తెలంగాణ రాష్ట్ర పోలీసుశాఖకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రగతిభవన్‌లో జనవరి 13న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సమీక్ష నిర్వహించారు. సమావేశంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి, హోం శాఖ కార్యదర్శి రాజీవ్‌ త్రివేది, మిషన్‌ భగీరథ వైస్‌ ఛైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి, సీయంవో అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పోలీస్‌శాఖ, పరిశ్రమలశాఖ చాలా మెరుగ్గా పనిచే స్తున్నాయని, వివిధ రాష్ట్రాలనుంచి తెలంగాణకు వస్తున్న పలు వురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు.

రాష్ట్రంలో టీఎస్‌ఐపాస్‌ విధానం ప్రకటించిన తరువాత 2500కు పైగా పరిశ్రమలు నెలకొల్పి ఉత్పత్తి ప్రారంభించడం జరిగిందని, దీనికి ప్రధాన కారణం శాంతి భద్రతలు మెరుగ్గా వుండడమే కారణమని పలువురి అభిప్రాయంగా ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో క్రైమ్‌ రేట్‌ గణనీయంగా తగ్గిందని, అదేవిధంగా నేరం చేసిన వారిపట్ల పోలీసులు మానవతా కోణంలో ఆలోచించి వారిని బాగు చేస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. సమావేశంలో పాల్గొన్న డీజీపీ అనురాగ్‌శర్మ పోలీసుశాఖకు అవసరమైన కానిస్టేబుళ్ల నియామకాలు, ఇతర అంశాలపై ముఖ్యమంత్రికి వివరించారు. ఖాళీగావున్న కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ త్వరితగతిన పూర్తి చేయాలనే అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. శాంతి భద్రతలు మెరుగ్గా వుండడంవల్ల గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఒకరినొకరు పరస్పర గౌరవంతో పలుకరించుకునే సమాజం ఏర్పాటవుతున్నదని సీఎం అన్నారు.

Other Updates