|

కొత్త జిల్లాలు వస్తున్నాయి!

kcrకొత్త జిల్లాలు వస్తున్నాయి!
తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడనున్నాయి. సెప్టెంబర్‌ 2 న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు కీలక నిర్ణయం గైకొన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నీటిపారుదల ప్రాజెక్టు, రెండు బెడ్‌ రూమ్‌ ఇళ్లు, మార్కెట్‌ కమిటీకు రిజర్వేషన్లు, గుడుంబా నియంత్రణ వంటి పలు నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మంత్రివర్గ నిర్ణయాలను వేలడించారు.
‘‘ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లా ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేపట్టాం. దేశంలో సగటున ప్రతి 19 లక్ష జనాభాకు ఒక జిల్లా ఉండగా, తెలంగాణ లో 35 లక్ష జనాభాకు ఒక జిల్లా ఉంది. ప్రజా సౌభ్యం కోసం కొత్త జిల్లాలు అవసరమని భావిస్తున్నాం. ఎక్కడెక్కడ కొత్త జిల్లాలు అవసరమో గుర్తించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన , రెవెన్యూ కార్యదర్శి, మరో ఇద్దరు కార్యదర్శు సభ్యులుగా అధ్యయన కమిటీని ఏర్పాటుచేశాం. సత్వరమే నివేదిక ఇవ్వాలని కోరాం. నివేదిక అందిన వెంటనే నిర్ణయం తీసుకుంటాం’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు తెలిపారు.
ప్రాజెక్టులకు రూ. 81 వేల కోట్లు
రాష్ట్రంలో పెండిరగ్‌ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రానున్న మూడేళ్ళలో ఏటా 25 వే కోట్ల రూపాయు కేటాయిస్తామని, ఈ ఏడాదిలో నెలకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. త్వరలోనే తెలంగాణ జల సమగ్ర వినియోగ విధానాన్ని ప్రకటిస్తామని చెప్పారు. మొత్తం 81 వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని, పెండిరగ్‌ ప్రాజెక్టు అన్నీ పూర్తిచేస్తామని సి.ఎం ప్రకటించారు.
తెలంగాణ రైతాంగానికి సంతోషం కల్గించేలా ప్రాజెక్టు రీ డిజైనింగ్‌ ప్రక్రియ పూర్తి కావస్తున్నదని, కాళేశ్వరం ఎత్తిపోత పథకం చేపట్టేందుకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయనున్నట్టు, పామూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సకాలంలో పూర్తిచేసేందుకు ప్రాజెక్టు అధారిటీ ఏర్పాటుపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు సి.ఎం కె.సి.ఆర్‌ తెలిపారు.
రెండు పడక గదు ఇళ్లు
రాష్ట్రంలో పెండిరగ్‌ లో ఉన్న పక్కా ఇళ్లను పూర్తిచేయడంతోపాటు , ఈ ఏడాది 60 వేల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు నిర్మిస్తామని సి.ఎం తెలిపారు. ఇందుకు గాను 3,900 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాలో రూ. 5.04 లక్ష రూపాయలతో 500 అడుగు విస్తీర్ణంలో ఇండ్లు నిర్మించాలని నిర్ణయించాం. పట్టణ ప్రాంతాలో కూలీ రేట్లు ఎక్కువగా వుండటాన్ని దృష్టిలో ఉంచుకోని 5.30 లక్ష రూపాయల వ్యయంతో ఇండ్లు నిర్మించాలని నిర్ణయించాం. హైదరాబాద్‌ లోని ఐ.డి.హెచ్‌ కాలనీలో నిర్మించిన ఇండ్ల నమూనాలోనే అన్ని ఇండ్లను నిర్మిస్తాం. గతంలో మంజూరైన ఇండ్ల నిర్మాణంలో అవినీతి చోటుచేసుకుంది. నిజమైన బ్దిదారును కలెక్టర్లు విచారణచేసి , ఎంపిక చేస్తారు. పూర్తయిన వాటికి బ్లిలు చెల్లింపు చేస్తాం. పూర్తికాని వాటిని పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
సెల్‌ ఫోన్ల పరిశ్రమకు రాయితీలు
రాష్ట్రంలో అనేక సంస్ధు సెల్‌ ఫోన్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. వాటికి ప్రత్యేక రాయితీలు కావాలని ఇండియన్‌ స్యొలార్‌ అసోసియేషన్‌ ప్రభుత్వాన్ని కోరింది. దీనిని అంగీకరించి , రాయితీ కోసం ప్రత్యేక విధానానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్టు సి.ఎం చెప్పారు.
చీప్‌ లిక్కర్‌ పై సమరం
మద్యంపై పాత విధానమే అములో వుంటుందని, గుడుంబాపై ఉక్కుపాదం మోపుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వేలడించారు. గుడుంబా తయారుచేసేవారిపై అవసరమైతే పి.డి. కేసులు నమోదు చేస్తామన్నారు. ఐ.జి స్థాయి అధికారితో ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌లను ఏర్పాటు చేస్తామని వేలడించారు.
గుడుంబా తాగటం వల్ల కలిగే అనర్థాను అరి కట్టేందుకు చీప్‌ లిక్కర్‌ను ప్రవేశపెట్టాలని మొదట్లో భావించి నప్పటికీ సమాజం నుంచి మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఈ ఏడాదికి పాత విధానాన్నే కొనసాగించాని మంత్రివర్గం నిర్ణయించిందని ముఖ్యమంత్రి తెలిపారు.

మార్కెట్‌ కమిటీకు రిజర్వేషన్లు
రాష్ట్రంలోని 183 మార్కెట్‌ కమిటీలో ‘పీసా’ చట్టం క్రింద ఉన్న 13 కమిటీను పూర్తిగా ఎస్‌.టి కే కేటాయిస్తాం. మిగతా 170 మార్కెట్‌ కమిటీలో 50 శాతం కమిటీలో రిజర్వేషన్లు వర్తింపజేస్తాం. ఇందులో ప్రధానంగా ఎస్‌.సి, ఎస్‌.టి. బి.సి, మైనారిటీ , మహిళకు రిజర్వేషన్లు వుంటాయి. ఇక రిజర్వేషన్లు లేని 85 కమిటీకు లాటరీ పద్ధతిలోఎంపిక జరుగుతుంది. పైరవీకి ఆస్కారం లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సి.ఎం తెలిపారు. తర్వాతి నుంచి రొటేషన్‌ పద్ధతిలో ఉంటుందన్నారు.
జి.హెచ్‌.ఎం.సి కి సిటీ ఆర్టీసి బాధ్యత
ఆర్‌.టి.సి కార్మికులకు సమ్మె సమయంలో మంచి ఫిట్మెంట్‌ ఇచ్చాం. ప్రజలకు మంచి రవాణా సౌకర్యం కల్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. టి.ఎస్‌.ఆర్‌.టి.సి రోజుకు 96 లక్ష మందిని గమ్యానికి చేరుస్తోంది. హైదరాబాద్‌ నగరంలో ఈ సంస్థ 218 కోట్ల రూపాయ నష్టంలో వుంది. ప్రపంచంలో ఎక్కడైనా అర్బన్‌ ట్రాన్స్‌పోర్టు ను ప్రభుత్వం నిర్వహిస్తూ వుంటుంది. మన దగ్గర అలాంటి పరిస్థితి లేదు.
హైదరాబాద్‌ నగరంలో ఆర్‌.టి.సి 3,800 బస్సు తిప్పుతోంది. ఈ ఏరియా ఆర్‌.టి.సి నష్టాలను ఇక జి.హెచ్‌.ఎం.సి భరిస్తుంది. దీనికోసం టి.ఎస్‌.ఆర్‌.టి. సి లో జి.హెచ్‌.ఎం.సి కమీషనర్‌ బోర్డు మెంబరుగా ఉంటారు. బస్టాండ్ల నిర్మాణం, తదితర అంశాపై కమీషనరే నిర్ణయం తీసుకుంటారు.
టి.ఎస్‌. ఆర్‌.టి.సి అభివృద్ధి చెందేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సి.ఎం తెలిపారు.
మంత్రివర్గం గైకొన్న ఇతర నిర్ణయాలు
ఖీ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్ళ వయోగపరిమితిని సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుద చేసిన ఉత్తర్వులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఖీ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం కరవు భత్యం విడుదలకు మంత్రివర్గ ఆమోదం.
ఖీ రాష్ట్రంలో వృత్తిపన్ను చట్టం, వ్యాట్‌ చట్టంలో మార్పు
ఖీ హైదరాబాద్‌ మహానగరంలో 2,631 కోట్ల రూపాయతో మల్టీలెవల్‌ ఫ్లై ఓవర్ల నిర్మాణం.
ఖీ తెంగాణ సహకార బ్యాంకు ద్వారా రైతుకు పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, మహిళా సంఘాలకు రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాలు ఇవ్వడానికి గాను, నాబార్డు నిబంధన మేరకు 2,500 కోట్ల రూపాయకు ప్రభుత్వం పూచీకత్తు.
ఖీ సహకార పరపతి సంస్థలో 25 శాతానికి మించిన ప్రభుత్వ వాటాధనాన్ని గ్రాంటుగా మార్చడం.
ఖీ నిజామాబాద్‌ జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాుతుమ్మెద, కరీంనగర్‌ జిల్లా జమ్మి కుంట్లలో వ్యవసాయ పాలిటెక్నిక్‌ు, మహబూబ్‌ నగర్‌ జిల్లా పాలెంలో వ్యవసాయ కళాశా ఏర్పాటు.
ఖీ రాష్ట్ర నర్సింగ్‌ మండళి, గిడ్డంగు సంస్థ ఏర్పాటు. రాష్ట్ర టెక్నాజీ సంస్థ ఏర్పాటు.
ఖీ తెలంగాణకు పుష్కంగా నీటిని అందించగ ప్రాణహిత, ఇంద్రావతి, గోదావరి నదు నీటి భ్యతను పూర్తిస్థాయిలో వినియోగించుకొనేందుకు నిర్ణయం.
ఖీ ఎక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్ల ఏర్పాటుకు నిర్ణయం.