ప్రభుత్వ ప్రోత్సాహం

పుస్తక ప్రదర్శన నిర్వహణకు ప్రభుత్వం ఎంతో సహకరిస్తోందని, ప్రతి యేటా ఈ ప్రదర్శనను తిలకించే పాఠక ప్రియుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని పుస్తక మహోత్సవ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్‌ చెప్పారు. ప్రతి ఏడాది నిర్వహిస్తున్న పుస్తక మహోత్సవానికి ప్రచురణ కర్తలు, పాఠక జనుల నుంచి లభిస్తున్న ఆదరాభిమానాలు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయన్నారు.
tsmagazine

పుస్తక ప్రదర్శనల ప్రయోజనం ఏమిటి? ఇది మన దేశంలో ఎలా ఉంది?
ఇందులో మూడు అంశాలున్నాయి. ఒక పుస్తకానికుండే ప్రయోజనం మొదటిది. అందులోనూ ఒక అంశానికి సంబంధించి వందల వేల సంఖ్యలో వచ్చిన పుస్తకాలను వాటి పబ్లిషర్స్‌ను ఒకేసారి, ఒకే కాలంలో ఒకే దగ్గర చూడడం, అందరం పుస్తకాలు చదివి, సాహిత్యం, విద్య, వైద్యం, ఆరోగ్యం ఇట్ల ఎవరి ఇష్టా ఇష్టాలు వాళ్లకుంటాయి. బుక్‌ఫెయిర్‌కు అవతల ఒక విషయానికి సంబంధించి అనేక పుస్తకాలు చూసే అవకాశం లేదు. ఉన్నా దానికోసం ఎక్కువకాలం ఖర్చవుతుంది. ఇక్కడ అది లేకుండా ఒకే దగ్గర లభిస్తాయి. రెండవది పుస్తకాలు ప్రచురణ సంస్థ నుండి కొన్నప్పుడు ఇతర అమ్మకదారుల నుంచి కొన్నప్పుడు వచ్చే ధర విషయంలో పాఠకుడు లాభపడతాడు. అన్నిటికీ మించి తమ రచయితలను పాఠకుడు కలుసుకునే అవకాశం. నిజానికి ఉత్తర భారతంలో, తెలుగేతర దాక్షిణాత్య రాష్ట్రాలలో ఉన్నంతగా ఈ పద్ధతి, సంప్రదాయం తెలుగులో లేదు. ఇప్పుడిప్పుడే రచయితలకు ప్రత్యేకంగా స్టాల్స్‌ కేటాయించడం వల్ల హైదరాబాద్‌లో పరిచయం చేస్తున్నాం.

ఎక్కడైన బుక్‌ఫెయిర్‌ జరుగుతాయి. మనదేశంలోని ఎన్‌.బి.టి, సాహిత్య అకాడమి, మోతీలాల్‌ బినార్ముదాస్‌ వంటి ఇతర ప్రచురణ సంస్థలు ఈ వరల్డ్‌ బుక్‌ఫెయిర్‌లో పాల్గొంటాయి. ప్రపంచ భాషల్లో, కనీసంగా ఇంగ్లీషులో ఎక్కువ ప్రచురణలు తెచ్చే సంస్థలే ఎక్కువగా పాల్గొనే అవకాశం. ప్రాంతీయ భాషల పుస్తకాలకు ఆదరణ తక్కువ. మన దేశంలో జాతీయస్థాయిలో జరిగినా ఈ అవసరం, స్థితి ఉంటాయి. అయితే జాతీయ భాష అయిన హిందీలో కూడా ఈ దేశంలో, ఒక శాతం మేరకు బయటి దేశాల్లో ఆదరణ పొందుతున్నాయి. సంస్కృతం, అరబిక్‌, ఉర్ధూలాంటి ప్రాచీన భాషల పుస్తకాలకు అన్ని చోట్లా ఆదరణ ఉంటుంది.

పుస్తకం పొందే విషయంలో రచయితల విజ్ఞానం, అనుభవం భారతదేశంలో కొంత నిరాదరణకు గురౌతోంది. పుస్తకంధర విదేశాల్లో అయితే, అంశం, రచయిత అనుభవా న్నుంచి నిర్ణయిస్తారు. మన దగ్గర ముద్రణకయ్యే ఖర్చును బట్టి నిర్ణయిస్తారు. ఈ విషయంలో ఇప్పుడిప్పడు కొంత మార్పులొస్తున్నాయి. కానీ, ఇంకారావాలి. మన దేశంలో 1972 నుండి అంతర్జాతీయ పుస్తకమేళాలు జరుగుతున్నాయి. ఎన్‌.బి.టి (నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌) నిర్వహించింది. అప్పటి భారత రాష్ట్రపతి వి.వి.గిరి ప్రారంభించారు. అంతకు ముందు నుండే జాతీయ మేళా ఉంది. జాతీయ పుస్తకమేళాల్లో ఒక అంశం మీద దేశవ్యాప్తంగా వచ్చిన పుస్తకాలన్నిటినీ ప్రదర్శనకు ఉంచుతారు. ఉదాహరణకు 2017లో ‘పుస్తక పఠనం సంస్కృతిపైన’ ఈ సంవత్సరం ‘పర్యావరణం’ పైన చేశారు. ఇలాంటివి ఇంకా చాలా విశేషాలున్నాయి.

హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ విశిష్టత ఏమిటి?

ఖచ్చితంగా దీని విశిష్టత దీనికుంటుంది. ముఖ్యంగా ఇక్కడికి సంబంధించిన సంస్కృతి, సాహిత్యం, సాహిత్యవేత్తలకు సంబంధించిన సేవను నెమరువేసుకునే ప్రయత్నం చేస్తుంది. వాటి మీద సెమినార్లు నిర్వహిస్తుంది. చర్చలుకొనసాగిస్తుంది. ప్రత్యేకంగా ఈ నేలమీది రచయితల పుస్తకాలకు ఒక స్థానాన్ని కల్పిస్తుంది. దేశంలో దీని స్థానాన్ని చెప్పడం అంటే, మొదటి ప్రపంచ పుస్తక ప్రదర్శనలో పాల్గొన్న సంస్థలు దుకాణాల సంఖ్య సుమారు రెండువందలు. గత సంవత్సరం ఇక్కడ పాల్గొన్న సంస్థలు, సముదాయాల సంఖ్య సుమారు మూడు వందలు. పేరుకు జాతీయ స్థాయి ప్రదర్శన అయినా ”ఆక్స్‌ ఫర్డ్‌” లాంటి అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్న దాఖలాలున్నా యి. ప్రతి సంవత్సరం సందర్శకుల సంఖ్య కూడా పెరుగుతోంది. వీటిని బట్టి స్థానాన్ని ఊహించవచ్చు.

పుస్తక ప్రదర్శనకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తోంది?

నిజానికి ఎక్కడైనా, ఏ సంస్థ ఇలాంటివి నిర్వహించినా ప్రభుత్వం, దాని అజమాషిలో ఉన్న సంస్థల సహాయం లేకుండా నిర్వహించడం కష్టం. ఆ విషయంలో ప్రభుత్వ సహాయం ఉంది. పర్యాటకశాఖ, భాషా సాంస్కృతిక, సాహిత్య అకాడమి వాటి, వాటి పరిధుల మేరకు సహాయం పడుతున్నాయి. మంత్రులు, అధికారులు భాగం పంచుకుంటున్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకి భాషాసాహిత్యంపై మమకారం ఉంది. ఆయన మంచి పాఠకుడు, కవిత్వం, వ్యాసాలు చదివి రచయితలకు ఫోన్‌చేసి అభినందించిన సందర్భాలున్నాయి. ‘తెలుగు మహాసభల్లో ఆయనకు భాషా సాహిత్యాలపై ఉండే గౌరవాన్ని కూడా చూసాం. ఈ పుస్తక ప్రదర్శనకు ప్రభుత్వం ఎంతో సహకరిస్తోంది.