|

నేతన్నకు అండగా

tsmagazineచేనేత కార్మికులకు ప్రభుత్వం మరొక వరాన్ని అందించింది. చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తూ గతంలో ఇచ్చిన జీవోను సవరిస్తూ నూతనంగా మరొక జీవో జారీ చేసినట్లు మంత్రి కెటి రామారావు తెలిపారు. ఈ జీవో ద్వారా ప్రభుత్వ ఏర్పాటు కంటే ముందుకు 2010 నుంచి ఋణాలు తీసుకున్న చేనేత కార్మికుల మూలధన రుణాలను లక్ష వరకు మాఫీచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. తొలుత చేనేత కార్మికులు జాతీయ బ్యాంకుల నుండి, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల నుండి చేనేత ఉత్పత్తులకై 01.01.2014 నుండి 31.03.2017 వరకు తీసుకున్న వర్కింగ్‌ కాపిటల్‌ వ్యక్తిగత ఋణాలను రూపాయలు ఒక లక్ష వరకు (లక్ష పైబడి ఋణాలు తీసుకున్న కూడా ఒక లక్ష వరకు మాఫీ లభిస్తుంది) మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి జీవోను జారీ చేసింది. అయితే గత ప్రభుత్వం కేవలం 31.3.2010 వరకు మాత్రమే ఋణా మాఫీ చేసి, తర్వతా సంవత్సరాల్లో ఏలాంటి ఋణ మాఫీ చేయలేదు. ఈవిషయాన్ని తమ దృష్టికి పలువురు నేతన్నలు తీసుకువచ్చారని, ప్రస్తుత రుణమాఫీని 2010 ఎప్రిల్‌ ఒకటి నుంచి వర్తింపచేయాని కోరిన నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఋణాలు తీసుకున్న వారికీ ప్రయోజనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ పథకాలకు జూన్‌ 2, 2014ను ఒక కటాఫ్‌ డేట్‌గా పరిగణించి నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నామని, ఈ చేనేత రుణమాఫీ విషయంలో నేతన్న సంక్షేమం కోసం ప్రత్యేక అంశంగా పరిగణించి ముఖ్యమంత్రి అదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ మేరకు నేతన్నలు చేసిన విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణించి ఋణమాఫీ ప్రయోజనాన్ని 1.4.2010 నుంచి 31.03.2017 వరకు కల్పించడం జరిగిందన్నారు. ఈ మేరకు జివో. యంయస్‌ 46 విడుదల చేశారు. ఈ రుణామాఫీ ద్వారా చేనేత కార్మికులకు సాద్యమైనంత అధికంగా ప్రయోజనం కలిగించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సాధారణంగా ఋణ మాఫీ చేసిన సందర్భాల్లో ఋణాలు చెల్లించని వారికే ఋణమాఫీ వర్తింపచేస్తారు. కానీ సకాలంలో ఋణాలు చెల్లించిన వారు నష్ట పోకుండా ఉండ కుండా ఉండేందుకు వారు చెల్లించిన ఋణాలను సైతం ప్రభుత్వం తిరిగి వారీ ఖాతాల్లో వేస్తుందని మంత్రి తెలిపారు. రుణాలు చెల్లించిన కార్మికుల ఖాతాల్లో లక్ష రూపాయాల పరిమితితో వారి డబ్బులను తిరిగి చెల్లిస్తున్నామన్నారు.

ఈ ఋణమాఫీ ద్వారా క్షేత్ర స్థాయి అధికారులు సంబంధిత బ్యాంకులతో, ‘వృత్తిలో కొనసాగే లబ్ధిదారులకు’ మాఫీ అయిన ఋణాలకు తక్కువ కాకుండా తిరిగి ఋణ సౌకర్యం కల్పించుటకై హామీ పొందుతారు. ూకూదీజ ద్వార బ్యాంకుల నుండి తెప్పించిన వివరాల ప్రకారం ఈ పథకము ద్వార సూమారు 8500 మంది చేనేత కార్మికులు ఋణ విముక్తులు అవుతారని, ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.40 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.