చేతల్లో స్నేహభావం

సకల జనుల సమ్మెలో మొదటి సైరన్‌ మోగించింది సింగరేణి కార్మికులు.
బస్సులను డిపోలకే పరిమితం చేసి రోడ్లపైకి వచ్చింది ఆర్టీసీ కార్మికులు.
పాలకుల కండ్లు బైర్లు కమ్మేలా చేసింది వెలుగునిచ్చే విద్యుత్‌ ఉద్యోగులు.
బడి గంటలు బంద్‌ పెట్టి, ఉద్యమ పాఠాలు మొదలు పెట్టింది ఉపాధ్యాయులు.
సహాయ నిరాకరణతో సర్కార్‌కు ముచ్చెమటలు పోయించింది ఉద్యోగులు.
బెదిరిస్తే పారిపోక ఎదిరించి నిలబడి కలబడిరది కాంట్రాక్టు ఉద్యోగులు.

ఇలా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రతీ రంగానికి చెందిన ఉద్యోగుల పాత్ర ఎంతో ఉంది. అందుకే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతీ ఒక్కరినీ గుర్తు పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉంటుందని ప్రమాణ స్వీకారం చేసిన రోజే చాటి చెప్పిన కేసీఆర్‌.. అడుగడుగునా అదే స్ఫూర్తి కనబరుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి పి.ఆర్‌.సి.ని చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రకటించారు కేసీఆర్‌. గత పాలకులు కొసిరి కొసిరి బేరమాడి, అరకొర పీఆర్సీలు విదిలిస్తే.. కేసీఆర్‌ మన ఉద్యోగులకు కడుపునిండా పీఆర్సీ ఇస్తానని చెప్పి మరీ మాట నిలుపుకున్నారు. 43 శాతం ఫిట్‌ మెంట్‌ ప్రకటించి మిగతా పాలకులకు ఆదర్శంగా నిలిచారు.

ఉద్యోగుల జీవన ప్రమాణాలు పెరగడానికి ఈ నిర్ణయం ఎంతో దోహదం చేసింది. 1999లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 25 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే, తర్వాత నాలుగేళ్లకు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కేవలం 16 శాతం ఫిట్‌మెంట్‌ మాత్రమే ఇచ్చారు. మరో ఐదేళ్ల తర్వాత అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య 39శాతం ఇచ్చారు. వీటన్నింటినీచేతల్లో-స్నేహభావం6 తలదన్నే విధంగా తెలంగాణ రాష్ట్రంలో తొలి పీఆర్సి ఫిట్‌మెంటు 43 శాతంగా కేసీఆర్‌ నిర్ణయించారు. ఎటువంటి బేరసారాలు లేకుండా, ఉద్యోగులు ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలేవీ చేయకున్నా… అన్ని వైపులా తానే నిలబడి న్యాయం చేశారు. పెరిగిన జీతాలను తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 2014 జూన్‌ 2 నుంచి ఇవ్వాలని కూడా నిర్ణయించారు. పెరిగిన జీతాల వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.6500 కోట్ల భారం పడినప్పటికీ అది భరించలేనిది కాదని ప్రకటించి కేసీఆర్‌ పెద్ద మనసును చాటుకున్నారు. కేవలం పిఆర్సీ ప్రకటించడం మాత్రమే కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల క్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.

శ్రీ ప్రభుత్వ ఉద్యోగుల పట్ల, వారి పనితీరు పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రా వుకు అచంచల విశ్వాసం ఉంది. అందుకే ప్రభుత్వం ఏ ప్రతిష్టాత్మకమైన కార్య క్రమం తీసుకున్నా దానికి ఉద్యోగులనే సారథులుగా ఉపయోగిస్తున్నది. విద్యుత్‌ ఉత్పత్తి రంగమయినా, వాటర్‌ గ్రిడ్‌ పనులైనా ప్రభుత్వ పరంగానే నిర్వహించాలనే ముఖ్యమంత్రి దృఢ సంకల్పం వెనుక ఉద్యోగులపై నమ్మకమే కారణంగా ఉంది.

శ్రీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్‌ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను కూడా కలుపుకుని ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఇంక్రిమెంట్‌ ఇచ్చింది. ఇది భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వమూ కూడా ఇవ్వని అరుదైన ఇంక్రిమెంటు. 2014 ఆగస్టు నుంచి ఈ ఇంక్రిమెంటు అందుతున్నది. ప్రభుత్వ డిగ్రీ కాలేజి, పాలిటెక్నిక్‌ ఉద్యోగులతో పాటు యుజిసి, ఎఐసిటిఇ ఆమోదం పొందిన యూనివర్సిటీల ఉద్యోగులకు కూడా ఇంక్రిమెంటు వర్తింపచేస్తున్నది.

శ్రీ తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీ కరించాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకు న్నది. దశలవారీగా క్రమబద్దీకరణకు కార్యాచరణ రూపొం దించుకున్నది. ఇంతకాలం ప్రభుత్వాలు వీరికి ఎలాంటి ఉద్యోగ భద్రత కల్పించలేదు. వెట్టి చాకిరీ చేయించుకున్నది.

శ్రీ రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లందరికీ హెల్త్‌ కార్డులు అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీపావళి పండుగ నాడు కార్యక్రమాన్ని ప్రారంభించి, ఆ ప్రక్రియ కొనసాగిస్తున్నది. ఏ ఉద్యోగికి అయినా.. ఎంత ఖర్చయినా భరించి వారి ఆరోగ్యాన్ని రక్షించాలని, రోగం నయం చేయించాలని ప్రభుత్వం బాధ్యత తీసుకున్నది. ఉద్యోగులు ఒక్క రూపాయి కూడా వాటా ధనం చెల్లించకుండానే హెల్త్‌ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
శ్రీ సకల జనుల సమ్మె కాలాన్ని వేతనంతో కూడిన సెలవు దినాలుగా ప్రకటించింది ప్రభుత్వం.
శ్రీ ప్రభుత్వ ఉద్యోగులను చీటికి మాటికి బదిలీ చేయవద్దని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నది. అసాధారణ కారణాలుంటే తప్ప కనీసం రెండేళ్ల వరకు బదిలీ చేయవద్దని నిర్ణయించింది. ఉద్యోగుల విధి నిర్వహణలో రాజకీయ జోక్యాన్ని పరిమితం చేసింది.

శ్రీ ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురా వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రక్రియ సాగుతున్నది.
శ్రీ ప్రతీ శాఖలో ఖాళీలన్నీ భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే విద్యుత్‌, పంచాయితీరాజ్‌, నీటి పారుదల శాఖ లాంటి కొన్ని శాఖలకు సంబంధించి ఉద్యోగాల భర్తీ కార్యక్రమం ప్రారంభమయింది. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన పూర్తి స్థాయిలో జరిగిన తర్వాత మరింత స్పష్టత వస్తుంది. అప్పుడు అన్ని శాఖల్లో ఖాళీలు నింపడంతోపాటు, భవిష్యత్‌ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ ను కూడా నియమించింది.
శ్రీ తెలంగాణలోని విద్యుత్‌ శాఖకు చెందిన జెన్‌ కో, ట్రాన్స్‌ కో, డిస్కం ఉద్యోగులకు 30శాతం ఫిట్‌ మెంటుతో కూడిన వేతన సవరణ చేసింది ప్రభుత్వం. 15 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు మూడు ఇంక్రిమెంట్లు, 15 సంవత్సరాల లోపు సర్వీసు ఉన్న వారికి రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.

శ్రీ ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంటు ఇవ్వడంతో పాటు ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరించడానికి ముందుకు వచ్చింది. సమగ్ర సర్వే రోజు విధులు నిర్వర్తించినందుకు ఆర్టీసీ కార్మికులకు ఒక రోజు అదనపు సెలవును కూడా మంజూరు చేసింది. నష్టాల సాకు చూపి డిపోలను మూసివేయవద్దని, కార్మికులను తగ్గించవద్దని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మరో వెయ్యి బస్సులు సమకూర్చడం ద్వారా ఆర్టీసీని మరింత పరిపుష్టం చేయడానికి నిధులు కూడా విడుదల చేసింది.
శ్రీ సింగరేణి కార్మికులకు సకల జనుల సమ్మె కాలానికి జీతం ఇప్పించడంతో పాటు, వారికి తెలంగాణ ఇంక్రిమెంటు ఇప్పించింది ప్రభుత్వం. కంపెనీ లాభాల్లో కార్మికులకు 20శాతం బోనస్‌ అందించింది. ఇందుకోసం రూ.250 కోట్లు ఖర్చు చేసింది. ఎన్నో ఏళ్లుగా పెండిరగ్‌ లో ఉన్న డిమాండ్‌ అయిన డిపెండెంట్‌ ఉద్యోగాల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. సింగరేణి గనులను విస్తరించి మరో 50 వేల మందికి ఉద్యోగావకాశం కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది.

శ్రీ జిల్లా, డివిజన్‌ స్థాయి అధికారులకు, మండల స్థాయిలో ఎమ్మార్వో, ఎంపిడివోలకు వాహన సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా ఉద్యోగులకు ఖచ్చితంగా ఫిక్స్‌ డ్‌ ట్రావెలింగ్‌ అలవెన్సు చెల్లిస్తున్నది.
శ్రీ అన్ని ఇంజనీరింగ్‌ విభాగాల ఇంజనీర్లకు లాప్‌ టాపులు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సర్వే , ఇతర పనులకు అవసరమయ్యే పరికరాలను కూడా కొనుగోలు చేస్తున్నది.

శ్రీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ ఉద్యోగం చేసే అటవీశాఖ అధికారులకు అన్ని రకాల భద్రత కల్పించాలని ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకు న్నది. అటవీశాఖ అధికారులకు సాయుధ పోలీసుల రక్షణ కల్పించాలనే విధానానికి రూపకల్పన చేసింది. స్మగ్లర్ల నుంచి ఎక్కువ ప్రాణహాని ఉన్న వారికి గన్‌ మెన్లను కూడా నియమించింది.

శ్రీ ప్రభుత్వ ఉద్యోగులకు సవరించిన కనీస వేతన చట్టం ప్రకారం కనీస వేతనం అందించడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నది.