|

అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2015

press-informationలక్ష్మణ రేఖ గోపాలకృష్ణ

గోవాలో నవంబర్‌ 20న శ్యాంప్రసాద్‌ స్టేడియంలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో – 2015 (ఇఫి) ఘనంగా ప్రారంభమయ్యింది. భారత ంద్ర ప్రభుత్వం ఎంటర్‌టైన్‌మెంట్‌ సొసైటీ ఆఫ్‌ గోవా సంయుక్తంగా నిర్వహించిన ఈ చిత్రోత్స ఐ అండ్‌ బి మంత్రి అరుణ్‌ జైట్లీ, గోవా ముఖ్యమంత్రి తదితరులు పాల్గొన్నారు. సభకు ముఖ్య అతిథిగా వచ్చిన బాలీవుడ్‌ నటుడు అనిల్‌కపూర్‌ను సత్కరించారు. 100 సంవత్సరాల భారతీయ సినిమా సంబరాల్లో భాగంగా ప్రముఖ సంగీత దర్శకులు ఇళయ రాజాను ఘనంగా సత్కరించారు. ది మ్యాన్‌ హూ నో ఇన్‌ఫినిటీ (యూ) చిత్రాన్ని ప్రారంభ చిత్రంగా ప్రదర్శించారు.

అంతర్జాతీయ పోటీ విభాగం, ప్రపంచ సినిమా, గత సినిమా వైభవం, ఇండియన్‌ పనోరమ (ఫీచర్‌, నాన్‌ ఫీచర్‌) స్పెషల్‌ నార్త్‌, ఈస్ట్‌ సెక్షన్‌, శ్రద్ధాంజలి సెక్షన్‌ పలు విధాలుగా చిత్ర ప్రదర్శనలు జరిగాయి. ఓపెన్‌ ఫోరవ్‌ు, ప్రెస్‌ మీట్‌లు, ఫిలింబజార్‌, మాష్టర్‌ క్లాసులు, ఉమన్‌ కల్చర్‌ సినిమాలు ఎన్నో ఈ ఉత్సవంలో చోటు చేసుకున్నాయి. ఇండియన్‌ పనోరమ విభాగంలో ఎంపిక చేసిన చిత్రాలు కన్నడ, మళయాళ, బెంగాలీ, అస్సామి, సంస్కృతం, మరాఠీ హిందీ 10 భాషల చిత్రాలను ప్రదర్శించారు. ఆస్కార్‌కు ఎంపికయిన కోర్టు, సినిమా వాలా, కాదంబరి, మసాన్‌, భజ్‌రంగీ బైజాన్‌, కోటి, ప్రియ మానసం, సోహ్రా బ్రిడ్జి, వాలియ చిరకుల్ల పక్షి గళవంటి ఎన్నో మంచి చిత్రాలు చూసే అవకాశం లభించింది. శశికపూర్‌ (దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత)కి శ్రద్ధాంజలి ఘటిస్తూ జునూన్‌, దీవార్‌, కల్‌యుగ్‌, షేక్స్‌ఫియర్‌ వాలా, ఉత్సవ్‌, హాఫిజ్‌ వంటి చిత్రాలను ప్రదర్శించారు. . బాలచందర్‌ మరో చరిత్ర, మనోరమ నటించిన అపూర్వ స¬దర్‌గళ్‌, రవీంద్ర జైన్‌ ‘హీనా’ ఏడిద నాగేశ్వరరావు శంకరాభరణం, డి. రామానాయుడు ప్రేమించు వంటి సినిమాలను వారి జ్ఞాపకార్ధం ప్రదర్శించారు. డిజిటల్‌ సినిమా తయారీపై మాస్టర్‌ క్లాసులు నిర్వహించారు నందన్‌ స్సనా. ప్రెస్‌ మీట్‌లో లక్ష్మణరేఖ గోపాలకృష్ణ రూపొందించిన గ్లోబల్‌ ఫిలిం ఫ్రటెర్నిటి ప్రపంచ సినిమా జెండాను ప్రెంచ్‌ దర్శకులు గెేబ్రిలీ బ్రిన్‌ ఎన్‌ విడుదల చేసి రూపకర్త గోపాలకృష్ణను అభినందించారు. తనతో ఈ జెండాను తీసుకొని వెడతానని ప్యారిస్‌లో ప్రదర్శిస్తామని అన్నారు. అలాగే గోపాలకృష్ణ రచించిన గాన, స్వర మాంత్రికులు సంగీత దర్శకులు గాయకులపై రచించిన పుస్తకాన్ని ఓపెన్‌ ఫోరవ్‌ులో ఇంటర్నేషనల్‌ ఫిలింఫెస్టివల్‌ డైరెక్టర్‌ సెంథిల్‌ రాజన్‌ విడుదల చేశారు. తెలుగు పుస్తకం ‘ఇఫి’లో విడుదల చేయడం గొప్ప విషయమని రచయితను అభినందించారు. దర్శకులు, నిర్మాతల గురించిన మాస్టర్‌ క్లాసును నాన్‌సీ భిషప్‌ (యూఎస్‌ఎ) నిర్వహించారు. నార్త్‌ – ఈస్ట్‌ విభాగంలో లాల్‌ హు ఇ ప్రత్యేక నృత్య, సంగీత ప్రదర్శనను నిర్వహించారు. ‘బొందికోయన్‌’ అనే అస్సామియా చిత్రం ప్రదర్శించారు. దేశ విదేశాల చిత్రాల ప్రదర్శన, దేశ విదేశీ నిర్మాతలు, దర్శకులు, టెక్నిషియన్స్‌ అందరూ ఒక చోట చేరి సినిమా పరిశ్రమ గురించి చర్చించడం కన్నుల పండుగగా జరిగింది. భారత సినీ పరిశ్రమ అభివృద్ధికి ఇటువంటి ఉత్సవాలు ఎంతో అవసరమని సంకల్పించిన జవహర్‌ లాల్‌ నెహ్రూ కోరిక నెరవేరింది. సినిమా నిర్మాణంలో సౌండ్‌ కి గల ప్రాముఖ్యతపై మాస్టర్‌ క్లాసు జరిగింది. ద క్లీన్‌ అనే అర్జంటీనా సినిమాను చిత్రోత్సవం ముగింపుసభలో 30వ తారీఖున ప్రదర్శిచారు.

రష్యా దర్శకులు, నటులు నికిత మిఖాల్‌ కోవ్‌ కి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ప్రపంచ సినిమాకు ఆయన చేసిన కృషిని అభినందించారు. విజయం సాధించిన ఈ దర్శకులు 1974లో ఆస్కార్‌ అవార్డు అందుకున్నారు. 2013లో ఆయన చిత్రం ’12’ను ఆస్కార్‌ అవార్డ్‌కు నామినేట్‌ చేశారు. ఈ అవార్డ్‌కి 10 లక్షల నగదు బహుమతిని అందజేశారు.

ఈ చిత్రోత్సవం పోటీ భాగంలో జువీదీ=ూజజు ూఖీ ునజు ూజు=ూూచీు అనే అర్జెంటినా సినిమా 40 లక్షల నగదు బహుమతి గెలుచుకుంది. 2015లో నిర్మించిన ఈ చిత్రం బహుమతి గెలుచుకోవడాన్ని అందరూ హర్షించారు. దీని దర్శకులు సిరో గు ఇర్రా, ఫిలింమేకర్‌ శేఖర్‌ కపూర్‌ జ్యూరీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. జులియా జెన్‌ట్‌ (జర్మన్‌ నటి) జియాన్‌-క్యు- హవాన్‌ (కొరియా దర్శకులు) సుహా ఆర్ఫ్‌ (నిర్మాత, దర్శకులు) మిచల్‌ రా డ్‌ ఫోర్డ్‌ (డైరెక్టర్‌ యూ) జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు.