bhagirathaమిషన్‌ భగీరథకు ఆర్థిక సహాయం చేయడానికి మరికొన్ని బ్యాంకులు ముందుకొ చ్చాయి. సెప్టెంబర్‌ 20న సచివాలయంలో పంచాయితీరాజ్‌ స్పెషల్‌ సిఎస్‌, మిషన్‌ భగీరథ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్పీ సింగ్‌ను బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉన్నతాధికారులు వేర్వేరుగా కలిశారు. ముందుగా ఎస్పీ సింగ్‌ను కలిసిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలంగాణ జోనల్‌ మేనేజర్‌ విశ్వనాథ్‌, మిషన్‌ భగీరథకు 2270 కోట్ల ఆర్థిక సహాయం చేయడానికి ఒప్పుకున్నారు. ప్రాజెక్టు స్వరూపం, లక్ష్యాలను విశ్వనాథ్‌కు వివరించిన ఎస్పీ సింగ్‌ దేశంలోని ప్రఖ్యాత ఆర్థిక సంస్థలన్నీ మిషన్‌ భగీరథలో భాగం అయ్యేందుకు ఉత్సాహం చూపుతున్నాయని తెలిపారు. ఇందుకు ప్రభుత్వ విశ్వసనీయతతో పాటు జెట్‌ స్పీడ్‌తో పనులు జరగడమే కారణమని అన్నారు.

కేవలం 9 నెలల్లోనే గజ్వేల్‌ సబ్‌ సెగ్మెంట్‌ పనులను పూర్తిచేసి మిషన్‌ భగీరథ కొత్త చరిత్ర సృష్టించిందన్నారు. మిషన్‌ భగీరథకు లోన్‌ ఇవ్వడం క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లాంటిదే అన్నారు. పారదర్శకమైన ఆర్థిక విధానాలు, ప్రజోపయోగ పథకాలతో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు. విద్యుత్‌ రంగంలో మిగులు, సాగునీటి ప్రాజెక్టులు,మిషన్‌ భగీరథ పూర్తయితే తెలంగాణలో నవశకం మొదలవుతుందన్నారు. ఆర్థిక, సామాజిక రంగాల్లో తెలంగాణ సమాజం అనూహ్యమైన ప్రగతిని సాధిస్తుందని పేర్కొన్నారు. ఆ తర్వాత మాట్లాడిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలంగాణ జోనల్‌ మేనేజర్‌ విశ్వనాథ్‌, సురక్షితమైన మంచినీరు ప్రజల ప్రాథమిక హక్కు అని గుర్తించిన ప్రభుత్వంతో కలిసి పనిచేయడం గర్వంగా ఉందన్నారు. దేశానికే రోల్‌ మోడల్‌ గా నిలిచే మిషన్‌ భగీరథకు రుణసహాయం చేయడం సంతోషంగా ఉందన్నారు. రంగారెడ్డి- శ్రీశైలం సెగ్మెంట్‌ కు 1800 కోట్లు, మహబూబ్‌ నగర్‌ ఎల్లూరుసెగ్మెంట్‌ లోని కల్వకుర్తి-కమ్మదనం- కొడంగల్‌ సబ్‌ సెగ్మెంట్‌ ట్రంక్‌ మేయిన్‌ పనులకు 470 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. మిషన్‌ భగీరథకు రుణసహాయం చేయడాన్ని తాము పుణ్యకార్యంగా భావిస్తున్నామన్నారు. ఆ తర్వాత ఎస్పీ సింగ్‌ తో సమావేశమైన యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌ వెంకటేష్‌, మిషన్‌ భగీరథపై దేశంలో జరుగుతున్న చర్చ తమను విపరీతంగా ఆకర్షించిందన్నారు.అందుకే తమకు తామే 2 వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయానికి ముందుకు వచ్చామన్నారు.

ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించాలన్న ప్రభుత్వ లక్ష్యంతో తమకు భావోద్వేగమైన అనుబంధం ఏర్పడిందన్నారు. ఎంతో ముందుచూపుతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథలో భాగం అయినందుకు సంతోషంగా ఉందన్నారు. బ్యాంకులు ఇచ్చే లోన్‌ కు ప్రభుత్వం గ్యారంటీగా ఉంటుందని ఎస్పీ సింగ్‌ స్పష్టం చేశారు. ఇంతేకాదు అనుకున్న సమయం కంటే ముందుగానే ప్రాజెక్టును పూర్తిచేసి, ఖర్చు తగ్గించుకోవడంతో పాటు ఆర్థిక ప్రయోజనాలు పొందుతామన్నారు. ఈ సమావేశంలో RWS&S ఈ.ఎన్‌.సి సురేందర్‌ రెడ్డి తోపాటు బ్యాంకు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆ మరుసటి రోజు ఆంధ్రాబ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో సురేష్‌ పటేల్‌ సచివాలయంలో ఎస్పీ సింగ్‌ తో సమావేశ మయ్యారు. మిషన్‌ భగీరథకు ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలోని కన్సార్టియం ఇస్తామన్న రుణాలకు సంబంధించిన మంజూరు పత్రాలను అందచేశారు. ఆర్థిక సహాయానికి ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించిన ఆయా బ్యాంకులు, తమ తమ మేనేజ్‌మెంట్‌ కమిటీ సమావేశాల్లో ఇందుకు ఆమోదం తెలిపాయి. త్వరలోనే అగ్రిమెంట్‌ చేసుకుని తొలి విడతగా కొంత మొత్తాన్ని విడుదల చేస్తాయి. ఈ కన్సార్టియంలోని బ్యాంకులు ఇచ్చే రుణాన్ని కరీంనగర్‌ జిల్లాలోని కోరుట్ల, సిరిసిల్ల, పెద్దపల్లి, మంథని-భూపాలపల్లి, LMD కరీంనగర్‌, LMD మానకొండూర్‌తోపాటు వరంగల్‌ జిల్లా లోని గోదావరి మంగపేట సెగ్మెంట్‌లోని మిషన్‌ భగీరథ పనులకు ఉపయోగిస్తారు. కన్సార్టియంలో భాగమైన బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర 1000 కోట్లు, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ 1000 కోట్ల రూపా యల ఆర్థిక సహాయానికి ఇదివరకే సూత్రప్రాయంగా అంగీకరించాయి. త్వర లో జరిగే తమ మేనేజ్‌మెంట్‌ కమిటీ మీటింగ్‌లో దీనికి లాంఛనంగా ఆమోదం తెలుపనున్నాయి.

ఇప్పటికే 632 కోట్ల ఆర్థిక సహాయానికి అంగీకరించిన విజయాబ్యాంకు కూడా లోన్‌ శాంక్షన్‌కు తమ మేనేజ్‌ మెంట్‌ కమిటీ మీటింగ్‌లో ఆమోదం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తామని ఆంధ్రాబ్యాంకు ఎం.డి సురేష్‌ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంతో తమ అనుబంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి భవిష్యత్తులోనూ కలిసి పనిచేస్తామన్నారు. ప్రాజెక్టు డిజైన్‌, టెండర్‌ ప్రక్రియ- బిల్లుల చెల్లింపులోని పారదర్శకత, పదేళ్ల పాటు ప్రాజెక్టు నిర్వహణను వర్క్‌ ఏజెన్సీలకే అప్పగించడంలాంటి అంశాలు తమను ఆకర్షించాయన్నారు. వీటితో పాటు రోజు రోజుకు అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ ప్రభుత్వ పనితీరు దేశంలోని ప్రఖ్యాత ఆర్థిక సంస్థలను ఆకట్టుకుం టుందన్నారు. ఒక ప్రభుత్వ పథకానికి ఆర్థిక సహాయం చేయడానికి బ్యాంకులు ముందుకురావడం శుభపరిణామమని ఎస్పీ సింగ్‌ చెప్పారు. మిగతా బ్యాంకులకు ఆంధ్రాబ్యాంకు మార్గదర్శిగా నిలిచిందని ప్రశంసించారు.

Other Updates