవెన్యూ డివిజన్లు:

జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌

మున్సిపాలిటీలు

జనగామ

జాతీయ రహదారి

ఎన్‌హెచ్‌ 163

సాగునీటి ప్రాజేక్టులు: లింగాల ఘనపురం, నవాబ్‌పేట, రఘునాథపల్లి, అశ్వరావుపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్‌, బొమ్మకూరు, గండిరామారం, కర్నెబోయిగూడెం రిజర్వాయర్లు

తాగునీటి ప్రాజెక్టు: జనగామ, చీటకోడూరు

తెలంగాణ సాయుధ పోరాటానికి కేంద్రంగా.. రాజకీయ, సామాజిక ఉద్యమాల పోతుగడ్డగా జనగామ పేరుగాంచింది. జనగామ ఒకప్పుడు జైనుల ప్రాబల్యం గల ప్రాంతం. తెలంగాణ ప్రాంతంలోనే అత్యధికంగా పాల ఉత్పత్తి చేసే డివిజన్‌. రోడ్డు, రైల్వేలే ప్రధాన రవాణా మార్గాలు. దేవాదుల, ఎస్సారేస్పీలతో పాటు బయ్యన్న రిజర్వాయర్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ జలాశయం సాగునీరు అందిస్తున్నాయి.

జిల్లాలోని పెంబర్తి లోహ హస్తకళలో ఖండాంతరఖ్యాతిని ఆర్జించింది.

మహాకవి బమ్మెర పోతన జన్మస్థలం బమ్మెర, కవి పాల్కురికి సోమనాథుడి స్వగ్రామం పాలకుర్తి ఈ జిల్లాలోనే ఉన్నాయి.

దక్కన్‌ పీఠభూమిలో ఎత్తయి ప్రాంతం సోలామైల్‌ ఇక్కడే ఉంది.

కామారెడ్డి

విస్తీర్ణం: 3,663 చ.కి.మీ.

జనాభా: 9,74,227

మున్సిపాలిటీలు 1

రెవిన్యూ డివిజన్లు: 3

మండలాలు 22

గ్రామ పంచాయతీలు: 323

మండలాలు: కామారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, మాచారెడ్డి, రాజంపేట, రామారెడ్డి, బీబీపేట, సదాశివనగర్‌, తాడ్వాయి, ఎల్లారెడ్డి, లింగంపేట, గాంధారి, నాగిరెడ్డిపేట, బాన్సువాడ, బీర్కూర్‌, నిజాంసాగర్‌, పిట్లం, జుక్కల్‌, బిచ్కుంద, నస్రుల్లాబాద్‌, పెద్దకొడప్‌గల్‌

రెవిన్యూ డివిజన్లు: కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ

మున్సిపాలిటీలు: కామారెడ్డి

ఎమ్మెల్యేలు: గంప గోవర్థన్‌ (కామారెడ్డి), ఏనుగు రవీందర్‌రెడ్డి (ఎల్లారెడ్డి),పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ), హన్మంత్‌ షిండే (జుక్కల్‌)

ఎంపీ: బీబీ పాటిల్‌ (జహీరాబాద్‌)

సాగునీటి ప్రాజెక్టులు: నిజాంసాగర్‌, పోచారం, కౌలాస్‌నాలా, సింగీతం రిజర్వాయర్‌

ఆలయాలు: సిద్ధిరామేశ్వరాలయం (భిక్కనూరు), కాలభైరవస్వామి ఆలయం (రామారెడ్డి), లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (చుక్కాపూర్‌), సోమలింగేశ్వరాలయం (సోమేశ్వర్‌)

పర్యాటక కేంద్రాలు: దోమకొండ గడికోట, పోచారం అభయారణ్యం, కౌలాస్‌ఖిల్లా, నిజాంసాగర్‌, పోచారం ప్రాజెక్టులు

నిజాంసాగర్‌ గలగలలు..

నిజాం హయాంలో కేవలం ఏడేండ్లలో పూర్తి చేసిన నిజాంసాగర్‌ ప్రాజెక్టు కామారెడ్డి జిల్లాలో ఉంది. తెలంగాణలో బెల్లం ఉత్పత్తి చేసే ప్రధాన కేంద్రం.మెదక్‌, సిరిసిల్ల, నిజామాబాద్‌, సిద్ధిపేట జిల్లాలకు కూడలి. బిటెక్‌ డైరీ టెక్నాలజీ కళాశాల ఇక్కడే ఉంది.

నిజామాబాద్‌

జనాభా: 15,77,108

విస్తీర్ణం: 4,261 చ.కి.మీ.

మండలాలు 27

మున్సిపాలిటీలు: 3

రెవిన్యూ డివిజన్లు: 3

గ్రామ పంచాయతీలు: 395

మండలాలు: నందిపేట, మాక్లూర్‌, నవీపేట, రెంజల్‌, ఎడవల్లి, బోధన్‌,వర్ని, కోటగిరి, డిచ్‌పల్లి, ఆర్మూర్‌, జక్రాన్‌పల్లి, వేల్పూరు, బాల్కొండ, మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి, భీంగల్‌, సిరికొండ, ధర్పల్లి. కొత్త మండలాలు: ఇందల్‌వాయి, మోప్కాల్‌, నిజామాబాద్‌ రూరల్‌, నిజామాబాద్‌ దక్షిణం, నిజామబాద్‌ ఉత్తరం, ముప్కాల్‌, మెండోరా, ఎర్గట్ల, రుద్రూరు

రెవిన్యూ డివిజన్లు: నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌

మున్సిపాలిటీలు/కార్పొరేషన్‌: నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, ఆర్మూర్‌, బోధన్‌

ఎమ్మెల్యేలు: బిగాల గణేష్‌గుప్తా (నిజామాబాద్‌ అర్బన్‌), బాజిరెడ్డి గోవర్ధన్‌ (నిజామాబాద్‌ రూరల్‌), ఆశన్నగారి జీవన్‌రెడ్డి (ఆర్మూర్‌), షకీల్‌ అహ్మద్‌ (బోధన్‌), వేముల ప్రశాంత్‌రెడ్డి (బాల్కొండ)

ఎంపీ: కల్వకుంట్ల కవిత (నిజామాబాద్‌)

జాతీయ రహదారులు: జిల్లా మీదుగా ఎన్‌హెచ్‌ 64, డిచ్‌పల్లి, ఆర్మూర్‌, బాల్కొండ మీదుగా ఎన్‌హెచ్‌ 44

రైల్వేలైన్‌: నిజామాబాద్‌-హైదరాబాద్‌ వరకు 185 కి.మీ. మార్గం

సాగునీటి ప్రాజెక్టులు: ఎస్సారెస్పీ, అలీసాగర్‌, గోదావరిపై 18 ఎత్తిపోతల పథకాలు

ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిజామాబాద్‌ జిల్లాలోనే ఉంది. గోదావరిపై కట్టిన ప్రాజెక్టులతో జిల్ల్లా సస్యశామలమవుతుంది. పసుపు సాగుకు నిజామాబాద్‌ పెట్టింది పేరు.వేలాది మందికి ఉపాధి కల్పించిన బోధన్‌లోని నిజాం చెక్కర కర్మాగారం, సారంగాపూర్‌ సహకార చెక్కర కర్మాగారాలు ప్రస్తుతం మూతపడ్డాయి. పసుపు సాగుకు నిజామాబాద్‌ జిల్లా పెట్టింది పేరు. సికింద్రాబాద్‌-ముంబై రైల్వేలైను ఉంది. బ్రిటిష్‌కాలం నాటి రుద్రూరు వ్యవసాయ పరిశోధనాకేంద్రం జిల్లాకే తలమానికం. వైద్య కళాశాలతో పాటు ఆస్పత్రి ఉంది. బడాపహాడ్‌ దర్గా, ఖిల్లా జైలు, సిర్నాపల్లి గడి, సారంగాపూర్‌ హనుమాన్‌దేవాలయం, డిచ్‌పల్లి ఖిల్లా రామాలయం, దేవల్‌ మజ్జిద్‌, కందకుర్తి త్రివేణి సంగమం, రామడుగు జలాశయం, గుత్ప ఎత్తిపోతల పథకాలు, అలీ సాగర్‌, అశోక్‌సాగర్‌, జానకం పేట అష్టముఖి కోనేరు, బోధన్‌ భీముని గుట్టలు ప్రముఖ పర్యాటక కేంద్రాలు. నిజామాబాద్‌ను ఇందూరు అని కూడా పిలుస్తారు.

నల్లగొండ

జనాభా: 16,31,399

విస్తీర్ణం: 6,863 చ.కి.మీ..

మండలాలు: 31

మున్సిపాలిటీలు: 3

రెవిన్యూ డివిజన్లు: 3

గ్రామ పంచాయతీలు: 516

మండలాలు: నల్లగొండ, కనగల్‌, తిప్పర్తి, మాడ్గులపల్లి, మిర్యాలగూడ, వేములపల్లి, దామరచర్ల, అడవిదేవులపల్లి, త్రిపురారం, నిమడనూరు, హాలియా, తిరుమలగిరి, పెదవూర, గుర్రంపోడు, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడ, చండూరు, నకిరేకల్‌, నార్కెట్‌పల్లి, కేతేపల్లి, కట్టంగూరు, చిట్యాల, శాలిగౌరారం, డిండి, చింతపల్లి, దేవరకొండ, పీఏపల్లి, చందంపేట, నేరేడుగొమ్మ, కొండమల్లేపల్లి

రెవిన్యూ డివిజన్లు: నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ

మునిసిపాలిటీలు: నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ

ఎమ్మెల్యేలు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్లగొండ), ఎన్‌. భాస్కరరావు (మిర్యాలగూడ), కె. జానారెడ్డి (నాగార్జునసాగర్‌), వేముల వీరేశం (నకిరేకల్‌) రమావత్‌ రవీందకుమార్‌ (దేవరకొండ), కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి (మునుగోడు)

ఎంపీలు: గుత్తా సుఖేందర్‌రెడ్డి (నల్లగొండ), బూర నర్సయ్య గౌడ్‌ (భువనగిరి)

పర్యాటక ప్రాంతాలు: నాగార్జునసాగర్‌, పానగల్లు; దేవాలయాలు: వాడపల్లి శివాలయం, నాగార్జునసాగర్‌లోని బౌద్ధారామం, పానగల్లు ఛాయా సోమేశ్వరస్వామి, దామరచర్ల మండలం కల్లేపల్లి మైసమ్మ దేవాలయం

ఉద్యమాల ఖిల్లా..

విప్లవ పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పురుడు పోసుకున్న గడ్డ నల్గొండ జిల్లా. నల్గొండ కేంద్రంగా 1907లోనే ఈ జిల్లా ఏర్పడింది. ఫార్మా పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. కృష్ణానదీ పరివాహక ప్రాంతమైన మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్లవద్ద పెద్ద సంఖ్యలో సిమెంటు పరిశ్రమలున్నాయి. నాలుగువేల మెగావాట్ల యాదాద్రి విద్యుత్‌ కేంద్రం ఇక్కడే రానుంది.

రైల్వే లైను: సికింద్రాబాద్‌నుంచి చిట్యాల, నల్లగొండ, మిర్యాలగూడ, వాడపల్లి మీదుగా ఏపీలోని గుంటూరు జిల్లా వరకు లైన్‌

సూర్యాపేట

జనాభా: 10,99,560

విస్తీర్ణం: 3,374 చ.కి.మీ.

మండలాలు: 23

మున్సిపాలిటీలు: 3

రెవిన్యూ డివిజన్లు: 3

గ్రామ పంచాయతీలు: 322

మండలాలు: సూర్యాపేట, ఆత్మకూర్‌ ఎస్‌, చివ్వెంల, పెన్‌పహాడ్‌, మోతె, నూతనకల్‌, మద్దిరాల, తిరుమలగిరి, తుంగతుర్తి, అర్వపల్లి, నాగారం, కోదాడ, అనంతగిరి, మేళ్లచెర్వు, మల్లారెడ్డిగూడెం, నేరేడుచర్ల, పాలకీడు, మఠంపల్లి, హుజూర్‌నగర్‌, మునగాల, గరిడేపల్లి, చిలుకూరు, నడిగూడెం.

రెవిన్యూ డివిజన్లు: సూర్యాపేట, కోదాడ

ఎమ్మెల్యేలు: జి. జగదీశ్‌రెడ్డి (సూర్యాపేట), గాదరి కిషోర్‌కుమార్‌ (తుంగతుర్తి), ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (హుజూర్‌నగర్‌), పద్మావతి (కోదాడ)

ఎంపీలు: బూర నర్సయ్య గౌడ్‌ (భువనగిరి), గుత్తా సుఖేందర్‌రెడ్డి (నల్లగొండ)

పర్యాటక ప్రాంతాలు: మఠంపల్లి శ్రీలక్ష్మీనర్సింహస్వామి, ఉండ్రుగొండ గిరిదుర్గం, పెద్దగట్టు లింగమంతులస్వామి ఆలయం, పిల్లలమర్రి, నాగులపహాడ్‌ శివాలయాలు, మేళ్లచెర్వు శివాలయం, తిరుమలగిరిలోని ఫణిగిరి బౌద్ధక్షేత్రం

జాతీయ రహదారులు : ఎన్‌.హెచ్‌. 65

సిమెంటు పరిశ్రమల కేంద్రం..

రజాకార్ల వ్యతిరేక తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమ కేంద్రం సూర్యాపేట. సిమెంట్‌ పరిశ్రమలతో అలరారుతోంది. ఇతర పరిశ్రమలు తక్కువైనా వ్యవసాయంలో మిన్నగా ఉంది. కృష్ణా పరివాహక ప్రాంతం కావడంతోపాటు సాగర్‌ ఎడమకాల్వ వ్యవసాయానికి ప్రధాన నీటి వనరు.

యాదాద్రి
విస్తీర్ణం: 3,092 చ.కి.మీ.

జనాభా: 7,26,465

మున్సిపాలిటీలు 1

మండలాలు 16

గ్రామ పంచాయతీలు: 304

మండలాలు 16: భువనగిరి, బీబీనగర్‌, భూదాన్‌ పోచంపల్లి, వలిగొండ, చౌటుప్పల్‌, సంస్థాన్‌నారాయణపురం, రామన్నపేట, ఆత్మకూర్‌ (కొత్తది), ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, మోటకొండూరు (కొత్తది), తుర్కపల్లి, బొమ్మలరామారం, మోత్కూరు, అడ్డగూడూరు (కొత్తది)

రెవిన్యూ డివిజన్లు: భువనగిరి, చౌటుప్పల్‌

మున్సిపాలిటీలు: భువనగిరి

ఎమ్మెల్యేలు: ఫైళ్ల శేఖర్‌రెడ్డి (భువనగిరి), గొంగిడి సునీత (ఆలేరు), కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి (మునుగోడు), వేముల వీరేశం (నకిరేకల్‌), గాదరి కిషోర్‌ (తుంగతుర్తి)

ఎంపీ: బూర నర్సయ్య గౌడ్‌

ప్రధాన పరిశ్రమలు: ఇనుము, ఎక్స్‌ప్లోజివ్స్‌, కెమికల్‌, ఆటోమొబైల్స్‌, ప్లాస్టిక్‌, క్రషర్‌, శానిటరీ, బాంబినో, గ్లాస్‌ ఇండస్ట్రీస్‌, పోచంపల్లి పట్టు చీరల తయారీ

జాతీయ రహదారులు: బీబీనగర్‌ మండలం కేపాల్‌-ఆలేరు మండలం టంగుటూరు వరకు ఎన్‌హెచ్‌ 163, చౌటుప్పల్‌ మండలంలో ఎన్‌హెచ్‌ 67

నరసింహుడి నీడన..

నిజాం సంస్థానంలో స్వాతంత్రోద్యమానికి నాంది పలికిన ఆంధ్ర మహాసభలు పురుడు పోసుకుంది ఈప్రాంతంలోనే. కొలనుపాక జైన దేవాలయం చారిత్రక ప్రాధాన్యం కలిగింది. ఏకశిలపై వెయ్యేళ్ల క్రితం నిర్మించిన భువనగిరి కోట చూడదగ్గ ప్రదేశం. ఇప్పటికే ఇక్కడ రాక్‌ క్లైంబింగ్‌ ద్వారా అనేకమందికి శిక్షణనిస్తున్నారు. తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఈ జిల్లాలోనే ఉంది.

రైల్వే లైన్లు: బీబీనగర్‌, ఆలేరు మీదుగా ఖాజీపేట వరకు, బీబీనగర్‌, వలిగొండమీదుగా ఏపీలోని గుంటూరు జిల్లా వరకు.

Other Updates