kcrశ్రీ వచ్చే ఐదేళ్లలో రూ.25 కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి పను
శ్రీ జనాభాను బట్టి ఒక్కో గ్రామానికి రూ.2 నుంచి రూ.6 కోట్లు
శ్రీ చెత్త సేకరణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 25వే సైకిల్‌ రిక్షాలు
శ్రీ సర్పంచ్‌, ఎంపీటీసీి, ఎంపిపి, జడ్పిటీసీ సమక్షంలో గ్రామసభ
శ్రీ గ్రామసభ ద్వారానే గ్రామాభివృద్ధి ప్రణాళిక రచన
శ్రీ పంచాయితీ రాజ్‌ వ్యవస్థకు పూర్వ వైభవమే లక్ష్యం
శ్రీ ఏడు కీలక రంగాలపై ప్రధానంగా దృష్టి
శ్రీ పచ్చదనం – పరిశుభ్రతకే ప్రథమ ప్రాధాన్యం
శ్రీ గంగదేవిపల్లి ఐక్యత – అంకాపూర్‌ వ్యవసాయం
శ్రీ మ్కునూర్‌ సహకారం

ఇప్పటి వరకూ ప్రభుత్వం ప్రవేశపెట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు భిన్నంగా గ్రామజ్యోతి రూపకల్పన జరిగింది. ప్రజలను భాగస్వామ్యం చేయడం… పంచాయితీ రాజ్‌ వ్యవస్థను బలోపేతం చేయడం… గ్రామా అభివృద్ధి కోసం మంజూరయ్యే నిధులు అవసరమైన పనుకోసం ఉపయోగించడం… ప్రజా ప్రతినిధులందరినీ క్రియాశీకం చేయడం… అధికారులు ప్రజలతో మమేకం కావడం… అభివృద్ధి పనుల్లో పూర్తి పారదర్శకత… తదితర లక్ష్యాతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గ్రామజ్యోతి కార్యక్రమాన్ని రూపొందించారు. ఇప్పటి వరకూ ప్రభుత్వ కార్యక్రమాలు అమలవుతున్న తీరుకూ గ్రామ జ్యోతికి చాలా వ్యత్యాసం ఉంది. గతంలో ఓ ప్రభుత్వ కార్యక్రమం వస్తే.. దానికి ఎన్ని నిధులు కేటాయిస్తారు? దాని వల్ల ఎవరు లబ్ది పొందుతారు? అనే విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. దాని వల్ల కార్యక్రమం కొద్ది మందికి మాత్రమే పరిమితమయ్యేది. సమాజంలోని ప్రజందరికీ సంబంధించిన కార్యక్రమం కాదనే అభిప్రాయం ఏర్పడేది. కానీ గ్రామజ్యోతి కార్యక్రమం గ్రామంలోని ప్రజందరికీ సంబంధించినది. ధనిక, పేద అనే తేడా లేదు. అధికారి, ప్రజాప్రతినిధి అనే వ్యత్యాసం లేదు. లింగ, వయో బేధం లేదు. ఇది అందరికీ సంబంధించిన కార్యక్రమం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటల్లోనే చెప్పాంటే సంఘటిత శక్తిలోని బలమేంటో ప్రజలకు తెలియచెప్పడమే గ్రామజ్యోతి లక్ష్యం’.

నిధులపై స్పష్టత – పనుపై ప్రణాళిక

రాబోయే నాలుగేళ్లలో గ్రామానికి వచ్చే నిధులెన్ని? గ్రామానికున్న అవసరాలెన్ని? అనే రెండు అంశాలను ముందు పెట్టుకుని ఏం చేయాలనే విషయంలో ఏకాభిప్రాయానికి రావడమే గ్రామజ్యోతి కార్యక్రమం ద్వారా చేయాల్సిన పని. ఇందుకోసం గ్రామసభలు నిర్వహించుకోవాలి. నిజానికి ప్రతీ గ్రామంలో గ్రామ సభ విధిగా నిర్వహించడం తప్పనిసరి. కానీ గ్రామసభలు ఇప్పుడు మొక్కుబడిగా సాగుతున్నాయి. అలా కాకుండా గ్రామసభలో తీర్మానం చేసిన పనులే చేయానే ఖచ్చితమైన నిబంధన ఈ కార్యక్రమం ద్వారా అమలువుతుంది. 13వ ఆర్థిక సంఘం, 14వ ఆర్థిక సంఘం, ఎస్‌.ఎఫ్‌.సి, తసరి నిధులు, సీవరేజ్‌, ప్రొఫెషన్‌ ట్యాక్స్‌, గ్రామ పంచాయితీకు స్థానికంగా పన్ను ద్వారా వచ్చే ఆదాయం, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌, రాష్ట్ర ప్రణాళిక ద్వారా వచ్చే నిధులు… ఇవన్నీ కులుపుకుని వచ్చే ఐదేళ్లలో గ్రామా అభివృద్ధి కోసం 21వేల కోట్ల రూపాయలకు పైగా సమకూరుతాయి. ప్రభుత్వం కూడా వచ్చే నాలుగేళ్లలో ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలు చొప్పున గ్రామజ్యోతికి కేటాయిస్తుంది. మొత్తం రూ.25 వేల కోట్లు సమకూరుతాయి. వీటిలో జనాభాను బట్టి ఏ గ్రామానికి ఎన్ని నిధులు వస్తాయో కూడా తెలుస్తూంది తెలుస్తుంది. ఆ లెక్కు కూడా గ్రామ సభ ముందుంటాయి. గ్రామస్తుంతా గ్రామసభలో కూర్చుంటారు కాబట్టి గ్రామానికి ఏ అవసర్లుంటాయో కూడా అందరి సమక్షంలోనే చర్చ జరుగుతుంది. అందరికీ అవసరమైన పను ప్రణాళిక రూపొందుతుంది. వచ్చే నిధులెన్నో తొస్తాయి కాబట్టి, ఆ డబ్బుతో ఏఏ పనులు చేయాలనే విషయంలో కూడా స్పష్టత వస్తుంది. గతంలో కూడా ఈ నిధున్నీ ఖర్చయిపోయేవి. కానీ ఎవరేం చేస్తున్నారో అర్థం కాని స్థితి ఉండేది. ఇన్ని వేల కోట్లు ఖర్చయినా, గ్రామా అవసరాలు తీరకపోయేది. గ్రామాల్లో ప్రజల ఆస్తులు సృష్టి జరగకపోయేది. డబ్బు ఖర్చయినప్పటికీ గ్రామాల్లో చూడడానికి అభివృద్ధి కనిపించకపోయేది. ఏ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలా ఖర్చవుతున్నాయి? అనే విషయాలు చాలా వరకు గోప్యంగా ఉండడం వల్ల పారదర్శకత లోపించేది. వీటన్నింటికీ సమాధానంగానే గ్రామ సభలోనే గ్రామ ప్రణాళికు తయారు కావాలని ప్రభుత్వం కోరుకుంటున్నది.

మన ఊరు ప్రణాళికకు రెండో దశ

వాస్తవానికి కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మనఊరు మన ప్రణాళిక పేరుతో గ్రామా అభివృద్ధి పనుకోసం ప్రణాళిక తయారైంది. కానీ అప్పుడు గ్రామాకు ఎన్ని నిధులు అందుబాటులో ఉన్నాయనే విషయంలో స్పష్టత లేదు. ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేస్తున్నది? ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఏ కార్యక్రమాలు రూపొందిస్తున్నది? గ్రామ స్థాయిలో ఏ పను కోసం ప్రణాళిక వేసుకోవాలి? అనే విషయంలో స్పష్టత లేదు. మన ఊరు మన ప్రణాళిక తయారైనప్పుడు చాలా గ్రామాల్లో మంచినీటి ట్యాంకు కావాలని, పైపులు కావాలని, చెరువు బాగు చేయాని, సాగునీటి కల్వువ తవ్వాని, పాఠశాలను అప్‌ గ్రేడ్‌ చేయాలని కోరుకున్నారు. వీటిలో చాలా వరకు ప్రభుత్వమే రాష్ట్రస్థాయిలో ప్రణాళికు సిద్ధం చేసి, నిధులు సమకూర్చి చేస్తున్నది. ఇంటింటికీ మంచినీళ్లు అందించే కార్యక్రమం ప్రభుత్వమే చేస్తున్నది. ప్రభుత్వమే చెరువులను పునరుద్ధరిస్తున్నది. రహదారు నిర్మాణం కూడా ప్రభుత్వ నిధుతోనే జరిగిపోతున్నది. ఇవన్నీ పను పోగా స్థానిక అవసరాకోసం మాత్రమే ఇప్పుడు ప్రణాళికు వేసుకోవాలి. కాబట్టి మన ఊరు మన ప్రణాళికలో ముందుకు వచ్చిన పనుల్లో ప్రభుత్వం చేపట్టిన పను మినహాయించుకుని, వచ్చే నిధులతో స్థానిక అవసరాలు గట్టెక్కించే పను కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవడం గ్రామజ్యోతిలోని ప్రధానాంశం.

శాఖ మధ్య సమన్వయం

గ్రామ స్థాయిలో అనేక ప్రభుత్వ శాఖలు పనిచేస్తున్నాయి. వారంతా ఎవరికి వారే అన్నట్లుగా ఉంది. ఇప్పుడు గ్రామసభకు అందరూ జవాబుదారులే. గ్రామ ప్రజలు వేసిన ప్రణాళిక ప్రకారమే అధికారులు, ఉద్యోగుంతా పనిచేయాల్సి ఉంటుంది. గ్రామ సర్పంచ్‌ తో పాటు, ఎంపిటిసి, ఎంపిపి, జడ్‌.పి.టి.సి. లాంటి స్థానిక ప్రజాప్రతినిధు కూడా గ్రామస్థు, అధికారుతో మమేకమై పనులు చేపిస్తారు. కాబట్టి ప్రభుత్వ శాఖ ఎవరికి వారే అన్నట్లుగా కాకుండా, అందరూ సమన్వయంతో పనిచేస్తారు.

పంచాయితీ రాజ్‌ వ్యవస్థకు పూర్వవైభవం

పల్లెలే దేశానికి పట్టుగొమ్ములు అని మహాత్మాగాంధి అనే వారు. భారతదేశం గ్రామాల్లోనే నివసిస్తున్నది, గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి అని చెప్పేవారు. ఆయన ఆలోచనకు అనుగుణంగా, దేశ మొదటి కమ్యూనిటీ డెవప్‌ మెంట్‌ మంత్రి ఎస్‌.కె. డే చొరవ వల్ల దేశంలో పంచాయితీ రాజ్‌ వ్యవస్థ పుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థను బలోపేతం చేసి, గ్రామీణ స్థాయిలోనే నిర్ణయాలు తీసుకోవాన్నది పంచాయితీ రాజ్‌ వ్యవస్థలోని ముఖ్య అంశం. అయితే పంచాయితీ రాజ్‌ వ్యవస్థ ఉద్యమంగా ప్రారంభమయినా తర్వాత ప్రభుత్వాలు అధికారులను, నిధులును తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఫలితంగా పంచాయితీరాజ్‌ సంస్థు నిర్వీర్యం అయిపోయాయి. నిధులు, విధులు, బాధ్యతు కూడా సరిగ్గా తెలియని దుస్థితి నెలకొంది. రాష్ట్ర స్థాయిలోనే నిర్ణయాలు జరిగి, రాష్ట్ర స్థాయిలోనే నిధులు విడుదయి ఖర్చయిపోయేవి. స్థానిక ప్రజలు, స్థానిక సంస్థ ప్రమేయం లేకుండానే అంతా జరిగిపోయేది. నిజానికి ఏ గ్రామానికి ఏమి కావాలనే విషయం హైదరాబాద్ లోను, ఢల్లీిలోనో కూర్చునే వారికన్నా గ్రామాల్లో ఉండే వారికే ఎక్కువ తెలుస్తుంది. కానీ వారి ప్రమేయం మాత్రం లేదు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చి ప్రజల భాగస్వామ్యంతో పంచాయితీ రాజ్‌ వ్యవస్థకు పూర్వ వైభవం తేవడమే ధ్యేయంగా గ్రామజ్యోతి ముందుకు వచ్చింది. పాన పై నుంచి కిందికి కాకుండా కింది నుంచి పైకి జరగాన్నదే ఉద్దేశ్యం.

ఏడు ప్రాధాన్యతాంశాపై గ్రామసభలో నిర్ణయాలు

గ్రామజ్యోతి కార్యక్రమాన్ని పట్టి నడిపించేది గ్రామసభ మాత్రమే. గ్రామసభలో చేసిన తీర్మానాలే కీకం. వాటి ప్రకారమే పను జరగాలి. ఏ గ్రామం ఆ గ్రామానికి అవసరమైన ప్రణాళికు తయారు చేసుకుంటూనే ఏడు ప్రధాన అంశాపై దృష్టి పెట్టాని అధికారులు మార్గదర్శకాలు రూపొందించారు.

1. పారిశుద్ధ్యం – మంచినీరు.
2. ఆరోగ్యం -పోషకాహారం.
3. విద్య
4. సామాజిక భద్రత – పేదరిక నిర్మూన.
5. సహజ వనరు నిర్వహణ
6. వ్యవసాయం.
7. మౌలిక వసతులు

మార్పు సాధకు (ఛేంజ్‌ ఏజెంట్స్‌) కీకం

అభివృద్ధి కార్యక్రమా అమలు పట్ల, ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి, అంకితభావం కలిగిన అధికారును గ్రామజ్యోతి మార్పు సాధనకుగా ప్రభుత్వం నియమించింది. ప్రతీ మండలానికి ఒకరు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 438 మందిని నియమించారు. ప్రభుత్వ ఉద్దేశ్యాను, లక్ష్యాను గ్రామాల్లో తెలియచేయడంతో పాటు, ప్రజను చైతన్య పరిచి సమిష్టి కృషితో గ్రామా అభివృద్ది చేసుకోవాలనే ఆలోచనను రేకెత్తించడం మార్పు సాధనకు పని. మార్పు సాధనకుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌ లో సమావేశం జరిపి తగు సూచను, సహాలు చేశారు. మార్పు సాధనకు కూడా ఉత్సాహంగా విధులు నిర్వహిస్తున్నారు. మండ స్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖ మధ్య సమన్వయం కుదర్చడం, గ్రామ ప్రణాళిలకు సరిగ్గా అమయ్యేలా చూడడం, గ్రామా ఇంచార్జిుగా నియామకమైన స్పెషల్‌ ఆఫీసర్లు, గ్రామాలను దత్తత తీసుకున్న ముఖ్య ప్రజాప్రతినిధులు, ముఖ్య అధికారుతో ఎప్పటికప్పుడు చర్చించి, కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూడడం లాంటి విధు మార్పు సాధకుకున్నాయి.

ప్రత్యేక అధికారులు

మండలానికొక మార్పు సాధకుడున్నట్లే.. గ్రామానికో ప్రత్యేక అధికారిని కూడా ప్రభుత్వం నియమించింది. గ్రామసభను నిర్వహించడం, గ్రామానికి వచ్చే నిధుకు సంబంధించిన సమాచారం గ్రామస్తుకు తెపడం, మండ స్థాయి అధికారుతో సమన్వయం చేసుకోవడం, మొత్తంగా గ్రామసభలో రూపొందిన ప్రణాళికకు అనుగుణంగా పను జరిగేలా చూడడం ప్రత్యేక అధికారి బాధ్యత.

గ్రామ దత్తత కార్యక్రమం

గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా ముఖ్యమైన ప్రజాప్రతినిధు, అధికారులు తలా ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఎమ్మెల్యే, ఎంపి, మంత్రి, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్‌ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అలాగే కలెక్టర్‌, ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామజ్యోతిని అమలు చేయపూనుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని చిన్నమ్కునూర్‌ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. తాము దత్తత తీసుకున్న గ్రామాల్లో ప్రజలను సంఘటిత పరిచి, చైతన్యవంతులను చేసి గ్రామాభ్యున్నతిలో వారిని భాగస్వామును చేయడం లక్ష్యం. వారే ప్రేరకుగా వ్యవహరించి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడం ద్వారా మిగతా గ్రామాలకు కూడా ఓ పద్ధతి నేర్పాన్నది ప్రభుత్వ ఉద్దేశం.

పచ్చదనం – పారిశుద్యం మొదటి సవాల్‌ ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా మురికి ఎక్కువగా ఉంటుంది. ఎవరింటిని వారు శుభ్రంగానే ఉంచుకుం టున్నప్పటికీ గ్రామ మంతా శుభ్రంగా ఉండాలనే ఆలోచన చేయడం లేదు. అందుకే ముందు గ్రామజ్యోతిలో భాగంగా గ్రామస్తుంతా కలిసి తమ గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకునే పని మొదులు పెట్టాని ప్రభుత్వం కోరుతున్నది. ఇది నిధుకు సంబంధించిన అంశం కాదు. ప్రజల్లో తమ ఊరును బాగు చేసుకోవాలనే కాంక్షను రగిలించే కార్యక్రమం. మురికి కాల్వలు శుభ్రం చేయడం, మురికి తుమ్మను, పిచ్చి చెట్లను తొగించడం, రోడ్లపై చెత్త లేకుండా చేయడం, ఏ గ్రామానికి ఆ గ్రామం చెత్త సేకరణకు, విసర్జనకు ఓ మార్గం కనిపెట్టడం ముఖ్యాంశాలు. ప్రతీ గ్రామంలో చెత్త వేయడానికి కావాల్సిన డంప్‌ యార్డును సిద్ధం చేసుకోవాలి. మురికి నీటిని నీటిలో పాతరేయడానికి సోక్‌ ట్యాంకు నిర్మించాలి. పారిశుధ్యంతో పాటు ఊరంతా పచ్చగా కలకలాడేందుకు తెలంగాణకు హరిత హారం కార్యక్రమం కూడా ప్రజలు స్వచ్ఛందంగా నిర్వహించాలి. నర్సరీ ద్వారా ఇప్పటికే ప్రభుత్వం కోట్లాది మొక్కులుఅందుబాటులో ఉంచింది. స్థానికంగానే మొక్కులు లభిస్తున్నాయి. వాటిని నాటి, సంరక్షించే బాధ్యత ప్రజలు తీసుకోవాలి. తమ గ్రామాన్ని పచ్చగా, పరిశుభ్రంగా మార్చుకోవాలి. ఈ రెండు విషయాల్లో విజయం సాధిస్తే మిగతా పనులన్నీ చాలా తేలిక గా చేసుకోవచ్చు. చెత్త సేకరణను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కూడా తన బాధ్యతగా ప్రతీ గ్రామానికి మూడు చక్రా సైకిల్‌ రిక్షాలు అందిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 25 వే సైకిల్‌ రిక్షాలు అవసరం అని నిర్ణయించి, ఆర్డర్‌ కూడా ఇచ్చింది. త్వరలోనే ఈ రిక్షాలు గ్రామాకు చేరతాయి.

ఆ మూడు గ్రామాలే ఆదర్శం

తెలంగాణలో పంచాయితీ రాజ్‌ వ్యవస్థకు పూర్వ వైభవం తేవాలని, వ్యవసాయం బాగుపడాని, సహకార స్పూర్తి అందరిలో రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాగా కోరుకుంటున్నారు. గ్రామాల్లో మార్పు సాధించడానికి ఎక్కడికో పోయి నేర్చుకోవాల్సిన పనికూడా లేదు. మన రాష్ట్రంలోనే మూడు గ్రామాలు మూడు విషయాల్లో పాఠాలు నేర్పుతున్నాయి. ప్రజలందరూ ఐకమత్యంతో ఉండి గ్రామాలన్ని అభివృద్ధి చేసుకున్న వరంగల్‌ జిల్లా గంగదేవిపల్లి పంచాయితీ రాజ్‌ స్పూర్తికి నిలువుటద్దం. అందుకే ముఖ్యమంత్రి కూడా ఈ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ఆగస్టు 17న అదే గ్రామంలో ప్రారంభించారు. లాభసాటి వ్యవసాయానికి నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ ఆదర్శం. తెలంగాణలోని రైతుంతా ధనవంతులు కావాంటే, వ్యవసాయం లాభసాటిగా మారాంటే ఏం చేయాలనే దానికి అంకాపూర్‌ ఓ మార్గం చూపిస్తుంది. కాబట్టి ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంది. ఇక రైతు పరస్పరం సహకరించుకోవడం వల్ల కలిగే లాభాలేంటో కరీంనగర్‌ జిల్లా మ్కునూర్‌ చేసి చూపెట్టింది. ఈ మూడు గ్రామాలాగానే తెలంగాణ పల్లెన్నీ వికసించాని, చీకట్లను పారద్రోలాని ప్రభుత్వం గ్రామజ్యోతిని వెలిగించింది. ప్రజలు సంఘటితమై, చైతన్యవంతమై ఈ గ్రామజ్యోతి మెగు పంచుకోవాలి.

Other Updates