– బుక్కా అశోక్‌
tsmagazine
‘మల్కాపూర్‌’ మారుమూల కుగ్రామం. ఈ ఊరు పేరంటేనే అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్లిప్తంగా ఉండేవాళ్లు. ఆ ఊరుకు వెళ్లాలంటేనే భయపడేవారు. అధికారులయితే ఆ ఊరు ముఖమే చూసేదికాదు. ఇందుకు గ్రామంలో ఆనాటి తీవ్రవాద ప్రాబల్యమే కారణం. ఇది ఒకప్పటి మాట.. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఈ ఊరును చూసేందుకు జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు కదిలి వస్తున్నాయి. అందుకు కారణం గ్రామ యువత కృషితో చేపట్టిన అభివృద్ధి. మల్కాపూర్‌ను 13 రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందర్శించి అభివృద్ధి చూసి అబ్బుర పడ్డారు. మల్కాపూర్‌ అభివృద్ధికి నిధులకు కొదవ రావద్దంటు మంత్రి హరీష్‌రావు సూచించడమే ఆకట్టుకున్నందుకు నిదర్శనం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ గ్రామం సందర్శనకు విచ్చేసి, ప్రతిష్టాత్మక ‘కంటి వెలుగు’ పథకం ‘మల్కాపూర్‌’లోనే ఆగస్టు 15న ప్రారంభించారు. మల్కాపూర్‌లో ప్రసంగించిన సీఎం కేసీఆర్‌ ”మల్కాపూర్‌కు నేను చెప్పేదేమీ లేదు.. నేను నేర్చుకొని పోవాల్సి ఉంది” అంటూ వాఖ్యానించడమే ‘మల్కాపూర్‌’ అభివ ద్ధికి నిదర్శనం. మల్కాపూర్‌ యువత చేసిన కృషికి అభివృద్ధ