cmబీసీ కులాల సంక్షేమంకోసం బడ్జెట్‌లో టాేయించిన నిధులు రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఉపయోగపడాలని, సంపద సృష్టి జరగాలని, ఆ సంపద పేదవాళ్లకు పంపిణీ కావాలని ముఖ్యమంత్రి . చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. బడ్జెట్లో బిసి కులాల అభ్యున్నతికి, కుల వృత్తులను కాపాడడానికి గతంలో ఎన్నడూలేనివిధంగా ఎక్కువ మొత్తంలో నిధులు టాేయించినందుకు పలు బిసి సంఘాల వారు మార్చి 13న ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రిని కలిశారు. ఎంబిసి సంఘం నాయకులు, దాదాపు 10 కుల సంఘాల ప్రతినిధులు వందల సంఖ్యలో ప్రగతిభవన్‌కు తరలివచ్చి సీఎంను కలిశారు.

అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కుల వృత్తులను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకోవడానికి పెద్ద ఎత్తున నిధులు టాేయించినందుకు వారంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా, భారతదేశ చరిత్రలో మొదటిసారిగా బిసి కులాలకు ప్రత్యేకంగా నిధులు టాేయించడంతో బిసి సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రికి శాలువా కప్పి, జ్ఞాపికలు బహూకరించి, స్వీట్లు తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు.

తెలంగాణలో 50శాతానికి పైగా బిసి కులాల వారున్నారు. చేపలు పట్టి జీవించే వారు, గొర్రెలు మేపి బతివాేరి సంఖ్య ఎక్కువ. ప్రతీ బిసి కులం ూడా ఏదో ఒక పనిచేసి బతుకుతున్నది. వీరిలో ఎక్కువమంది పేదరికం అనుభవిస్తున్నారు. కొన్ని కుల వృత్తులు ఇంకా సజీవంగా ఉన్నాయి. చేపల పెంపకం, గొర్రెల పెంపకం, రజక వృత్తి, నాయీ బ్రాహ్మణ వృత్తి లాంటివి ఉన్నాయి. వాటిని సంప్రదాయ పద్ధతిలోనే కొనసాగించవచ్చు. కొంత ఆధునీకరించుకోవచ్చు. కొన్ని కుల వృత్తులు నశించాయి. వాటిమీద ఆధారపడిన వారి జీవితాలు విచ్ఛిన్నమయ్యాయి. ప్రత్యామ్నాయ వృత్తి చేసుకోవడానికి పెట్టుబడిలేని పరిస్థితి. ఇలాంటి వారందరి జీవితాల్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకున్నది. వారందరి సమస్యలు మాకు తెలుసు. పరిష్కారం చూపడానికి నిధులు టాేయించాం.

ఏ కులానికి ఆ కులం ూర్చుని తమకు ఏం కావాలనే విషయంలో స్పష్టతకు రావాలి. పెద్ద ఎత్తున గొర్రెలు, చేపల పెంపకం చేపడతాం. నాలుగు లక్షల కుటుంబాలకు గొర్రెలు కొనిస్తాం. జలాశయాల్లో పెద్ద ఎత్తున చేపల పెంపకం చేపడతాం. గ్రామాల్లో, పట్టణాల్లో నవీన క్షౌరశాలలు ఏర్పాటు చేస్తాం. రజక వృత్తిని ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుం టాం. విశ్వబ్రాహ్మణులకోసం ఏం చేయాలనే విషయాన్ని ూడా వారే నిర్ణయించుకుని చెబితే కార్యక్రమాలు రూపొందిస్తాం. ఆయా వృత్తులు ఆధునీకరించే క్రమంలో కులాల ప్రతినిధులను ప్రభుత్వం ఖర్చుతో ఇతర రాషా్టలు, దేశాలకు అధ్యయనం కోసం పంపుతాం. బిసిలు, కుల వృత్తులు పెద్ద ఎత్తున వృద్ధిలోకి రావాలి. అప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అవుతుంది. ఇది అంతిమంగా రాష్ట్ర ప్రగతికి దోహదపడుతుంది.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని నేడు పేదలు, గ్రామీణ ప్రాంతాల్లోని కుల వృత్తులవారి అభివృద్ధిలో చూస్తున్నాను. కాయకష్టాన్ని నమ్ముకుని బతి ప్రతీ ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఉన్న వృత్తిని కాపాడి ప్రోత్సహిస్తాం. ప్రత్యామ్నాయ వృత్తులకోసం పెట్టుబడి సమూరుస్తాం. బ్యాంకులతో లింకు లేకుండానే చాలావరకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాలు రూపొందిస్తాం అని ముఖ్యమంత్రి సీేఆర్‌ ఆయా కుల సంఘాల ప్రతినిధులందరికీ స్పష్టంచేశారు.

అత్యంత వెనుకబడిన కులాల (ఎంబిసి)లో అనేక కులాలున్నాయి. వీరిలో కొన్ని కులాలకు వృత్తి ఉంది. మరికొందరికి లేదు. ఎవరికి ఏం చేస్తే బాగుంటుందో ఎంబిసి నాయకులే సూచించాలి. త్వరలోనే సమావేశమై ఎవరికి ఏం కావాలనే విషయాన్ని నిర్ణయించుకోండి. ఈ బడ్జెట్లో ఎంబిసిలకు వెయ్యి కోట్లు టాేయించాం. ఇది తొలి అడుగు. ఇంకా చాలా చర్యలు తీసుకుందాం. ప్రభుత్వం పెట్టిన ప్రతీ రూపాయి పేదవారికి ఉపయోగపడాలి. మరిన్ని నిధులు టాేయించడానికి ూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని సీఎం అన్నారు.

గతంలో ఎందరో ముఖ్యమంత్రులను, నాయకులను కలి సినా ఎంబిసిలను పట్టించుకోలేదని, తమను పిలిచి సమస్యలు పరిష్కరించిన ముఖ్యమంత్రి సీేఆర్‌ అని ఎంబిసిల సంఘం నాయకులు కాళప్ప, సూర్యారావు అన్నారు. బడ్జెట్లో నిధులు టాేయించడంతోనే తాము సంతోషపడడం లేదని, ఆ డబ్బులు సంపూర్ణంగా వినియోగమై బిసి కులాల్లో నిజమైన మార్పు వచ్చినప్పుడే తమకు తృప్తి ఉంటుందని సీఎం అన్నారు.

ఎంబిసి సంఘం అధ్యక్షుడు జెసి కాళప్ప, ప్రధాన కార్యదర్శి సూర్యారావు సంగం, నాయకులు ప్రేవ్‌ులాల్‌, పెండ్యాల చంద్రమోహన్‌ మేరు, ఎత్తరి అంతయ్య, పల్లె సత్యం వంశరాజు, డాక్టర్స్‌ ఓర్సు కృష్ణయ్య, మల్లిఖార్జున్‌ అడ్కి, మల్లెల ఉషారాణి, రాజేశ్వర్‌, శంకర్‌జీ, ముదిరాజ్‌ సంఘం నాయకులు డాక్టర్‌ బండా ప్రకాష్‌, చొప్పరి శంకర్‌, పల్లెబోయిన అశోక్‌, ప్రొఫెసర్‌ నీలా రాములు, రజక సంఘం నాయకులు భిక్షపతి తదితరులు, కుర్మ సంఘం నాయకులు, యాదవ సంఘం నాయకులు, ప్రతినిధులు, నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు, విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు కలిశారు.ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ఎంపీ బాల్క సుమన్‌, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తదితరులు ూడా వెంట ఉన్నారు.

Other Updates