”భిన్న సంస్కృతులు ఎదిగి పూచినపాదు” హైదరాబాదు అన్న అంశానికి నిర్వచనంలాంటి చూడచక్కని జీవితం తొణికిసలాడే చిత్రాలు అనేకం వేసిన, వేస్తున్న వర్ధమాన కళాకారుడు బి. అక్షయ ఆనంద్‌ సింగ్‌.

ఆయన చిత్రాలు ఆయన చుట్టుప్రక్కల సమకాలీన అంశాలు, హైదరాబాద్‌ వాసుల జీవనం – మరీ ముఖ్యంగా ధూల్‌పేటకు, జుమ్మేరాత్‌ బజార్‌కు చెందిన అనేక మంది నిత్యజీవితానికి అద్దం పట్టినట్టు ఉంటాయి. ఈ శ్రేణిలోని చిత్రాలన్నీ కళాత్మకతను ఒడిసిపట్టి డాక్యుమెంట్‌ చేసినట్టు ఉండడం విశేషం. పైగా ఈయన చిత్రాలు హైదరాబాద్‌ జీవన సరళి, ఇక్కడి సంప్రదాయాలు, ఆధునిక సంస్కృతుల సంగ