maga

ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 21 వ తేదీ దేశ వ్యాప్తంగా పోలీసు అమర వీరులను సంస్మరించుకుంటూ వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు పోలీసులు చేస్తున్న త్యాగాలు, విధుల పట్ల అవగాహన కల్పించడం జరుగుతుంది.

ఈ అక్టోబర్‌ 21 1959 సంవత్సరంలో కేంద్ర రిజర్వు బలగానికి చెందిన సిబ్బంది, దేశ సరిహద్దులలోని ఆక్సాయిచిన్‌ ప్రాంతంలో విధులు నిర్వహిస్తుండగా హఠాత్తుగా పెద్ద సంఖ్యలో చైనా దేశానికి చెందిన సైనికులు దాడి చేశారు. ఈ ఘటనలో మన బలగాలు ఎంతో సాహసంతో ధైర్యంతో పోరాడి తమ ప్రాణాలను కోల్పోయారు. దేశ సరిహద్దులలో విధులు నిర్వహించేది, దేశ అంతర్గత భద్రత కల్పించేది పోలీసు మాత్రమే. నిరంతరం ప్రజలకు అన్నిసమయాలలో అందుబాటులో ఉండేది పోలీసులే. పోలీసు విధులు నిర్వహిస్తూ దేశ వ్యాప్తంగా ఈ సంవత్సరం 383 మంది పోలీసులు అమరులైనారు.

పోలీసు అమరవీరుల సంస్మరణ దినం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలను చేపడతారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల భాగ్యస్వామ్యం తో కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. మూడు రోజుల పోలీస్‌ ఎక్స్‌పో , పోలీస్‌ అమరవీరుల స్మారక పరుగు, పాఠశాల, కళాశాల విద్యార్థులతో ర్యాలీ, వైద్య శిబిరంతో పాటు రక్త దాన శిబిరాలు, వివిధ పాఠశాలల విద్యార్థులకు వ్యాస రచన, వక్తత్వ, పెయింటింగ్‌ పోటీలు నిర్వహించడం జరిగింది.

పోలీస్‌ ఎక్స్‌పో

పోలీస్‌ అమరవీరుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని ఎస్‌ బి ఇన్డోర్‌ స్టేడియంలో మూడు రోజుల పాటు ఎక్స్‌పోను నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ఆధునిక ఆయుధాలు, నేరాన్ని చేధించేందుకు వాడే అత్యాధునిక పరికరాలు, ఫోరెన్సిక్‌లో నిర్వహించే పరీక్షలు, షి బృందాల స్టాల్‌, తెలంగాణ పోలీస్‌ శాఖలో ఉన్న వివిధ విభాగాల వారి స్టాల్స్‌ ఏర్పాటు చేయడం జరిగింది. 26 స్టాల్స్‌ లో మహారాష్ట్ర, అసోమ్‌, కేరళ, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్ర పోలీస్‌ తో పాటు కేంద్ర పోలీస్‌ సంస్థలు పాల్గొన్నవి. ఈ ఎక్స్‌పోలో ప్రదర్శనతో పాటు టి ఎస్‌ ఎస్‌ పి ఒకటి, ఎనిమిదో బెటాలియన్‌, సైబరాబాద్‌ టాక్‌ టికల్‌ టీం, శునకం బృందం ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ప్రదర్శన చూసేందుకు జంట నగరాల నుండి ప్రజలు, పాఠశాల, కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పోలీస్‌ అమరుల స్మారక పరుగు

గత సంవత్సరం లో ప్రారంభించిన ఇండియన్‌ పోలీస్‌ మెమోరియల్‌ రన్‌ (IPMMR))కు రాష్ట్ర ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. ప్రత్యేకమైన నాలుగు ప్రచార రథాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి ఏర్పాటు చేయడం జరిగింది, ఈ ప్రచార రథాలలో ఎల్‌ఈడి స్క్రీన్‌ ద్వారా స్మారక పరుగు, పోలీస్‌ అమరవీరులపై చేసిన లఘు చిత్రాలను ప్రదర్శించడం జరిగింది. ప్రతి జిల్లా లో ప్రజలు, ముఖ్యంగా యువత ప్రచార వాహనాల వద్దకు వచ్చి వివ రాలు తెలుసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం దాదా పుగా 8 వేల మంది రన్‌లో పాల్గొన్నారు. హైదరాబాద్‌ లోని నెక్లెస్‌ రోడ్డులో నిర్వహించే పోలీస్‌ రన్‌కు సంబంధించి టీషర్ట్‌, మెడల్‌ను ప్రత్యేకంగా తయారు చేయించబడింది. 2 కె, 5 కె, 10 కె రన్‌లో ఈ సంవత్సరం 2 కె రన్‌కు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పరుగు పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి మెడల్‌ ఇవ్వడం జరిగింది. అమరులైన పోలీస్‌ లను గుర్తు చేసుకుంటూ నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది.

పోలీసు అమరవీరుల సంస్మరణ దినం

ప్రతి సంవత్సరం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం హైదరాబాద్‌ గోషామహల్‌లోని పోలీసు మైదానంలో అమరవీరుల స్థూపం వద్ద పుష్పాలతో నివాళులర్పిస్తారు. టిఎస్‌ఎస్‌పి బెటాలిన్‌యలు, రాచకొండ కమిషనరేట్‌, హైదరాబాద్‌ సిటీ ఆర్మ్డ్‌ రిజర్వు, సిటీ సివిల్‌ పోలీసు, హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌ పోలీసు, మౌంటెడ్‌ పోలీసులు కవాతు చేశారు. అమరవీరుల కుటుంబ సంక్షేమానికి ఫ్లాగ్‌ను అమ్మి నిధి సేకరణ చేయడం జరిగింది.

ఈ సంవత్సరం తెలంగాణ పోలీస్‌ శాఖ ప్రత్యేకంగా అమరవీరుల సంస్మరణకి గుర్తుగా రూపొందించిన తపాలా బిళ్ళను, కోవెర్‌ను భారత తపాలా శాఖ సహకారంతో ఆవిష్కరించడం జరిగింది. రెండు నిమిషాల పాటు మౌనం పాటించడమే కాకుండా ప్రాణ త్యాగాలు చేసిన పోలీసు అమర వీరుల పేర్లు చదవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విశ్రాంత డిజిపి లు, పోలీస్‌ కమీషనర్‌లు పాల్గొని నివాళులు అర్పించారు.

అమరవీరుల కుటుంబాలకు చేస్తున్న సంక్షేమ చర్యలు

పోలీసు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోపోయిన వారికీ ఇతర రాష్ట్రాల తో పోలిస్తే కేవలం తెలంగాణ రాష్ట్రంలలో పరిహారం అధికంగా ఇవ్వడం జరుగుతుంది.

భార్య / నియామక కుటుంబ సభ్యునికి కారుణ్య నియామకం మరియు హౌస్‌ సైట్‌ అందించబడుతుంది. అమరవీరుల పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణలో ఉన్న పాఠశాల, కళాశాలలో ఉచిత విద్య అందించబడు తుంది. ఇంజనీరింగ్‌ లో 2% సీట్లు మరియు MBBS / BDS కోర్సులు 0.25% సీట్లు మరణించిన వారి పిల్లల కోసం ప్రత్యేకించబడ్డాయి. అమరవీరుల కుటుంబ సభ్యులకు ఆరోగ్య భద్రత పథకం వర్తింపబడుతుంది

ఫ్లాగ్‌ ఫండ్‌

ఫ్లాగ్‌ ఫండ్‌ లో జమ చేసిన నిధి ద్వారా విధి నిర్వహణ లో అవయవాలు కోల్పోపోయిన వారికీ కృత్రిమ అవయవాలు అమర్చేందుకు అయ్యే ఖర్చు మంజూరు చేయడం, అమరవీరుల/ గాయపడిన పోలీస్‌ సిబ్బంది పిల్లల ఉన్నత చదువుకు స్కాలర్‌ షిప్‌ అందించడం జరుగుతుంది. అంబర్‌పేటలోని పోలీస్‌ బాయ్స్‌ హాస్టల్‌ నిర్వహణకు మంజూరు చేయడం, 2016 అక్టోబర్‌ నుండి సెప్టెంబర్‌ 2017 వరకు ఖర్చు చేసిన వివరాలు

1. విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు పోలీస్‌ కొనిస్టేబుళ్లకు కృత్రిమ అవయవాలకు 9,28,157/- మంజూరు చేయడం జరిగింది.

2. అంబర్‌పేటలోని పోలీస్‌ బాయ్స్‌ హాస్టల్‌ నిర్వహణకు 7,36,441/- ఖర్చు చేయడం జరిగింది.

3. 1,50,000/- నగదు చనిపోయిన ముగ్గురు పోలీస్‌ సిబ్బంది కూతుర్ల వివాహాలకు 50 వేల చొప్పున మంజూరు చేయడం జరిగింది.

పందిరి హర్ష భార్గవి

Other Updates