harishమార్కెటింగ్‌ శాఖ అధికారులతో మంత్రి హరీష్‌ రావు వివిధ అంశాల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్‌ డైరెక్టర్‌ శరత్‌, అడిషనల్‌ డైరెక్టర్‌ లక్ష్మి బాయి, హార్టికల్చర్‌ డైరెక్టర్‌ వెంకట్‌ రామిరెడ్డి, ఎస్‌ ఇ మార్కెటింగ్‌ నాగేశ్వర్‌ రెడ్డి, అధికారి సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మొదటి దశలొ 128 గోడౌన్లను 411 కోట్లతో 6.85 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యంతో, రెండో దశలో 202 గోడౌన్స్‌ 613.50 కోట్లతో 10.22 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యం గల గోడౌన్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నాబార్డ్‌ వారి సౌజన్యంతో నిర్మిస్తున్న గోడౌన్ల ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు మంత్రి హరీష్‌ రావు. జిల్లాల వారిగావాటి ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. గోడౌన్ల నిర్మాణంలో అందరికంటే మంచి ప్రతిభ కనబర్చిన నల్లగొండ జిల్లా ఇంజనీరింగ్‌ అధికారులను అభినందించారు. అలాగే మహబూబ్‌ నగర్‌ జిల్లా అన్ని జిల్లాల కంటే వెనుకంజలో ఉండటంపైన మంత్రి సీరియాస్‌ అయ్యారు. పని తీరు మార్చుకోవాలని హితవు పలికారు. మంజూరు అయిన గోడౌన్ల నిర్మాణానికి స్ధలాలు చూపించని వారు రెండు వారాల్లో స్ధలాలు చూపించాలని అన్నారు. లేని పక్షంలో ఆ గోడౌన్‌ లను అవసరం ఉన్న చోటుకి బదిలీ చేస్తామని అన్నారు మంత్రి హరీష్‌ రావు. ఇందుకోసం కావల్సిన చర్యలు తీసుకొవాలని అధికారులను అదేశించారు. మార్చి 31 వరకు మొదటి దశలో 100 గోడౌన్ల నిర్మణాన్ని పూర్తి చేయాలని తెలిపారు. జూన్‌ 31 వరకు రెండో దశలో మిగిలిన 230 గోడన్ల పూర్తి చేయాలని అన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని మంత్రి మార్కెటింగ్‌ ఇంజనీర్లకు గుర్తు చేశారు. నాణ్యత పాటించాని వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. ఇందుకోసం థర్డ్‌ పార్టీ చెకింగ్స్‌ ఏర్పాటుకు మంత్రి అదేశాలు జారీ చేశారు. గోడౌన్ల నిర్మాణం కోసం అత్యంత పారదర్శకంగా టెండర్లను నిర్వహించామని అన్నారు. కాంట్రక్టర్లు 8 నుంచి 15 వరకు తక్కువ కోట్‌ చేసినందు వల్ల 120 కోట్ల రూపాయలు మార్కెటింగ్‌ శాఖకు ఆదా అయిందని అన్నారు మంత్రి హరీష్‌ రావు. గోడౌన్ల పై కప్పుల పై సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటు కోసం కేంద్రంలోని సోలార్‌ పవర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్‌తో విధివిధానల కోసం సంప్రదించాలని మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ ను అదేశించారు మంత్రి హరీష్‌ రావు.

కోల్డ్‌ స్టోరేజిల పై సమీక్ష

మర్కెటింగ్‌ శాఖ, ఎపెడ కలిసి నిర్మించతలపెట్టిన కొల్డ్‌ స్టోరేజిల పై సమీక్షించారు మంత్రి హరీష్‌ రావు. బొయిన్‌ పల్లి, గుడిమల్కాపూర్‌, వంటిమామిడికి డిపీఆర్‌ తయారు చేసిన టాప్‌ బ్లూ సప్లయి చైన్‌(కంపెని) కన్స్లటెంట్‌ మిష్టర్‌ లాయడ్‌ పీపీట ని ఇచ్చారు.

ఈ మూడింటితో పాటు మిగతా రెండు చోట్ల కూడా వెంటనే డిపీఆర్‌ ను తయారు చేసి సత్వర చర్యకు ఎపెడ డిజీయం ను అదేశించారు మంత్రి హరీష్‌ రావు. అతి త్వరలో వివిధ రాష్ట్రలలో ఉన్న కోల్డ్‌ స్టోరేజిలను పరిశీలించాడానికి స్టడిటూర్‌ ప్లాన్‌ చేయాలని మంత్రి హరీష్‌ రావు అన్నారు. కోల్డ్‌ స్టోరేజిల నిర్మాణం తొందరగ పూర్తి చేయాలనే ఉద్దేశంతో టాప్‌ బ్లూ సప్లయి చైన్‌ వారితో డిపీఆర్‌ను రెఢి చేయించినట్టు మంత్రి తెలిపారు. మార్కెటింగ్‌ శాఖ, కేంద్ర ప్రభుత్వ సంస్ధ ఎపెడ ద్వార కేంద్ర నిధులతో సమగ్ర వసతులు ఉన్న, మార్కెటింగ్‌ వెలం హౌస్‌, పార్కింగ్‌ తో కూడిన బహుళ ప్రయోజనలు కల కోల్డ్‌ స్టోరేజి నిర్మాణం తలపెట్టడం జరిగింది. దీని కోసం అత్యుతమ కన్సల్టెన్సీటా భ్లూను ఎంపిక చేసుకొని ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ ప్రరిస్ధితులను మరియు రాబోయె 10 సంవత్సరాల అవసరలను ద ష్టిలో ఉంచుకొని అవసరమున్న డిజైను తయారు చేసి 60 కోట్లతో మూడు కొల్డ్‌ స్డోరేజిలకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది.

ఉల్లిగడ్డ పాలసి పైన చర్చ..

వ్యవసాయ శాఖ రూపొందించిన ఆనియాన్‌ పాలసి ముసాయిద పై అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ సమర్పించారు. ఉల్లిగడ్డ విధానం మార్కెటింగ్‌ శాఖ పాత్ర పైన వివరించారు. ఈ సందర్భంగా ఉల్లిగడ్డ విధానం అవసరాన్ని వివరించారు మంత్రి హరీష్‌ రావు. ఉల్లి ధర హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు మాత్రమే ఉల్లిగడ్డ విధానం గురించి చర్చ జరగుతుందని అన్నారు. అలాంటి పద్దతికి ఇక స్వస్తి పలుకాలని అన్నారు. ముసాయిదాను అతి త్వరలో చట్టరూపంలోకి తీసుకొని రావడానికి కావల్సిన చర్యలు తీసుకొవల్సిందిగా అదేశించారు మంత్రి హరీష్‌ రావు.

మార్కెట్‌ యార్డ్‌ ల పని తీరు పైన మంత్రి సమీక్షించారు.

రాష్ట్ర వ్యాపితంగా ఉన్న వ్యవసాయ మార్కెట్‌ కమిటీిల ఆదాయంపై మంత్రి సమీక్షించారు. గత సంవత్సరంతో పోలుస్తే తక్కువగా ఉన్నదని వెంటనే రావల్సిన మార్కెట్‌ ఫీజును వసూలు చేసి ఎటు వంటి ఎగవేతలకు తావు లేకుడా చర్యలు తీసుకొవాలని అదేశించారు. తిరిగి ఫిబ్రవరి 15న సమీక్ష సమావేశం నిర్వహిస్తానని తెలిపారు. జంట నగరాలలో మర్కెట్‌ కమిటీి పని తీరు పై మంత్రి సంత ప్తిని వ్యక్తం చేశారు. ఇక్కడ అమలు పరుస్తున్న సరుకుల ఆటోమెటిగ్‌ యాంత్రం ద్వార గేట్‌ ఎంట్రి చేస్తున్న విధానన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని మంత్రి అన్నారు. ఇందు కోసం కావల్సిన ప్లాన్‌ను రెడి చేయాలని అధికారులకు తెలిపారు.

Other Updates