| |

కాళేశ్వరం పనులను పరిశీలించిన గవర్నర్‌

tsmagazineమంత్రి భుజం తట్టి అభినందించిన గవర్నర్‌
కన్నేపల్లి ప్రధాన పంపుహౌజ్‌ సహా అన్నారం,సుందిళ్ళ బ్యారేజీ లను గవర్నర్‌ నరసింహన్‌ సందర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మాణ పనులను ఏరియల్‌ సర్వే ద్వార పరిశీలించారు. ఇరిగేషన్‌ రంగంపైనా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, దాని ఫలితాలపైనా మంత్రి అవగాహన, పట్టు గవర్నర్‌ను ఆకర్షించాయి. మంత్రి భుజం తట్టి గవర్నర్‌ ప్రశంసించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో దాదాపు 125 కిలోమీటర్ల దూరమంతా గోదావరిని సజీవంగా ఉంచేందుకు రచించిన ప్రణాళికలు, అమలు చేస్తున్న తీరు, ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు జీవనాధారంగా ఎలా మారుతుందో గవర్నర్‌కు హరీశ్‌రావు వివరించారు. కాళేశ్వరం భారత్‌ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి దిక్సూచి అవుతుందో గవర్నర్‌ కు హరీశ్‌ వివరించారు. రైతు ఆత్మహత్యలను నివారించడానికి కాళేశ్వరం ఒక్కటే శరణ్యం అని గవర్నర్‌ కు వివరించారు. మూడు బ్యారేజీలు,మూడు పంపు హౌజ్‌ లు, గ్రావిటీ కెనాల్‌ నిర్మాణాలు జరుగుతున్న తీరు, వేలాదిమంది కార్మికులు,యంత్రాల ధ్వని తో కాళేశ్వరం ప్రాంతం మారుమోగుతుండడం పట్ల నరసింహన్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఆయన సమస్యలు తెలుసుకున్నారు.ఈ ప్రాజెక్టు కోసం జరుగుతున్న పనులు,దీనికయ్యే విద్యుత్తు, టి.ఎం.సి.లు,మోటార్లు, పంపులు, వాటి బిగింపు షెడ్యూల్‌ గురించి గవర్నర్‌ ఎంతో ఆసక్తి గా తెలుసుకున్నారు.
tsmagazine
ఇరిగేషన్‌ మంత్రి హరీశ్‌ రావు రెండు రోజుల పాటు జరిపిన కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో పనుల పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర గవర్నర్‌ వెంట పర్యటించిన మంత్రి ఎడతెరిపి లేకుండా క్షేత్ర స్థాయి పర్యటన లు,సమీక్ష సమావేశాలు జరిపారు. కాళేశ్వరం ప్యాకేజి 6, 7, 8 పనులను ముఖ్యంగా టన్నెల్‌ తవ్వకాల ను పరిశీలించి వాటి పురోగతిని అక్కడే సైటులో సమీక్షించారు. గోలివాడ, సుందిళ్ళ,అన్నారం పంపు హౌజ్‌ ల పనుల పురోగతిని సమీక్షించారు. కన్నెపల్లి పంపు హౌజ్‌ దగ్గర కాళేశ్వరం పనులపై ఇరిగేషన్‌ ఇంజనీర్లు, ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షించారు. కాళేశ్వరంను ఇరవై నెలల్లో పూర్తి చేయనున్నట్టు హరీశ్‌రావు చెప్పారు.అత్యంత వేగంగా అటవీ, పర్యావరణ అనుమతులు సాధించడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాత్రమే సాధ్యపడిందన్నారు. గత ప్రాణహిత- చేవెళ్ల డిజైన్లో తమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యత లేదని సి.డబ్ల్యు.సి తేల్చడంతో సి.ఎం.కేసీఆర్‌ మేడిగడ్డను ఎంపిక చేశారని హరీశ్‌ రావు గుర్తు చేశారు.వచ్చే జూన్‌, జూలై నాటికి సుందిళ్ళ, అన్నారం ఆనకట్టలను పూర్తి చేయడానికి పట్టుదలతో పని చేస్తున్నట్లు తెలిపారు.

కన్నెపల్లి పంపు హౌజ్‌ దగ్గర కాళేశ్వరం పనులపై ఇరిగేషన్‌ ఇంజనీర్లు, ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షించారు. కాళేశ్వరంను ఇరవై నెలల్లో పూర్తి చేయనున్నట్టు హరీశ్‌రావు చెప్పారు.అత్యంత వేగంగా అటవీ, పర్యావరణ అనుమతులు సాధించడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాత్రమే సాధ్యపడిందన్నారు.

మేడిగడ్డ బ్యారేజీని 2018 చివరి నాటికి పూర్తి చేస్తామని హరీశ్‌ రావు ప్రకటించారు. కాళేశ్వరంప్రాజెక్ట్‌ పనుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నామని చెప్పారు.రోజుకు రెండున్నర లక్షల సిమెంటు బస్తాలు వాడుతున్నట్టు మంత్రి చెప్పారు. కన్నేపల్లి – అన్నారం ఆప్రోచ్‌ కాలువ పనులను ఆయన పరిశీలించారు. వచ్చే మే నెలకల్లా ఈ కెనాల్‌ ను పూర్తి చేయాలని ఏజెన్సీ ని ఆదేశించారు.ఈప్రాజెక్ట్‌ పూర్తయితే 125 కిలోమీటర్ల మేర నదిలో 365 రోజుల మేర నీరు నిల్వ ఉంటుందన్నారు. సుందిళ్ళ, అన్నారం, మేడి గడ్డ ఆనకట్టలపై జాతీయ రహదారుల ప్రమాణాలతో రోడ్‌ బ్రిడ్జ్‌ లు నిర్మిస్తున్నట్టు మంత్రి తెలియజేశారు. భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా పంట పొలాలకు నీరిచ్చేలా చిన్నపాటి ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టు హరీశ్‌ రావు పేర్కొన్నారు.మంథని అసెంబ్లీ నియోజకవర్గం లోని ప్రతి ఎకరానికి సాగు నీరందుతుందన్నారు. చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి రెండో దశ అటవీ అనుమతులు వచ్చినందున ఈ పథకం త్వరగా పూర్తి చేసి రెండు పంటలకు నీరివ్వాలని కన్నెపల్లి పంపు హౌజ్‌ దగ్గర సమీక్షలో అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పెద్దపల్లి జిల్లా మంథని రూపు రేఖలు మారనున్నట్టు మంత్రి అన్నారు.అటు ఎస్‌.ఆర్‌.ఎస్‌.పి,ఇటు కాళేశ్వరం, చిన్న కాళేశ్వరం, మంథని లిఫ్ట్‌ పథకాలతో మొత్తం మంథని అసెంబ్లీ నియోజక వర్గం సమగ్రాభివృద్ధి చెందుతుందన్నారు. కాళేశ్వరం గొప్ప పర్యాటక కేంద్రంగా మారుతుందన్నారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందడం వల్ల ఎంతో మందికి జీవనోపాధి లభిస్తుందన్నారు. నౌకాయానం అభివృద్ధి జరుగుతుందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు.చిన్న కాళేశ్వరం లిఫ్టు తో మంథని లో 40 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని ఆయన చెప్పారు.