ఉద్యమకారుడికి మంత్రి కెటిఆర్‌ చేయూత

ఉద్యమకారుడికి--మంత్రి-కెటిఆర్‌-చేయూత‘ప్రార్థించే చేతులుకన్నా, సహాయం చేసే చేతులే మిన్న’…. అనే సూక్తిని నిజం చేశారు పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి కె. తారక రామారావు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నడిచే రొగులకు అడ్డంగా వెళ్లి తన రెండు కాళ్లు, ఒక చేయిని కోల్పోయి వికలాంగుడైన పిడమర్తి నాగరాజును అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి కెటిఆర్‌ తెలిపారు.

నల్గొండ జిల్లా, గరిడేపల్లి మండం, రాయినిగూడెంకు చెందిన పిడమర్తి నాగరాజు 2011లో తెలంగాణ ఉద్యమ సమయంలో నడిచే వరకు అడ్డంగావెళ్లి తన రెండు కాళ్లు, ఒక చేయిని కోల్పోయాడు. నాగరాజు జూన్‌ 5న సచివాలయానికి వచ్చాడు. డి బ్లాక్‌ వద్ద నాగరాజును గుర్తించిన మంత్రి కెటిఆర్‌ అతని వద్దకు వెళ్లి పులకరించి, అతని పరిస్థితి గురించి ఆరాతీశారు. నాగరాజు దీనస్థితికి చలించిపోయిన మంత్రి కెటిఆర్‌ వెంటనే వ్యక్తిగతంగా లక్ష రూపాయల చెక్కును అతనికి అందజేశారు. ఆర్ధిక సహాయం చేయడమే కాకుండా మిర్యాలగూడ మార్కెట్‌ కమిటీలో క్లర్క్‌ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి, తక్షణమే మార్కెట్‌ కమిటీ కార్యదర్శితో మాట్లాడి ఆదేశాలు జారీచేశారు. భవిష్యత్తులో నాగరాజు కుటుంబానికి ఎలాంటి సహాయమైనా అందజేస్తానని కెటిఆర్‌ హామీ ఇచ్చారు.

పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు స్పందనకి, సహాయానికి నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు. పేదరికంలో ఉన్న తన కుటుంబానికి, తనలాంటి ఉద్యమకారుల పట్ల మంత్రి చూపిన అప్యాయతను జీవితమంతా గుర్తుంచుకుంటానని ఉద్వేగానికి గురయ్యాడు.