ramanachariబ్రాహ్మణుల సర్వతోముఖాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటు చేస్తూ జనవరి 28న ఉత్తర్వులు జారీచేసింది. ఈ పరిషత్‌ కు ఛైర్మెన్‌ గా రిటైర్డ్‌ ఐ.ఏ.ఎస్‌ అధికారి, ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కె. వి. రమణాచారిని నియమించారు. 17 మంది ప్రముఖులను పరిషత్‌ సభ్యులుగా నియమించారు. పరిషత్‌ వైస్‌ ఛైర్మన్‌గా వనం జ్వాలా నరసింహారావు నియమితులయ్యారు. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి, ఎం.ఎల్‌.సి. పురాణం సతీష్‌, అష్టకాల రామ్మోహన్‌, వి.మృత్యుం జయ శర్మ, చకిలం అనిల్‌ కుమార్‌, జోషి గోపాల శర్మ, భద్రకాళి శేషు, సుమలత శర్మ, సువర్ణ సులోచన, ఎం.వెంకట రమణ శర్మ, రాష్ట్ర ఆర్థిక శాఖ సెక్రటరీ, రాష్ట్ర దేవాదాయ శాఖ సెక్రటరీ సభ్యులుగా ఉన్నారు. పారిశ్రామిక వేత్త సి.ఎల్‌. రాజం ట్రెజరర్‌ గా వ్యవహరిస్తారు. దేవాదాయ శాఖ కమిషనర్‌ మెంబర్‌ సెక్రటరీగా వ్యవహరిస్తారు.

Other Updates