vandaఅష్టైశ్వర్య విలసితాం – కర్మయోగ సంసేవితాం – శ్రేష్ఠ పాలక పూజితాం –

వందే తెలంగాణ శ్రీమాతరం – (అపార సంపదలతో తులతూగుతూ, అంకితభావంతో పనిచేసే అధికారులు, ఉద్యోగులు, సమర్థుడైన నాయకుడి పాలనలో ముందుకు వెళ్తున్న తెలంగాణ తల్లికి వందనాలు) అంటూ, రాష్ట్ర గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌ నరసింహన్‌ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పాలనా విధానాన్ని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ప్రశంసలతో ముంచెత్తారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మంచి విజన్‌ ఉన్న గొప్ప నాయకుడని, విజన్‌ ను మిషన్‌ గా మారుస్తూ, స్పష్టమైన విధానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంవైపు నడిపిస్తున్నారని గవర్నర్‌ ప్రశంసించారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా జూన్‌ 2న హైదరాబాద్‌లోని హెచ్‌.ఐ.సి.సి లో మేధావులు, వివిధ రంగాల నిపుణులు, అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశానికి గవర్నర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ళ కాలంలో శాంతిభద్రతల పరిస్థితి అమోఘంగా వున్నదని, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణ పథకం, టి.ఎస్‌.ఐ. పాస్‌, నూతన పారిశ్రామిక విధానం వంటివి ఎంతో విశిష్టమైన కార్యక్రమాలుగా గవర్నర్‌ పేర్కొన్నారు.

మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని ప్రశం సిస్తూ, ఈ కార్యక్రమం ద్వారా ఇంటింటికీ నల్లా నీరు సరఫరా కానున్నందున, కడవెడు నీటికోసం తెలంగాణ ప్రజలు ఇక గుట్టలెక్కనవసరం లేదని, ఇది ఎంతో అభినందనీయ కార్యక్రమమని పేర్కొ న్నారు. అలాగే, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళ ను నిర్మించి గహిణుల పేరుమీద అందిం చడం గర్వించదగిన కార్యక్రమమని, దీంతో ఆడబిడ్డల ఆత్మగౌరవం మరింత ఇనుమడిస్తుందన్నారు.

?పుట్టుకనీది, చావు నీది, బతుకంతా దేశానిది? అన్న ప్రజాకవి కాళోజీ నారాయణ రావు కవితను ఉటంకిస్తూ, స్వచ్ఛ తెలంగాణ వంటి కార్యక్రమాలలో పౌరులంతా భాగస్వాములు కావాలన్నారు.

కరువును తరిమేస్తాం:

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖరరావు మాట్లాడుతూ, 2018 సంవత్సరం నాటికి రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసి కరువును తరిమేస్తామని అన్నారు. అప్పటికి రాష్ట్ర బడ్జెట్‌ ద్విగుణీకత మవుతుందని, మౌలిక సదుపాయాల కల్పన పూర్తిచేసి, ఇక పేదరికంపై యుద్ధం ప్రకటిస్తామని సి.ఎం అన్నారు. ప్రతి పేద కుటుంబాన్ని తట్టిలేపి, వారిని ధనవంతులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

అమరవీరుల స్మ తి వనానికి భూమిపూజ

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. రాజధాని నగరం హైద రాబాద్‌లో పలు సాంస్కతిక కార్య క్రమాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఈ సందర్భంగా తొలుత గన్‌ పార్కు వద్దగల అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం, అమరవీరుల త్యాగాలకు ప్రతీకగా లుంబినీ పార్కులో నిర్మించ తలపెట్టిన అమరవీరుల స్థూపానికి భూమిపూజ, శంకుస్థాపన చేశారు.

హుస్సేన్‌ సాగర్‌ తీరాన, సంజీవయ్య పార్కు వద్ద దేశంలోనే అత్యంత ఎత్తైన భారీ జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జాతీయ పతాకాన్ని ఎగురవేసి, పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరించి, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సభలో వివిధ రంగాలలో ప్రతిభను చూపిన పలువురిని ముఖ్యమంత్రి పతకాలతో సత్కరించారు.

బాణాసంచా వెలుగులు: అదే రోజు రాత్రి టాంక్‌ బండ్‌పై జరి గిన సంబురాలలో సాంస్కతిక ఉత్సవాల ర్యాలీ, బాణాసంచా వెలుగు జిలుగులు చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కొన్ని గంటలపాటు జరిగిన ఈ వేడుకలు ప్రజలను విశేషంగా ఆకర్షించాయి.

Other Updates