|

పోలీసులకు సి.ఎం. వరాలు

పోలీసులకు సి.ఎం. వరాలుపోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అక్టోబర్‌ 21న హైదరాబాద్‌లోని గోషామహల్‌ స్టేడియంలో పోలీసు అమర వీరులకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిజిపి అనురాగ్‌ శర్మలు శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పోలీసులకు పలు వరాలు కురిపించారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లలో పదిశాతం పోలీసులకు కేటాయిస్తామన్నారు. ఎస్‌ఐ, ఆపై స్థాయి అధికారులకు ఆయా జిల్లాల్లోనే కోరుకున్న మున్సిపాలిటీలల్లో ఇండ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. ట్రాఫిక్‌ పోలీసులకు 30శాతం పొల్యూషన్‌ అలవెన్స్‌ ఇస్తామని ప్రకటించారు. యూనిఫాం అలవెన్సును రూ.3,500 నుంచి రూ.7,500లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అమరుల త్యాగాలను సమాజం గుర్తించా లని, విధినిర్వహణలో పోలీసులకు వెన్నుదన్నుగా ఉంటూ అండదండ లందించాలని సిఎం కేసిఆర్‌ పిలుపునిచ్చారు. ఏదేశమైనా, ఏ రాష్ట్రమైనా శాంతి భద్రతలు బాగుంటేనే అభివృద్ధి చెందుతుందన్నారు. శాంతి భద్రతలు దెబ్బతింటే ప్రజల్లో అభద్రతా భావం పెరిగి అభివృద్ధి కుంటుపడు తుందన్నారు. అందుకే శాంతి భద్రతలను పరిరక్షించే పోలీసులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిజిపి అనురాగ్‌ శర్మ తదితరులు ప్రసంగించారు.