|

డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లకు హడ్కో అవార్డు

tsmagazine డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణంలో మెరుగైన పని తీరును కనబర్చినందుకు తెలంగాణ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు అరుదైన గౌరవం దక్కింది. హడ్కో 48వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఇండియా హబిటాట్‌ సెంటర్‌ఫైన్‌ ఆడిటోరియంలో కేంద్ర గృహ నిర్మాణ,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్ధీప్‌ పూరి చేతుల మీదుగా గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ ఈ అవార్డును అందుకున్నారు.

పట్టణ, గ్రామీణ పేదలకు పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో నాణ్యత, సృజనాత్మకత, పారదర్శకతతో పటిష్టమైన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను నిర్మించి ఇస్తున్నందుకు తెలంగాణ హౌజింగ్‌ కార్పొరేషన్‌కు కేంద్ర ప్రభుత్వ సంస్థహౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (హడ్కో) అవార్డును ప్రధానం చేసింది. ఈ కార్యక్రమానికి హడ్కో ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవికాంత్‌, జి.హెచ్‌.ఎం.సి అడిషనల్‌ కమిషనర్‌ భారతి, గృహనిర్మాణ శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ సత్యమూర్తి హాజరయ్యారు.