| |

నిర్ణయాలే విజయానికి మెటు

winner”ఒక్కసారి కమిట్‌ అయితే నామాట నేనే వినను” పోకిరీ సినిమాలో హీరో అనే డైలాగులు చాలా ప్రాచుర్యం పొందాయి. ఒక పని చేయాలని నిర్ణయం తీసుకుంటే అది మన మనస్సుపైన ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది. అది ఎంతవరకు వ్యక్తిని కార్యోన్ముఖున్ని చేస్తుందో చెప్పడానికి ఉదహరించే ఒక అద్భుతమైన వాక్యం. మనం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొన్న తరువాత దానిని సాధించడం కోసం వ్యక్తులు ఎంత తీవ్రమైన పట్టుదలతో ఉంటారో చెప్పే నిర్ణయం తాలూకూ వాక్యం అది. మానసిక శాస్త్రంలో వ్యక్తులు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలంటే జీవితానికి సంబంధించి ఒక గొప్ప పరిష్కారాన్ని సూచించారు.

”జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలంటే, తన జీవితానికి సంబంధించిన నిర్ణయమే తనను ఆ స్థానానికి తీసుకెళుతుంది తప్ప తనకు వున్న పరిస్థితులు, ఇబ్బందులు కాదు.”అనేది నిజం. అచ్చంగా ఇలాంటి సందర్భమే గత సంవత్సరం ‘సీ.ఏ.’లో దేశంలోనే టాపర్‌గా నిలిచిన కుమారి ప్రేమజయకుమారి చెబుతుంది. ముంబాయికి చెందిన ఒక ఆటో డ్రైవర్‌ కూతురైన ఆమె డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌లో ఉన్న పుడే ఎలాగైనా సీఏ కావాలని నిర్ణయం తీసుకున్నానని, ఆ నిర్ణయమే తనకు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన శక్తిని, ఉత్సాహాన్ని నిరంతరం అందచేసిందని చెప్పింది.

1994లో ఐఎఎస్‌కు ఎంపికైన బుర్రా వెంకటేశం వరంగల్‌ జిల్లాలోని జనగాంకు చెందిన వారు. పేద కుటుంబానికి చెందిన ఇతని తల్లి వ్యవసాయ కూలి. తన స్వయం నిర్ణయం ద్వారానే ఐఎఎస్‌ను సాధించానని చెబుతారు.

నేటి విద్యార్థులు తాము తీసుకోవలసిన నిర్ణయాలు జీవితానికి సంబంధించిన వాటిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల తీవ్రమైన అనార్థాలకు దారి తీయడం. విలువైన సమయం వృథా కావడమే కాకుండా ఒక్కోసారి అనారోగ్యం భారిన ూడా పడతారు. సరియైన నిర్ణయాలు తీసుకుంటే అవి తన భావిజీవితానికిి నిచ్చెనలుగా మారి బంగారు భవిష్యత్తుకు ఏర్పరుస్తాయో చర్చిద్దాం.

విద్యార్థులు ఇప్పుడు పోటీ పరీక్షలకు చదువుతున్న యువతీ యువకులను గతంలో చాలా మంది మీరు ఎందుకు మంచి మార్కులు సాధించలేక పోయారు? అని ప్రశ్నిస్తే రకరకాల ఇబ్బందులు చదవనీయలేదని, తల్లి దండ్రులు తీవ్రంగా పోట్లాడుకోవడం లేదా ఏదో ఒక కారణంతో తనను దూషించే వారిని దానితో మనస్సు పరిపరివిధాల ఆలోచించేదని అందువల్ల చదవడం కుదరలేదని చెబుతారు.

అమ్మా నాన్న చదవమని పదే పదే చెప్పడంతో చదువల మీద ద్వేషం పెంచుకుని చదమాడదు అనుకున్నాను. పరీక్షల్లో తప్పాను. నాకిష్టమైన కోర్సును నేను ఎంచుకోవడంలో నా తల్లి దండ్రులు నాకు స్వేచ్ఛను ఇవ్వలేదు. వాళ్ళను ఎలాగైనా బాధ పెట్టాలనుకున్నాను. అందుకోసం కొన్ని పరీక్షలు రాయలేదు. రాసినవి సరిగ్గా చదవకుండా రాసి ఫెయిల్‌ అయ్యాను. అని ఆర్థిక పరిస్థితులు, చదువుకు ఉపకరించే పరిస్థితులు లేకపోవడం, చాలా దూరం వెళ్ళి చదువుకోవాల్సి రావడం.. ఇలా అనేక కారణాలు పేర్కొంటారు.

పైన పేర్కొన్న విద్యార్థుల, యువతీ యువకుల భావాలు చదివితే మనకు స్పష్టంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్లనే అలా పరాజితులుగా మిగిలారని అర్థం అవుతుంది. పరాజితులకు, విజేతలకు ఉన్న తేడాని చూద్దాం..

పరాజితుల పద్ధతి ఇది..

శ్రీ ప్రతిపని అదే జరుగుతుందని ప్రణాళికలు వేసుకోూడదు అనుకుంటారు.

శ్రీ టీవీ చూడడానికి ముందు ఒక్క పది నిమిషాలు చూస్తారు అంతే! అనుకొని అది రెండు గంటలైనా చూస్తూనే ఉంటారు.

శ్రీ మధ్యాహ్నం గంట పడుకుంటాను. అని పడుకుని రెండు, మూడు గంటల తర్వాత లేస్తారు.

శ్రీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి పది నిమిషాల్లో వచ్చేస్తామని రెండు గంటల తర్వాత వస్తారు.

శ్రీ ఎక్కువ మంది స్నేహితులుండి ఎక్కువ సమయం మాట్లాడడాని ఉపయోగించి రేపటి నుంచి నేను చదువుకోవాలి, ఎక్కువ సమయం మీతో టాేయించలేను అని చెబుదాం అనుకుని చెప్పలేక, రోజు సమయం కంటే ఎక్కువ సమయాన్ని అనవసర చర్చలతో గడిపేస్తారు. తర్వాత స్నేహితులకు అవసరమైనప్పుడు సమయం టాేయించడం మన బాధ్యత. మనం కాకుంటే ఇంవెరు మాట్లాడతారు అనుకుంటారు.

శ్రీ ఉదయం లేవగానే బాగా చదువుకోవాలి అనుకుంటారు. అయితే అలారం మోగగానే ఆపేసి తర్వాత లేవచ్చులే అని పడుకుంటారు.

శ్రీ స్నేహితులతో షికార్లు కొట్టాలని, బైక్‌లపై సరదాగా తిరగాలని, సాయంత్రం రాగానే చదువుకుని పడుకోవాలనుకుంటారు. కానీ షికార్లు పూర్తయ్యి ఇంటికి వచ్చిన తర్వాత చదువలేరు.

శ్రీ నోట్స్‌ ఎప్పటికప్పుడు రాసి పెట్టుకుని అన్నింట్లో ముందుండాలని క్లాసులో అందరూ గుర్తించాలని కోరుకుంటారు. అలా ఉండేటట్లుగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. కానీ ప్రణాళిక ప్రకారం ఉండలేరు. తొందరగా నిద్రపోవడం లేదా ఎక్కువగా వినోదాన్ని ఆశ్రయించడం చేస్తారు. ఎక్కువ చదువడం మంచిది కాదు అనే ధోరణిని ూడా పెంచుకుంటారు.

శ్రీ ప్రతిసారి ప్రణాళికలు వేసుకోవడం, ఆ ప్రణాళిక ప్రకారం కాకుండా పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తించడంతో ప్రణాళిక వేసుకోవడం వల్లే ఇలా చేస్తున్నానని టీవీ చూడడం, ఫోన్‌ మాట్లాడుతూ సమయం అంతా వృథా చేస్తారు. ఎవ్వరూ ఫోన్‌ చేయడం లేదని వాళ్ళకి మిస్డ్‌ కాల్స్‌ ఇచ్చి ఫోన్లు చేయించుకుంటారు.

శ్రీ చదువుకుంటుంటే అనవసరమైన ఆలోచనలు వస్తున్నాయి. ఏం చెయ్యాలో తెలియడం లేదని, ఈ ఆలోచనలన్నీ పోయిన తర్వాత చదవటం మొదలుపెడతానని ఆలోచించుకుంటూ ూర్చుంటారు.

శ్రీ చదువుకోసం ూర్చుని అరే! ఫలానా పుస్తకం లేదు అది ఉంటేనే చదవడం సులభం. అది వేరే ఫ్రెండ్స్‌ వద్ద ఉంది అది తెచ్చుకుని చదువుతానని, ఇప్పుడు వేరే పుస్తకం చదివే మూడ్‌ లేదని చదువుకోకుండా లేస్తారు. చదువుకుందామనే అనుకుంటున్నా, అమ్మా, నాన్న, నన్ను చదువుకోమన్నారు కాబట్టి మూడ్‌ చెడుపోయింది. ఇంక చదువలేను అనుకోవడం.

శ్రీ సెల్‌ఫోన్‌ను విపరీతంగా ఉపయోగించడం లేదా వీడియో గేవ్స్‌ు ఆడి సమయం వృథా చేయడం.

శ్రీ పైన పేర్కొన్న ప్రతి సంఘటనల్లో.. స్పష్టంగా మనకు కనపించేది విషయాల పట్ల, చేద్దామనుకున్న పని పట్ల గంభీరతతో నిర్ణయం తీసుకోకపోవడం, చేద్దాం ఎలాగైనా.. అని సంకల్పించుకోవడం కనిపిస్తుంది.

విజేతలెవరంటే..?

శ్రీ ప్రతి రాత్రి పడుకునే ముందు రేపటి ఉదయం గురించి అలారం పెట్టుకోవడం. అంతేకాకుండా పొరపాటున లేవకుండా ఉంటానేమో అని తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులకు చెప్పి పడుకుంటారు. లేస్తాను అనుకున్న సమయాన్ని చదువుకు ఉపయోగించుకుంటారు.

శ్రీ స్నేహితులతో తిరగాలని, సినిమాలకు వెళ్ళాలని ఉన్నా ఇప్పుడు చదువుకోవాల్సిన అవసరం ఉంటే పై ఆలోచనలను ఆపేసుకుని తర్వాత వెళ్ళవచ్చులే అని చదువుకు సిద్ధమవుతారు.

శ్రీ సబ్జెక్టులో అర్థం కానిది ఏదైనా ఉంటే ఎవరితో చెప్పించుకోవాలో వెతికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారు. ఎప్పుడూ అన్నింటితో సిద్ధం అవుతారు. పూర్తి చేయాల్సిన పాఠాలు, ప్రశ్నలు ఉంటే వాటిని పూర్తి చేసిన తర్వాత కానీ నిద్రపోరు.

శ్రీ పరీక్షల కోసం తప్పకుండా ప్రణాళిక వేసుకొని దాని ప్రకారమే నడుచుకుంటారు. విజయాన్ని సాధిస్తారు. వినోదం కోసం తప్పకుండా సమయాన్ని టాేయిస్తారు. అయితే అనుకున్నంత సమయాన్ని మాత్రమే టాేయిస్తారు. ఇంకా వినోదాన్ని అనుభవించాలని వున్నా సమయం ప్రకారం చదువుకోవడానికి సిద్ధం అవుతారు. చదివేటప్పుడు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. అయితే వాటికోసం నిర్ణీత సమయం టాేయించి వాటి గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి మళ్ళీ చదువు మొదలు పెడతారు.

శ్రీ ఒక వేళ ఇబ్బందిగా ఉంటే వెంటనే వారు సైకాలజిస్టును కలిసి, సమస్యను సమర్థంగా ఎదుర్కొని మళ్ళీ చదువుకు ఉపక్రమిస్తారు.

శ్రీ ఇబ్బందిగా ఉన్న సబ్జెక్టుకు వీలైనంత త్వరగా ట్యూషన్స్‌ పెట్టించుకొని వాటిని నేర్చుకోవడానికి సిద్ధపడుతారు తప్ప నేనే నేర్చుకుంటాను నాకు ఎవ్వరి సహాయం అవసరం లేదని అనుకోరు.

శ్రీ సెల్‌ఫోన్లు ఉపయోగించరు. విపరీతంగా ఎస్‌ఎంఎస్‌లు పంపడం చేయరు. తల్లిదండ్రులతో మంచి స్నేహ సంబంధాలుంటాయి.

చూశారా ఫ్రెండ్స్‌! మీరూ విజేతల్లా ఆలోచించి ఒక్క నిర్ణయం తీసుకుంటే వెయ్యి రకాలుగా మీలో మార్పులు వస్తాయి. విజయానికి, పరాజయానికి తేడా ఒక్క నిర్ణయం మాత్రమే.

ఆల్‌ ది బెస్ట్‌..