ముఖ్యాంశాలు

69,100 కోట్లతో మెట్రో రైలు విస్తరణ
నాలుగు ఏండ్లలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెట్రో విస్తరణను పూర్తిస్థాయిలో చేసే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మెట్రో రైలు అథారిటిని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ (ఎంఏయుడి) శాఖను కేబినెట్ ఆదేశించింది.

సచివాలయంలో ప్రార్థనాలయాల ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర సచివాలయం మరో చారిత్రక ఘట్టానికి వేదికగా నిలిచింది. దేశ పరిపాలనా చరిత్రలోనే మున్నెన్నడూ లేనివిధంగా మత సామరస్య లౌకికవాద స్ఫూర్తి ఫరిఢవిల్లింది.

మెదక్‌ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతా..
మెదక్‌ను కూడా సిద్ధిపేట మాదిరిగా అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని, అందుకు మంత్రి హరీష్‌రావుకు బాధ్యతలు అప్పగిస్తున్నానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు.

సమాచార శాఖ మంత్రిగా పట్నం
రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఎమెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారంచేశారు. రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో మహేందర్ రెడ్డి చేత గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తెలుగులో పదవీప్రమాణ స్వీకారం చేయించారు.

దళితబంధు విజయపథం
ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి పథకం దేశంలో సంచలనాలు సృష్టిస్తున్నది. దళిత జాతి స్వావలంబన కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మాకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది.
సంపాదకీయం

సతతం హరితం
పర్యావరణ పరి రక్షణ, పచ్చదనం పెంపొందించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణకు హరితహారం‘ కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంతంగా అమలు చేస్తోంది. భవిష్యత్ తరాల వారికి చల్లని వాతావరణాన్ని, స్వచ్ఛమైన గాలిని అందించాలనే ఉద్దేశ్యం.