magaఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి నగరాలకు తీసుకువెళ్లాలన్న తెలంగాణ ప్రభుత్వం ఆశయం శరవేగంగా ముందుకు పోతుంది. ఇప్పటికే వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌ లాంటి పట్టణాల్లో ఐటి టవర్ల నిర్మాణానికి అమోదం తెల్పిన ప్రభుత్వం నిజామాబాద్‌ పట్టణానికి ఐటి పరిశ్రమను తీసుకెళ్లనున్నట్లు తెల్పింది.

త్వరలోనే నిజామాబాదులో ఐటి హబ్‌ ఏర్పాటు చేయనున్నట్లు ఐటి శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఈ ఐటి హబ్‌ కోసం మెదటి దశలో సుమారు 25 కోట్ల రూపాయాలను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఐటి హబ్‌లో, ఇంకుబేషన్‌ సెంటర్‌ కూడా ఉంటుందని తెలిపారు. వచ్చే ఏడాదిలో ఇందుకు సంబంధించిన అన్న