పేదలపట్ల కనికరం కబ్జాకోరులపై కాఠిన్యం!

పేదలపట్ల-కనికరం--కబ్జాకోరులపై-కాఠిన్యం!1పేదలకు నిలువ నీడ కల్పించే విషయంలో అత్యంత ఉదారంగా ఉండాలని, భూకబ్జాలకు పాల్పడేవారి విషయంలో మాత్రం అత్యంత కఠినంగా ఉండాలనేది ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్పష్టం చేశారు.
హైదరాబాద్‌ నగరంలో భూకబ్జాల దుకాణం బంద్‌ కావాలనేది తన లక్ష్యం అని, నగరంలోని ప్రజా ప్రతినిధులు, అధికారుల అందరి సహకారం, సమన్వయంతో పనిచేస్తామని చెప్పారు. హైదరాబాద్‌ నగరంలోని పలు అంశాలకు సంబంధించి పార్టీల అభిప్రాయాలు తీసుకునేందుకు సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం డిసెంబరు 16న జరిగింది. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు పద్మారావు, మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్‌, కాంగ్రెస్‌ ప్రతినిధులు మల్లు భట్టి విక్రమార్క, నిరంజన్‌, టిడిపి నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్వీ రమణ, నర్సిరెడ్డి, బిజేపి నుంచి కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌, యంఐయం నుంచి జాఫ్రి, సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి, రవీంద్రకుమార్‌, సీపీయం నుంచి తమ్మినేని వీరభద్రం, సున్నం రాజయ్య, టీఆర్‌ఎస్‌నుంచి వేణుగోపాలచారి, రాజేశ్వర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నుంచి శివకుమార్‌ సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, మెట్రో రైల్‌ ఎండీ ఎవీఎస్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌, రెవిన్యూ కార్యదర్శి మీనా, పంచాయతీరాజ్‌ కార్యదర్శి రేమాండ్‌పీటర్‌, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ప్రభుత్వ సలహాదారు బి.వి. పాపారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నగరంలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలు, కబ్జాలు, పేదల నివాసాలు, రెగ్యులరైజేషన్‌ తదితర అంశాలపై రాజకీయ పక్షాల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అంతకుముందు ముఖ్య మంత్రి ప్రభుత్వ లక్ష్యాలను అందరికీ విడమరచి చెప్పారు. హైదరాబాద్‌ నగరంలో భూముల రేట్లు పెరుగుతున్న కొద్ది భూ ఆక్రమణలు కూడా పెరిగాయని, కబ్జా రాయుళ్లకు నగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ అత్యంత సులువుగా మారిందని చెప్పారు. సాధారణ పౌరులు హైదరాబాద్‌లో భూములు కొనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. భూవివాదాలే ఇందుకు కారణం అని చెప్పారు. భూ ఆక్రమణదారులను పూర్తిస్థాయిలో అరికట్టాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ భూమిని ఎవరైనా ఆక్రమించాలంటే దడ పుట్టే పరిస్థితి రావాలన్నారు. అందుకోసం కఠినమైన చట్టాలు కూడా తెచ్చే యోచన వుందన్నారు.
హైదరాబాద్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమణలు నాలుగురకాలుగా జరిగాయని వివరించారు. వివిధ జిల్లాల నుంచి పొట్టకూటికోసం వచ్చే పేదలు ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్నారని, మధ్య తరగతి ప్రజలు నివాసం ఏర్పరుచుకోవడంకోసం ప్రభుత్వ భూమి అని తెలియకుండా మధ్యవర్తుల వద్ద కొనుక్కున్న ఉదంతాలు ఉన్నాయని, పాఠశాలలు, వైద్యశాలలు, ప్రార్థనా మందిరాల కోసం వాడుకొంటున్న భూమి ఉందని, కబ్జాదారులు యధేచ్ఛగా ఆక్రమించిన భూములు ఉన్నాయని సీఎం తెలిపారు. కబ్జాకు గురైన భూముల్లో కూడా కొన్నింటిలో నిర్మాణాలు ఉన్నాయని, మరికొన్ని ఖాళీ జాగాలు ఉన్నాయన్నారు. వీటన్నింటి విషయంలో ఒకే విధానం అనుసరించడం సాధ్యంకాదని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారికి రెగ్యులరైజ్‌చేసి నిధులు సమకూర్చుకోవడం ప్రభుత్వ లక్ష్యంకాదని, ఆ డబ్బులతోనే ప్రభుత్వం నడవదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచడం కోసం, భూ వివాదాలకు శాశ్వతంగా ముగింపు పలకడంకోసమే భూముల అంశాన్ని తీసుకున్నామని వెల్లడిరచారు. ఇందుకు ఒక్కో విషయంలో ఒక్కోరకంగా స్పందించాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు.
125 గజాల స్థలంలోపు నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలకు ఉచితంగా రెగ్యులరైజ్‌ చేయాలి.
250`300 గజాల స్థలంలో నివాసం ఉంటున్న మధ్య తరగతి ప్రజల పట్లకూడా ప్రభుత్వం సానుభూతితో వ్యవహరిస్తున్నది. కొద్దిపాటి ధర తీసుకుని వాటిని రెగ్యులరైజ్‌ చేస్తుంది.
500 గజాలలోపు నివాసస్థలాలు ఏర్పాటు చేసుకున్న వారి భూములను 100 గజాలకు కొంత ధరను పెంచుతూ రెగ్యులరైజ్‌ చేస్తుంది.
500 గజాలకు పైగా భూమిని ఆక్రమించుకొని నివాసాలు, శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్న వారికి భారీ మొత్తంలో ధర నిర్ణయించి రెగ్యులరైజ్‌ చేస్తుంది.
ఖాళీ జాగాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.

15నుంచి 50 గజాలలోపు స్థలంలో నివాసం ఉంటున్న వారందరిని ఒక పూల్‌గా మార్చి వారికి బహుళ అంతస్థుల భవనాలు కట్టించి మెరుగైన నివాసాలు అందించాలి.
ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రతిపాదనలపట్ల రాజకీయ పక్షాలన్నీ ఆమోదం, హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పైన చెప్పిన 6 సందర్భాలను నిర్ధారించడానికి, ఎవరెవరు ఏ కేటగిరికిందికి వస్తారో నిర్ణం యించడానికి నియోజకవర్గాలవారీగా ఎమ్మెల్యేలు, అధికారులు కమిటీలుగా ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ భూ ముల క్రమబద్దీకరణకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం రాజకీయ పట్టింపులకు పోకుండా అందరినీ పరిగణనలోకి తీసుకుంటుందని ప్రకటించారు. పార్టీ ఏదైనప్పటికీ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల పర్యవేక్షణ, సహకారంతోనే భూకబ్జాలులేని హైదరాబాద్‌ నగరాన్ని సృష్టించాలని తాను భావిస్తున్నట్లు వెల్లడిరచారు.