జేబిఎస్‌ -ఎంజీబీఎస్‌ మెట్రో

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించబడి,ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో ప్రాజెక్ట్‌గా గుర్తింపు పొందిన హైదరాబాద్‌ మెట్రోకారిడార్‌-2ని సీఎం ప్రారంభించడంతో మెట్రో మొదటిదశ 69 కి.మీ. పూర్తయ్యింది. దీంతో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ ను కలిపే కీక మెట్రోరౖుె మార్గం ప్రయాణికుకు అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర రాజధానిలోని రెండు ప్రధాన బస్సు స్టేషన్లను కగుపుతూ జూబ్లీబస్‌ స్టేషన్‌ నుంచి మహాత్మాగాందీ ó(ఇమ్లిబన్‌) బస్‌స్టేషన్‌ వరకు 11 కి.మీ. మేర నిర్మించిన మెట్రోరౖుె మార్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. తొుత మొదటిదశను 72 కి.మీ.ుగా ప్రతిపాదించగా.. పాతబస్తీ మినహా 1,3 కారిడార్లు ఈపాటికే అందుబాటులోకి రాగా, తాజాగా రెండో కారిడార్‌ అందుబాటులోకి వచ్చింది.
జేబీఎస్‌ మెట్రో స్టేషన్‌ వద్ద ఏర్పాటు చేసిన శిలాఫకాన్ని మొదట సీఎం ఆవిష్కరించారు.మెట్రో ప్రాజెక్ట్‌ మొత్తంలో ఐదు అంతస్తుల్లో నిర్మించిన ఏకైక జేబీఎస్‌ మెట్రో స్టేషన్‌ ను ముఖ్యమంత్రి రిబ్బన్‌ కత్తిరించి ప్రారంభించారు. ఐదో అంతస్తులోని ప్లాట్‌ ఫామ్‌ కు చేరుకుని పూతో అంకరించిన మెట్రోకి పచ్చజెండా ఊపి అందులోనే ఎంజీబీఎస్‌ స్టేషన్‌ వరకు ప్రయాణించారు. మధ్యలో చిక్కడపల్లి స్టేషన్లో ప్లాట్‌ ఫామ్‌ మీదకు వచ్చి ప్రజకు అభివాదం చేశారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో మంత్రు మహమూద్‌ అలీ, కేటీఆర్‌, తసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, ఉప సభాపతి పద్మారావుగౌడ్‌, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, ఎంపీ రేవంత్‌ రెడ్డి, నగర ఎమ్మెల్యేు సాయన్న, దానం నాగేందర్‌, అరికపూడి గాంధీ, మాగంటి గోపినాథ్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, మెట్రోరౖుె ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, ఎల్‌ అండ్‌ టీ సీఈవో, ఎండీ ఎస్‌.ఎన్‌.సుబ్రమణ్యన్‌, హైదరాబాద్‌ మెట్రో ఎండీ కేవీబీరెడ్డి తదితయి పాల్గొన్నారు.

జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు మెట్రోలో ప్రయాణిస్తూ పు విషయాను సీఎం తనతో పంచుకున్నారని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. కాుష్యాన్ని,ట్రాఫిక్‌ రద్దీని తగ్గించాలానే ప్రధాన ఉద్దేశ్యంతో రూపొందించిన మెట్రో ఫలాను హైదరాబాద్‌ వాసు ఇప్పటికే ఆస్వాదిస్తున్నారు.‘‘జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ కారిడార్‌ సాంకేతికత, దార్శనికత పరంగా దిల్లీ మెట్రో కంటే గొప్పగా ఉంది. మెట్రో స్టేషన్లు నిర్మించిన విధానం, అందిపుచ్చుకున్న సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం చూస్తే ముచ్చటేస్తోంది. భవిష్యత్తులోనూ దీన్ని కొనసాగించాలి. హైదరాబాద్‌ను ప్రపంచ నగరంగా మార్చేందుకు సిటీలోని అన్ని ప్రాంతాకు మెట్రోని విస్తరించడానికి మాస్టర్‌ ప్లాన్‌ ను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారని, మెట్రోరౖుె ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. జేబీఎస్‌, ఎంజీబీఎస్‌ స్టేషన్లు ఆధునిక విమానాశ్రయా మాదిరిగా ఉన్నాయి. ఇవి త్వరలోనే ప్రజ రాకపోకతో సందడిగా మారుతాయి’’ అని సీఎం పేర్కొన్నట్టు ఎన్వీఎస్‌ రెడ్డి వివరించారు. సీఎంని తాను లోకోపైలెట్‌ క్యాబిన్లోకి తీసుకెళ్లినప్పుడు వివిధ స్టేషన్ల వద్ద చుట్టుపక్క ఉండే గల్లీు, థియేటర్లు, రోడ్ల పేర్లను ప్రస్తావించారన్నారు.
ఈ మార్గం ప్రారంభంతో దిల్‌షుఖ్‌ నగర్‌ వాసి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ చేరుకోవాంటే ఎంజీబీఎస్‌ రౖుె మారితే సరిపోతుంది. ఈ మార్గంలో రహదారిపై వెళితే సాధారణంగా 45 నిమిషా సమయం పడుతుంది. మెట్రోలో 16 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.