|

టిఎస్‌-ఐ పాస్‌ అధ్యయనానికి హిమాచలప్రదేశ్‌ బృందం

tsmagazineరాష్ట్రంలో సత్వర పారిశ్రామికాభివద్ధి కోసం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సూచనలకు అనుగుణంగారూపొందించిన టిఎస్‌-ఐ పాస్‌ పలు రాష్ట్రాలను ఆకర్షిస్తున్నది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ ఇండస్ట్రియల్‌ పాలసీ అత్యంత సమర్ధవంతంగా అమలు అవుతున్నది. ఈ పాలసీని అధ్యయనం చేయడానికి, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర హోం మరియు పరిశ్రమల శాఖ నుండి ఓ బృందం తెలంగాణకు వచ్చింది.

హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర హోం మరియు పరిశ్రమలశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి మనోజ్‌ కుమార్‌ నేతత్వంలోని అయిదుగురు సభ్యుల బృందం, పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్‌టెక్నాలజీ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌తో తెలంగాణ సచివాలయంలో సమావేశమైంది. పరిశ్రమల శాఖ ప్రత్యేకకార్యదర్శి అబిద్‌ హుస్సేన్‌, పరిశ్రమల శాఖ డిప్యుటీ డైరెక్టర్‌ అనిల్‌ కుమార్‌ తదితరులు అయిదుగురు సభ్యులుగా గల ఈ బృందం తెలంగాణ రాష్ట్రం లో మాదిరిగా తమ రాష్ట్రంలో కూడా ఇండస్ట్రియల్‌ పాలసీని రూపొందించాలని అనుకుంటున్నామని అన్నారు.

భారత దేశంలోని రాష్ట్రాలలోనే కాకుండా, ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలంగా ఉందని ప్రశంసించారు. తెలంగాణ లో పెట్టుబడులు ఆకర్షించడానికి ”ఇన్వెస్ట్‌ మెంట్‌ తెలంగాణా సెల్‌” మెంబర్లు బాగా కషి చేసి , రాష్ట్రానికి అధికంగా పెట్టుబడులు తీసుకొచ్చారని అభినందించారు.

”ఇన్వెస్ట్‌ మెంట్‌ తెలంగాణా సెల్‌” తో పాటు టిఎస్‌-ఐ పాస్‌ సభ్యులను సిమ్లాకు పంపించాలని, హిమాచలప్రదేశ్‌లో తాము ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రత్యేక టీము విషయంలో సహకరించాలని పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ను మనోజ్‌ కుమార్‌ బందం కోరింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో జూన్‌ 2019 లో నిర్వహించబోయే ”ఇన్వెస్టర్‌ మీట్‌” లో పాల్గొనేందుకు పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ను ఈ బృందం సభ్యులు ఆహ్వానించారు. వీరి పర్యటనలో భాగంగా ఈ బృందం పరిశ్రమల శాఖ కమిషనర్‌ కార్యాలయాన్ని సందర్శించింది.