double-roomముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ పథకంపై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రజల నుంచి కూడా అనుహ్యా స్పందన వస్తుండంటంతో.. గూడు లేని పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు తెలంగాణ సర్కారు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తొంది.

నిరుపేదలు కూడా ఆత్మగౌరవంతో బతుకాలనే సదుద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పథకానికి రూపకల్పన చేశారు. ఒక్కపైసా కూడా లబ్ధిదారులపై భారం మోపకుండా పూర్తిగా ప్రభుత్వమే వాటిని నిర్మించి ఇస్తున్నది. అనుకున్నట్లుగానే అత్యంత ప్రతిష్టాత్మకంగా పథకాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను ప్రభుత్వం మంజురూ చేసింది. వీటి నిర్మాణానికి సుమారు 14 వేల కోట్ల రూపాయాలు అవసరంమని గహనిర్మాణ శాఖ బడ్జెట్‌ అంచనాలను రూపోందించింది. ప్రభుత్వం రూ.557 కోట్ల మొత్తానికి బడ్జెట్‌ కేటాయింపు చేసింది. ఈప్రాజెక్ట్‌కు కావాల్సిన మిగిలిన నిధులను రాష్ట్ర గహ నిర్మాణ సంస్థ, హడ్కోతో పాటు ఇతర ఆర్థిక సంస్థల నుంచి సమీకరించా లని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వివిధ గహ నిర్మాణ పథకాల కింద ఇండ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా సుమారు 236 కోట్ల రూపాయలను విడుదల చేసింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో 1 లక్ష ఇండ్లు, మిగతా 9 జిల్లాల్లో లక్ష ఇండ్లను, అంటే జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో 40 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో 60 వేల ఇండ్లను ప్రభుత్వం నిర్మించనుంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గానూ రెండు పడక గదుల నిర్మాణం కోసం ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం లోపే డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పూర్తి చేయనుంది.ఒక్కో గహానికి జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.7.75 లక్షలు (రూ.7లక్షలు ఇంటి నిర్మాణానికి, రూ.75వేలు మౌలిక వసతుల కల్పనకు), పట్టణ ప్రాంతాలలో రూ.6.05 లక్షలు (రూ.5.30 లక్షలు ఇంటి నిర్మాణానికి, రూ.75 వేలు మౌలిక వసతుల కల్పనకు) కేటాంయించారు. గ్రామీణ ప్రాంతాలలో రూ. రూ.6.29 లక్షలు (రూ.5.04 లక్షలు ఇంటి నిర్మాణానికి, రూ.1.25 లక్షలు మౌలిక సదుపాయాలకు) చొప్పున నిర్మాణ వ్యయంగా ప్రభుత్వం నిర్ణయించింది.

వేగవంతమైన ఇండ్ల నిర్మాణ ప్రక్రియ

జీహెయచ్‌ యంసీతో పాటు జిల్లాల్లో కొన్ని చోట్ల వరంగల్‌ ,మెదక్‌,ఖమ్మం , మహబూబ్‌ నగర్‌, కరీంనగర్‌ జిల్లాలో మొత్తం 5238 ఇండ్లకు టెండర్ల ప్రక్రియ పూర్తై పనులు కూడా ప్రారంభమయ్యాయి. మిగతా జిల్లాల్లో టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది.

రాష్ట్రంలో అభివద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి… దేశంలో ఎక్కడాలేని విధంగా పేద వారికి డబుల్‌బెడ్‌ రూం ఇండ్లు ప్రభుత్వం సొంత ఖర్చుతో నిర్మించి ఇవ్వడం మహా అద్భుతం.. పేదల సొంతింటికలను నిజం చేస్తున్న తెలంగాణ.. మిగితా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సయితం సీయం కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ, అభివద్ది పథకాలను కొనియాడటం విశేషం . స్వరాష్ట్రంలో పిచ్చుక గూళ్ల లాంటి పేదల ఇండ్లకు కాలం చెల్లిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడం .. పేదల అభ్యున్నతి పట్ల ఆయనకున్న నిబధ్దతను తెలియజేస్తోంది.

పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక

ఇండ్లు లేని నిరుపేదలకు మాత్రమే డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను నిర్మించి ఇవ్వాలనే క త నిశ్చయంతో కేసీఆర్‌ ఉన్నారు. గతంలో ఇందిరమ్మ ఇండ్లలో జరిగిన అక్రమాలను ద ష్టిలో ఉంచుకుని .. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పథకంలో ఎక్కడ అవకతవకలకు తావు లేకుండా లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు కలెక్టర్లకు అప్పగించారు. ప్రభుత్వ పథకాలు అంటే కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే అని గతంలో ఉన్న అపోహాను ద ష్టిలో ఉంచుకుని సీయం కేసీఆర్‌ .. ఈ – ప్రొక్యూర్‌ మెంట్‌ టెండర్ల ద్వారానే రెండు పడక గదుల నిర్మాణం చేపట్టాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణంలో నాణ్యత లోపించినా.. సంబంధిత కాంట్రాక్టర్‌ పై లైసెన్స్‌ ను రద్దు చేయడంతో పాటు క్రిమినల్‌ చర్యలు తప్పవని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరించారు. దీంతో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతుంది.

ఆధార్‌తో లబ్ధిదారుల జాబితా అనుసంధానం

లబ్ధిదారుల జాబితా మొత్తాన్ని ఆధార్‌ కార్డులతో అనుసం ధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గహ నిర్మాణ పథకం డాటా బేస్‌లో ఒక్కోక్క లబ్ధిదారుని వివరాలను జతచేయనున్నారు. దీంతో ఎవరైనా తప్పుడు వివరాలతో రెండవ సారి ఇండ్ల మంజురూ కు అఫ్లై చేసిన ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల నకిలీ ఆటలు సాగవు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏ పని చేయలన్నా దానికి వెనుక ముందు ఆలోచిస్తారు. ఆచరణ సాధ్యమనుకుంటూనే దానిపై ముందుకు కదులుతారు. హైదరాబాద్‌ లాంటి మహానగరంతో పాటు పట్టణాలు,పల్లెల్లో ఉండటానికి ఇండ్లు లేక ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ దర్భుర జీవితం గడుపుతున్న పేదల బతుకు మరాలనే ఉద్దేశ్యంతో రెండు పడకల గదుల ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇండ్లు లేని నిరుపేద లకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రతి బడ్జెట్‌ లో నిధులు కేటాయిస్తున్నారు. రాబోయే మూడు ఏండ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేదల స్వంతింటిని కలను నిజం చేస్తారనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది..

Other Updates