|

తెలంగాణ ప్రభుత్వం

కడుపులో బిడ్డడు పుడమిపై పడినంత
హత్తుకొనును కేసియారుకిట్టు
బడికిపోయెడునట్టి బాలబాలికలకు
గురుకులమ్ములె కదా గొప్ప నెలవు
పెండ్లీడు వచ్చిన పేద కన్నియలకు
కల్యాణలక్ష్మియే కట్నమవును
నిలువనీడను కోరు నిరుపేద వారికి
డబులుబెడ్‌ రూముల డాబయిల్లు
చిన్ని శిశువుల నుండియు చేరదీసి
ఎన్ని అవసరమలెవరికెప్పుడగునొ
అన్ని విధముల పథకము లమలు జేయు
కన్న తండ్రిగా మన తెలంగాణ ప్రభుత

బీడీలు చుట్టియు వాడిపోయినయట్టి
వృద్ధకార్మికులకు పెన్షనయ్యె
వార్థక్యముననున్న వారికందరికిని
చేతిలో పెన్షనే ఊతమయ్యె
ఒంటరి మహిళలకు నొకయింత చేయూత
నందించగా సాయమందజేసె
దివ్యాంగులకు కూడ దిగులు తీరెడు నట్లు
ఆర్థిక సహకార మందజేసె
పేదలకు ముదుసలులకు, నాదరువును
లేని అబలలకును విధి హీనులకును
నేడు తెలంగాణమందున నెవరికైన
కన్న తండ్రిగా మన తెలంగాణ ప్రభుత

చెరువులోతులు చేసి కరువు నివారింప
కాకతీయ మిషను కదలివచ్చె
జలనాళికలు సాచి జనులదాహము దీర్చ
మిషను భగీరథ మేలుచేసె
గంగపుత్రుల వృత్తి ఘనముగా సాగించ
చేపపిల్లలనిచ్చి చెంత నిలిచె
గొర్లకాపరులకు గొర్లమందలనిచ్చి
సంపన్నులను చేయ సాయమిచ్చె
వసతి గృహముల నన్నము వాసి పెంచె
నేత బట్టల వాడుక కూతమిచ్చె
అన్ని వృత్తుల వారిని ఆదరించె
కన్న తండ్రిగా మన తెలంగాణ ప్రభుత

వట్టి చేతుల సాగుకు బాధపడెడు
రైతు చేతుల కొకయింత ఊతమివ్వ
‘రైతుబంధు పథకము’ వరమ్మునిచ్చె
‘ధరణి’ భూమలకెల్ల నాధారమయ్యె
కన్నతండ్రివలె తెలంగాణ ప్రభుత

నేడు ప్రపంచమందు కడు నిక్కెను మా తెలగాణ పల్కులున్‌
పాడిరి పద్యముల్‌ బతుక పండుగ పాటలు, బోనమెత్తుచున్‌
ఆడిరి మొక్కుదీర్చిరి నిరంతర వెల్గుల సంతసమ్ముతో
తోడొక కన్నదండ్రివలె తోచె ప్రభుత్వము నెల్లవారికిన్‌
tsmagazine

డా|| గండ్ర లక్ష్మణరావు