|

ప్రణాళికా సంఘానికి కొత్త రూపు

maddi‘‘అంతర్జాతీయ పరిస్థితులు… అభివృద్ధిలో దూసుకెళ్ళడానికి భారత్‌కు అవకాశం కల్పించాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే దేశ బలగాలను తగినవిధంగా ఉపయోగించుకొనేలా ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త సంస్థ రావాలి’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త సంస్థ ఏర్పాటు ప్రతిపాదనపై డిసెంబరు 7న ప్రధానమంత్రి మోది తన నివాసంలో ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటుచేసి సమాలోచనలు జరిపారు. దాదాపు 7 గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పలువురు ముఖ్యమంత్రులు కొత్త వ్యవస్థ ప్రతిపాదనను బలపరుస్తూ పలు సూచనలు చేశారు.
ప్రస్తుత ప్రణాళికాసంఘం స్థానంలో ప్రతిపాదిత కొత్త సంస్థలలో రాష్ట్రాలకు ప్రముఖపాత్ర ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. విధాన ప్రణాళికా ప్రక్రియ ‘పైనుంచి క్రిందికి’బదులు ‘క్రిందినుంచి పైకి’ మారాలన్నారు. ప్రతిపాదిత సంస్థలో ‘టీమ్‌ ఇండియా’ భావన అంతర్భాగంగా ఉండాలన్నారు.

‘‘తమ భావాలు వ్యక్తం చేయడానికి వేదిక లేదని రాష్ట్రాలు కొన్నిసార్లు భావిస్తున్నాయి. అంతరాష్ట్ర వివాదాల పరిష్కారానికి ప్రభావవంతమైన యంత్రాంగం ఉండాలి’’ అని ప్రధాని అభిప్రాయపడ్డారు. సదస్సు అనంతరం ముఖ్యమంత్రులతో ప్రధాని ఇష్టాగోష్టిగా మాట్లాడారు.