harishమల్లన్న సాగర్‌ ప్రాజక్టు కింద ముంపుకు గురి కానున్న పల్లె పహాడ్‌ రైతులు, ప్రజలతో మంత్రి హరీష్‌ రావు జులై 27న జరిపిన చర్చలు సఫలమయ్యాయి. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టుకు అన్ని విధాలా సహకరిస్తా మని పల్లె పహాడ్‌ వాసులు ప్రకటించారు. గజ్వేల్‌ లోని మల్లారెడ్డిగార్డెన్స్‌ లో పల్లె పహాడ్‌ రైతులు, యువకులతో మంత్రి హరీష్‌ రావు చర్చించారు. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన పల్లె పహాడ్‌ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు హరీష్‌ రావు తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై నమ్మకంతో పల్లె పహాడ్‌ ప్రజలు భూములిచ్చేందుకు ముందుకొచ్చారని మంత్రి అన్నారు. పల్లె పహాడ్‌ వాసుల త్యాగం వెలకట్టలేనిదన్నారు. 123 జీవో ప్రకారం భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. వారికీ ధన్యవాదాలు. నిర్వాసితులు కోరుకొన్నచోట గ్రామాన్ని నిర్మించి ఇస్తాం.

గ్రామాన్ని నిర్మించి, హామీలు నెరవేర్చిన తర్వాతే ఊరు ఖాళీ చేయండి. లక్షలాది మంది రైతుల జీవితాలలో వెలుగు నింపేందుకు ఆకుపచ్చ తెలంగాణ నిర్మాణం జరుగుతున్నట్లు మంత్రి హరీష్‌ రావు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే ఆరు గ్రామాలు స్వచ్చందంగా ముందుకొచ్చిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. మిగతా గ్రామాలతోనూ చర్చలు జరుపుతున్నామని అన్ని గ్రామాల ప్రజలతో ఒప్పించి మల్లన్న సాగర్‌ నిర్మిస్తామని మంత్రి తెలిపారు.

పల్లెపహాడ్‌ రైతులు భూములివ్వడానికి ముందుకు వచ్చిన తెల్లవారే జులై 28రోజు ఎర్రవల్లి గ్రామస్తులు సమష్టిగా నిర్ణయం తీసుకున్నారు. జి.వో. 123 ప్రకారం తమ భూములను అప్పగించడానికి తమ సమ్మతిని తెలియజేశారు.

పల్లెపహాడ్‌ రైతుల మనోగతం….
సీఎం కేసీఆర్‌ ఫై వున్న నమ్మకంతో భూములు ఇచ్చేందుకు అంగీకరించాం. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని నమ్ముతున్నాం. మా భూములు పోయినా ప్రాజెక్ట్‌ నిర్మాణం తో లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. తమ గ్రామాన్ని సీఎం కేసీఆర్‌ దత్తత తీసుకోవాలనీ గ్రామస్థులు మంత్రిని కోరగా ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానని తెలిపారు.

Other Updates