|

తెంగాణలో మహాత్ముని పాదముద్రు!

mahatma-gandhiతెంగాణలో మహాత్ముని
పాదముద్రు!

మహాత్మాగాంధీ తెంగాణలో మొత్తం మూడుసార్లు పర్యటించారు. ఆయన చివరి పర్యటన 1946లో జరిగింది.
1946 జనవరి చివరివారంలో మహాత్ముడు దక్షిణభారత హిందీ ప్రచారసభ రజతోత్సవాలో పాల్గొనడానికి మద్రాసు వెళ్ళవసి ఉంది. తిరుగు ప్రయాణంలో మహాత్ముడు ఖాజీపేట మార్గంలో వెళ్లితే తెంగాణలోని ముఖ్య కేంద్రాలైన ఖమ్మం, వరంగల్‌ ప్రజకు మహాత్ముని దర్శనం చేసుకునే మీ కుగుతుందనీ, తద్వారా తెంగాణలో స్వాతంత్య్రోద్యమానికి కొత్త ఊపిరి భిస్తుందని ఆంధ్ర మహాసభ జాతీయ పక్షం తీర్మానించింది. అయితే మహాత్ముడు తన అంగీకారం తొపలేదు. అప్పుడు మహాసభ నాయకు మహాత్మునితో పరిచయమున్న ఎం.ఎస్‌.రాజలింగం గారిని మద్రాసుకు పంపి కార్యక్రమం ఖరారు చేసుకురమ్మని కోరారు. దీనిపై రాజలింగం మద్రాసు వెళ్ళి గ్లొపూడి సీతారామ శాస్త్రిని కుసుకొని తెంగాణలో ఒక వైపు మతోన్మాదు, మరొక వైపు కమ్యూనిస్టు చేస్తున్న దురాగతాను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో గాంధీజీ పర్యటిస్తే ప్రజకు నైతిక బం చేకూరుతుందని విశద పరిచారు. ఇదంతా విన్న గాంధీజీ ఖమ్మం, వరంగల్‌లోనే కాదు అవసరమైన అన్ని చోట్ల ఆగుతానని అభయమిచ్చారు. గాంధీ మహాత్ముని పర్యటన కోసం స్పెషల్‌ రౖుె ఏర్పాటు చేయడం జరిగింది.
గాంధీ మహాత్ముని అంగీకారం పొందగానే రాజలింగం ఈ వార్తను నాయకుకు తెలియజేశారు. వ్యవధి రెండు మూడు రోజులే ఉన్నందున మధిర, మానుకోట, డోర్నకల్‌, కార్యకర్తకు వెంటనే ఈ వార్త తెలియబరిచారు. కర పత్రాను గ్రామాకు పంపించారు. స్వామీ రామానంద తీర్థ హైదరాబాద్‌లో లేరు. మందుము నరసింగరావుని తీసుకురావటానికి ఒక కార్యకర్తను ప్రత్యేకంగా పంపించారు. రాజలింగం రౖుెలో మహాత్ముని వెంట వచ్చారు.
ఖమ్మంలో ఆంధ్ర మహాసభ జాతీయ పక్షం పట్టణ అధ్యక్షుడు గెల్లా కేశవరావు, ఖమ్మం వర్తక సంఘం అధ్యక్షుడు సుగ్గా అక్షయలింగం గుప్తా, ఐదేసి వే రూపాయు నిధు వసూు చేశారు. ఖమ్మంలో వెంకటగిరి లెవల్‌ క్రాసింగ్‌ గేటు వద్ద విశామైన మైదానంలో స్పెషల్‌ రౖుెబండిని ఆపారు. ప్రజు తండోపతండాుగా మహాత్ముని దర్శనం కోసం వచ్చారు. సర్దార్‌ జములాపురం కేశవరావు ఈ ప్రజానీకాన్ని అదుపులో పెట్టారు. రైల్వే స్టేషను నుంచి ఒక ఫర్లాంగు దూరంలో 15 అడుగు ఎత్తున బ్లతో వేదిక నిర్మించారు. రాత్రి ఎనిమిది గంట నుంచే జనం రావడం మొదలైంది. రాత్రి నుంచి వేచి ఉన్న ప్రజ నుంచి వాంటీర్లు 1500 రూపాయు వసూు చేశారు. ఉదయం 8.30నిమిషాకు స్పెషల్‌ రౖుె బండి మైదానం దగ్గర ఆగింది. మహాత్ముని వెంట కానూ గాంధీ, కృష్ణ బజాజ్‌, ఉన్న రాజగోపా కృష్ణయ్య, ఎం.ఎస్‌.రాజలింగం మొదలైన వారు వేదిక మీద కూర్చున్నారు.
స్వాగత పత్రం అందుకున్న మహాత్మునికి వెయ్యి నూట పదహారు రూపాయు వెండి పళ్ళెంలో పోసి సమర్పించారు. అయితే ఈ వెండి పళ్ళెం కూడా నాదేనా? అని ముసిముసి నవ్వులో మహాత్ముడు ప్రశ్నించాడు. నినాదాు చేయకుండా నిశ్శబ్దంగా ఉన్న ప్రజను మహాత్ముడు ప్రశం సించారు. ఆ తరువాత ప్రజందరూ కసిమెసి ఉండాలి. కు,మత భేదాు పాటించవద్దు. అందరూ ఖాదీ వసా్తు ధరించాలి. రాట్నం వడకాలి. త్వరలో రానున్న స్వరాజ్యానికి అర్హత సంపాదించుకోవాని మహాత్ముడు ఉద్బోధించారు.
డోర్నకల్‌ చిన్న పట్టణమైనా సుమారు ఏడు వంద మంది మహాత్ముని దర్శనం చేసుకున్నారు. 4000 రూపాయ విరాళం సమర్పించారు. గుండ్రాతి మడుగు పక్కనున్న 400 మంది హరిజను భక్తితో వచ్చి మహాత్ముని సందర్శించుకొని 2000 రూపాయ నిధి సమర్పించారు. వారితో గాంధీజీ 15 నిమిషాు మాట్లాడారు. మానుకోటలో 800 మంది జనం వచ్చారు. వారు 700 రూపాయు హరిజన నిధికి సమర్పించారు.
వరంగల్‌
1946 ఫిబ్రవరి 5వ తేదీన గాంధీజీ వరంగల్‌ రానున్నారని ప్రచారం జరిగింది. అంతకుముందు రెండు మూడు రోజు నుంచి నాయకు అన్ని గ్రామాలో ముమ్మరంగా ప్రచారం చేశారు. వరంగల్‌, హన్మకొండ విద్యార్థి సంఘాు, వాంటీర్లు 800 మంది స్వాతంత్య్ర భారత్‌ కీ జై అనే నినాదాతో వరంగల్‌ స్టేషను చేరుకున్నారు. గూడ్సు స్టేషను పక్కన గాంధీ మహాత్ముడు దర్శనమిచ్చి సందేశమివ్వడానికి నిర్ణయించిన స్థంలో ఉదయం ఏడు గంటనుండే జనం రావడం మొదలైంది. కార్యక్రమం ప్రకారం గాంధీజీ ఉదయం 9 గంట 20 నిమిషాకు రావసి ఉంది. కానీ, స్పెషల్‌ ట్రెయిను మార్గమధ్యంలో అన్ని స్టేషన్లలో ఆగటం వన 12.20 నిమిషాకు చేరుకుంది. అక్కడికి వచ్చిన ప్రజ నుంచి పదిమే విరాళం సేకరించగలిగారు. కొందరు స్త్రీు బంగారు ఆభరణాు విరాళంగా ఇచ్చారు.
గాంధీ మహాత్ముని పర్యటన విజయవంతం చేయటానికి ఏర్పడిన ఆహ్వాన సంఘంలో టి. హయగ్రీవాచారి, ఎం.ఎస్‌. రాజలింగం, బండారు చంద్రమౌళీశ్వరరావు, ఎస్‌. శ్రీరాము నాయుడు, ఎన్‌. చంద్రమౌళి, బి.రంగనాయకు ఉన్నారు. ఆహ్వాన సంఘం పక్షాన టి.హయ గ్రీవాచారి మహాత్ముని హరిజన నిధికి 15000 రూపాయు విరాళం వసూు చేసి సమర్పించారు. చందాకాంతయ్య ఐదు వే రూపాయు ఇచ్చారు. ఒక హరిజన బాలిక మహాత్ముని నుదుట తికం దిద్దబోగా దీన్ని మహాత్ముడు మందహాసంతో స్వీకరించారు. మధ్యాహ్నం 12.30 నిమిషాకు స్పెషల్‌ రౖుె వరంగల్‌ ప్లాట్‌ఫారం మీద ఆగగానే వేదికపై గొడుగు పట్టుకొని నిలిచి ఉదయం నుంచి ఎండను లెక్క చేయక ఆకలి దప్పు మరచి తదేకశ్రద్ధగా ఎదురుచూస్తున్న క్షా యాభైవే ప్రజా సందోహానికి మహాత్ముడు దర్శనమిచ్చిన ఆ దృశ్యం నిజంగా చూడదగినది. దీన్ని చూసిన ప్రతి కనుదోయి నుండి ఆనందబాష్పాు రాలాయి. మహాత్ముని పాద స్పర్శన చేత వరంగల్‌ నే పవిత్రమైనది. గాంధీ మహాత్ముడు ఉన్న పది నిమిషాు పది వర్ణా త్యుం. గాంధీ మహాత్ముని వెంట హయ గ్రీవాచారి, రాజలింగం మొదలైన కొందరు నాయకు స్పెషల్‌ రైల్లో ఖాజీపేట వరకు వెళ్ళారు. నాయకు కృషి ఫలితంగా జరిగిన గాంధీ మహాత్ముని పర్యటన వన తెంగాణ ప్రజలో మహత్తరమైన చైతన్యం కలిగింది.
డోర్నకల్‌ స్టేషనులో బండి ఆగినప్పుడు గాంధీజీ స్నానం చేయడానికి స్టేషను మాస్టారు అంగీకరించలేదు. అనుమతిస్తే తన ఉద్యోగం పోతుందని భయపడ్డాడు. చివరకు రాజలింగం గారు బకెటు అడిగి తీసుకొని రెండు మూడు బకెట్ల నీళ్లు స్టేషను పక్కనున్న వారి సహాయంతో స్టేషన్‌లోని బాత్‌రూంలో పెట్టించగలిగారు. బాపు స్నానం చేశారు.
1946లో బాపు అంతటివాడికి స్నానానికి ఇబ్బంది అయింది. ఆ ప్రదేశాు నిజాం రాష్ట్ర పానలో ఉన్నవని తొసుకుంటే ఆ పరిస్థితు ఇక్కడ ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. స్పెషల్‌ ట్రెయిన్‌లో తెంగాణ సరిహద్దు దాటబోయే ముందు గాంధీజీ తెంగాణ ఆంధ్రుకు స్వదస్తూరీతో సందేశమిచ్చారు.
ఆంధ్ర దేశంపై నాకు చాలా ఆశ ఉంది. ఆంధ్ర దేశం నా ఆశయాను పూర్తిగా నెరవేరుస్తుందని నా నమ్మకం. అది ఏమంటేేే అస్పృశ్యతను పూర్తిగా తొగించాలి. అస్పృశ్యు కొరకు దేవాయాన్నీ తెరచి ఉంచాలి. అందరూ ఖద్దరు ధరించాలి. జాతి సమైక్యత కాపాడాలి. నూతన భాషతో పాటు జాతీయ భాష అయిన హిందూ స్థానాన్నీ, దేవనాగరి, ఉర్దూ లిపులో నేర్చుకోవాలి.
– ఎం.కె. గాంధీ.
కాజీపేట
5-2-1946