చెత్త సేకరణకు అదనపు వాహనాలు


గ్రేటర్‌ హైదరాబాద్‌లోని గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లను జీరో గార్బేజ్‌ స్టేషన్లుగా, నగరంలో పారిశుధ్య కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి సర్కిల్‌కు అదనంగా నాలుగు మినీ టిప్పర్లు, రెండు బాబ్‌కాట్‌లు అందించడంతో చెత్తను ఎప్పటికప్పుడు తరలించడం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయి.

ప్రతిరోజు నగరం నుండి జవహర్‌నగర్‌ డంప్‌యార్డ్‌కు 5వేల మెట్రిక్‌ టన్నుల నుండి 6వేల మెట్రిక్‌ టన్నుల వరకు గార్బేజ్‌ను తరలిస్తుండగా ప్రతి సర్కిల్‌కు ఈ అదనపు వాహనాలను కేటాయించడంతో జవహర్‌నగర్‌కు వెళ్లే చెత్త 7వేల టన్నులకు చేరింది. ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌లో 2500 స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటి నుండి చెత్త సేకరించి వివిధ ప్రాంతాల్లో ఉన్న 17ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లకు పంపిస్తున్నారు. వీటితో పాటు జిహెచ్‌ఎంసి వాహనాల ద్వారా కూడా రోడ్లపై స్వీపింగ్‌ ద్వారా వచ్చిన వ్యర్థాలను ఈ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లకు పంపిస్తున్నారు.

అయితే వరుస పండుగలు, నిరంతర వర్షాల వల్ల అధిక పరిమాణంలో గార్బేజ్‌ వివిధ ప్రాంతాల్లో పేరుకొని ఉండడం, ఈ గార్బేజ్‌ను తొలగించేందుకు తగు మొత్తంలో వాహనాలు లేవని డిప్యూటి కమిషనర్లు, మెడికల్‌ ఆఫీసర్లు జిహెచ్‌ఎంసి కమిషనర్‌కు పలుమార్లు విజ్ణప్తి చేయడం జరిగింది. ఇటీవల జిహెచ్‌ఎంసి కార్యాలయంలో పారి

శుధ్య నిర్వహణపై సమీక్ష నిర్వహించిన మున్సిపల్‌ శాఖ మంత్రి కె.టి.రామారావు, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌లకు కూడా ఈ సమస్యను ప్రస్తావించి అదనపువాహనాలను కేటాయించాల్సిందిగా విజ్ణప్తి చేశారు. దీంతో ప్రతి సర్కిల్‌కు నాలుగు మినీ టిప్పర్లు, రెండు బాబ్‌కాట్‌లను అదనంగా కేటాయించడంతో నగరంలోని గార్బేజ్‌ను ఎప్‌టికప్పుడు తొలగిస్తున్నారు.

ప్రస్తుతం ట్రాన్స్‌ఫర్‌స్టేషన్లకు గార్బేజ్‌ పంపించేందుకుగాను 532 వాహనాలను జిహెచ్‌ఎంసి ఉపయోగిస్తోంది. ఈ 532 వాహనాల్లో 108 డంపర్‌ ప్లేసర్లు, 256 మినీ టిప్పర్లు, 37 రెఫ్యూజ్‌డ్‌ కంప్యాక్టర్లు, 8 పెద్ద కంప్యాక్టర్‌ వాహనాలు, మూడు 10టన్నుల టిప్పర్లు, 17ట్రాక్టర్లు, 86 బాబ్‌కాట్‌లు, ఆరు జె.సి.బిలు, ఐదు ఫ్రంట్‌ ఎండ్‌లోడర్లు, ఆరు సి.ఎస్‌.ఆర్‌ ఆటోలు ఉన్నాయి. ఇవే కాకుండా ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల నుండి గార్బేజ్‌ను జవహర్‌నగర్‌ డంప్‌యార్డ్‌కు తరలించేందుకు 201 వాహనాలను ఉపయోగిస్తున్నారు. వీటిలో 125 టన్నుల సామర్థ్యం గల 164 వాహనాలు, నాలుగు ఎక్జావేటర్లు, 32 జె.సి.బిలు, ఒక బాబ్‌కాట్‌లు ఉన్నాయి. ప్రతి సర్కిల్‌కు ఈ అదనపు వాహనాల కేటాయింపు ద్వారా నగరంలోని అన్ని ట్రాన్స్‌ఫర్‌స్టేషన్లను ఎప్పటికప్పుడు జీరో గార్బేజ్‌ స్టేషన్లుగా మారుస్తున్నామని, నగరంలోని చెత్తను కూడా ఎప్పటికప్పుడు తొలగిస్తుండడంతో జవహర్‌నగర్‌కు వెళ్లే గార్బేజ్‌ పరిమాణం 7వేల టన్నులకు చేరిందని జిహెచ్‌ఎంసి ట్రాన్స్‌పోర్ట్‌ విభాగం డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి వివరించారు.

నిరుపయోగ వస్తువుల సేకరణకు స్పెషల్‌ డ్రైవ్‌

మీ ఇంట్లో పనికిరాని వస్తువులు ఉన్నాయా…ఉంటే వాటిని రోడ్లపైగాని, చెత్తకుప్పల్లో గాని, నాలాల్లో వేయవద్దు. వీటిని మీ ఇంటి వద్దనుండే జిహెచ్‌ఎంసి సేకరించనున్నది. ఈ నిరుపయోగ వస్తువులను సేకరించేందుకు జిహెచ్‌ఎంసి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తుంది. నవంబర్‌ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు పదిరోజుల పాటు జిహెచ్‌ఎంసి పరిధిలోని ఇళ్లలో వృథాగా ఉన్న పాత వస్తువులు, కూలర్లు, పరుపులు, మెత్తలు, పనిచేయని ఎలక్ట్రానిక్‌ వస్తువులు, విరిగిన కుర్చీలతో పాటు ఇతర నిరుపయోగ వస్తువులను ఈ ప్రత్యేక డ్రైవ్‌లో సేకరించాలని నిర్ణయించారు.

నగరంలో ఈ పనికిరాని వస్తువుల న్నింటిని రహదారులకు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో, నాలాల్లో వేస్తున్నారు. తద్వారా నాలాలు, మ్యాన్‌హోళ్లు జామ్‌ కావడంతో రోడ్లపై మురుగునీరు పొంగ డం, నాలాల ద్వారా నీరు సక్రమంగా ప్రవహించకుండా రహదారులు జలమయం కావడం నగరంలో సాధారణంగా మారింది. ఇటీవల నగరంలోని ఖాళీ స్థలాలు, పార్కులు, రహదారులవెంట ప్లాస్టిక్‌ ఏరివేత కార్యక్రమాన్ని జిహెచ్‌ఎంసి విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్లాస్టిక్‌ డ్రైవ్‌ ద్వారా 150 మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ను జిహెచ్‌ఎంసి సేకరించింది. తద్వారా ఇటీవలకాలంలో వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల నాలాలు, డ్రెయిన్‌ లు, మ్యాన్‌హోళ్లలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు తక్కువగా ఉండడంతో వరదనీరు సక్రమంగా పారేందుకు అవకాశం ఏర్పడింది. ఇదేమాదిరిగా ప్లాస్టిక్‌ ఏరివేత వల్ల వచ్చిన సత్ఫలితాల దృష్ట్యా ఇళ్లలోని వృథా వస్తువులను కూడా సేకరించేందుకు జిహెచ్‌ఎంసి ప్రణాళికలు రూపొందిం చింది. దాదాపు 10రోజుల పాటు కొనసాగే ఈ డ్రైవ్‌లో రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేసన్లు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. ఇందుకుగాను ఆర్‌.డబ్య్లూ.ఏలు, ఎన్‌.జి. ఓలు, మహిళా సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నిరుపయోగ వస్తువులన్నింటిని జిహెచ్‌ఎంసికి అందజేయాలని విజ్జప్తి చేయనున్నారు. కాగా ఈ నిరుపయోగ వస్తువుల సేకరణకు ప్రతి డివిజన్‌లో ఒక స్థలాన్ని ఎంపిక చేసి ఆయా స్థలాలకు ఈ వస్తువులను తెచ్చి వేయవచ్చని కూడా జిహెచ్‌ఎంసి ఏర్పాటు చేస్తోంది.