magaబంగారు తెలంగాణ నిర్మాణంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలనుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ బృహత్‌ సంకల్పంతోఏర్పాటు చేసిన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ద్వారా ఆ వర్గాలకు కొండంత దైర్యాన్ని ఇచ్చినట్లుయింది.దీంతో రాష్ట్ర రాజధాని నగరంలో మొట్ట మొదటిసారిగా బ్రాహ్మణ పరిషత్‌ భవనానికిశంకుస్ధాపన చేసుకున్న సంఘం సభ్యులు అదే స్ఫూర్తితో సూర్యాపేట జిల్లా కేంద్రంలో సదనం నిర్మించకుంటున్నారు.

బ్రాహ్మణులు తమసమస్యలను కడుపులో దాచుకుంటారు తప్ప ఎవరికీ చెప్పుకోరు. అలాంటి వారి సమస్యలను పరిష్కరిస్తూ వారికి సముచితమైన గౌరవాన్ని ఇవ్వడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అగ్రభాగాన ఉన్నారని రాష్ట్ర విద్యుత్‌, ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట సమీపంలో చివ్వెంల మండలం దురాజ్‌పల్లి వద్ద జాతీయ రహదారి పక్కన రూ. కోటి వ్యయంతో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ఆద్వర్యంలో నిర్మించే విప్రహిత బ్రాహ్మణ సదనం భవన నిర్మాణానికి ఆగస్టు 19న మంత్రి జగదీష్‌రెడ్డి శంకుస్థ్ధాపన చేశారు. అనంతరం సూర్యాపేట నందు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ చైర్మన్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహదారు డాక్టర్‌ కె.వి.రమణాచారి ఆద్యక్షతన నిర్వహించిన అవగాహన సదస్సులో బ్రాహ్మణ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలను గురించి మంత్రి వివరించారు.

రాష్ట్రంలో అణగారిన వర్గాలతో పాటు నోరు తెరచి తమ హక్కులు, సమస్యలను అడగలేనివారిని అక్కున చేర్చుకునే ప్రభుత్వం మాది. అలాంటి ముఖ్యమంత్రి మనకు ఉన్నారని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే 2003లో జరిగిన గోదావరి పుష్కరాలను తెలంగాణలో మొక్కుబడిగా నిర్వహించటం పట్ల నాటి ఉద్యమ నేత కేసీఆర్‌ అసంతృప్తినివ్యక్తం చేశారని గుర్తుచేశారు. మనకాడ పారే నదులు స్వచ్చమైనవి కావా అన్ని ప్రశ్నించారని, అలాగే పుష్కరాలల్లో తెలంగాణ బ్రాహ్మణులకు జరిగిన అన్యాయాన్ని వివరించి అందరినీ ఏకతాటిపైకి తెచ్చారన్నారు. అలాగే మన గుడుల పట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చూపిన వివక్షను కేసీఆర్‌ గుర్తించారని తెలిపారు. రాష్ట్రం ఏర్పాడిన వెంటనే తెలంగాణాలో అన్ని వర్గాలు, సంస్కృతులు, సంప్రదాయాలను గౌరవించేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు తెలిపారు. అందులోభాగంగానే బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటు చేసి రూ.100 కోట్ల నిధులను కేటాయించినట్లుతెలిపారు. ఏడాదిలో బ్రాహ్మణ సదనం పూర్తి చేయించి ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభోత్సవం చేయించనున్నట్లు వెల్లడించారు. ఆధ్యాత్మిక, విద్యా వికాస కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి తెలిపారు

సూర్యాపేటలో బ్రాహ్మణ సదనం భవన నిర్మాణానికి ఒక ఎకరం భూమిని విరాళంగా ఇచ్చిన ఆదుర్తి రామయ్యను స్ఫూర్తిగా తీసుకుని మంధని, మేడ్చల్‌, మల్కాజిగిరి, చెన్నూరులో సదనం నిర్మాణానికి భూమిని నిదాళంగా ఇచ్చేందుకు దాతలు ముందుకు వచ్చారని డాక్టర్‌ కే.వి. రమణాచారి తెలిపారు. కంచి కామకోటి పీఠం సహకారంతో సూర్యాపేటలో సంప్రదాయవిద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేసి బాల బాలికలకు 6వ తరగతి నుంచి ఉన్నత విద్య వరకు బోధించే సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. డిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచార్యులు మాట్లాడుతూ దేశంలో బ్రాహ్మణులకు అత్యుత్తమ గౌరవం దక్కేది తెలంగాణ రాష్ట్రంలోనే అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ కె. సురేంద్రమోహన్‌, మున్సిపల్‌ ఛైర్‌పరన్స్‌ గండూరి ప్రవళిక ప్రకాష్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ యన్‌. శ్రీనివాసగౌడ్‌, మార్కెట్‌ కమిటి చైర్మన్‌ వై. వెంకటేశ్వర్లు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ సభ్యులు చకిలం అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 

వై. వెంకటేశ్వర్లు

Other Updates