అంబరాన్ని తాకిన ఢిల్లీ సంబురాలు

అంబరాన్ని-తాకిన-ఢల్లీి-సంబురాలుదేశరాజధాని ఢిల్లీ నగరం తెలంగాణ ఆట పాటలతో మార్మోగింది. తెలంగాణ సంబురాలతో మురిసిపోయింది. జూన్‌ రెండున తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవాలలో భాగంగా ఢిల్లీలోని తెంగాణ భవన్‌ వేదికగా వారం రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాలు ఢిల్లీ వాసులను అలరించాయి. ఢిల్లీ నగరంలో తెలంగాణ ముద్ర వేయడంలో నిర్వాహకులు విజయవంతమయ్యారు.

జూన్‌ రెండున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఈ వేడుకలను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన పోలీసులు మార్చ్‌ ఫాస్ట్‌ నిర్వహించారు. తొలుత తెలంగాణ తల్లి విగ్రహానికి పూఢిల్లీమాఢిల్లీ వేసి, అనంతరం అమరవీరుఢిల్లీ స్థూపం వద్ద ఉప ముఖ్యమంత్రి నివాళులర్పించారు.
సాయంత్రం జరిగిన సభలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటం వద్ద ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ జ్యోతి వెలిగించి నివాళుర్పించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం గత ఏడాదికాలంగా రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి తీసుకున్న పలు కార్యక్రమాఢిల్లీను ఆయన ఈ సందర్భంగా వివరించారు.

తెలంగాణ మీడియా సెంటర్‌ ఏర్పాటు

ఢిల్లీలోని తెంగాణ భవన్‌లో కొత్తగా ఏర్పాటుచేసిన మీడియా సెంటర్‌, ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌, టూరిజం సెంటర్‌ను ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. టూరిజం శాఖ వెలువరించిన పుస్తకాలను ఆయన ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో భాగంగా సమాచార, పౌరసంబంధాల శాఖ ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శన పలువురిని విశేషంగా ఆకర్షించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి పోరాట యోధుడు కె. చంద్రశేఖర రావు ఉద్యమించిన ఘట్టాలను కళ్ళకు కట్టినట్టుగా వివరించే చిత్రపటాలతోసహా, గత ఏడాదిగా రాష్ట్రం సాధించిన ప్రగతిపై ప్రదర్శించిన ఈ ఛాయాచిత్ర ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో సుమారు 80 చిత్రాలు ప్రదర్శించారు. అటు ఆంధ్రభవన్‌, ఇటు తెలంగాణ భవన్‌కు వచ్చే వందలాది మంది ఈ ప్రదర్శనను తిలకించి పులకించిపోయారు.

మీడియా సెంటర్లో ఏర్పాటుచేసిన కాళోజి నారాయణ రావు హాలును ఉత్సవాల ముగింపు రోజున కేంద్ర సమాచార హక్కు చట్టం కమీషనర్‌ మాడభూషి శ్రీధర్‌ ప్రారంభించారు. ఈ హాలులో కాళోజి నారాయణరావు, సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి, ముఖ్దూం మొహినుద్దీన్‌, చెరబండరాజు, సరోజినీ నాయుడు, మహాకవి పోతన, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తదితర తెలంగాణ ప్రముఖుల చిత్రపటాలతో ఏర్పాటుచేశారు. తెలంగాణలోని చారిత్రిక ప్రదేశాలు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చిత్రపటాలను కూడా ఈ హాలులో అలంకరించారు.

ఈ వేడుకలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవాలకే నిండుదనం తెచ్చాయి. బోనాల నృత్యం, లంబాడా నృత్యం, ఢిల్లీ ప్రముఖుడు , పద్మ విభూషణ్‌ రాధారెడ్డి, రాజారెడ్డి దంపతుల కూచిపూడి నాట్యవిన్యాసం మొత్తం సంబరాలలో విశేషంగా నిలిచింది. ఆరవ నవాబు మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ ప్రభుత్వం అప్పట్లో సేకరించిన స్థలంలో నిర్మించిన తెలంగాణ భవన్‌ ప్రాంగణంలో 1956 తరువాత ఇంత ఘనంగా ఖవ్వాలీతో సహా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఢిల్లీవాసులను అబ్బుర పరచింది.

ముగింపు వేడుకలకు ముఖ్య అతిథుగా హాజరైన కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవేద్కర్‌, కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్‌ ప్రాంగణంలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళుర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలదండవేసిన అనంతరం ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటం వద్ద జ్యోతిని వెలిగించి ముగింపు వేడుకలను ప్రారంభించారు. తెలంగాణ దూరదర్శన్‌కు యాదగిరి నామకరణంచేసే విషయంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తనను సంప్రదించారని, పార్లమెంటులో తెలంగాణ పై జరిగిన చర్చల విశేషాలను కేంద్రమంత్రి గుర్తుకు తెచ్చుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన హైదరాబాద్‌ బ్రదర్స్‌ ఖవ్వాలీ ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ఈ వేడుకలు ప్రారంభం నుంచి ముగింపు ఉత్సవం దాకా, ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు డాక్టర్‌ వేణుగోపాలా చారి, తేజావత్‌ రామచంద్రుడు, పార్లమెంటు సభ్యుడు బి.వినోద్‌ కుమార్‌, తెలంగాణ రెసిడెంట్‌ కమీషనర్‌ శశాంక గోయల్‌, రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ సంచాకులు వి. సుభాష్‌, తెలంగాణ భవన్‌ కమీషనర్‌ రామ్మోహన్‌, తెలంగాణ మాసపత్రిక అసోసియేట్‌ ఎడిటర్‌ సామిడి జగన్‌ రెడ్డి , తెలంగాణ భవన్‌ సిబ్బంది ఈ ఉత్సవాల విజయవంతానికి కృషిచేశారు.

బి.సి కమీషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య, హోమ్‌ శాఖ ప్రధాన కార్యదర్శి సామ గోపాల్‌ రెడ్డి, ప్రఖ్యాత చిత్రకారిణి అర్పితా రెడ్డి, మౌంటేనీగ్రో పై కాన్సల్‌ జనరల్‌ డాక్టర్‌ జనీస్‌దర్చారి, తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో స్థిరపడిన పులువురు తెలంగాణ పారిశ్రామిక వేత్తలు, కాయస్థు, నవాబు కుటుంబాల వారు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకలను తికించారు.