మంచిర్యాల టూ అమెరికా..

సింగరేణి బిడ్డ ఘనత ప్రతిష్ఠాత్మక అబర్న్‌ యూనివర్సిటీలో సీటు సాధించిన ఫారెస్ట్‌ కాలేజీ విద్యార్థిని ఓ వైపు కోవిడ్‌ ప్రభావం, మరోవైపు విద్యావ్యవస్థలో గందరగోళం ఉన్నప్పటికీ తెలంగాణ ఫారెస్ట్‌ కాలేజీ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ స్టూడెంట్స్‌ తమ సత్తా చాటుతున్నారు. మొన్న సూర్య దీపిక నేడు సుహర్ష ప్రతిష్ఠాత్మక అమెరికా యూనివర్సిటీ ఆఫ్‌ అబర్న్‌లో ఎం.ఎస్సీ సీటు సాధించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఫారెస్ట్‌ కాలేజీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌లో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న వీరిద్దరికీ ఈ గొప్ప అవకాశం వచ్చింది. గతంలో సూర్య దీపిక, ఎం ఎస్సీ ఫారెస్ట్‌ జెనెటిక్స్‌ లో సీటు సాధించింది. ఇప్పుడు సుహర్ష ఎం.ఎస్సీ వుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాజీలో రెండేళ్ల కోర్సుకు ఎంపికైంది.

ట్యూషన్‌ ఫీజు రెండేళ్లకు కలిపి 30 వే డార్లు యూనివర్సిటీ మినహాయింపు ఇచ్చింది. దీనితో పాటు 1500 డార్ల స్కార్‌షిప్‌ను కూడా రెండేళ్లపాటు అందించనుంది. ఈ మొత్తం సుమారు 50 క్షు కానుంది. అబర్న్‌ యూనివర్సిటీలో స్కూల్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ అండ్‌ వైల్డ్‌ లైఫ్‌ బయాజీ డీన్‌ గా ఉన్న జానకిరాం రెడ్డి అవపాటి సహకారంతో వీరిద్దరూ సీట్లు సాధించారు.

సుహర్ష మంచిర్యాలకు చెందిన వారు. ఆమె తండ్రి సింగరేణి కారీస్‌లో పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన తనకు ఈ అవకాశం రావటం చాలా ఆనందంగా ఉందని, కాలేజీలో అనువైన వాతావరణం, ఫ్యాకల్టీ ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని సుహర్ష తెలిపారు.

గతంలో చేసుకున్న ఒప్పందం ఆధారంగా ఫారెస్ట్‌ కాలేజీ అధ్యాపకుకు బ్రిటిష్‌ కొంబియా యూనివర్సిటీ, కెనడా రెండు విడతల్లో ట్రైనింగ్‌ ఇచ్చింది. కోర్సు, సిబస్‌, టీచింగ్‌ పద్ధతు, పరిశోధన విభాగాల్లో శిక్షణ ఇచ్చారు.
ఫైనల్‌ ఇయర్‌లో మొత్తం 49 మంది స్టూడెంట్స్‌ ఉంటే, అందులో 31 మంది అమ్మాయిలే. మరో ఆరుగురు విద్యార్థిను ఫారెస్ట్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీ డెహ్రాడూన్‌లో వుడ్‌ టెక్నాజీలో ఎం.ఎస్సీ చేసేందుకు సిద్ధమౌతున్నారు.తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని తొలిసారిగా ఎంట్రెన్స్‌ టెస్ట్‌ కేంద్రాన్ని కూడా హైదరాబాద్‌లో నిర్వహించేందుకు నిర్ణయం జరిగింది. ఫైనల్‌ ఇయర్‌లో ఉన్న మరో 20 మంది సివిల్‌ సర్వీసు పరీక్షు రాసేందుకు సిద్ధమవుతున్నారు. స్వయంగా కాలేజీ డీన్‌ చంద్రశేఖర రెడ్డి వారిని ప్రోత్సహిస్తున్నారు. తెంగాణ ముఖ్యంగా ఫారెస్ట్‌ కాలేజీ నుంచి జాతీయ స్థాయి ప్రతిభతో అధికాయిగా ఎంపిక కావానే క్ష్యంతోనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కాలేజీ స్థాపన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ స్థాయి వసతు ముగు క్యాంపస్‌లో కల్పించారని డీన్‌ తెలిపారు.