|

దూల్‌పేట్‌ ఇప్పుడు మారిపోయింది..

tsmagazineతెలంగాణా ప్రాంత ప్రజలు సాగు-తాగునీరుకై దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్నారు. స్వరాష్ట్రంలో ఈ సమస్యను శాశ్వతంగా రూపుమాపడానికి అనేక పథకాలు రూపొందినాయి. అదేవిధంగా సంక్షేమపథకాల అమలు సైతం వేగం పుంజుకున్నది. సంక్షేమపథకాల ఫలాలు పేదప్రజలకు అందాలంటే వారి ఆర్థిక- ఆరోగ్య స్థితిగతులు సరిగ్గా ఉంటేనే చేరుతాయనేది ప్రభుత్వ భావన.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వరంగల్‌ జిల్లా పర్యటనలో భాగంగా స్వయంగా పేదప్రజల కష్టాలను, కష్టాలకు కారణమైన గుడంబాతయారీ – అమ్మకాలను గమనించి తెలంగాణా రాష్ట్రం ‘గుడంబా’ విముక్త రాష్ట్రం కావాలని రాష్ట్ర ఎక్సైజ్‌, పోలీస్‌, మరియు రెవిన్యూ శాఖలను స్పష్టంగా ఆదేశించినారు. అదే సమయంలో రాష్ట్రస్థాయి కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో సుదీర్ఘంగా చర్చించి గుడంబాను రాష్ట్రం నుంచి తరిమేసి పేదప్రజల ఆరోగ్యాన్ని కాపాడి సంక్షేమ పథకాల ఫలాలను అందించాలని ఆదేశించినారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గుడంబా తయారీ / అమ్మకం కేంద్రాలను ూ, దీ, జ డ ణ (వాటి తీవ్రతను ఆధారంగా చేసుకొని)గా గుర్తించి స్థానిక ఎక్సైజ్‌ సిబ్బంది, పోలీస్‌ సిబ్బంది కలిసి ప్రతిరోజూ దాడులు నిర్వహించినారు. ఎలాంటి రాజకీయ ఒత్తిడికి గురికాకుండా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి పూర్తి మద్దతుగా ఉన్నారు. తండాలు, గూడెలు, గ్రామాలపై నిరంతరం నిఘా ఉంచడం వల్ల రవాణా సైతం నియంత్రించగలిగారు. నేర నియంత్రణలో భాగంగా గుడంబా తయారీకి కారణమైన నల్లబెల్లం పూర్తిగా నియంత్రించగలిగినారు. ముఖ్యంగా ఈ వ్యాపారంలో ఉన్న అసలు వ్యక్తులను గుర్తించి వారిపైనే నేరుగా కేసులు నమోదు చేయడం వలన నల్లబెల్లం రవాణా పూర్తిగా ఆగిపోయింది. తెల్లబెల్లం పై సైతం కొంతవరకు ఆంక్షలు విధించి దుర్వినియోగం కాకుండా చూడగలిగినారు.

గుడంబా తయారీ, అమ్మడం, రవాణాదారులకు, నల్లబెల్లం సరఫరాదారులపై పి.డి యాక్టు ప్రయోగించడం ద్వారా సమస్య దాదాపు నివారింపబడింది. పోలీస్‌, రెవిన్యూశాఖ వారి సహాయం పూర్తి స్థాయిలో ఉండటం మూలాన ఈ కార్యక్రమం గమ్యాన్ని చేరింది.

కేవలం కేసులు నమోదు చేయడం, జైలుకు పంపడం వరకే కాకుండా బెయిల్‌పై వచ్చిన తర్వాత వారిని స్థానిక తహసిల్దార్‌ దగ్గర బైండోవర్‌ చేయడం సత్ఫలితాలను ఇచ్చింది. ఈ బైండోవర్‌ ప్రక్రియలో నిందితులను 1సంవత్సరం నుంచి 3సంవత్సరాల వరకు, ఒకలక్ష రూపాయాలకుగాను సత్ప్రవర్తనతో ఉంటామని ఒక పూచీకత్తు తీసుకున్నారు. కొంతమంది నిందుతులు నేరాన్ని మళ్ళీ చేయడం వలన బైండోవర్‌ పూచీకత్తును ఉల్లంఘించినందుకు అపరాధరుసుము కట్టడం లేక 6నెలలు వరకు జైలు జీవితం గడిపినారు.

నేర నియంత్రణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 56,970 మందిని బైండోవర్‌ చేసినారు. వీరిలో 1,526 మంది బాండ్‌ను ఉల్లంఘించి తిరిగి నేరాలు చేయడం వలన వారి నుంచి రూ||3,19,78,500 అపరాధ రుసుముగా వసూలు చేసినారు. రాష్ట్రంలో పేరుమోసిన గుడంబా తయారీ అమ్మకందారులు, నల్లబెల్లం రవాణ చేసే 95మందిపై పి.డి.యాక్ట్‌లో కేసులు నమోదు చేసినారు.

అవగాహన కార్యక్రమాలు

కేవలం కేసులు నమోదు చేయడం వరకే తమ బాధ్యత కాదని గుడుంబా అమ్మడం, త్రాగడం వలన కలిగే అనర్థాలను ప్రజలకు తెలియచేసేలా కార్యక్రమాలు నిర్వహించింది ఎక్సైజ్‌ శాఖ. గ్రామాలలో, తాండాలలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామసభలు నిర్వహించి, గుడంబా అమ్మకాలు తయారీ చేయబోమని సభలో తీర్మానించడం, స్థానికులతో ప్రతిజ్ఞలు చేయించడం వలన గ్రామీణ ప్రాంతంలో బాగా ప్రభావం చూపింది. స్థానిక స్కూల్‌, కాలేజి విద్యార్థులు, స్థానిక ప్రజలతో కలిసి ర్యాలీలు నిర్వహించి ప్రజలలో అవగాహన కల్పించడంలో ఎక్సైజ్‌శాఖ సఫలం అయ్యింది. కళారూపాలు, చిన్న చిన్న నాటికలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం వలన గుడంబా వల్ల కలిగే అనర్థాలు ప్రజలకు సులభంగా అర్థమ య్యాయి. సాంస్కృతిక సారధి కళాకారులు, స్థానిక కళాకారుల పాత్ర దీనిలో మరువలేనిది. గ్రామాలలో, పట్టణాలలో గోడలపై నినాదాలు రాయడం సైతం దీనిలో ఒక భాగం.

పునరావాసం

tsmagazineరాష్ట్రప్రభుత్వం గుడంబా అమ్మకాలను నియంత్రించడం వరకే కాకుండా వాటిపై ఆధారపడిన అనేక కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయించింది. దానికై ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ప్రి.సెక్రటరీ ఎక్సైజ్‌ వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ కమీషనర్‌ ఆర్‌.వి.చంద్రవదన్‌, అకున్‌ సబర్వాల్‌ డైరక్టర్‌ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌) నేతృత్వంలో రాష్ట్ర అబ్కారీశాఖ మంత్రి టి.పద్మారావుగౌడ్‌ మార్గదర్శకత్వంలో ఒక బృహత్తర పథకాన్ని రూపొందించినారు.

+బసబఎపa జుటటవష్‌వస ూవతీరశీఅర =వష్ట్రaపఱశ్రీశ్రీఱ్‌a్‌ఱశీఅ ూషష్ట్రవఎవ (+.జు.ూ.=.ూ) (గుడంబా ఆధారిత వ్యక్తుల పునరావాస పథకం) అనే పథకాన్ని (+శీ=్‌ చీశీ. 216, తేది: 23.3.2017) ప్రకటించినారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 7,886 కుటుంబాలను అర్హులుగా గుర్తించినారు. (+.ూలో పొందుపరచిన నియమాలను అనుసరించి) ఇందులో

జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో కమిటీలో జిల్లా ఎక్సైజ్‌ అధికారి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మొదలగు శాఖల అధికారుల సభ్యులుగా ఉన్నారు.

+జుూ=ూ పథకంలో లబ్ధిదారులకు వారు కోరుకున్న పథకంలో 2 లక్షల రూపాయల సహాయం అందజేస్తారు. నేరుగా ఆర్థిక సహాయం కాకుండా వారివారి ఇష్టాల ప్రకారం ఎంచుకున్న వ్యాపారానికి 2 లక్షల విలువైన సామాగ్రిని అందచేస్తారు. లబ్ధిదారులు ఈ రెండు లక్షల రూపాయలను తిరిగి చెల్లించనవసరం లేదు.

రాష్ట్రవ్యాప్తంగా +జుూ=ూ పథకం ద్వారా లబ్ధిదారులు ఆటో, కిరాణా దుకాణం, టెంట్‌హౌజ్‌, గొర్రెల కొనుగోలు, బర్రెల కొనుగోలు, సెంట్రింగ్‌ వస్తువులు, చీరల దుకాణాలు, బ్యూటీపార్లర్స్‌, మొబైల్‌టిఫిన్‌ సెంటర్‌ మొదలైన వృత్తులను / వ్యాపారాలను ఎన్నుకొన్నారు.

లబ్ధిదారులకు సరైన సమయంలో నాణ్యమైన వస్తువులను అందజేయడానికై గ్రామీణ ప్రాంతాలలో మండల కొనుగోలు కమిటీ ఏర్పాటుచేసి స్థానిక వీూణూలు, ఎక్సైజ్‌ ఇన్‌స్టెక్టర్‌ల పర్యవేక్షణలో కొనుగోలు చేసి అందజేసినారు. పట్టణ ప్రాంతాలలో జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా కొనుగోలు కేంద్రంలో నమోదు చేసుకున్న సంస్థలు, లేక నాణ్యమైన వస్తువులు అందజేసే సంస్థల ద్వారా లబ్ధ్దిదారులకు వారు కోరుకున్న విధంగా వస్తువులు అందజేసినారు.

కొన్ని సాంకేతిక కారణాల వలన కొన్ని జిల్లాలలో సమస్యలు ఎదురైనా కొద్ది రోజులలోనే ఈ సమస్యలను అధిగమించి 100 శాతం ఈ పథకాన్ని లబ్ధ్దిదారులకు చేరే విధంగా ఎక్సైజ్‌శాఖ పనిచేస్తోంది.

నిరంతరం పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖల దాడులు, అరెస్టులు, జైలు జీవితాలు, భయంతో జీవించడం ఆలవాలంగా మారిన గ్రామాలు తాండాలు, పట్టణ ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలు (ఉ. ధూల్‌పేట) ఇప్పుడు ప్రశాంతంగా మారిపోయాయి. అక్కడి మహిళలు, యువత +జుూ=ూ పథకం ద్వారా లబ్ధి పొందిన వారు కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో ఆనందంగా జీవిస్తున్నారు. వారి జీవితాలలో కొత్త వెలుగు ప్రసరించింది.

ధూల్‌పేటపై ప్రత్యేక దృష్టి

కొన్ని శతాబ్దాలుగా గుడంబా తయారీ, రవాణా అమ్మకానికి ప్రసిద్ధి చెందిన ధూల్‌పేట సైతం గుడంబా రహితంగా మారడం ఎక్సైజ్‌ శాఖ పనితీరును సూచిస్తుంది. రాజధాని నడిబొడ్డులో శతాబ్దాల నుంచి గుడంబా తయారీ, రవాణా అమ్మకం జరుగుతుండేవి. హైద్రాబాద్‌ జిల్లా ఎక్సైజ్‌శాఖ, స్థానిక పోలీస్‌ల సహకారంతో గుడంబా అమ్మకాలను, తయారీని దాదాపుగా నియంత్రించారు. తదనంతరం పునరావాస పథకంలో భాగంగా అర్హులైన వారిని గుర్తించి వారు కోరుకున్న విధంగానే సహాయం అందచేస్తున్నారు. ఆటో, ఆటోట్రాలీ, కిరాణా, టెంట్‌హౌజ్‌ మొదలైన వాటిలో వీరికి సహాయం అందజేస్తుంది ఎక్సైజ్‌ శాఖ.

ధూల్‌పేట్‌లోని యువతకు సైతం స్వయం ఉపాధి పథకాల ద్వారా ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంది ఎక్సైజ్‌శాఖ. ధూల్‌పేటలో యువతలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికై వివిధ సంస్థల ద్వారా శిక్షణ ఇప్పించినారు. ప్రస్తుతం ధూల్‌పేట యువత కష్టపడి జీవించడం స్వయంకృషితో సంపాదించడం, భయంలేని జీవితాలను గడుపుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మారని ధూల్‌పేట చిత్రం స్వరాష్ట్రంలో మారిపోయింది. వారి జీవితాలలో ఒక వెలుగును ఇచ్చింది.

తెలంగాణ రాష్ట్రం గుడంబారహిత రాష్ట్రంగా మార్చాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలను అనుసరించి రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ రేయింబవళ్ళు కష్టపడుతూ ఆ లక్ష్యం దిశగా పయనిస్తోంది. రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ పనితీరు దేశంలోనే ఆదర్శంగా నిలబడింది. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్నాటకలు గుడంబాను ఎలా నియంత్రించాలనే విషయంపై అధ్యయం చేయడానికి మన రాష్ట్రానికి రావడం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్‌ శాఖకు గర్వకారణంగా ఉన్నది. శాఖ పనితీరు, సమస్యను ఎదుర్కొనడంలో చూపిన పద్ధతులు ఇతర రాష్ట్రాలకు అనుసరణీయంగా మారినాయి.

ఎక్సైజ్‌శాఖ ఉన్న పరిమిత వనరులు, సిబ్బందికి క్షేత్ర స్థాయిలో ఉన్న అనేక ఇబ్బందులను అధిగమించి ఈ క్రతువును దాదాపుగా పూర్తి చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమంపై విమర్శలూ వచ్చినాయి. గుడంబాను నిరోధిం చడం ద్వారా మద్యం అమ్మకాలు పెంచుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆరోపణ. దీనిలో ఏమాత్రం నిజం లేదనేది వాస్తవం. గుడంబాను నియంత్రించి పేద ప్రజల ఆర్థిక స్థితిగతులను, ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే ముఖ్య లక్ష్యం. గ్రామీణ ప్రాంతాలలో పొదుపు పెరగడం తర్వాత కొనుగోలు శక్తి పెరగడం, నేరరహితంగా మారడమే దీని ప్రధాన లక్ష్యం. చివరగా ‘ఆరోగ్య తెలంగాణ’గా ఉంచడమే కర్తవ్యం.

గుడంబారహిత తెలంగాణా నిర్మాణంలో ఇప్పటివరకు ఎక్సైజ్‌శాఖ ఒక్కటే కాకుండా రెవిన్యూ, పోలీస్‌ అధికారుల సహాయ సహకారాలు మరువలేనిది. అదేవిధంగా పునరావాస పథకాల అమలులోనూ జిల్లా కలెక్టర్లు, సంక్షేమ శాఖ అధికారుల సహాయం వెలగట్టలేనిది.

ఎక్సైజ్‌శాఖకు ముఖ్యమంత్రి ఇచ్చిన లక్ష్యం దాదాపుగా నెరవేర్చింది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం ‘బంగారు తెలంగాణ’, ‘గుడంబా రహిత తెలంగాణ’, ‘ఆరోగ్య తెలంగాణ’గా రూపొందుతుందని ఆశిద్దాం.

ఎస్‌.శ్రీనివాసమూర్తి