maga

హరితహారం-హరితహారం!

తెలంగాణా హరితహారం!

అందాలా-ఆనందాలా

ఆకుపచ్చని అడవితీరం!

||హరిత||

దొంగలు ఎత్తుకుపోకుండా

నిప్పు ముప్పు ఏర్పడకుండా

పశువుల మేతకు గురికాకుండా

అడవులనన్నీ రక్షించాలి!

రహదారుల కిరువైపుల చెట్లను

రమ్యంగా నాటించాలి!

రాష్ట్ర అటవీ సాంద్రతను

అత్యధికంగా పెంచాలి!

||హరిత||

నలభై కోట్ల మొక్కలనే

నలుదెసలా నాటించాలి!

ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఆశయాల్ని సాధించాలి!

‘మన ఊరు – మన ప్రణాళిక’

అనే నినాదంతో యికపై

గ్రామస్థాయి – మండల స్థాయి

లక్ష్యాలనధిగమించాలి!

||హరిత||

నూటాయిరవై కోట్ల మొక్కలు

అరణ్యేతర ప్రాంతాల్లో

పది కోట్ల వరకు మొక్కలు

పట్టణాలా పరిధుల్లో

కొండలు-బంజరు భూముల్లో

మెండుగ తోటలు పెంచాలిగ

”హరిత హార సత్ప్రణాళిక”

అటవీ క్షేమ భూమిక!

||హరిత||

డా|| వడ్డేపల్లి కృష్ణ

Other Updates