|

కదం కదం కలిపి ధూంధాం!!

kcrఇదొక కొత్త సమయం` నవ తెలంగాణ నిర్మాణంలో
నవ నవోదయం జరుగుతున్న సమయం.
ఇదొక కొత్త సందర్భం`
ప్రత్యేక రాష్ట్రం తనదైన పద్ధతిలో ముందుకు సాగుతున్న సందర్భం.
ఇదొక కొత్త వాతావరణం` ప్రజల్లో నడిచిన వారు,
ప్రజతో నడిచిన వారే ప్రజా నాయకుగా ప్రభవించిన వాతావరణం.
ఇదొక కొత్త భవిష్య బింబం` రాష్ట్ర భవితకు భయం లేదని,
భర్‌పూర్‌గా యువ నాయకత్వం కొలువుదీరిందనే భరోసా భాండాగారం.
ఇదొక కొత్త ముక్తకంఠం` పార్టీలు, పదవుకు అతీతంగా
రాజకీయ నాయకులు ఏకమై గొంతెత్తి కలుపుతున్న గళం.
మంత్రులు, అధికారున్న తేడా లేదు.
వృద్ధు, యువకున్న భేదం లేదు.
సీనియర్లు, జూనియర్లన్న వివక్ష లేదు.
ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అన్న విభజన లేదు.
ఆ వర్గం, ఈ వర్గం అన్న వికారాలు లేవు.
అభివృద్ధే అందరి ఆరాటంగా, ప్రతి అడుగూ తెలంగాణ కోలాటంగా పది జిల్లా పయనం పదహారు నొగా సాగుతోంది. ప్రతి ఒక్కరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచుతోంది. నవ తెలంగాణ నగుబాటు పాలైతే నోటితో నవ్వి, నొసటితో వెక్కిరిద్దామనుకున్న శక్తలు ఆశలు ఆవిరయ్యేలా ప్రత్యేక రాష్ట్రం ప్రత్యేకంగా నిలుస్తోంది.
అందివచ్చిన యువ నాయకత్వం
తెలంగాణ  ఉద్యమంలో మొకలెత్తిన యువ నాయకత్వం వారసత్వంగా వట వృక్షంగా మారి ప్రత్యేక రాష్ట్రానికి అద్భుత వరంగా అవతరించింది. దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేనంత మంది యువ నాయకలు తెలంగాణ లో వివిధ పదవులను అధిరోహించి, సృజనాత్మకంగా, విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
హరీశ్‌రావు, తారకరామారావు, ఈటెల, జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, కవిత, ఘంటా చక్రపాణి, రసమయి బాకిషన్‌, పిడమర్తి రవి, దేశపతి శ్రీనివాస్‌ తదితర అనేకమంది పూర్తిగా రాష్ట్ర సేవలో నిమ గ్నమై పునర్నిర్మాణానికి పున్నాది రాళ్లుగా మారుతున్నారు. తుమ్మ నాగేశ్వర్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, జూపల్లి కృష్ణారావు వంటి అనుభవజ్ఞు వారికి తీసిపోకుండా, తమ అనుభవం ఆధారంగా సహకారాన్ని అందజేస్తున్నారు. యువ మంత్రుల్లో ఒక్కొక్కరిది ఒక్కక్క శైలి. ఒక్కొక్కరిది ఒక్కో తరహా. ఉదయం 6 నుంచి రాత్రి 12 దాకా ప్రజ మధ్య గడిపేవారు కొందరు. తెర వెనక మంత్రాంగాన్నంతా గుట్టు చప్పుడు కాకుండా నిర్వహించేవారు మరి కొందరు. పరిపానా వ్యవహారాలను పటిష్ఠంగా చక్కబెట్టే వారు ఇంకొందరు. ప్రత్యర్థి కుట్రలను నిరంతరం గమనిస్తూ ఎత్తుకు పై ఎత్తు వేసేవారు ఇంకొందరు. ఒక్కమాటలో చెప్పాంటే నేటి తెలంగాణ  ప్రభుత్వం అనేకమంది నిపుణలు, అనితర సాధ్యమైన, అచరణాత్మక (ప్రాక్టికల్‌) నైపుణ్యా సమాహారం.

శ్రుతి కలిసిన బృంద గానం
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక పథకాన్ని, కార్యక్రమాన్ని ప్రకటించగానే తత్సంబంధిత బృందం రంగంలోకి దిగుతుంది. ఎవరి పాత్ర ఏమిటి, ఎవరేం చేయాన్నదాన్ని విభజించు కుంటుంది. ఆ వెంటనే కార్యక్షేత్రంలో ప్రవేశిస్తుంది. ఇటీవల జరిగిన గోదావరి పుష్కరాలు కార్యక్రమం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. పుష్కరాలను ఘనంగా నిర్వహించాని కేసీఆర్‌ ఆదేశించినదే తడవు, వ్యూహ రచనా విభాగం రంగంలోకి దిగింది. భక్తు లక్షల్లో వచ్చే అవకాషముందని ముందే సరిగ్గా అంచనాలు వేసింది. ఒకే చోట కాకుండా అనేక ప్రాంతాల్లో ఘాట్లను ఏర్పాటు చేసింది. వాటికి విస్తృత ప్రచారమూ కల్పించింది. అక్కడితో ఆగలేదు. కార్యక్రమం పూర్తయ్యే దాకా అదే శ్రద్ధతో పర్యవేక్షణ జరిగింది. మంత్రులంటే, అపాయింట్‌మెంట్‌ తీసుకుంటే తప్ప కవలేని వారు, ఏసీ రూముల్లో తప్ప ఉండలేని వారు, బుగ్గ కార్లలో తప్ప తిరగలేని వారు, బందోబస్తు ఉంటే తప్ప బయటకు రాలేని వారు అన్న అభిప్రాయాలు జనంలో నాటుకు పోయిన తరుణంలో తెలంగాణ మంత్రులు అందుకు పూర్తి భిన్నమైన దృశ్యాన్ని ఆవిష్కరించారు. మంత్రులు మోటారు సైకిళ్లపై తిరుగుతూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించిన దృశ్యాను ఇటీవలికాంలో దేశంలో మరెక్కడైనా మనం చూడగలిగామా? మంత్రి మొదు కొని మామూు నాయకుడి దాకా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా కార్యక్రమాను పర్యవేక్షించారు. ఈ చొరవ వల్లే ఒక్క ప్రమాదం కూడా లేకుండా పుష్కరాు ప్రశాంతంగా పూర్తయ్యాయి. పకడ్బందీ ప్లానింగ్‌, ఫూల్‌ప్రూఫ్‌ ఇంప్లిమెంటేషన్‌ వల్లే ఈ విజయం సాధ్యమైంది.

జనమే మనం` జనమే జయం
ఒక్క పుష్కరానే కాదు. నిశితంగా గమనిస్తే మరొక గొప్ప విషయం బయటపడుతుంది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మొదుకుని తెంగాణ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ, తమ కార్యాయంలో ఉండే సమయం కన్నా, జనం మధ్య ఉండే సమయమే ఎక్కువ. నినాదాు లేవు. ప్రచారాు లేవు. పటాటోపాు లేవు. ఆర్భాటాు లేవు. హంగు లేవు. కానీ పొద్దున లేస్తే మంత్రు, ఎమ్మెల్యేు ఏదో ఒక ఊర్లో ఉంటారు. ఏదో ఒక సమావేశంలో పాల్గొంటారు. ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రజతో సమస్యు పంచు కుంటారు. జనం కష్టాను తొసుకుంటారు. వీలైతే అక్కడికక్కడే పరిష్కరిస్తారు. గతంలో ముఖ్యమంత్రి సభ అంటే రోజు తరబడి ఏర్పాట్లు, అధికార యంత్రాంగమంతా మిగతా పనున్నీ వదలిపెట్టి అందుకోసమే సమయాన్ని వెచ్చించడం, వే కొద్దీ జనాన్ని తరలించడం, కోట్ల కొద్దీ ఖర్చు ఉండేవి. మరి ఇప్పుడు? ఎర్రవెల్లిలోని వేప చెట్టు కింది రచ్చబండ మీద కూర్చుని ముఖ్యమంత్రి గ్రామసభ నిర్వహిస్తారు. చిన్న మ్కునూరు చెరువు కట్ట పక్కన జనంతో మాట్లాడతారు. పార్శీగుట్ట గల్లీలో ఇంటి ముందు గట్టు మీద కూర్చుని ప్రజతో మాట్లాడతారు. ఒక ముఖ్యమంత్రి గ్రామస్థాయికి వెళ్లి జనంతో మాట్లాడడం ఇదివరకెప్పుడైనా కనిపించిందా? ఇక హరీశ్‌రావు, ఈటె వంటి మంత్రుకు రాష్ట్రంలో తెలియని ఊరు, చూడని పల్లె లేదంటే అతిశయోక్తి లేదు. మాక్రో టార్గెట్స్‌ (భారీ క్ష్యాను) సాధించేందుకు తెంగాణలో ఇప్పుడు మైక్రో లెవెల్‌ గవర్నెన్స్‌ (సూక్ష్మ స్థాయి) పరిపాన సాగుతోందని ఒక నిపుణుడు విశ్లేషించారు.

సర్కారు త్రివిధ వ్యూహం
స్థూంగా గమనిస్తే ప్రభుత్వం ప్రధానంగా మూడు ప్రాథమ్యాతో పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. 1. దీర్ఘకాలికంగా ఫలితాలిచ్చే అధిక వ్యయంతో కూడుకొన్న భారీ పథకాు` ప్రాజెక్టు రీ డిజైన్‌, విద్యుత్కేంద్రా నిర్మాణం, వాటర్‌గ్రిడ్‌, హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం మొదలైనవి. 2. సామాజిక భాగస్వామ్యం అవసరమయ్యే, తక్కువ ఖర్చుతో కూడిన, స్వ్పకాలిక పథకాు` మిషన్‌ కాకతీయ, హరిత హారం, గ్రామ జ్యోతి మొదలైనవి. 3. ప్రజ తక్షణావసరాను తీర్చే, కొద్ది మొత్తాు ఖర్చయ్యే, సంక్షేమ పథకాు` హాస్టల్‌ విద్యార్థుకు సన్నబియ్యం, ఆసరా పెన్షన్లు, స్కార్‌షిప్పు, దీపం పథకం వంటివి. ఏడాదిన్నర పాన ఎలాంటి ఒడిదొడుకు లేకుండా సాగడానికి ప్రధాన కారణం` ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివేచనతో పనిచేయడం. ఏ అంశంపైనా మొండి పట్టుదకు పోకుండా, ఎప్పటికప్పుడు మంచిచెడ్డను బేరీజు వేసుకుంటూ, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయాల్లో ప్రభుత్వం మార్పు చేర్పు చేసుకుంటుంది. పేద ప్రాణాకు గుదిబండగా మారిన గుడుంబాను అరికట్టే సదుద్దేశంతో చౌకమద్యం తేవాని భావించినా, దానిపై ప్రజల్లో అపోహు ఏర్పడ్డాయని భావించిన వెంటనే ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైనింగ్‌పై కొన్ని జిల్లాల్లో అపోహు ఏర్పడ్డట్టు గుర్తించగానే దాన్ని సరిదిద్దేలా తక్షణ చర్యు తీసుకుంది. ఈ ఏడాదిన్నర కాంలో అధికార వర్గాు ప్రజకు మరింత చేరువయ్యాయి. ప్రజకే నేరుగా మంత్రును సంప్రదించే వాతావరణం ఉండడంతో అధికాయి సైతం భయభక్తుతో, నిబద్ధతతో పనిచేయాల్సిన వాతావరణం. తెంగాణ ఏర్పడ్డాక ఒక్క కుంభకోణం చోటుచేసుకోలేదు. ఒక్క మంత్రీ అవినీతి ఆరోపణల్లో కూరుకుపోలేదు. రైట్‌ ట్రాక్‌లో ఉన్నామనడానికి ఇంతకంటే ఏం కావాలి?