ఆకుపచ్చని పొద్దు పొడువాలే!

ఆకుపచ్చని-పొద్దు-పొడువాలేతెంగాణ ముద్దుబిడ్డకు, అన్నాదమ్ముకు, అక్కాచెళ్ల్లెకు, పిన్నకు, పెద్దకు అందరికీ ఆకుపచ్చని అభివందనాు. అరవై ఏండ్ల ఉద్యమం ఫలించి తెంగాణ అవతరించింది. పద్నాుగేండ్లు ప్రజా ఉద్యమాన్ని ముందుండి నడిపించిన మన మహా నాయకుడు, ప్రియతమ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గారి నేతృత్వంలో తెంగాణ జీవితాలో నవ వసంతం చిగురిస్తున్నది. ఈ శుభ సందర్భంలో తెంగాణకు హరిత హారం వేద్దాం రమ్మని తెంగాణ ప్రభుత్వం పిుస్తున్నది. తొకరి కురిసింది. భూమి పదును మీదున్నది. ఇదే అదును. ఆకాశంలో ఎన్ని చుక్కున్నాయో భూమి మీద అన్ని మొక్కు నాటుమంటున్నది. ప్రతి చెయ్యీ పచ్చని మొక్కు నాటి బంగారు తెంగాణకు పాదు తీయాని అంటున్నది. పచ్చని మొక్క తోరణం కట్టి ప్రగతిని ఆహ్వానిద్దాం రమ్మంటున్నది. మనం పవిత్ర ఆశయంతో నాటే ఈ చక్కని మొక్కు తరతరా తెంగాణ గుండె మంటు చల్లార్చే అమృతపు చుక్కు. ఉజ్వమైన భవిష్యత్తుకు దారి చూపే వేగుచుక్కు.

పరాయి పానలో నిధుకు, నీళ్లకు దూరమై బీడు పడిన బాధ మనది. నెర్రొ బారిన తెంగాణ నే తండ్లాటను చూసి త్లడిల్లినం. మనది బంగారం అసుంటి మట్టి. ఒక్క తొకరి తాకితే చాు. పచ్చని మొక్కు ప్రసవించి భూమి పచ్చి బాలింతరాలైతది. ఒక స్వర్గాన్ని పోడగొట్టుకున్నాం మనం. ఎట్లుండేటి తెంగాణ ఎట్లయిపోయింది? ఒక్కసారి మీ జ్ఞాపకాను మర్లేయిండి. పొలిమేర ఆత్మీయంగా పకరించే యాపు, తుమ్మలేవి? పానాదు పంటుండే పచ్చని చెట్లేవి? ఊరికెవరొచ్చినా చెంతకు పిలిచి చింత తీర్చిన చింతతోపులేవి? తొవ్వకు రెండు దిక్కు చేతు కుపుకొని ఛత్రం పట్టినట్టు నీడ పట్టిన చెట్ల గుబుర్లేవి? ఇంటి ముంగటుండే బంతి నారు, చామంతు సాు, ఇంటెనక పెరట్ల ఉండే కలెమాకు, నిమ్మ, దానిమ్మ, జామ చెట్లేమైనయి? చెరువు కట్టకు అండదండగా నిబడే ఈత, తాటి వనాలేవి? ఏ దిక్కు చూసినా కనిపించే మామిడి, నేరేడు, జిట్రేగి, దిరిసెన, టేకు, మద్ది, యాప, తుమ్మ మానును ఎవరు మాయం చేసిన్రు? ఊయలూపిన మర్రి ఊడు ఎవరు నరికేసిన్రు? పొలా ఒడ్డున యాప, కానుగ చెట్లుంటుండె. కొమ్ము కొట్టి పొం తొక్కితే పంట బంగ పండుతుంది.

మానుకు మబ్బుకు మధ్య ఉన్న బంధమేందో గని చెట్లు విసిరే చ్లగాలికి మురిసిన మబ్బు కరిగి నీరై ముసర్లు పెట్టేది. ఎన్నొద్దులైనా ముసుర్లు ఇడువకపొయ్యేది. పశు కాపరి గొంగడి కొప్పెర ఇడువకపొయ్యేది. ఎటుపొయింది ఏనుగు తొండంతోని పోసినట్టు కురిసిన కుంభవృష్టి? పుట్లు పుట్లుగా పుట్టే ఆరుద్ర పురుగు, రింగున తిరిగే జింగన్ను, పండ్లు తిని కమ్మగ పాటు పాడే కోయిమ్ము, పచ్చగడ్డి మేసే పశువు, ఆ పశువు చుట్టూ ఎగిరే సీతాకోక చిుకు, శ్రావణ మాసం చెట్ల కింద వన భోజనాు అన్నీ పాతతరం జ్ఞాపకాలైపొయినై. కొత్త తరానికి వాన ముసురంటే ఏందో తొవకుంటనే అయినం. బతుకమ్మకే పూు కరువైన కాం దాపురించింది. బతుకు సంబురమే మాయమైంది. గత పాకు చేసిన పాపాతో పచ్చని అడివి ఆగమైంది. చెరువు కట్ట, మత్తడి మాయమైంది. తరతరా వృక్ష సంపదను తెగనరికి నీడనిచ్చిన గూడునే అంటుపెట్టుకున్నట్టయింది. ప్రాణవాయువు పంచే చెట్లు లేక గాలి విషపూరితమైంది.
తల్లి కొంగోలే భూమికి నీడపట్టిన ఓజోన్‌ పొర ఛిద్రమై అతినీలోహిత కిరణాు సోకి ఎండ గూడ విషపూరితమైంది. చెట్లుచేము లేని తెంగాణ దోడుదోడు పాడుపాడైంది. ప్రకృతి పోయిందని పరమేశ్వరుడు గూడ పోయిండు. ఆకాశగంగ అలిగి రానంటున్నది. వానకాం గూడ ఎండకామే అయితున్నది. చెడగొట్టు వానలే తప్ప చేన్లు మురిసే వాను పడుతలేవు. తరువు బంధం తీరిపోయే వరకు కరువు తెంగాణతోని చుట్టీర్కం కలిపింది. భూమి జ అడుగంటింది. ఏడు నిువులెత్తు బావు ఎండిపోయినై. పాతాళం పోయినా సుక్క నీరు పడుతలేదు. వనం లేక తిండి కరువైన జీవరాశు జనం కొస్తున్నయి. అడివి నరికిన మనిషి కర్కశత్వానికి తిండి లేక ఊర్ల మీద పడ్డ కోతు మర్కటత్వానికి నడుమ పంచాయితి మోపైంది. కోతు కొంప పీకి పందిరేస్తున్నయి. చేన్లను చెడగొడుతున్నయి. తోటు నాశనం చేస్తున్నయి.

ఊర్ల పరిస్థితే ఇట్లుంటే నగరాు నరక కూపాయితున్నయి. కారడువు పోడగొట్టుకొని కాంక్రీట్‌ జంగ్ల ఉడికి ఉడికి చస్తున్నడు మనిషి. ఒకనాడు బాగ్‌ నగరంగా పేరుపొందిన భాగ్యనగరం బాధ నగరంగా మారుతున్నది. ఇంకెంత కాం కండ్ల ముందు ప్రకృతి ఇచ్చిన వృక్ష సంపద క్షీణిస్తుంటే చూసుకుంట ఉందాం? ఇప్పుడు గనక మనం మేల్కోకపోతే ముందు తరాు మనల్ని క్షమించవు. ఈ పరిస్థితిని మార్చాలె. పట్టుబట్టి జట్టుకడితే సాధించలేనిది ఏదీ లేదని రుజువు చేసిన జాతి మనది. మన సంఘటిత శక్తి బమేందో దేశానికి చాటినం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసినం. ఆత్మశక్తితో ఉద్యమించి తెంగాణను సాధించుకున్నం. రాష్ట్రం సాధించుకున్నరు గానీ వీళ్లేం ముందట పడుతరు అని వెక్కిరించిన నోళ్లు మూతు పడి నివ్వెర పోయెటట్టు సమగ్ర ప్రణాళికతో ముందడుగు వేస్తున్నం. అవినీతి లేని పాన అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిుస్తున్నం. పేద సంక్షేమం కోసం పెన్షన్లు పెంచి, చదువుకునే ప్లికు సన్న బియ్యం బువ్వ పెట్టి దేశంలోనే సంక్షేమంలో నంబర్‌ వన్‌ రాష్ట్రమనే ఘనతను సాధించినం. ఉమ్మడి రాష్ట్రం సృష్టించిన సమస్య సుడిగుండాను అధిగమిస్తూ సాగునీటి ప్రాజెక్టు, మిషన్‌ కాకతీయ, వాటర్‌ గ్రిడ్‌, పేదకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు, కల్యాణ క్ష్మి, షాదీ ముబారక్‌ వంటి వినూత్న పథకాతో పురోగమిస్తున్నం. రాష్ట్ర బడ్జెట్‌ లో సింహ భాగం నిరుపేద సంక్షేమం కోసం, బడుగు వర్గా అభ్యున్నతి కోసం ఖర్చు చేస్తున్నం.

ఎన్ని నిధు కేటాయించినా వాను కొనలేం. బడ్జెట్‌ కేటాయింపుతో భూగర్భ జలాు పెరగవు. భూమి నీళ్ళుండాలె. నీళ్ళుండాంటే వాను పడాలె. వాను పడాంటే చెట్లుండాలె. చెట్లుంటే వానలొస్తయి. వాను వస్తే వనం పెరిగితే అడివి పండో ఫమో దొరికుతది. కోతు వాటి మానాన అవి బతుకుతయి. అందుకే మన ముఖ్యమంత్రి ఇచ్చిన నినాదం వాను వాపస్‌ రావాలె-కోతు వాపస్‌ పోవాలె. మళ్ల ఆకుపచ్చని వైభవంతో తెంగాణ కళకళలాడాలె. పచ్చని చెట్ల మెట్లమీంచి వాన తల్లి దిగిరావాలె. నిబడి కురిసే వానతోని కరువు బాధు తీరిపోవాలె. పట్టుబట్టి జట్టుకట్టి ఎట్లనయితే తెంగాణను సాధించుకున్నమో అట్లనే కోట్లాది మొక్కు నాటి తెంగాణకు హరితహారం వేద్దామని మన ముఖ్య మంత్రి ఇస్తున్న పిుపును అందుకోవాలె. నే నుచెరుగులా విరివిగా మొక్కు నాటాలె.

భూమ్మీద 33 శాతం చెట్లుండాలె. ఇప్పుడు 22 శాతమే ఉన్నయి. మనం తెంగాణ అంతట జులై 3 నుంచి ఈ వానకాం మొత్తం 40 కోట్ల మొక్కు నాటాలె. వచ్చే మూడేండ్లలో 230 కోట్ల మొక్కు నాటాలె. నాటిన మొక్కను పసిప్లి లెక్క పదింగా పెంచాలె. మొక్కు మొక్కితే కరగని మబ్బు మొక్కు నాటితే కరుణిస్తయి. ఇగ పసిపిగాడి నుంచి పండు ముసలి దాక అందరు కదలాలె. విద్యార్థి సంఘాు, మహిళా సంఘాు, యువజన సంఘాు, అన్ని ప్రజా సంఘాు పిడికిలెత్తి హరిత ఉద్యమం ప్రారంభించాలె. నడుం కట్టాలె. నడుం వంచి చక్కని మొక్కు నాటాలె.

కాుష్యం పొయి మనిషి ఆయుష్యం పెరగాలె. బడీ, గుడీ, మసీదు, గురుద్వార, చర్చిల్ల అయితేంది దఫ్తర్ల, దవఖాన్ల బాటపొంటి, బాయికాడ, చెరువు కట్ట మీద, చేన్ల ఒరా మీద, బస్టేషన్ల, రైల్‌ స్టేషన్ల, పోలీస్‌ స్టేషన్ల, సబ్‌ స్టేషన్ల, నదు వెంబడి, వాగు వెంబడి, గుట్ట మీద, మట్టి పుట్ట మీద, ఇంటి ముంగట, ఇంటెనక, ఏడ జాగుంటే ఆడ చక్కని మొక్కు నాటాలె. మొక్కు నాటిన చేతులే చేతుని చాటాలె. పూజించే చెట్లు, పూలిచ్చే చెట్లు, పండ్లిచ్చే చెట్లు, పసరు మందిచ్చే చెట్లు, ఈ చెట్టు ఆ చెట్టని కాదు అన్ని రకా చెట్లు పెంచాలె. చెరువు కట్ట మీద తాటి వనాు పెంచి కట్ట మైసమ్మకు సాక పొయ్యాలె. ముంతెడు మీసా పోతరాజుకు మోదుగు దొప్ప్ల నైవేద్యం పెట్టాలె. అల్లోనేరడల్లో అని పాడుకుంటూ అ్లనేరేడ్లు నాటాలె. నాటిన మొక్కు మోరసాచి మొగును మొక్కాలె. మొగు మురిసి వరుసబెట్టి వాను కొట్టాలె. నేటి మొక్క రేపటి చెట్టయి, తెంగాణకు చ్లని నీడబడితే మన తెంగాణ మేఘాయమైతది. ప్రతి పల్లె చిరపుంజైతది, చిరాయువైతది. మనం కోల్పోయిన స్వర్గం మ్ల దిగిరావాలె. వసపోయిన పక్షు తిరిగొచ్చి గూళ్లు కట్టుకొని స్లగ బతకాలె. పక్షు కికిలకు పశువు అంబారావాతో తెంగాణ ఆకుపచ్చని పొద్దుపొడవాలె. అందమైన తెంగాణ ఆకుపచ్చని కోన కావాలె. తెంగాణ తల్లి మెడలో హరిత కాంతు ప్రజ జీవితాలో సుఖశాంతు నింపాలె.

మొక్కు నాటిన చేతులే చేతుని చాటాలె. పూజించే చెట్లు, పూలిచ్చే చెట్లు, పండ్లిచ్చే చెట్లు, పసరు మందిచ్చే చెట్లు, ఈ చెట్టు ఆ చెట్టని కాదు అన్ని రకా చెట్లు పెంచాలె.

వృక్షో రక్షతి రక్షితః