ప్రజల మధ్యనే మనుగడ సాగించిన నిరాడంబరుడు సోలిపేట మృతికి శాసనసభ నివాళి

దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి మృతికి శాసనసభ ఘనంగా నివాళుర్పించింఇ. ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖరరావు సభలో సంతాప తీర్మాణాన్ని ప్రవేశపెడుతూ, ప్రజకోసం, ప్రజ మధ్యనే నిత్యం మనుగడ సాగించిన నిరాడంబరుడు రామలింగారెడ్డి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ మాట్లాడుతూ…

తెంగాణ ఉద్యమ నేపథ్యంలో ఎదిగి వచ్చిన నాయకుడు సోలిపేట రామలింగారెడ్డి. నిత్యం ప్రజ మధ్యనే మనుగడ సాగించిన నిరాడంబర నేతగా ప్రజ హృదయాల్లో సోలిపేట రామలింగారెడ్డి చెరగని ముద్రవేసారు. ఆయన చాలా చిన్న వయసులో, అనారోగ్యంతో హఠాన్మరణం పాు కావడం విషాదం. రామలింగారెడ్డి ఆకస్మిక మరణం ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న దుబ్బాక నియోజకవర్గ ప్రజతో పాటూ యావత్‌ తెంగాణ ప్రజ హృదయాను కచివేసింది.

1962 అక్టోబర్‌ 2న సిద్ధిపేట జిల్లా చిట్టాపూర్‌ లోని సామాన్యరైతు కుటుంబంలో జన్మించిన రామలింగారెడ్డి విద్యార్థి దశ నుంచే ప్రజా
ఉద్యమావైపు ఆకర్షితుయ్యారు. ప్రజ హక్కును కాపాడడానికి పత్రికు ఉపయోగపడతాయనే విశ్వాసంతో జర్నలిస్టు వృత్తిని ఎన్నుకున్నారు. వామపక్ష భావాతో ప్రేరితుడైన రామలింగారెడ్డి మెదక్‌ జిల్లా ప్రజాక్షేత్రంలో ఎగిసి పడిన ఉద్యమాకు బాసటగా నిలిచారు. జర్నలిస్టు సంఘం నాయకుడిగా కూడా రామలింగారెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. జర్నలిస్టు సమస్య పరిష్కారం కోసం రామలింగారెడ్డి రాజీలేని పోరాటాు నిర్వహించారు.

సోలిపేట రామలింగారెడ్డి శాసనసభ్యుడు కాక ముందు నుండి నాకు ఆయనతో ఆత్మీయమైన అనుబంధం ఉంది. ఆయన మొదటినుంచి తను నమ్మిన ఆదర్శాను ఆచరణలో పెట్టిన అభ్యుదయవాది. సోలిపేట రామలింగారెడ్డి వరకట్నం, ఇతర ఆడంబరా ప్రసక్తి లేకుండా సభావివాహం చేసుకున్నారు. ప్రజాకవి కాళోజి గారితో పాటు, ఆనాటి సిద్ధిపేట శాసనసభ్యుడినైన నా చేతు మీదుగా ఆ వివాహం జరిగింది. ఆదర్శాన్ని తనవరకే పరిమితం చేయకుండా తన ప్లికు కూడా అదే పద్ధతిలో వివాహాు జరిపించిన ఆచరణశీలి రామలింగారెడ్డి.
తెంగాణ ఉద్యమ క్రమంలో రామలింగారెడ్డిలో ఉన్న చురుకుదనాన్ని, నిబద్ధతను నాయకత్వ క్షణాను గమనించి నేను స్వయంగా ఆయనను రాజకీయ రంగంలోకి తీసుకొచ్చాను. 2004 ఎన్నికల్లో దొమ్మాట శాసనసభా స్థానానికి తెంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసీ ఘన విజయం సాధించిన రామలింగారెడ్డి యువనాయకుడిగా శాసన సభలో అడుగు పెట్టారు. ఒకవైపు ప్రజాసేవలో నిమగ్నమౌతూనే, మరోవైపు మెదక్‌ జిల్లాలో తెంగాణ ఉద్యమ నిర్మాణంలో రామలింగారెడ్డి చురుకైన పాత్ర పోషించారు. ఉద్యమ ప్రతీఘాతకును ఎండగట్టడంలో, ప్రతిఘటించటంలో రామలింగారెడ్డి ఎంతో సాహసంతో, పదునుతో వ్యవహరించారు. సమైక్యవాద నాయకు కల్పించే ప్రలోభాకు లొంగకుండా చెదరని సంక్పంతో పోరాటంలో నిలిచారు. ఉద్యమ ప్రయోజనాకోసం నాయకత్వం నిర్దేశించినప్పుడు తన ఎం.ఎల్‌.ఎ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. 2009లో ఒకసారి పరాజయం పాలైనా, మొక్కవోని దీక్షతో పనిచేసి తిరిగి ప్రజ విశ్వాసం పొంది 2014, 2018 ఎన్నికలో వరుసగా భారీ మెజారిటీతో గొపొందిన రామలింగారెడ్డి అంచనా కమిటీ అధ్యక్షునిగా కూడా సేవందించారు.
సిద్ధిపేటలోని జర్నలిస్టు కానీలో ప్రభుత్వం ఇచ్చిన స్థంలో కట్టుకున్న సాధారణమైన ఇంట్లోనే చివరిదాకా నిరాడంబరంగా జీవించారు. ఉదయం లేచింది మొదు నియోజకవర్గ ప్రజ ఆపతి, సంపతి అర్సుకోవడం తప్ప తనకు వేరేలోకం లేదు. ప్రజ కోసం పనిచేయటమే జీవన విధానంగా ఎంచుకున్న అరుదైన నాయకుడు రామలింగారెడ్డి. మధుమేహ వ్యాధితో బాధపడుతున్న రామలింగారెడ్డి కాలికి గాయమై అది ప్రమాదకరంగా పరిణమించడంతో గత ఆగస్టు 5వ తేదీన అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు.

గౌరవ శాసన సభ్యు రామలింగారెడ్డి గారి మృతిపట్ల శాసనసభ ఏకగ్రీవంగా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ తీర్మానిస్తున్నది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. ఈ తీర్మానాన్ని సభ ఆమోదించింది.