ఆరుగురు పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం

ఆరుగురు-పార్లమెంటరీ-కార్యదర్శుల-నియామకం1ఆరుగురు పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రాష్ట్రంలో ఆరుగురు పార్లమెంటరీ కార్యదర్శులను నియమించి, వారికి శాఖలు కూడా కేటాయించారు. పార్లమెంటరీ కార్యదర్శులుగా జలగం వెంకట్రావు, శ్రీనివాసగౌడ్‌, కోవ లక్ష్మి, దాస్యం వినయ్‌భాస్కర్‌, వొడితెల సతీష్‌కుమార్‌, గాదరి కిషోర్‌కుమార్‌లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం గురించి అంతకుముందే ప్రభుత్వం ఆర్డినెన్స్‌ కూడా జారీ చేసింది.
పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమితులైనవారికి డిసెంబర్‌ 29న శాఖలు కేటాయించారు. వీరు ఆయా శాఖలకు అనుబంధంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. జలగం వెంకట్రావు, దాస్యం వినయ్‌భాస్కర్‌లు ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుబంధంగా, శ్రీనివాస్‌గౌడ్‌ ` రెవెన్యూ, కోవ లక్ష్మి ` వ్యవసాయం, సతీష్‌`విద్య, కిశోర్‌`ఆరోగ్యశాఖలకరు అనుబంధంగా పనిచేస్తారు.