sai1సమ్ముదమంది చూచిరి భృశంబుగ భూజనులెల్లబ్రహ్మతే

జమ్మును రాజతేజమును సద్బహుభూషణరత్న రాజితే

జమ్మును విస్తరించుచు నిజద్యుతి యొప్పగ మూర్తమైనధ

ర్మమ్మును బోలెనున్న గుణమండితుదీక్షితు ధర్మనందనున్‌

(సభా-1-290)

ధర్మరాజు రాజసూయమనే యాగాన్ని నిర్వహించే సమయంలో ఆయన రూపం ఎట్లావున్నదో జపహోమము తత్పరుడైన నన్నయ మనకు ప్రత్యక్షం చేసినారు. ఇదే తీరు అన్నివిధాలా అట్లేవున్న మన ముఖ్యమంత్రి అయుత చండీయాగదీక్షామూర్తిని కూడా మనం ఈ పద్యంలో – చివరన

‘చంద్రశేఖరున్‌’ అని మార్చుకుంటే సరిపడుతుంది.

చంద్రశేఖరరావుకి ఎందరో పెద్దల ఆశీస్సులున్నాయి.
”రుషీణాంపునరాద్యానాం వాచమర్ధోను ధావతి’ అనే సూక్తి ఫలం వీరియందు నిండుకున్నందుననే ఎవరూ ఊహించని-తలపెట్టని అద్భుతమూ అపురూపమైన అయుత చండీయాగం’ అనే మహాక్రతువును 2015 డిసెంబరు 23-27 తేదీ వరకు నాటి మెదక్‌ జిల్లాలోని ఒక విశేష స్థలంలో నిర్వహించి ‘కలౌ చండీ విశిష్యతే’ అనే సూక్తికి సార్థకత కల్పించటం- చిరస్థాయిగా నిలిచింది. ఆ యాగం పండితులు-ఏర్పాట్లు మొదలైన వాటిని మళ్లీ తెల్పటం పునరుక్త దోషమవుతుంది. అయితే చంద్రశేఖరరావు ఈ యాగాన్ని న్విహించటం మన కొరకో మన కుటుంబం కొరకో కాదు. భవిష్యత్తులో తాను ప్రజల నిమిత్తం చేయదలచిన సత్కార్యపరంపరలు ఏ మాత్రం విఘ్నం లేకుండా జరిగి ‘సర్వే జనా: సుఖినోభవంతు’ అనే సూక్తి అక్షరాలా నిజం కావాలనే దీక్షా దక్షతతో అనితరసాధ్యమైన ఈ యాగాన్ని నిర్వహించడంవల్లనే-యజ్ఞఫలం. వేదమూర్తుల ఆశీ: ఫలం-యాగ దర్శనార్థం వచ్చిన అశేషజనుల దీవెనలు- వెరసి ఈనాడు ఇట్లా మన తెలంగాణం అన్నిటా ఆదర్శమై మూర్తమైన ధర్మ రాష్ట్రంగా ప్రఖ్యాతి చెందింది.

ఒకనాడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంటు, నీరు. విద్య మొదలైనవి లేకుండా పోతయి. కరువులో వుంటారని ఏకరువుపెట్టిన ఆంధ్రా పాలకుల దిమ్మతిరిగే విధంగా మిగులు కరెంటు. నీరు-విద్య మొదలైన వాటికి ఆదర్శంగా నిలిచిన మన రాష్ట్రానికి నాయకత్వం వహించిన చంద్రశేఖరరావు మేధావద సాధారణ ఊహా విశేషాలే కారణం కదా! లేకుంటే-బీద బిక్కి జనాలు తమ సంతాన వివాహానికి ఎంత బాధపడేవారో గమనించి అట్టడుగువర్గాల వారికి కళ్యాణలక్ష్మి ద్వారా నేరుగా ధనసాయం చేయడం ఎవరికీ తట్టని గొప్పపని. దీనివల్ల ఎందరెందరో లబ్ధి పొంది ముఖ్యమంత్రిని తల్చుకోవడం ఆయన దీనజనోద్ధరణయత్నానికి ఒక నిదర్శనం. దీనితోపాటు క్రైస్తవ సోదర సోదరీమణులకు వారి విశేషమైన పండుగల్లో చక్కని వస్త్రాలను సరఫరా చేస్తూ, వారి ప్రార్థనా స్థలాల అభివృద్ధికి ఎంతో తోడ్పడడం మన ముఖ్యమంత్రి విశాల దృక్పథానికి ప్రతీక. అయితే రాష్ట్రవ్యాప్తంగావున్న ఎందరెందరో పేద ముస్లిం కుటుంబాల వారికి కూడా ‘షాదీ’ నిమిత్తం ధనసాయం చేయడం. ఈ వర్గంవారికి చెందిన అనేకానేక సమస్యలు పరిష్కరించి- మైనారిటీ కమిషన్‌ ఏర్పాటు చేసి, ఆ వర్గం వారికి రిజర్వేషన్‌ సౌకర్యం కల్పిం చిన ఘనత కేవలం మన తెలంగాణ ముఖ్యమంత్రి సుదీర్ఘ దృష్టి విశేషంగా భావించటం సహృదయ లక్షణం. ఇవన్నీ ఇట్లావుంటే మన రాష్ట్రంలో ఎంతో బాధపడే చేపల పెంపకందార్లను, గొర్రెల, మేకల పెంపకం చేసే వారిని ఆదుకున్న తీరు చూస్తే తలలు పండిన రాజనీతిజ్ఞులే ఖంగుతింటున్నారు. అయితే వీటన్నిటినీ మించిన స్కీముల్లో మొదట లెక్కింపదగింది ‘మిషన్‌ కాకతీయ’ ఈపేరులోనే దాని చరిత్ర తెలుస్తుంది. ఎప్పుడో కాకతీయ రాజులు వేయించిన గొలుసుకట్టు చెర్వులు నేడు నామమాత్రావశేషంగా బిక్కుమంటూ కన్పడుతుంటే వాటిని ఉద్ధరించి త్రవ్వుకువచ్చే మట్టిని రైతుల పొలాల్లో చేర్చు కొని చెరువులను పూడిక తీయడంవలన అవన్నీ నేడు జలకళతో నిండుకుండ లవలె శోభాయమానంగా వుంటూ అక్కడి రైతుల ముఖాలపైన చెరగని చిరు నవ్వు కన్పించడానికి- నిరంతరం తమ భూములు సస్యశామలోపేతం కావడా నికి కారణమైన తెలంగాణ రథసారధిని స్మరించని వారెవరైనా వున్నారా!

sai3మన సృష్టియే జలంనుండి జరిగిందని పెద్దల వ్రాత-జీవనంలో అతి ముఖ్యం నీరు. ఈ నీటి కొరకు ఎన్ని యుద్ధాలు-ఎన్ని అలజడులు జరుగుతున్నాయో మనకు తెల్సు. అందుకోసమే ఆ చరిత్ర మనకు రావద్దని ఏర్పాటు చేసిందో గొప్పనైన ‘మిషన్‌ భగీరథ’ ఎంత మంచి పేరు, ఎవరైనా ఒక పనిని సాధిస్తే ‘భగీరథ ప్రయత్నం’ అంటారు. ఆనాడు భగీరథుడు దివిజగంగను భువికి దించితే ఈనాడు మన భువిలో ఎక్కడెక్కడోవున్న నదీనదాల జలాలను అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో కొండలు-గుహలు- అడవులుదాటి ప్రతి వూరికి, ప్రతి ఇంటి ముంగిటికి మన భగీరథుడు ప్రత్యక్షం కావడం ఒక విధంగా పున:సృష్టి చేసిన మరొక లోకమా అనే భ్రమకు ఆస్కారమైన కాకతీయ, భగీరథ స్కీములు. శాశ్వతమైన స్కీములు.

ఈనాడు పల్లెలు పచ్చబడి-పట్నాలవలస తగ్గటానికి ఈ రెండు ప్రయత్నాలు మాత్రమే ముఖ్యమైనాయి. ఇక విద్యారంగం ఎంతో విస్తరిస్తు న్నది. ప్రతి పల్లె ప్రతి శిశువు విద్యాగంధంతో రాణించే దశ మన ప్రభుత్వం చిత్తశుద్ధికి అక్షరయాగానికికొక నిదర్శనం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మన దేవాలయాలు వాటి నిర్వహణ ఒక గాడిలో పడినాయి. యాదగిరిగుట్ట, వేములవాడ వంటి ప్రాచీన క్షేత్రాల పునరుద్ధరణ తీరు ఆశ్చర్యాతీతంగా మారింది గదా! ఇది ఒక విధాత వింత సృష్టి. దేవాలయ అర్చకులు తమ దీనదశను విస్మరించేటట్టు వారికొక సంస్థను ఏర్పాటుచేసి, సక్రమంగా జీతభత్యాలు వచ్చేటట్టుచేసి వారిని స్వామి సన్నిధిలో త్రికాలాల్లోనూ ‘లోకాస్సమస్తా స్సుఖినోభవంతు’ అనేటట్లు చేసిన చిత్తశుద్ధిగల ముఖ్యమంత్రి వేద సంస్కృత విద్యలను ఆయా రంగాల్లో కృషి చేసిన పెద్దలను సమాదరించడం, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పరచి కోట్లకొద్ది బడ్జెట్‌ను ఇచ్చి నిర్వహణ నిమిత్తం సమర్థులైన అధికారులను నియమించడం చంద్రశేఖరరావు రాజనీతి విశేషమునకొక నిదర్శనం. ఇట్లే మరికొన్ని సంక్షేమ సంఘాలు, వాటి నిర్వహణ మొదలైనవి ముఖ్యమంత్రి మస్తిష్క విశేష ఫలాలు.

కిరాతార్జునీయంలో – ఒకసందర్భంలో-

సకింసఖా సాధునశాస్తియోధిపం

హితాన్నయ: సంశ్శ్రుణుతే సకిం ప్రభుః అంటాడు.

రాజసఖుడైనవాడు హితోక్తులతో రాజును శాసించవలెను. తన హితాన్నికోరి చెప్పే విషయాలను రాజు గ్రహించవలెను. లేకుంటే ఆ రాజు రాజేనా? అని తెల్పినదాంట్లో మన ముఖ్యమంత్రి హితవర్గం సన్నిహితవర్గం శుక్రనీతిమంతం. కాబట్టి ‘ము.మ’గారు వారు చెప్పిన దాన్ని గ్రహించి అనుష్ఠించటం ఆయన సహృదయతకొక నిదర్శనం. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ మూడు సంవత్సరాల్లో ముదమందే విషయా లు ఎన్నో వున్నాయి. వీటన్నిటికీ కూడా ‘సర్వముతానెయై నవాడెవ్వడూ’ ఆ చంద్రశేఖరరాయ ముఖ్యఆమాత్యులను మనం నిరంతరం

కాలేవర్షము పర్జన్య:/ పృథివీ సస్యశాలినీ

లోకోయంక్షోభరహిత:-అని కోరుదాం. అందుకే ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ సూక్తి త్రికాలములలోనూ ఫలించుగాక.

Other Updates