goalkonda-kotaభారతదేశ చరిత్రలో దేశ చరిత్రతోపాటు ప్రాంతీయ చరిత్రు కూడా
ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మన తెంగాణ
రాష్ట్రానికి కూడా అనాది నుండి అంతటి ఘనమైన చరిత్ర వుంది.
అందులోనూ గోదావరి నది పరీవాహక ప్రాంతమైన ఉత్తర తెంగాణ
చరిత్ర పూర్వయుగం నుండి గొప్ప సంస్క ృతికి, నాగరికతకు
నియంగా వుంది. అలాంటి మహత్తర చరిత్ర కలిగిన ఉత్తర
తెంగాణలో నాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచింది ‘నిర్మల్‌ కోట’.

ఆదిలాబాద్‌ జిల్లాలో డివిజన్‌ కేంద్రం నిర్మల్‌. హైదరాబాద్‌ నుండి నాగ్‌పూర్‌కు వెళ్ళే జాతీయ రహదారిపై వున్న ఈ పట్టణం డిచ్‌పల్లి రైల్వే స్టేషన్‌ నుండి 58 కి.మీ. నిజామాబాద్‌ నుండి 75 కి.మీ. దూరంలో వుంది. గోదావరికి ఉత్తరాన 6 కి.మీ. దూరంలో వున్న ఈ ప్రాంతం ఒకప్పుడు దట్టమైన అడవుతో నిండి వుండేది. చుట్టూ గుట్టు, కొండ మధ్య ఈ పట్టణ నిర్మాణం జరిగింది. ఈ పట్టణం చుట్టూ వున్న గుట్టపై కోటగోడు, బురుజు లాంటి అనేక నిర్మాణాు ఉన్నాయి.

ఆసఫ్‌జాహీ నవాబు పాన 1724లో ప్రారంభమైంది. సలాబత్‌ జంగ్‌ (1751`1761) నవాబు కాంలో నవాబ్‌ ముజారిజుల్‌ ముల్క్‌ జఫిరుద్దౌలాబహదూర్‌ మీరాజు ఇబ్రహీం ఖాన్‌ ధంసా ఎగందు సర్కార్‌ పాకునిగా నియమింపబడ్డారు.

నిర్మల్‌, క్షెట్టిపేట, చెన్నూర్‌ ప్రాంతాు కూడా అతని ఆధీనములోనే వుండేవి. 1747లో, జగిత్యా స్థ దుర్గమును, నిర్మల్‌ గిరిదుర్గాను ప్రెంచి ఇంజనీర్ల సహాయంతో అతను నిర్మించాడు. నిర్మల్‌లోని ఇబ్రహీంబాగ్‌లో ఇతని సమాధి ఇప్పటికీ వుంది. ఇబ్రహీం ఖాన్‌ పేరిట నిర్మల్‌లో ఇబ్రహీంబాగ్‌ నిర్మింపబడిరది.

కొంత కాలానికి ఇబ్రహీం ఖాన్‌ ధంసా కుమారుడు ఎహెతెషామ్‌జంగ్‌ ఎగందు సర్కార్‌ పాకుడైనాడు. బహుక్రూరుడైన ఇతడు నిజాం నవాబునే లెక్కచేయలేదు. అందువ్ల నిజాం అలీఖాన్‌ ఆసఫ్‌జా`2 ఎగందు కోటను ముట్టడిరచడానికి పెద్ద సైన్యాన్ని పంపాడు. భీకరంగా జరిగిన ఆ యుద్ధంలో ఎగందు సేనకు అపార నష్టం సంభవించింది. యుద్ధం నుండి ఎహితేషామ్‌జంగ్‌ 1791లో జగిత్యా కోటకు, ఆ తరువాత నిర్మల్‌ కోటకు పారిపోయాడు. నిజాం సేను ఎహితేషామ్‌ జంగ్‌ను పట్టుకొని బంధించారు. కాని రెండవ నిజాం అతని తల్లి విన్నపాన్ని గౌరవించి అతనిని క్షమించి అతనిని బెరార్‌కు సుబేదార్‌గా ఎలిచిపూర్‌కు పంపాడు.

ఎంతో చారిత్రక ప్రాధాన్యం కలిగిన నిర్మల్‌కు ఆ పేరు రావటం వెనుక ఎంతో చారిత్రక నేపథ్యం కూడా వుంది. 1600`1650 మధ్య కాంలో భద్రాచం తహసిల్దారుగా వున్న కంచర్ల గోపన్న నామధేయుడైన శ్రీరామదాసు భద్రాచంలో శ్రీ సీతారామాంజనేయు ఆయాు నిర్మించి, ఉత్సవాను జరిపించటానికి సర్కారుకు సంబంధించిన నిధును ఖర్చు చేయటం వ్ల, అప్పటి గోల్కొండ నవాబు అబూల్‌ హసన్‌ కుతుబ్‌షా అంటే నవాబు తానీషా, శ్రీరామదాసును చెరసాలో పెట్టించారు. శ్రీరామదాసుకు ‘వెమదవాయి నిమ్మ నాయుడు’ అత్యంత సన్నిహితుడు. నాడు కొందరు భూస్వాము తానిషాతో చేయి కలిపి, శ్రీరామదాసుపై కుట్రపన్ని, భూమి శిస్తు విషయాల్లోనేగాక మరెన్నో తగాదాు తీసుకొచ్చారు. ఇది తెలిసి విసుగెత్తిన ‘నిమ్మనాయుడు’ కుటుంబ సమేతంగా కొంత సిబ్బందితో కలిసి నిరాశ నిస్పృహతో గోదావరి నదీ తీరం వెంబడి చెన్నూరు, కోటిలింగా గుండా ప్రయాణించి మట్టికోటగా నెకొని వున్న న్లగుట్ట అనగా నేటి ఖాన్‌పూర్‌ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ ఔరంగజేబు నియమించిన ఖిలేదారు నిమ్మనాయుడు రాకను అడ్డుకున్నాడు. దాంతో ఇరుసేన మధ్య భీకర పోరాటం జరిగింది. ఆ పోరాటంలో నిమ్మ నాయుడు విజయం సాధించాడు. ఆ ఖిలేదారు నిమ్మనాయుడు ఆధిపత్యాన్ని అంగీకరించాడు. అయినా నిమ్మనాయుడు న్లగుట్ట ప్రాంతంలో కొంతకాం మాత్రమే ఉండి మరో మంచి ప్రాంతంవైపు బయుదేరాడు.

నిర్మల్‌ పట్టణానికి తూర్పుదిశగా ‘పులిమడుగు’ (బత్తీస్‌ఘడ్‌ ప్రాంతం) పేరుతో ఒక బస్తీ వుండేది. చత్రపతి శివాజీ నాయకత్వంలో గోల్కొండ సైన్యాు మహారాష్ట్ర సేన అండదండతో పుసార్లు మొగు సైన్యాను ‘పులిమడుగు’లో ఓడిరచారు కూడా. సైనికు యుద్ధ సమయాల్లో తదాచుకోవడానికి కోటగోడు, బురుజు, నే బొయ్యారాు (సొరంగాు) కందకాు మొదగునవి ఆ ప్రాంతంలో ఆ కాంలోనే నిర్మించబడ్డాయి.

కొన్ని రోజు తరువాత నిమ్మనాయుడు పులిమడుగు ప్రాంతం నుండి రాత్రిపూట వెళుతుండగా అప్పటికే న్లగుట్ట ప్రాంతంలో జరిగిన సంఘటన తెలిసి ఉండటం వ్ల పులిమడుగు ఖిలేదారు నిమ్మనాయుని చెలిమిని కోరి అతన్ని తన సహాయంగా వుంచుకోవటమేగాక వారందరికీ ఆధారంగా ఆశ్రయం కలిపించాడు.

ఒకనాడు నిమ్మనాయుడు తన త్లె ఏనుగుపై ఇప్పటి దేవరకోట శ్రీ క్ష్మీ వెంకటేశ్వర స్వామి మందిర ప్రాంతానికి బయుదేరాడు. అక్కడి స్థ మహత్యం తొసుకున్న నిమ్మనాయుడు అక్కడి పులిమడుగు దుర్గాధిపతి సహకారంతో అక్కడే స్థిరపడ్డాడు. ఆ పవిత్ర స్థంలోనే శ్రీ సీతారామాంజనేయ విగ్రహాను స్థాపించి నిత్యం దూప, దీప, నైవేద్యాతోపాటు భజనాదు చేసేవాడు. నిమ్మ నాయుడి మంచితనం, శౌర్యం, సేవాగుణం స్థానికుకు నచ్చటంతో ఈ ప్రాంతంలో నిమ్మనాయుడికి ఆదరాభిమానాు అనూహ్యంగా పెరిగి పోయాయి.

ఈ ప్రాంతంలోని అటవీ భూ సంపత్తిని ఉపయోగంలోకి తేవడానికి భద్రాచం, సిరివంచ, కొండపల్లి, విజయవాడ, ఖమ్మం, మధిర, ఎ్గందు, ఓరుగ్లు, కొండవీడు, వడూరు తదితర ప్రాంతా నుండి కర్రబొమ్ము చేసేవారిని, బ్రాహ్మణ, వైష్ణవ, ఆరాధ్య, పద్మశాలి, తెనుగు, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, నగిషీి మొదలైన కువృత్తు వారిని రప్పించి, వారి నివాసాకై ఆ అరణ్యానికి సమీపంలో కునుబ అనే వీధిలో 12 ఇండ్లతో ఒక గ్రామాన్ని రూపొందించాడు. ఆ గ్రామానికి తన పేరు చిరస్థాయిగా ఉండటానికని ‘నిమ్మ’ అని నామకరణం చేసాడు. ‘నిమ్మ’ గ్రామాన్ని తరువాత వచ్చిన పాకు ‘నిర్మల్‌’గా మార్చారు. ఇప్పటికి కూడా కొంతమంది ‘నిమ్మ’ అనే పిుస్తుంటారు.

నిర్మల్‌ కోట చుట్టూ రాతి గోడ పొడవునా ఎత్తైన 64 బురుజు, కోటలోనికి ఏడు ప్రవేశ ద్వారాు నిర్మించాడు. శత్రువు రాతిగోడ ఎక్కి నీరు నిండి వున్న కందకం దాటి రాకుండా తగు ఏర్పాట్లు చేశాడు. పట్టణం చుట్టూ నిర్మించిన ప్రధానమైన రక్షణ గోడతో పాటు, రాజ సౌధం (ఖిల్లా గుట్ట) చుట్టు మరొక పటిష్టమైన రాతి గోడను నిర్మించాడు. దీనినే ‘ఆంజనేయదుర్గం’ అంటారు.

కోటలోకి వెళ్ళడానికి తూర్పువైపు సింహద్వారం, దక్షిణ, ఉత్తర దిశల్లో మరో రెండు ప్రధాన ద్వారము, సింహ ద్వారానికి దగ్గరలో తూర్పుకు ఒక చిన్న ద్వారం, సభాభవనం, హవామహల్‌, అంతఃపురసౌధం, మంచినీటి కోనేరుబావి, ఇలా ఆనాటి రాతినిర్మాణాు ఇప్పటికి మనకి కనిపిస్తాయి. నాటి ప్రభుత్వం ఈ కట్టడాపై సరైన శ్రద్ధ తీసుకోకపోవటం వ్ల కొంత, స్థానికు అవగాహన రాహిత్యం వన మరికొంత చుట్టుప్రక్క ప్రాంతా వారు రాళ్ళను క్లొగొట్టడం వ్ల ఇంకొంత వివిధ చారిత్రాత్మక కట్టడాన్నీ శిథిలావస్తకు చేరుకున్నాయి. కోటలో నిధు అన్వేషణ కోసం జరిపిన తవ్వకా వ్ల మివైన పురాతన సంపద కనుమరుగయి పోయింది.

కోటలో కొువై వున్న దేవతా మూర్తు పూజ నైవేధ్య ఖర్చుకుగాను నాటి రాజు వంద ఎకరా భూమిని ‘ఇనాము’గా ఇచ్చినట్టు స్థానికు ద్వారా తొస్తున్నది. ఆ భూమున్నీ ఆక్రమణకు గురి కావటంతో దేవతా మూర్తు ఆనా పానా కరువైపోయింది. నిమ్మరాయుడు, కుంటి వెంకట్రాయుడు, శ్రీనివాసరాయుడు, కనింగ రాయుడు, ధంసా మొదలైన రాజు ఈ కోటలో నుండే తమ పాన వంద సంవత్సరాపాటు కొనసాగించారు.

నిర్మల్‌ ఖిల్లా ప్రాంతం అంతా రాజభవనంతో పాటు శ్యామ్‌ఘడ్‌, బత్తీస్‌ఘడ్‌, ఖిల్లా గుట్ట, దసరాసీ మోంఘన లాంటి 64 బురుజుతో అత్యంత విశాంగా విస్తరించి శతృదుర్భేద్యంగా నిర్మించబడిరది.

మదీనాలో గ బురుజు, బత్తీస్‌ఘడ్‌పై గ కుంటి వెంకట్రాయుని మట్టికోట సింహద్వారం, బురుజు, కిల్లాగుట్ట సింహద్వారం, రాజసింహాసనపు గద్దె, ఆంజనేయస్వామి మందిరం, అత్తకోడళ్ళ బావి, దసరాసీి మోంఘన ద్వారం (జంగల్‌పేట్‌ చెరువుకట్టమీద) గొుసు దర్వాజ, ఖిల్లాగుట్టపై గ హవామహల్‌ అంటే నాట్యశాతో పాటు రాజరాజేశ్వరాయము, వెంకటేశ్వరాయము లాంటి కట్టడాు చూపరు కళ్ళను తిప్పుకోకుండా చేయటమే కాక నాటి శ్పిు ప్రతిభకు గీటురాళ్ళుగా నేటికీ తార్కాణంగా నిుస్తున్నాయి. వీటిలో ప్రధానంగా రాజభవనం (ఖిల్లా గుట్ట) శ్రీనివాసరావు కాంలో కట్టబడిరది. బుడతకీచు అనే సన్నిహితుడి సహా మేరకు, శ్రీనివాస రావు దీనిని ఫ్రెంచ్‌వారి సహాయంతో కట్టించారు. కోట చుట్టూ సున్నంతో ఎత్తయిన బలిష్టమైన రాతి, ఇటుక గోడ, గోడపొడవునా లోతైన కందకం త్రవ్వించి కందకంలో ఎ్లప్పుడూ నీరు వుండే విధంగా అమర్చి బయట నుండి శత్రువు కోటలోకి రాకుండా మొసళ్ళను అందులో దింపేవారు.

ఇక్కడ ఎక్కువగా చెప్పుకోవసింది గొుసు దర్వాజ గురించి, ఈ దర్వాజకి పెద్ద ఇనుప పక వుండేది. వీటని బలిష్టమైన గొుసుతో పెద్ద చక్రాకు చుట్టి వుంచేవారు. ద్వారం మూసివేయడానికి తెరవడానికి గొుసును ఉపయో గించేవారు. వీటిని లాగడానికి ఏనుగును ఉపయోగించేవారు. ఈ దర్వాజా నిర్మాణ తీరును చూస్తే శత్రువు రాకను అడ్డుకోవడానికి ఎంత నైపుణ్యంతో నాటి నిర్మాణాు చేసారో అర్థమవుతుంది. ప్రస్తుతం జాతీయ రహదారి వెడ్పు పను కారణంగా దర్వాజకు సంబంధించిన ఒక దిమ్మె ధ్వంసం అవటంతో మరొక దిమ్మె మాత్రమే మనకు కనిపిస్తుంది.
మొత్తంగా నిర్మల్‌ పట్టణంలో ఏడు సింహ ద్వారాు ఉండేవి. రాజా శ్రీనివాసరావు కాంలో మొదటి ప్రహరీలో సైనిక శిబిరం ఏర్పాటు చేసేవారు. అప్పటి కాంలో పెట్టిన పేర్ల ఆధారంగా నేటికీ కొనసాగుతున్న నివాస వాడు ఇప్పటికీ మనకు పట్టణంలో కనిపిస్తాయి. నాటి సింహద్వారాు మాత్రం మనకు శిథిలావస్థలో కనిపి స్తాయి. కొన్ని ద్వారాు అసు ఆనవాళ్ళే లేకుండా పోయాయి. నిర్మల్‌ కోటల్లో అత్యంత చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్న కోటల్లో ‘బత్తీస్‌ ఘడ్‌’ కోట కూడా ఒకటి.

16వ శతాబ్దంలో ఔరంగజేబు ఆజ్ఞతో నిర్మించబడ్డ కోటనే ఈ బత్తీస్‌ఘడ్‌. మాలిక్‌ కాఫర్‌ దండయాత్ర నుండి తప్పించుకోవడానికి ఈ కోట కట్టబడిరదని చరిత్రకారు అభిప్రాయం. బత్తీస్‌ఘడ్‌ కోట ప్రాంతము, నిర్మల్‌ పట్టణానికి తూర్పున ఉంది. ఈ ప్రాంతాన్ని ఆ కాంలో దఫ్తర్‌ పులి మడుగు అనేవారు. అప్పటి సేనానాయకుడు ‘మానిక్‌ఘడ్‌, మహుక్‌, వడూర్‌, కుంటా, అప్పారావుపేట్‌, ఎగడప, ఎగంద’ ` మొదయిన 32 గడి కోటను సైన్యం కొరకు నిర్మించాడు. ఆ 32 గడి గుర్తుగా ఒకే చోట 32 గదు ఈ కోటలో నిర్మించటం వ్ల దీనికి ‘బత్తీస్‌ఘడ్‌’ అని పేరు పెట్టారు.
నిమ్మ పట్టణాన్ని ఏలిన కుంటి రాజా వెంకట్రాయుని మేన్లుడు రాజా శ్రీనివాసరావు తన పాతికేళ్ళ పానలో పట్టణం చుట్టూ గట్టి ప్రహరీగోడతోపాటు, 64 బురుజు, ప్రహరీ గోడ పొడగునా లోతైన కందకం నిర్మించాడు. నాటి కట్టడాు, తదితర విషయాకు సంబంధించిన ఎంతో మివైన సమాచారాన్ని నిమ్మ పట్టణంలోని బత్తీస్‌ఘడ్‌, శ్యాంఘడ్‌, సోన్‌ఘడ్‌ ముందు రాతిగుండ్లపై మోడి భాషలో ఆయన శాసనాు చెక్కించాడు. అయితే చాలావరకు ఆ బురుజు కనుమరుగైపోగా కోట చుట్టు నిర్మించిన ప్రహరీగోడ కూలిపోయి కందకం పూడిపోయింది. ఖిల్లాగుట్టపై గ అరుదైన చారిత్రక శాసనాు కూడా నామరూపాు లేకుండా పోయాయి.

శత్రుదుర్భేద్యంగా అద్భుత నిర్మాణ కౌశంతో నిర్మించబడ్డ 32 కోట నడుమ విక్షణంగా శోభిల్లే బత్తీస్‌ఘడ్‌ నుండి రాచరికపు వైభవ చంద్రికను కురిపించిన నిర్మల్‌ నిమ్మనాయుడు, వేంకట్రాయుడు, శ్రీనివాసరావు ధన్యు. వారు ఇక్కడ నిర్మించిన వివిధ మందిరాు సంస్క ృతి గోపురాుగా యశోధ్వజాు ఎగురవేసి నాటి ప్రజకు నిమ్మ రామరాజ్యమిచ్చింది అని స్థానికు నేటికీ చెప్పుకుంటారు. ఏదెమైనా ఇలాంటి చారిత్రాత్మక ప్రదేశాల్ని కాపాడుకోవడం అటు ప్రభుత్వంతో పాటు ఇటు ప్రజందరి కనీస బాధ్యత. నిర్మల్‌ కోటను భావితరాకోసం పదిపరచాల్సిన బాధ్యత మనందరిమీదా ఉంది. ఇక్కడ సౌకర్యాు మెరుగుపరిచి, రక్షణ చర్యు చేపడితే ఇది గొప్ప టూరిజం కేంద్రంగా విరాజ్లిుతుంది. ఆ వైభవం ఈ కోటకు తొందరగా దక్కుతుందని ఆశిద్దాం.

Other Updates